కొందరిపై ఎందుకు ప్రేమ పుడుతుందో తెలియదు..చూడగానే వారికీ,మనకూ జన్మజన్మల సంబంధం ఉందని అనిపిస్తుంది..వారి పేరు వినగానే,వారి రూపం చూడగానే ఏదో తెలియని ఆనందం మనసును ఆక్రమిస్తుంది.అలా నాకు ఫోటో చూడగానే ప్రేమ,ఆరాధన పుట్టినవారిలో స్వామి వివేకానందులు మొదటివారు.
ఇక భగవాన్ రమణులు రెండవవారు.రామకృష్ణులు,శారదామాతలను కూడా చూడగానే ఇలాంటి భావమే కలుగుతుంటుంది.
4వ తరగతి చదువుతున్నప్పుడే(అతిశయోక్తి అనిపించవచ్చు కానీ నిజం) రమణుల ఒక వాక్యం ("నేను" గురించి)ఏదో పుస్తకంలో చదివి మా తాత గారిని అడగడం ఇప్పటికీ గుర్తు వస్తూ ఉంటుంది.
ఇప్పటికీ వీరి పేర్లు ఎవరి నోటైనా అనుకోకుండా విన్నా మనసు తెలియకుండానే ఆ మాటల వైపు వెళ్ళిపోతూంటుంది.
ప్రతిరోజూ ఏదో ఒక సందర్భం లో నా హృదయంలో తిరుగాడే నా హృదయవాసి అయిన భగవాన్ రమణులకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
"భక్తి జ్ఞానమునకు తల్లి"
- భగవాన్ రమణులు