తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Saturday, March 3, 2018

సోదరి నివేదిత గురించి శ్రీ రామకృష్ణుల భవిష్యవాణి

భారతదేశం వచ్చాక వివేకానంద శిష్యురాలైన సోదరి
నివేదిత పూర్తిగా బెంగాలీ కట్టుబొట్టు అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించింది. అందువలన ఆమె ఆ విషయంలో అమాయకత్వంతో చేసే కొన్ని పనులు శారదా మాతకు నవ్వు తెప్పించేవి.
అలా ఒకరోజు శారదా మాతకు నవ్వు రాగా " గురుదేవులు(శ్రీ రామకృష్ణులు) చెప్పినట్లు ఈమె(నివేదిత) బయటా తెలుపే(శరీరం రంగు),లోపలా తెలుపే(కల్మషం లేని మనసు)" అని మనస్ఫూర్తిగా నవ్వారు. అది విన్న నివేదిత పరుగుపరుగున శారదా మాత వద్దకు వెళ్లి రామకృష్ణులు అలా ఎప్పుడన్నారు అని అడిగింది. "ఒక రోజు భావావస్థలో రామకృష్ణులు తాము విదేశాలకు వెళ్లినట్లు అక్కడ మనుషులు లోపలా బయటా తెలుపే" అని అన్నట్లు శారదా మాత చెప్పారు.
ఆ సంఘటన ఎప్పుడు జరిగిందో అని ఆమె ఆరా తీయగా ఫలానా యాత్రా దినాన అని అమ్మ చెప్పింది. వెంటనే నివేదిత స్వామి రామకృష్ణానంద వద్దకు వెళ్లి ఆ దినానికి సరిఅయిన ఇంగ్లీష్ తేదీ అడిగింది. ఆయన లెక్క కట్టి ఫలానా దినం అని చెప్పాడు. నివేదిత పరుగుపరుగున పోయి తనకు రామకృష్ణులు కలలో దర్శనం ఇచ్చిన తేదీ ఎప్పుడో తను రాసిన డైరీ లో చూసింది. ఆశ్చర్యకరంగా రామకృష్ణులు ఆమెకు కలలో దర్శనం ఇచ్చిన రోజు, ఆయన ఆ విధంగా భావావస్థలో చెప్పిన రోజూ ఒక్కటే అయింది.

ఈ విషయం శారదా మాతకు నివేదిత చెప్పగా అమ్మ నివేదిత చుబుకం ను ముద్దాడి " నరేంద్ర(స్వామి వివేకానంద) నా బిడ్డ. నా బిడ్డకు నువ్వు అందుకే అంత ప్రీతిపాత్రమైనావు. గురుదేవులు నిన్ను అనుగ్రహించి ఎన్నుకొన్నారు" అంది..

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు