తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స
Showing posts with label మహనీయుల జీవితాలలో మధురఘట్టాలు. Show all posts
Showing posts with label మహనీయుల జీవితాలలో మధురఘట్టాలు. Show all posts

Thursday, May 23, 2013

మన పని మనం చేసుకోవడానికి మొహమాటం ఎందుకు? (అబ్రహం లింకన్ జీవితపు చిన్న సంఘటన)


అబ్రహం లింకన్ యొక్క మహోన్నతపు వ్యక్తిత్వం మనకు పరిచయమే.
వారి జీవితం నుండి మనం నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి.
ఒక చిన్న సంఘటన.

ఒక సారి లింకన్ గారి స్నేహితుడు లింకన్ గారి ఇంటికి వెళ్ళేటప్పటికి లింకన్ గారు తమ బూట్లు పాలిష్ చేసుకుంటున్నారు.

అది చూసి వారి స్నేహితుడు "అదేంటి లింకన్! నీ బూట్లు నువ్వే పాలిష్ చేసుకుంటున్నావ్?" అన్నాడు.

వెంటనే లింకన్ గారు " మరి నువ్వు ఎవరి బూట్లు పాలిష్ చేస్తావ్?" అన్నారు.

లింకన్ మాటల్లోని అంతరార్థం తెలుసుకుని ఆ స్నేహితుడు ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు. మనం కూడా నేర్చుకుందాం.

స్వామి వివేకానందులు చెప్పినట్లు " ఒకరి గొప్పతనం వారు చేసిన గొప్ప కార్యాల వలన కాక వారు తమ దైనందిన జీవితంలో చేసే చిన్న చిన్న పనులు ఎలా చేస్తున్నారు అనేదాన్ని బట్టి ఉంటుంది."

Wednesday, June 13, 2012

ఇలా చేయడం శ్రీరామానుజాచార్యులకే చెల్లింది.


అష్టాక్షరీ మంత్రాన్ని బహిర్గతం చేసి మానవాళికి మహోపకారం చేసిన రామానుజాచార్యుల జీవిత సంఘటన ఇది.

శ్రీరామానుజాచార్యుల కాలంలో జనులు రోజూ ఒక వింతను చూసేవారు.

అదేంటంటే రామానుజులు శారీరకంగా అంత బలవంతులు కాకపోవడంతో రోజూ స్నానానికి వెళ్ళేటప్పుడు ఒక బ్రాహ్మణుని భుజంపై చేతులు వేసుకుని వెళ్ళేవారు. స్నానం చేసి తిరిగి వచ్చేటప్పుడు ఒక శూద్రుని భుజంపై చేతులు వేసి వచ్చేవారు. జనం దీనిని వింతగా చూసేవారు.

ఒక రోజు కొందరు ధైర్యం చేసి స్వామి ప్రవర్తనకు గల కారణం అడిగారు.
అప్పుడు ఆయన ఇలా అన్నారు.

"స్నానం వలన నా శరీరం మాత్రమే శుభ్రం అవుతోంది. మనసులోని మాలిన్యం పోవడం లేదు. ఇతరుల కన్నా నేను గొప్పవాన్ని అనే భావన అహంకారం అనిపించుకుంటుంది. మనిషి పురోగతికి ఆధిక్య భావన అన్నింటికీ మించిన ఆటంకం.స్నానం చేసి దేహ మాలిన్యాన్ని పోగొట్టుకొన్న తర్వాత నేను శూద్రున్ని తాకి నా అహంకారాన్నీ,మనోమాలిన్యాన్ని తొలగించుకుంటున్నాను. నేను ఎవరికన్నా గొప్పవాణ్ణీ కాను. నాకన్నా ఎవరూ తక్కువ వారూ కాదు. నాకాన్నా శూద్రుడు కూడా శ్రేష్ఠుడే అనే భావన వలన నాకు ఆనందం లభిస్తుంది."



Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు