తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Saturday, March 3, 2018

సోదరి నివేదిత గురించి శ్రీ రామకృష్ణుల భవిష్యవాణి

భారతదేశం వచ్చాక వివేకానంద శిష్యురాలైన సోదరి
నివేదిత పూర్తిగా బెంగాలీ కట్టుబొట్టు అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించింది. అందువలన ఆమె ఆ విషయంలో అమాయకత్వంతో చేసే కొన్ని పనులు శారదా మాతకు నవ్వు తెప్పించేవి.
అలా ఒకరోజు శారదా మాతకు నవ్వు రాగా " గురుదేవులు(శ్రీ రామకృష్ణులు) చెప్పినట్లు ఈమె(నివేదిత) బయటా తెలుపే(శరీరం రంగు),లోపలా తెలుపే(కల్మషం లేని మనసు)" అని మనస్ఫూర్తిగా నవ్వారు. అది విన్న నివేదిత పరుగుపరుగున శారదా మాత వద్దకు వెళ్లి రామకృష్ణులు అలా ఎప్పుడన్నారు అని అడిగింది. "ఒక రోజు భావావస్థలో రామకృష్ణులు తాము విదేశాలకు వెళ్లినట్లు అక్కడ మనుషులు లోపలా బయటా తెలుపే" అని అన్నట్లు శారదా మాత చెప్పారు.
ఆ సంఘటన ఎప్పుడు జరిగిందో అని ఆమె ఆరా తీయగా ఫలానా యాత్రా దినాన అని అమ్మ చెప్పింది. వెంటనే నివేదిత స్వామి రామకృష్ణానంద వద్దకు వెళ్లి ఆ దినానికి సరిఅయిన ఇంగ్లీష్ తేదీ అడిగింది. ఆయన లెక్క కట్టి ఫలానా దినం అని చెప్పాడు. నివేదిత పరుగుపరుగున పోయి తనకు రామకృష్ణులు కలలో దర్శనం ఇచ్చిన తేదీ ఎప్పుడో తను రాసిన డైరీ లో చూసింది. ఆశ్చర్యకరంగా రామకృష్ణులు ఆమెకు కలలో దర్శనం ఇచ్చిన రోజు, ఆయన ఆ విధంగా భావావస్థలో చెప్పిన రోజూ ఒక్కటే అయింది.

ఈ విషయం శారదా మాతకు నివేదిత చెప్పగా అమ్మ నివేదిత చుబుకం ను ముద్దాడి " నరేంద్ర(స్వామి వివేకానంద) నా బిడ్డ. నా బిడ్డకు నువ్వు అందుకే అంత ప్రీతిపాత్రమైనావు. గురుదేవులు నిన్ను అనుగ్రహించి ఎన్నుకొన్నారు" అంది..

Monday, July 24, 2017

ధ్యానం చేసి భక్తులను ఆశీర్వదించిన కోతి

 ఈ మధ్య ఒక కోతి ఒక గుడిలో దేవుడి ముందు 10 నిమిషాలు ధ్యానం చేసి తర్వాత భక్తులను ఆశీర్వదించింది.

మన ఆర్డినరి ముఖాలకు మహాత్ముల ముఖాలకు ఉన్న తేడా

Wednesday, July 19, 2017

బుధ గ్రహంపైన సూర్యుడు ఎలా అస్తమిస్తాడు.

మొదట మునిగిపోయి మళ్ళీ అక్కడ బుధ గ్రహం పై వంపు వలన పైకి వచ్చినట్లు కనిపించి మళ్ళీ అస్తమిస్తాడు.

Saturday, June 18, 2016

దేవుడికి పనిపాటాలేదా ? నన్నెందుకు పట్టించుకోవాలి ?

చెట్లు కొట్టేస్తా - వానలుపడవు - కాలం మారిపోయింది అంటూ తెగ బాధపడతాను

పెద్దవారిని కూడా గౌరవించను - నాకు మర్యాదలేదని బాధపడతాను - కాలం మారిపోయిందని దొంగఏడుపులు ఏడుస్తా

అవసరమున్నా,లేకపోయినా బైకులో చాలా వేగంగా వెళతాను - జనం ఎవరూ రూల్సు పాటించరని గగ్గోలు పెడతాను

నోరు తెరిస్తే అబద్దమే వస్తుంది - కానీ నిజానికి విలువలేదని గుండెలు బాదుకొంటా

మూర్ఖుడైనా తనదైన రోజున మహత్కార్యాన్ని చేసి గొప్పపేరు సంపాదిస్తాడు. నిజమైన గొప్పతనం అనేది ఒకరు చేసిన గొప్పపనిని బట్టికాక అతను తన దైనందిన జీవితములో చేసే చిన్నచిన్న పనులను ఏవిధముగా చేస్తున్నాడనేదాన్ని బట్టి ఉంటుంది.ఇది స్వామి వివేకానందుని మాట.

1.మనము తాగడానికి నీరులేదని, పాలకులు సరిగా లేరని బాధపడతాము. అదే నీరు రోజూ వస్తూ నీటిగొట్టాలు పగిలిపోయి నీరు వృథాగా వెళ్ళిపోతున్నా పట్టించుకోము. లేక కుళాయికి ట్యాపులేక నీరు వెళ్ళిపోతుంటే కనీసము ఏదైనా అడ్డుపెడదామన్న ఆలోచనకూడా రాదు. వచ్చినా మిగతావారు చూసుకుంటారులే, నాకెందుకు అనుకొని వెళ్ళిపోతారు. నీళ్ళైతే పట్టుకొంటారు కాని నీరు వృథాగా పోతుంటే పట్టించుకోరు. ఎవరూ పట్టించుకోకుంటే నీటిసరఫరా విభాగపు వారిని తిడతారు. అంతేకాని మన బాధ్యత మనకు పట్టదు. కనీసము వారికి ఫోను ఐనా చేసి చెపుదామన్న ఆలోచన కూడా రాదు. 

2.ఇంకొందరు విదేశాలకు వెళ్ళివచ్చి అక్కడ ఎంతో శుభ్రముగా ఉంటుందని మనదేశములో అలా ఉండదని తెగ బాధపడిపోతుంటారు. ఇక విదేశాలు చూడని వారైతే TV లో ఆయా దేశాలను చూసి మన దేశము అలా లేదని బాధపడుతుంటారు. ఏ ప్రభుత్వ పథకమైనా జనము పాటిస్తేనే ఆ పథకము విజయవంతము అవుతుంది. కనీసము మనము అంతరాత్మ చెప్పినట్లైనా నడుచుకోము. మనకు తెలుసు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేసినా, ఉచ్చ పోసినా అనారోగ్యమని, మరియు శుభ్రతకు భంగము అని. కాని మనము ఏమి చేస్తున్నామో మనకు తెలుసు. విదేశాలలో ఉన్నప్పుడు అక్కడి నియమాలు పాటించినప్పుడు అవే నియమాలు ఇక్కడ ఎందుకు పాటించరు? మాటలైతే ఎన్నో మాట్లాడుతారు.

ఇలా ఒకటా,రెండా ఎన్నో చెప్పుకోవచ్చు. ఏ విషయమైనా వ్యక్తిగతము నుండే వస్తుంది. మొదట నిద్రలేవగానే "నేను" అనే స్పృహ కలిగిన తర్వాతే మిగతా ప్రపంచము గోచరిస్తుంది. అంటే ఏ పనైనా వ్యక్తిగతము నుండే వస్తుంది. ప్రతి మనిషి తన బాధ్యత తెలుసుకొని ప్రవర్తిస్తే హక్కులు వాటంతట అవే వస్తాయి. అలా రాకున్న పోరాడే హక్కు కూడా ఉంటుంది. అంతే కాని హక్కులే తప్ప బాధ్యతలు తెలుసుకోనంత కాలం జీవితాలు అలానే ఉంటాయి.

ఇలాంటి మనలను భగవంతుడు ఎందుకు పట్టించుకోవాలి?

గమనిక: ఈ టపా అందరినీ ఉద్దేశించి వ్రాసినది కాదు. కాని చాలామంది ప్రజలనే ఉద్దేశించి వ్రాసినది

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు