తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Wednesday, May 30, 2012

ఫలితం కోసం వేచిచూసేవాడిని ఫలితం తెలిసికూడా చెప్పకుండా టెన్షన్ పెట్టడం ఒక పైశాచికానందమే!

TV లలో వచ్చే Reality show లలో పోటీదారులను చూస్తుంటే అయ్యోపాపం అనిపిస్తోంది. వాళ్ళు వాళ్ళ పని పూర్తి చేసి ఫలితం కోసం వేచిచూస్తుంటారు. కాని వ్యాఖ్యాత లేక న్యాయనిర్ణేతలు అనబడే సదరు వ్యక్తులు ఫలితము వాళ్ళ చేతులలో ఉంచుకొని పోటీదారులకు చెప్పకుండా వాళ్ళను Tension పెడుతుంటారు.

చూసే ప్రేక్షకులకే చాలా Tension ఉంటుంది. అలాంటిది నిజంగా పోటీలో పాల్గొన్నవారికి ఇంకెంత ఉంటుందో కదా పాపం. వారు ఏడుస్తారు. విసుగుతో (Frustration) తో పక్కవారిని ఈర్ష్యా,అసూయలతో చూస్తుంటారు, బాధపడుతుంటారు. ఇవన్నీ చూస్తూ వ్యాఖ్యాతలు మరియు న్యాయనిర్ణేతలు ఎంతో సంతోషంతో ఇంకా రెచ్చగొడుతుంటారు. పోటీదారుల బాధలలో వీరు ఆనందాన్ని వెదుక్కుంటూంటారు. ఇవన్నీ మనం చూస్తూ Tension పడుతూ ,అయ్యో పాపం అనుకొంటూ తిట్టుకొంటూ ఉంటాము.

వ్యాఖ్యాతల సంగతి సరి, మరి న్యాయనిర్ణేతలు అనబడే సదరు వ్యక్తులు కొద్దోగొప్పో పేరు సంపాదించుకొన్నవారే కదా! వారి బుద్ధి ఏమైంది? వయసుతో పాటు వివేకం సంగతి దేవుడెరుగు, వారికి శాడిజం బాగా పెరిగిపోతున్నట్లు అనిపిస్తోంది.

హనుమంతుడు లంకలో సీతమ్మను చూసి వచ్చిన తర్వాత అతని కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వేచిచూస్తున్న వానరవీరులను ఏం Tension పెట్టలేదే. వానరుల దృష్టిలో పడగానే "దృష్ట్వాతు సీతా" (చూసాను సీతను) అన్నాడు కదా. "సీతను చూసాను" అని కూడా అనలేదు, అలా అంటే మొదట సీత పేరు చెబితే సీతమ్మకు ఏమయ్యిందో, చూసాడో లేదో అనే సందేహాలు వస్తాయని మొదటే "చూసాను" అనే పాజిటివ్ మాట అన్నాడు.

మనము హనుమంతునితో మనలను పోల్చుకోనవసరం లేదు, కనీసం అతని ఆచరణ ను తెల్సుకొని మనలను మనం దిద్దుకొంటే చాలు కదా.

కొసమెరుపు:
అసలు TV చూడకుంటే సరిపోతుంది అనుకోవచ్చు. కాని ఇలాంటి కార్యక్రమాలు చూడడం వలన ఇలా మనం మన జీవితంలో ఉండకూడదు అని నేర్చుకోవచ్చేమో. ఇలాంటి భావంతో చూస్తే ఏ తలనొప్పీ ఉండదనుకొంటాను.

Friday, May 25, 2012

ఏమిటయ్యా వేంకటేశు...

ఏమిటయ్యా వేంకటేశు...

అప్పుడెప్పుడో.. ఒక సోమరి ఏనుగు కాలికి దెబ్బతగిలితేనే... ఇంటి దగ్గరినుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి రక్షించావే..

ఆ తరువాత... ఒక వెర్రి పిల్లాడు... పొరపాటున ఒక పిచ్చి రాయిలో నువ్వున్నావని అంటే.. ఏకంగా ఒక అవతారాన్నే చూపించావే...

మరోసారి.. ఒక చాదస్తపు వృద్దురాలు... ఎంగిలి పండ్లిస్తే.. మొహమాటం కూడా లేకుండా తిన్నావే....

మొన్నటికి మొన్న... పాత స్నేహితుడు పలకరింపుకు వచ్చి అటుకులిస్తే... అష్ట ఐశ్వార్యలిచ్చి సత్కరించావే...

మరి నేనిప్పుడు.. అంతులేని కష్టాల్లో, అయోమయమైన రాగద్వేషాల్లో కొట్టుకుంటుంటే కరుణించవేమయ్యా....  ఇంత మొండివాడివేమయ్య .. 




--ఇది మా స్నేహితుడు కొండయ్య వ్రాసిన కవిత

Wednesday, May 9, 2012

ఈ మధ్య నేను చూసిన మంచి సినిమా "Two brothers"

నా స్నేహితుడు ఉదయ్ చెప్పగా 2004 సంవత్సరం లో విడుదలైన Two brothers అనే పులుల కు సంబంధించిన సినిమా చూశాను. చాలా బాగుంది. ప్రేమాభిమానాలు, మాతృప్రేమ అనేవి సర్వవ్యాపకమని పులుల ద్వారా దర్శకుడు బాగా చెప్పగలిగాడు.

తల్లి పులి, దాని ఇద్దరు బిడ్డలైన రెండు పిల్లలు మానవ స్వార్థం వలన విడిపోవడం తర్వాత ఎన్నో కష్టాలు పడడం చివరికి మూడూ కలవడం ఎంతో బాగా చూపించారు. ముఖ్యంగా పులులు మధ్య భావోద్వేగాలను దర్శకుడు చాలా బాగా చూపించాడు. కొన్ని దృశ్యాలలో మనము కూడా ఆ భావోద్వేగంలో లీనమైపోతాము. అంతబాగా తీశారు.
సెంటిమెంట్ కు పెద్దపీట వేస్తూ తీశిన ఈ ఆంగ్ల చిత్రం చాలా కదిలించింది.

మన తెలుగు మూసచిత్రాలకు భిన్నంగా మంచి సినిమా చూడాలనే కోరిక ఈ సినిమా ద్వారా తీరింది.

ఈ చిత్రం ఫ్రెంచ్ నుండి ఆంగ్లానికి అనువదించినట్లు ఉంది.


Wednesday, April 25, 2012

అన్నమయ్య ఆవేదన అర్థం చేసుకోండి

కీర్తన:

కడుపెంత తా గుడుచు కుడుపెంత! దీనికై పడని పాట్లనెల్ల పడి పొరలనేలా||

పరుల మనసునకునాపదలు కలుగజేయ పరితాపకరమైన బ్రతుకేలా|
సొరిదినితరుల మేలుచూచి సైపగలేక తిరుగుచుండేటి కష్టదేహమిది యేలా||

యెదిరికెప్పుడు చేయు హితమెల్ల తనదనుచు చదివిచెప్పని యట్టి చదువులేలా|
పొదిగొన్న ఆశలో బుంగుడై సతతంబు సతమతంబై పడయు చవులు దనకేలా||

శ్రీవేంకటేశ్వరుని సేవానిరతిగాక జీవనభ్రాంతి బడు సిరులేలా|
దేవోత్తముని నాత్మ దెలియ నొల్లక పెక్కు త్రోవలేగిన దేహి దొరతనంబేలా||

అర్థవివరణ:

ఉన్నది బెత్తెడు కడుపు, అదెంత తింటుంది? పట్టెడన్నమే కదా. దీనికొరకేనా ఇన్నిపాట్లు మనము పడి పొర్లుతున్నది?
ఇతరుల మనసులు బాధ పెట్టే పనులు చేసే దుఃఖకరమైన బ్రతుకు ఎందుకు?
ఈర్ష్య,అసూయలకు లోనై మనము ఇతరులు బాగుపడుతూంటే చూసి ఓర్వలేని బ్రతుకు ఎందుకు?
ఎదుటివారికి చేసే మేలు కూడా మనకు మేలే అని చెప్పని విద్య ఎందులకు?
ఆశలలో మునిగిపోయి ఎల్లప్పుడూ సతమతం చేసే డబ్బు ఎందులకు?
భగవంతుని సేవ లేకుండా జీవితాన్ని భ్రాంతిలో పడవేయు ధనమెందుకు?
పరమాత్మను తెలియలేక అన్ని రకాల దారులలో కన్నుగానక తిరుగు జీవుని దొరతనం (నేనే గొప్ప అనుకోవడం) ఎందుకు?

Wednesday, April 11, 2012

ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి.


లాభాల కోసం ఇతరులను త్రొక్కివేసే వారిని ప్రోత్సహిస్తారో లేక తమ మానాన తాము ఎవరినీ మోసం చేయకుండా కేవలం బ్రతకడం కోసమే వ్యాపారం చేసుకునేవారిని ప్రోత్సహిస్తారో ఆలోచించుకోండి.

చిత్రంలో దాగున్నదెవరో కనుక్కోండి?


ఈ చిత్రం లో దాగున్నదెవరో కనుక్కోగలరా?

ఒకవేళ కనుగొనడానికి ఇబ్బంది ఐతే
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
చిత్రాన్ని చూస్తూ మీ తలను కంటిన్యూగా ఆడించండి.

Monday, March 19, 2012

తప్పించుకొనేందుకు పారిపోయివస్తే మళ్ళీ ఇలాగైందేమిటి? - రమణమహర్షులవారు


శ్రీరమణమహర్షుల వారు ఆశ్రమంలో ఉండగా గతంలో రమణుల పాఠశాల జీవితంలో వారికి తమిళం భోధించిన ఉపాధ్యాయుడు ఒకసారి వచ్చారు. ఆ ఉపాధ్యాయుడిని గుర్తించిన మహర్షి తాను రచించిన ఒక తమిళ గ్రంధాన్ని ఆయనకు సమర్పించారు.

మహర్షి రచనా విధానాన్ని ఆ ఉపాధ్యాయుడు ఎంతగానో మెచ్చుకొన్నాడు.ఆ తర్వాత ఆ గ్రంధంలోని ఒక పద్యానికి అర్థం అడిగాడు. అప్పుడు మహర్షి సమీపంలోని భక్తుల వంక చూస్తూ ఇలా అన్నాడు.

"ఆయనను చూడండి. ఇటువంటి ప్రశ్నల బెడదను తప్పించుకునేందుకే నేను బడి నుండి పారిపోయాను.ఆయన మదురై నుండి ఇక్కడికి వచ్చి మళ్ళీ నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు. దీని అర్థం ఏంటి?" అని చమత్కరించారు.

అదివిన్న జనం భక్తులతో సహా గొల్లున నవ్వారు.

Friday, March 16, 2012

సచిన్ యొక్క చాలా అరుదైన ఫోటో


సచిన్ వందో సెంచరీ కి అభినందనలు

Wednesday, March 7, 2012

ఈ శిల్పము యొక్క అర్థం ఏంటో వివరించగలరా?



గత ఆదివారం నేను నా స్నేహితుడు ఉదయ్ కడప జిల్లా ఒంటిమిట్ట దేవస్థానమునకు వెళ్ళాము.

అక్కడ అనేక శిల్పాల ఛాయాచిత్రాలు తీసుకున్నాము.

అందులో ఈ శిల్పమునకు అర్థం ఏమయ్యుంటుందో చెప్పగలరు.

Wednesday, February 29, 2012

నేడే నా పుట్టినరోజు


ఈరోజు మీ సురేష్ బాబు పుట్టినరోజు. ఆశీర్వదించండి.

Tuesday, February 21, 2012

అమెరికన్లు భారతీయుడికి ఇచ్చిన గౌరవం


చికాగోలో స్వామివివేకానందుని పేర ఉన్న మార్గము



Monday, February 13, 2012

హనుమాన్ చాలీసా

శ్రీ గురుచరణ సరోజరజ,నిజమనముకుర సుధార
బరణౌ
రఘువర విమల యశ,జోదాయక ఫలచార

బుద్దిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార
బలబుధ్ధి విద్యాదేహు మోహి హరహు కలేశ్ వికార

1.
జయహనుమాన జ్ఞాన గుణసాగర జయకపీశ తిహులోక ఉజాగర
2.
రామదూత అతులిత బలధామ అంజనిపుత్ర పవన సుతనామ
3.
మహావీర విక్రమ బజరంగీ కుమతినివార సుమతికే సంగీ
4.
కంచన వరణ విరాజసువేశ కానన కుండల కుంచిత కేశా
5.
హాథ వజ్ర ఔద్వజా విరాజై కాంథే మూంజ జనేవూ సాజై
6.
శంకర సువన కేసరీ నందన తేజ ప్రతాప మహాజగ వందన
7.
విద్యావాన గుణి అతిచాతుర రామకాజ కరివేకో ఆతుర
8.
ప్రభుచరిత్ర సునివేకో రసియా రామలఖన సీతా మన బసియా
9.
సూక్ష్మ రూప ధరి సియహిదిఖావ వికటరూప ధరి లంక జరావ
10.
భీమరూప ధరి అసుర సమ్హారే రామ చంద్రకే కాజ సవారే
11.
లాయ సజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హరషి వురలాయే
12.
రఘుపతి కీన్హీ బహుత బడాయి తుమ మమ ప్రియ భరత సమభాయి
13.
సహస వదన తుమ్హరో యశగావై అసకహి శ్రీపతి కంఠలగావై
14.
సనకాదిక బ్రహ్మాది మునీశా నారద శారద సహిత అహీశా
15.
యమ కుభేర దిగపాల జహాతే కవికోవిద కహి సకై కహాతే
16.
తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా రామ మిలాయ రాజపద దీన్హా
17.
తుమ్హరో మంత్ర విభీషణ మానా లంకేశ్వర భయే సబ జగజానా
18.
యుగ సహస్ర యోజన పరభానూ లీల్యో తాహి మధుర ఫల జానూ
19.
ప్రభుముద్రికా మేలిముఖ మాహీ జలధి లాంఘిగయే అచరజ నాహీ
20.
దుర్గమ కాజ జగతకే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే
21.
రామ దు ఆరే తమ రఖవారే హోతన ఆజ్ఞా బిను పైసారే
22.
సబ సుఖ లహై తుమ్హారీ సరనా తుమ రక్షక కాహూ కో డరనా
23.
ఆపన తేజ సమ్హారో ఆపై తీనోం లోక హాంకతే కాంపై
24.
భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబనామ సునావై
25.
నాశై రోగ హరై సబ పీరా జపత నిరంతర హనుమత వీరా
26.
సంకట సే హనుమాన చుడావై మన క్రమ బచన ద్యాన జోలావై
27.
సబ పర రామ తపస్వీ రాజా తినకే కాజ సకల తుమ సాజా
28.
ఔర మనోరథ జోకోయిలావై అమిత జీవన ఫల పావై
29.
చారో యుగ ప్రతాప తుమ్హారా హై ప్రసిద్ద జగత ఉజియారా
30.
సాధు సంతకే తుమ రఖవారే అసుర నికందన రామ దులారే
31.
అష్ట సిద్ది నవనిధి కే దాతా అస వర దీన జానకీ మాతా
32.
రామ రసాయన తుమ్హరే పాసా సదా రహో రఘుపతికే దాసా
33.
తుమ్హరే భజన రామకో పావై జన్మ జన్మకే దుఖ బిసరావై
34.
అంతకాల రఘుపతి పురజాయీ జహా జన్మ హరిభక్త కహాయీ
35.
ఔర దేవతా చిత్తన ధరయీ హనుమత సేయి సర్వ సుఖ కరయీ
36.
సంకట హరై మిటై సబవీరా జో సుమిరై హనుమత బలవీరా
37.
జైజైజై హనుమాన గోసాయీ కృపాకరో గురుదేవకీనాయీ
38.
జో శతబార పాఠకర జోయీ చూటహి బంది మహా సుఖ హోయీ
39.
జో యహ పడై హనుమాన చాలీసా హోయసిద్ది సాఖీ గౌరీసా
40.
తులసీదాస సదా హరిచేరా కీజైనాథ హృదయ మహడేరా

పవనతనయ సంకటహరన మంగళ మూరతి రూప
రామలఖన సీతాసహిత హృదయ బసహు సురభూప

రామాయ రామభద్రాయ రామ చంద్రాయ వేధసే

రఘు నాధాయ నాధాయ సీతాయః పతయే నమః!

Wednesday, February 1, 2012

నవ వ్యాకరణాలు అంటే ఏవి?


శ్రీమద్‌రామాయణంలో మొదటిసారి హనుమంతుడిని శ్రీరామ,లక్ష్మణులు కలుసుకొన్నప్పుడు శ్రీరాముడు లక్ష్మణునితో హనుమంతుని మాటతీరుని మెచ్చుకొంటూ హనుమను "నవ వ్యాకరణ"పండితుడని పొగుడుతాడు.

ఇంతకూ నవ వ్యాకరణాలు అంటే ఏవో చూద్దామా!

1.పాణినీయం
2.కలాపం
3.సుపద్మం
4.సారస్వతం
5.ప్రాతిశాఖ్యం (కుమార వ్యాకరణం)
6.ఐంద్రం
7.వ్యాఘ్రభౌతికం
8.శకటాయనం
9.శాకల్యం

Thursday, January 12, 2012

స్వామి వివేకానందుని గురించి చాలామందికి తెలియని అద్భుతము

స్వామి వివేకానందుని పుట్టినరోజు నేడు. జాతీయ యువజనదినోత్సవం నేడు.ఈ టపా గతంలో ప్రచురింపబడ్డదే. వివేకానందుల పుట్టినరోజు సందర్బంగా ఈ టపా తిరిగి వ్రాస్తున్నాను.

స్వామి వివేకానందుని గురించి తెలియని భారతీయుడు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. యువతకు స్పూర్తి దాయకుడైన వివేకానందుడు అందరికీ ఆదర్శమే. అతను ఎన్నో అధ్యాత్మిక అనుభవాలు చివరికి అత్యున్నతమైన అద్వైత స్థితిని కూడా పొందాడు. ఇక్కడ చాలా మందికి ఒక సందేహం వస్తుంది. అదేమిటంటే ఇంత మహానుభావునికి సిద్ధులు అనగా అతీతశక్తులు ఉండవా అని. ఉన్నాయి. కాని అతను ఎప్పుడూ వాటిని బహిరంగముగా ప్రదర్శించలేదు.

ఇప్పుడు శ్రీ పరమహంస యోగానంద గారి గురించి చూద్దాం.
స్వామి పరమహంస యోగానంద క్రియాయోగమును భారత మరియు అమెరికా,ఇంగ్లండు లలో వ్యాప్తి చేసిన ఒక యోగి. ఇతను రచించిన ఆత్మకథ పేరు "ఒక యోగి ఆత్మకథ". ఈ పుస్తకం చాలా ప్రచారం పొందింది.ఈ పుస్తకమును అనేక అమెరికా విశ్వవిద్యాలయాలలో పాఠ్యాంశముగా పెట్టారు. ఈ పుస్తకములోనే మనకు తెలియని వివేకానందుని అతీత శక్తి గురించి ఉంది.సరే ఆ సంఘటన చూద్దాం.
####################################################################

పరమహంస యోగానంద గారు రెండవ సారి అమెరికా వెళ్ళినప్పుడు తన పాశ్చాత్య శిష్యుల కోసం ఎన్నో కానుకలు తీసుకెళ్ళారు. అక్కడ అందరికీ కానుకలు ఇస్తున్నారు. ఒక శిష్యునికి ఒక వెండి కప్పు బహుమానముగా ఇచ్చారు.
ఈ శిష్యుడు యోగానందుల కంటే వయసులో పెద్దవాడు. అప్పుడు ఆ శిష్యుడు నిశ్చేష్టుడై నోట మాట రాక ఒక మూల ఏడుస్తూ కూర్చుండిపోయాడు. యోగానంద గారు అది గమనించి అప్పటికి ఏమీ అనకుండా చివరలో ఏకాంతముగా ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు. అప్పుడు ఆ శిష్యుడు అవి ఆనందభాష్పాలు అని చెప్పాడు. యోగానంద గారు కారణం అడిగారు.
అప్పుడు ఆ శిష్యుడు తన చిన్ననాటి సంఘటన గురించి చెప్పాడు. అతని చిన్నతనంలో ఒకసారి అతను నీళ్ళల్లో మునిగిపోబోతూ రక్షించండని అరవసాగాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక కాషాయ దుస్తులు ధరించిన ఒక వ్యక్తి గాలిలో సూర్యకాంతివెలుగుతో ప్రత్యక్షమై "లే" అన్నాడు. ఈ శిష్యుడు ఎలాగో బయట పడ్డాడు. కొన్ని రోజులకు ఆ విషయం మరిచిపోయాడు.
తర్వాత చికాగోలో విశ్వమతమహాసభ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి లోపలికి పోవడం చూసి ఈ అబ్బాయి నిశ్చేష్టుడై తన తల్లితో "అమ్మా! చిన్నప్పుడు నాకు గాలిలో కనిపించిన వ్యక్తి అతనే" అంటూ వడివడిగా లోనికి ప్రవేశించారు. ఆ వ్యక్తే స్వామి వివేకానంద. వివేకానందులు ఈ అబ్బాయిని చూడ్డంతోనే నవ్వుతూ " నీళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండు" అన్నారు.ఈ అబ్బాయి ఆనందభాష్పాలు రాలుస్తూ శిష్యునిగా చేర్చుకోమన్నాడు. అందుకు వివేకానందులు "నీ గురువు నేను కాదు. అతను మరో పాతిక సంవత్సరాల తర్వాత వస్తాడు. దానికి గుర్తు అతడు నీకు ఒక "వెండి కప్పు"ను బహుమానముగా ఇస్తాడు" అన్నాడు.
వివేకానందులకు తనను శిష్యునిగా చేసుకోవడం ఇష్టములేక ఇలా అంటున్నాడని బాలుడు అనుకొన్నాడు. కాని ఇప్పుడు అతని భవిష్యవాణి ఇలా జరగడం చూసి ఆనంద భాష్పాలు రాల్చాడు.

ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే విశ్వమత మహాసభ జరిగినది 1893 సెప్టెంబరులో. యోగానంద గారు పుట్టినది 1893 జనవరి 5 న.
####################################################################

వివేకానందులు సిద్ధులను అనగా మహిమలను అసహ్యించుకొనేవారు. అందువలన అత్యంత అవసర పరిస్థితులలోనే తన శక్తులను ఉపయోగించారు. పైన పేర్కొన్న మానవాతీతశక్తి గురించి కూడా స్వామి వివేకానందులు ఎవరికీ స్వయముగా చెప్పలేదు.అందువలనే వివేకానందులు స్థాపించిన శ్రీ రామకృష్ణ మఠం వారి పుస్తకాలలో ఎక్కడా ఈ విశేషముగాని మరే ఇలాంటి విశేషాలు కాని పేర్కొనబడలేదు.

లేవండి,మేల్కొనండి గమ్యము చేరువరకు విశ్రమించకండి (వివేకానందుని పిలుపు)


Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు