నిన్నటి ప్రశ్న:
మీకు నలుగురు స్నేహితులు ఉన్నారు.
ఆ నలుగురూ ఎప్పుడూ నిజం చెప్తారు.
వారి జీతాలెంతో చెప్పడం వారిలో ఏ ఒక్కరికీ ఇష్టం లేదు.
ఒక వేళ మీ జీతం ఎంత అని అడిగితే చెప్పడం మాకు ఇష్టం లేదంటారు.
వారిలో వారికి కూడా ఒకరి జీతం ఇంకొకరికి తెలియడం ఇష్టం లేదు.
ఇప్పుడు ప్రశ్న ఏంటంటే వారి జీతాలు ఎవరికీ తెలియనవసరం లేకుండానే వారి జీతాల మొత్తం వారి ద్వారానే కనుక్కోవాలి.
సమాధానం:
నలుగురు వ్యక్తులు a,b,c,d అనుకుందాము. ఒక కాగితం తీసుకొని a తో తన జీతం మొత్తానికి తన ఇష్టమొచ్చినంత కలిపి వ్రాయమనాలి. ఉదాహరణకు a జీతం 15000 అనుకుంటే అతను 547 కలిపాడనుకోండి 15547 వ్రాస్తాడు. ఇలా ఎంత కలిపితే అంత వ్రాస్తాడు. జీతం వ్రాయడు (కాబట్టి తెలిసేందుకు అవకాశం లేదు) కాని కలిపిన మొత్తంతో కలిపి వ్రాస్తాడు. తర్వాత అదే కాగితాన్నిb,c,d లకు ఇచ్చి అధే విధంగా చేయమంటాము. ఇప్పుడు మొత్తము(జీతాల మొత్తము + వాళ్ళు కలిపిన మొత్తము) వస్తుంది. ఇప్పుడు వచ్చిన దాన్లో వాళ్ళు కలిపిన మొత్తాలను తీసివేయమనాలి.ఇప్పుడు మిగిలేదే వాళ్ళ జీతాల మొత్తము.
ఉదాహరణకు a,,b,c.d ల జీతాలు A,B,C,D అనుకొంటే మరియు కలిపిన మొత్తాలు w,x,y,z అనుకొంటే
అందరూ కలిపిన మొత్తం
(A+w) + (B+x) + (C+y) + (D+z) అవుతుంది
ఇందులో మళ్ళీ w,x,y,z లను తీసేస్తే A+B+C+D (అంటే జీతాల మొత్తం) వస్తుంది.
ఇక్కడ వారెంత కలిపారో మనకు తెలియనవసరం లేదు మరియు ముఖ్యంగా వారి జీతాలు కూడా తెలియనవసరం లేదు.
చూసారా ఎంత సులభమో.