శ్రీరమణమహర్షుల వారు ఆశ్రమంలో ఉండగా గతంలో రమణుల పాఠశాల జీవితంలో వారికి తమిళం భోధించిన ఉపాధ్యాయుడు ఒకసారి వచ్చారు. ఆ ఉపాధ్యాయుడిని గుర్తించిన మహర్షి తాను రచించిన ఒక తమిళ గ్రంధాన్ని ఆయనకు సమర్పించారు.
మహర్షి రచనా విధానాన్ని ఆ ఉపాధ్యాయుడు ఎంతగానో మెచ్చుకొన్నాడు.ఆ తర్వాత ఆ గ్రంధంలోని ఒక పద్యానికి అర్థం అడిగాడు. అప్పుడు మహర్షి సమీపంలోని భక్తుల వంక చూస్తూ ఇలా అన్నాడు.
"ఆయనను చూడండి. ఇటువంటి ప్రశ్నల బెడదను తప్పించుకునేందుకే నేను బడి నుండి పారిపోయాను.ఆయన మదురై నుండి ఇక్కడికి వచ్చి మళ్ళీ నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు. దీని అర్థం ఏంటి?" అని చమత్కరించారు.
అదివిన్న జనం భక్తులతో సహా గొల్లున నవ్వారు.