నిన్న NDTV లో వచ్చిన జాతీయ రక్షణా బలగాల (NSG కమెండోల) కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా, స్పూర్తిదాయకముగా సాగింది. కార్యక్రమానికి భారత క్రికెట్ సారథి ధోనీ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.
కార్యక్రమం చలోక్తులు,హృదయం హత్తుకొనే సన్నివేశాలతో సాగిపోయింది.
కొన్ని సన్నివేశాలు:
1.ఇది మనకు తెలియని విషయం.నారీమన్ ప్రాంతంలో నివశిస్తున్న వ్యక్తి చెప్పినది. నారీమన్ హోటల్ పైకి హెలికాప్టర్ లో నుండి తాడు సహాయంతో ఒక కమెండో దిగుతున్నప్పుడు పొరపాటున జారి క్రిందపడ్డాడు. అప్పుడు అతని కాలు బెణికింది. కాని ఆ విషయం అతను పట్టించుకోకుండా తన పనిలో మునిగిపోయాడు.
2.ఒక సారి ఒక ఉగ్రవాది విసిరిన బాంబు కమెండో ప్రక్కనే పడింది. ఈ విషయం పసిగట్టిన కమెండో ముందుగానే నేల పై పడుకోవడంతో ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నాడు.వెంటనే అతను పైకి లేచి ఉగ్రవాది వైపు పరిహాసపూర్వకముగా నవ్వాడు. అంత కఠిన పరిస్థితులలో కూడా ఆ కమెండో ప్రశాంతమైన చిరునవ్వును కోల్పోలేదు.
3. ఒక కమెండో(నవ్వుతూ) ధోనీ తో :
మీరు మొన్న ఒక వన్డేలో కీపింగ్ చేస్తూ "గంట వాయించు" అని అంటున్నారు.ఎందుకు?
ధోనీ: అప్పుడు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ ఇయాన్ బెల్ ఆడుతున్నాడు. అతని పేరులో "బెల్" ఉండడం వలన మన హిందీ భాషలో బౌలర్‌కు అతని గంట వాయించమని చెప్పాను.(అందరిలో నవ్వులు)
4.ధోనీ కమెండోలతో : చివరి బంతికి 10 పరుగులు ఎలా కొట్టగలము ?
ఎవరూ జవాబు ఇవ్వలేదు.
ధోనీ: మమూలుగా ఎవరూ కొట్టలేరు.అది నోబాల్ ఐతే తప్ప.కాని అది నోబాల్ కాకున్నా అలా కొట్టగల వ్యక్తి ఒక్కడే ఉన్నాడు.అతను రజనీ కాంత్.అతను కనుక కొడితే బంతి రెండు ముక్కలై ఒక ముక్క బౌండరీకి,ఇంకో ముక్క సిక్స్ కు వెళ్తుంది.ఒక వేళ 24 పరుగులు కొట్టవలసి వస్తే బంతి ఆరు ముక్కలై అన్ని ముక్కలు బౌండరీకి వెళ్తాయి.(అందరిలో నవ్వులు)
5.ఒక కమెండో ఉద్విగ్నతతో :
మేము అక్కడ పోరాడుతుంటే పార్లమెంట్ లో కూర్చున్న కొన్ని ...... ఆ విషయాన్ని కూడా రాజకీయం చేస్తున్నాయి.
ఇంకొన్ని విశేషాలు తర్వాత