తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

బుధవారం 23 జూన్ 2010

మహాత్ములను,గొప్పవారిని అనుకరించడం ఏమవసరం?

ఈ మధ్య గమనించిన పోకడ ఏమిటంటే ఒక ఫలానా మహాత్ముడు లేక గొప్పవాడు ఇలా బట్టలు కట్టుకొనేవాడు, మాట్లాడేప్పుడు ఇలా తల ఎగురవేసేవాడు అంటే మనం కూడా వారిలానే అనుకరిచడానికి ప్రయత్నిస్తున్నాము, వారి హావభావాలను కూడా అనుకరించడానికి ప్రయత్నిస్తున్నాము.

ఉదాహరణకు గాంధీగారు కొళ్ళాయి గుడ్డ కట్టుకొన్నాడని మనం కూడా అలానే ఉండగలమా? భగవాన్ రమణుల వారు గోచీ గుడ్డ ఒక్కటే పెట్టుకొనే వారని మనం పెట్టుకొంటామా? యోగి వేమన నగ్నంగా ఉండేవాడని మనం కూడా బట్టలు విప్పేసి తిరగగలమా? భగవాన్ రమణులు తన పాదం తప్పుచేసిందని తేనెటీగలు కుడుతున్నా అవి పూర్తిగా కరిచి వెళ్ళిపొయేవరకు తన పాదం కదపలేదు. మనమూ అలానే చేస్తే మన గతి ఏమిటి?

బయటకు కనిపించే వాటిని అనుకరిస్తూ కావలసిన దానిని పట్టించుకోకపోవడం ఎవరికి లాభం? ప్రపంచమంతా భగవంతుడే అని ఊరకే విని ఆ జ్ఞానం నిజంగా లేనివాడు పులి కూడా భగవంతుడే అని పులి ముందు నిల్చోగలడా? బయటకు అంతా దైవమే అంటూ కాలికి ఒక ముల్లు కుచ్చుకొన్న మరుక్షణం "అబ్బా నొప్పి!" అని ఎందుకు అంటున్నారు? అంటే అతడు మాట్లాడే మాట ఒకటి, లోపల ఉంచుకొన్నది ఒకటి.

అబ్దుల్‌కలాం గారి తలకట్టు(Hair style) ను, సచిన్ టెండూల్కర్ భుజాలు ఎగురవేయడాన్ని అనుకరిస్తాము, కాని వారికి తమ పనిపట్ల ఉన్న అంకితభావం, దేశం పట్ల గల ప్రేమను అలవరచుకోవడానికి ప్రయత్నించము.వారు నడిచిన మార్గం, వారు ఆచరించి చూపిన విధానాలు మనం ఆచరిద్దాం. ఒకవేళ మనం కూడా ఆ స్థాయికి ఎదిగితే అప్పుడు మనం ఏం చేయాలో, మన బట్టలు ఎలా వేసుకోవాలో, ఎలా తలదువ్వుకోవాలో మనకే అర్థం అవుతుంది. సరే వారి వేషభాషలు బాగుంటే అనుకరించడానికి అభ్యంతరం లేదు. కాని అలా అనుకరించి మనం వారే అయినట్లు భావించడం(feel అవడం) మనలను మనం మోసం చేసుకోవడమే. అంతేకాని గుడ్డిగా వారిని అనుసరిస్తే మనకు ప్రయోజనం ఏమిటి?

3 వ్యాఖ్యలు:

  1. బాగా చెప్పారు. అందుకే అలాంటి వాళ్ళను అనుకరించడం కాదు,వాళ్ళ బోధనలను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాలి,తద్వారా జీవితానికి అర్ధాన్ని సాధించాలి.వీలైతే వాళ్ళ స్థాయికి చేరడానికి ప్రయత్నించాలి. స్పూర్తి అనేది వాళ్ళ సిద్ధాంతాలను మనసులో నింపుకొంటే వస్తుంది కానీ వాళ్ళ వేషభాషలని అనుకరిస్తే కాదు.

    రమణుల్లా తేనెటీగలకి కాలొదిలి నిలబడగలరా, సర్కోమా వచ్చి వొళ్ళంతా రక్తం ఒడుతుంటే ఎర్ర శమంతకమణిని చూస్తున్నానగలరా, శంకరుల్లాగా తల ఇవ్వడానికి సిద్ధపడగలరా..? చంద్రశేఖరుల్లా జ్వరం వస్తే పంచాగ్ని తపస్సు చేస్తాననగలరా?

    అందుకే అంటారు , అలాంటి వాళ్ళ చేష్టలను అర్ధం చేసుకోవాలని ప్రయత్నించొద్దు, వాళ్ళని నమ్మి జీవితాన్ని సార్ధకం చేసుకోవడానికి ప్రయత్నించమని

    ప్రత్యుత్తరంతొలగించు
  2. వీళ్ళదుంపదెగ యోగివేమనజోలికి పోవద్దని చెప్పండి .

    ప్రత్యుత్తరంతొలగించు

నా బ్లాగును ఇష్టపడేవారు