తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Monday, December 26, 2011

బెంగళూరు లో ఆంధ్రప్రదేశ్ బస్టాండు మార్పు


ఇన్నిరోజులుగా బెంగళూరులోని మెజెస్టిక్ నుండే ఆంధ్రా,కర్ణాటక వైపు వెళ్ళే బస్సులు బయలుదేరేవి. కాని మెట్రోరైలు పనుల మూలాన నేటి నుండి ఆంధ్రావైపు అంటే హైదరాబాద్,విజయవాడ,తిరుపతి,కర్నూలు వైపు వెళ్ళే అన్ని APSRTC,KSRTC బస్సులు శాంతినగర బస్టాండు నుండి బయలుదేరుతాయి.

మతభేధాలు తప్పు అన్న పరమేశ్వరుడు

ఈ కథ వరాహపురాణంలో ఉంది.

బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఎవరిని పూజించాలి? ఎవరిని గురించి తపస్సు చేస్తే కోరుకున్నవి నెరవేరతాయి? అనే సందేహం పూర్వం ఓసారి అగస్త్య మహామునికే వచ్చింది. అప్పుడాయన సందేహం ఎలా నివృత్తి అయింది అని చెప్పే కథా సందర్భం ఇది. మహారాజుకు అగస్త్యుడు తన స్వానుభవాన్ని వివరించాడు.

పూర్వం సర్వలోక జ్ఞానప్రాప్తికి అగస్త్యుడు ఎవరిని ఆరాధించాలా అని ఆలోచించి తనకు తెలిసినంతలో సనాతనుడు, యజ్ఞమూర్తి అయిన విష్ణువును ఆరాధించటం ప్రారంభించాడు. అలా ఆ యజ్ఞమూర్తిని చాలాకాలం పాటు ఆరాధిస్తుండగా ఓ రోజున యజ్ఞమూర్తి ప్రత్యక్షం కాలేదు. కానీ దేవేంద్రుడితో సహా దేవతలంతా అగస్త్యుడి ఆశ్రమానికి వచ్చారు. తాను యజ్ఞమూర్తిని ఆరాధిస్తుంటే ఆయన ప్రత్యక్షం కాక ఈ దేవతలంతా వచ్చారేమిటబ్బా.. అని అగస్త్యుడు ఆలోచిస్తుండగానే ముక్కంటి నీలలోహితుడు అయిన శివుడు అక్కడికి వచ్చి నిలుచున్నాడు.

ఆయనను చూడగానే దేవతలు, రుషులు అంతా కలిసి ఆ రుద్రమూర్తికి నమస్సులర్పించారు. ఇంతలో మహాయోగి, త్రికాలజ్ఞుడు, పద్మ సంభవుడు అయిన బ్రహ్మ ఓ విమానంలో అక్కడకు వచ్చాడు. అలా దేవతలంతా అక్కడకు వచ్చారు కానీ అగస్త్యుడు అనుకొన్నట్లు విష్ణువు మాత్రం రాలేదు. ఇదేమిటి నేననుకొన్నట్లుగాక ఈ దేవతలంతా వచ్చారేమిటి? అని ఆ ముని అనుకొంటూ ఇంతమంది దేవతల్లో అసలు పూజనీయుడెవరు? అనే సందేహం కలిగి రుద్రుడు వైపున తిరిగి అదే విషయాన్ని గురించి అడిగాడు. అప్పుడు రుద్రుడు ఇలా చెప్పటం ప్రారంభించారు.

ఓ మునీ.. లోకాలన్నీ సర్వయజ్ఞాలతో యజిస్తున్నది ఎవరినో, ఎవరి వల్ల ఈ జగత్తంతా దేవతలతో సహా పుడుతోందో.. అలాగే ఈ జగత్తంతా ఎప్పుడూ ఎవరిలో నిలిచి ఉంటుందో, ఎవరిలో విలీనమవుతోందో ఆ పరదైవమే సత్యరూపమైన భగవంతుడు. ఎవరు ఎంతమంది దేవతలను గురించి ఎన్ని పూజలు, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని నమస్కారాలు పెట్టినా అవన్నీ ఆ భగవంతుడికే చెందుతాయి. ఆ దేవదేవుడే లోకపాలనా సౌలభ్యం కోసం మూడు రూపాలుగా సృష్టించుకున్నాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేవే ఆ రూపాలు. సత్వరజస్తమోగుణాలలో సత్వగుణం చేత జీవికి ముక్తి కలుగుతుంది. ఆ సత్వం నారాయణాత్మకం. యజ్ఞరూపుడైన నారాయణుడే ఆ భగవానుడు.

ఈయన నాలుగు యుగాలలో నాలుగు విధాలుగా లోకవాసుల చేత పూజలందుకొంటుంటాడు. కృతయుగం లోని వారు సూక్ష్మ రూపంలో ఉండే భగవంతుడిని ఉపాసిస్తారు. త్రేతాయుగం లోని ప్రజలు యజ్ఞరూపంలో ఉన్న
భగవంతుడిని అర్చిస్తారు. ద్వాపరంలో పాంచరాత్ర సిద్ధాంతాన్ని అనుసరించే వారు ఆయనను ఉపాసిస్తారు. కలియుగంలో అనేక రూపాలలో ఆ భగవంతుడు పూజలందుకొంటుంటాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ భగవంతుడి కంటే పరదైవం ఇంకొకటి లేదు. విష్ణువే స్వయంగా బ్రహ్మ. బ్రహ్మే స్వయంగా రుద్రుడు.. అని బ్రహ్మ విష్ణు రుద్రులకు ఏ భేదాన్ని పాటించకుండా అందరూ ఆరాధించాలి. ఆ ముగ్గురిలో భేదాన్ని భావించిన వాడు పాపకారి, దుష్టాత్ముడు అవుతాడు.

ఇలా రుద్రుడు అగస్త్యమునికి దైవతత్వాన్ని గురించి వివరించి చెప్పారు. అగస్త్యముని అసలు విషయాన్ని అప్పటికి గ్రహించాడు. తాను అనవసరంగా బ్రహ్మ వేరు, విష్ణువు వేరు, రుద్రుడు వేరు అని అనుకొంటూ ఎదురొచ్చిన దేవతలను తక్కువ చేసి చూసినందుకు చింతించాడు. ఎవరి మనస్సుకు నచ్చిన పద్ధతిని బట్టి వారు ఆయా దేవతలను అర్చించవచ్చు. అంతేకానీ ఈ కనిపిస్తున్న దేవుడు మా దేవుడు కాదు.. అంటూ మన భేదాన్ని సృష్టించటం, ఎదుటి మతాన్ని, ఆ దేవతలను తక్కువ చేసి చూడటం సమంజసం కాదని ఆ మునికి బాగా అర్థమైంది.


ఇప్పటి పరిస్థితులకు అనుగుణముగా మనం ఈ కథను విభిన్నమతాలకు అన్వయించుకోవచ్చు

Saturday, December 24, 2011

సనాతన ( హిందు ) ధర్మం లో "ఓం" ను ఎందుకు భగవంతుని చిహ్నము గా స్వీకరించారు?

శబ్దమే భగవంతుడని చెప్పబడింది.ప్రతిపదము నకు మూలాధారము గా ఒక గుర్తుగా ఉంటే అది ఉత్తమోత్తమ చిహ్నం అవుతుంది.శబ్దోచ్చారణ లో మనం కంఠం లో ని స్వరపేటికను,అంగిలిని, శబ్ద ఫలకాన్ని ఉపయోగిస్తాము.ఏ శబ్దము నుండి ఇతర శబ్దాలన్నీ వ్యక్తమవుతున్నాయో అలాంటి అత్యంత స్వాభావిక శబ్దము ఏదైనా ఉందా? ఆ శబ్దమే ప్రణవము లేక ఓంకారము.ఇందులో అ,ఉ,మ లు ఉన్నాయి.నాలుకలోని, అంగిలిలోని ఏ భాగము కూడా 'అ 'కార ఉచ్చారణ కు తోడ్పడదు.ఇది ఓంకారానికి బీజం గా ఉంది.చివరిది 'మ 'కారము.పెదవులని మూసి దీన్ని ఉచ్చరిస్తారు.నోటిలోని మూలభాగము నుండి అంత్యభాగము వరకు కూడా ఉచ్చారణ సమయము లో దొర్లుకుంటూ ఉంటుంది.ఇలా శబ్ద ఉచ్చారణా ప్రక్రియనంతా ఓంకారం తెలియజేస్తూంది.అందువలన ఓంకారాన్ని స్వీకరించడము జరిగింది.

" స్వామి వివేకానంద "

Thursday, December 22, 2011

ఈ మతంలో కొంత మంచి ఉంది, ఆ మతంలో కూడా కొద్దిగా ఉందేమో

దేవుడొక్కడే అని అందరికీ తెలుసు. కానీ మళ్ళీ నా మతం,నీ మతం అని అంటాము. అనేక మతాలు ఉన్నాయనటం భ్రాంతి మాత్రమే. ఉన్నది ఒకే ధర్మం."ఏకమేవ అద్వితీయం" అనే సత్యమే అనాదిగా వస్తోంది.లోకం లో వేర్వేరు ప్రవృత్తులు గల మనుషులు జన్మిస్తుండేటంత వరకూ ఆ అద్వితీయ దైవమే పాత్రోచిత మార్పులను పొందుతుందని గ్రహిస్తే, మనం పరస్పర సహనాన్ని చూపించుకోగలం.


"నదులన్నీ వేర్వేరు తావుల్లో జన్మించి,ఋజు లేక వక్రమార్గాలలో పయనించి సముద్రంలో కలిసిపోయేటట్లు, వివిధ శాఖల వారు విభిన్న దృక్పథాల్లో చివరకు నిన్నే చేరుతున్నారు(శివ మహిమ్నా స్తోత్రం 7)" అనేది అత్యంత వాస్తవం. కొందరంటారు "అవునవును,ఈ మతంలో కొంత మంచి ఉంది.ఇవి అధమ మతాలు.వీటిలో కూడా కొంత మంచి ఉంది" అని. అలాగే ఇతర మతాలన్నీ చరిత్రకందని కాలానికి పూర్వం జరిగిన క్రమపరిణామాన్ని సూచించే శిథిలాలనీ తమ మతం ఒక్కటే పరిపూర్ణమైన పరిణామాన్ని పొందినదనీ అంటారు. ఇంకొందరు తమ మతం నవీనమైనదవటంతో అదే సర్వోత్తమం అనీ సర్వశ్రేష్ఠతను దానికి ఆపాదిస్తున్నారు. కాని వీటన్నిటికీ సముద్ధరణ శక్తి సమంగానే ఉన్నదని మనం గ్రహించాలి.మనకు కనిపించే తేడాలన్నీ కేవలం గౌణ(secondary) విషయాలనే ఆశ్రయించుకొని ఉన్నాయి.ఇలాంటి విషయాలు మూఢాచారం నుండి పుట్టినవి. పిలిచేవారందరికీ భగవంతుడే సమాధానం ఇస్తాడు. ఎవరికి గానీ జీవుల ఉద్ధరణ గురించి కానీ,వారి ముక్తిని గురించి కానీ తలకొట్టుకోవలసిన అవసరం లేదు. సర్వశక్తివంతుడైన సర్వేశ్వరుడే జీవుల ఉద్ధరణ గురించి ఆలోచిస్తాడు. ఒకే భగవంతుడు జీవుల మొరలను ఆలకిస్తున్నాడు.


ఒక వైపు తమకు దేవుడిపై విశ్వాసం ఉందంటూ , మళ్ళీ తమ మతం భుజస్కందాలపైనే మానవకోటిని ఉద్ధరించే భారం ఉందని అసంబద్ధంగా మాట్లాడే వారి తీరు ఎలాంటిదో నాకు తెలియడం లేదు. దీనిని ధర్మం అనగలమా? ధర్మం అంటే భగవత్ సాక్షాత్కారం.


మాటలు,కేవలం మాటలలోనే విశ్వాసం, గ్రుడ్డితనం తో తడుముకోవడం, పూర్వుల సిద్ధాంతాలను చిలుకల మాదిరి పలుకుతూ మతం పేరున రాజకీయాలను చేయడం తగదు. ఇప్పుడు కొందరు ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తునందని అనుకొంటున్న ఇస్లాం మతంలో కూడా " ప్రభూ! నువ్వు సర్వేశ్వరుడివి.నీవు అందరి హృదయాలలో ఉన్నావు.నువ్వే ప్రతివారికీ శరణు. నువ్వే జగద్గురువవు.నీ ప్రజలు నివశించే భూమిని రక్షింప నువ్వే మా అందరికంటే అధికముగా ప్రయత్నిస్తావు" అనే అమోఘవాక్యాలు వెలువడ్డాయి.


ఎవరి నమ్మకాలనూ చెరుపనవసరం లేదు. మంచిని ఇచ్చే శక్తిని ఉంటే ఇద్దాము. వారి విశ్వాసాలను కదల్పకుండానే వారిని బాగుపడనిద్దాము. దీనికేమీ అభ్యంతరం లేదు. కాని రెంటికీ చెడ్డ రేవడి పరిస్థితి ని ఎందుకు కల్పించాలి?

Wednesday, December 21, 2011

ఆశ్చర్య పర్చే మన దేవుళ్ళ పేర్ల అర్థాలు

మన దేవతల పేర్లకు అర్థాలు తెల్సుకుంటే మనకు చాలా ఆశ్చర్యం కల్గుతుంది.
కొన్నిటిని ఇక్కడ చూద్దామా!

విష్ణు - సర్వవ్యాపకత్వం
శివ - చైతన్యం ( గమనించండి శివం కు వ్యతిరేకం శవం అనగా అచైతన్యం)
గౌరి - తెలుపు పసుపు కలిసిన వర్ణం కలది
కాళి - నలుపు వర్ణం కలది
కృష్ణ - నలుపు వర్ణం
రామ - రమ్యతే ఇతి రామ: అనగా ఆత్మతో సదా కలిసిఉండేవాడు
గణపతి - గణాలకు అధిపతి
విఘ్నేశ్వరుడు - విఘ్నాలకు అధిపతి
ఇంద్రుడు - ఇంద్రియాలకు అధిపతి
జర - ముసలితనం ( కృష్ణావతార సమాప్తానికి కారణం)
వ్యాసుడు - విభజించేవాడు
సుబ్రహ్మణ్యం: బ్రహ్మత్వం నందు(పరమాత్మతత్వం నందు) బాగా కుదురుకున్నవాడు

అలాగే కొన్ని సంస్కృత పదాలు ఎలా వచ్చాయో చూద్దామా!

పక్షి : "క్షిప"తీతి పక్షిః (ఎగురునది పక్షి)
సింహం : "హింస"తీతి సింహః ( హింసించునది సింహం)

Tuesday, December 20, 2011

భగవద్గీత పై నిషేధం - ఎవరికి నష్టం?

పాపం "ఖర్మ"జీవులు భగవద్గీతను నిషేధించాలని చూస్తున్నవాళ్ళు.

అమృతం త్రాగమని ఇచ్చాడు దేవుడు, కాది ఇది విషం అని నిరాకరిస్తే అది ఎవరికి నష్టం?

పద్దెనిమిది అంతస్తుల సౌధం ఇచ్చాడు భగవంతుడు.దీన్ని ఆశ్రయించుకొని జీవితాన్ని పండించుకొమ్మన్నాడు దేవుడు. వద్దు మాకు అవసరం లేదు అంటే ఎవరికి నష్టం?

అనేక వేలఏళ్ళుగా తుఫానులకు, భూకంపాలకు అనేకానేక భీభత్సాలకు ఎదురొడ్డి ఏమాత్రం తొణకని,చెదరని 18 అంతస్తుల సౌధమే మాకు వద్దు అంటే ఎవరికి నష్టం?

ఏమనుకుంటున్నారు ఈ మతచాందసులు?
భగంతుడు మానవుడి పై ఆధారపడి ఉన్నాడా లేక మానవుడు భగవంతుడిపై ఆధారపడి ఉన్నాడా?

భగవద్గీతను నిషేధించి మెల్లమెల్లగా సనాతన వైదిక ధర్మాన్ని నశింపజేయాలని అనుకుంటే అది వారి మూర్ఖత్వమే అవుతుంది కాని ఇతరం కాదు. భారతీయులు ఏ మతం వారు కానివ్వండి, భారతీయుల నరనరాలలోనూ సనాతన వైదికధర్మమే ప్రవహిస్తోంది.

భగవద్గీతను ఒకమతగ్రంధం గా భావించి నిషేధించాలని చూస్తున్న వీరి అజ్ఞానానికి నవ్వుకోవడం తప్ప సగటు భారతీయుడు ఏ మాత్రం బాధపడడు. బాధపడతాడు ఎందుకంటే అది వారి అజ్ఞానం గురించే.

Monday, December 19, 2011

నచికేతుడిలాంటి వారిని పది మందిని ఇస్తే ప్రపంచాన్నే మార్చేస్తాను - స్వామి వివేకానంద

"నాకు నచికేతుడిలా చెప్పినది మారుమాటాడక చేసేవాళ్ళుంటే ఒక పదిమందిని ఇవ్వండి.నేను ఈ ప్రపంచాన్నే మార్చేస్తాను" అన్నాడు స్వామివివేకానంద.

ఇంతకూ నచికేతుడు అంటే ఎవరు?అతని గొప్పతనం ఏమిటి?

కఠోపనిషత్తు లో నచికేతుడి ప్రస్తావన వస్తుంది.

వాజశ్రవుడు(ఉద్దాలకుడు) అను ఒక రాజు ఒక యాగం చేయ సంకల్పించాడు.ఆ యాగం లో తనకు గల సర్వసంపదలనూ దానం చేయాలి.కాని వాజశ్రవుడు ఎందుకూ పనికిరాని గోవులను,గొడ్డులను,ముసలి ఆవులను దానం చేయసాగాడు.ఇది గ్రహించిన అతని కుమారుడు నచికేతుడు తన తండ్రిని పాపం నుండి విముక్తున్ని చేయదలచి "నాన్నా!నేనూ నీకు గల సంపదనే కదా.మరి నన్ను కూడా దానం చెయ్యి"అన్నాడు.దీన్ని ఒక బాల్యచేష్ట గా తీసుకుని వాజశ్రవుడు విసిగించవద్దని అన్నాడు.కాని కొడుకు యొక్క పోరు పడలేక విసుగుతో "నిన్ను యముడికి ఇస్తున్నాను"అని అన్నాడు.(ఇప్పుడు కూడా మనం ఏమైనా కోపం వస్తే "చావు పో" అని వాడతాము కదా అలా అన్న మాట).
కాని యజ్ఞం తర్వాత వాజశ్రవుడు తను కొడుకుతో అన్న మాటలు గుర్తొచ్చి చాలా భాధపడ్డాడు.అప్పుడు నచికేతుడు తండ్రితో "నాన్నా!ఈ ప్రపంచంలో మాట నిలుపుకోకపోవడం వలన అసత్యదోషం వస్తుంది.మీరు ఏమీ భాధపడకుండా నన్ను యముడి వద్దకు పంపండి."అని యముని వద్దకు వెళ్ళాడు.

నచికేతుడు యముని వద్దకు వెళ్ళిన సమయం లో యముడు ఏదో పనిమీద వెళ్ళి అక్కడ లేడు.నచికేతుడు యముడు వచ్చేవరకు మూడు రొజులు నిరాహారంగా ఉన్నాడు.యముడు వచ్చి విషయం తెలుసుకొని "వచ్చిన అతిథి ని మూడురోజులు నిరాహారంగా ఉంచి పాపం చేసాను.అందుకు ప్రాయశ్చిత్తం గా మూడు వరాలిస్తాను" అని అనుకొని నచికేతుడితో మూడు వరాలు కోరుకొమ్మన్నాడు.

అప్పుడు నచికేతుడు " ఓ యమధర్మరాజా!మొదటి వరంగా నేను ఇక్కడి నుండి ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు మా తండ్రి నన్ను సంతోషంగా ఆహ్వానించాలి(ఈ వరం ఎందుకంటే తన తండ్రి తన మీద అనుమానపడకుండా ఉండడానికి).మరియు అతని పాపాలన్నీ పోవాలి.
రెండవ వరంగా స్వర్గ ప్రాప్తికి సంబంధించిన యజ్ఞాన్ని,దానికి సంబంధించిన క్రతువుని నేర్పించమని అన్నాడు.యముడు సంతోషంతో నేర్పించి అప్పటినుండి ఆ యజ్ఞానికి నాచికేతయజ్ఞం అని పేరొస్తుందని వరమిచ్చాడు.
ఇక మూడవ వరంగా మరణానంతర జీవితం గురించి మరియు బ్రహ్మఙ్ఞానం గురించి ఆడిగాడు.యముడు అది చెప్పడం ఇష్టం లేక ధన,వస్తు,కనక,వాహన,కాంతలను అనుగ్రహిస్తానని అన్నాడు.కాని నచికేతుడు నిరాకరించడం వలన యముడు ఎంతో సంతోషించి తను కోరుకున్న వరంగా బ్రహ్మజ్ఞానం ఉపదేశించాడు.
తర్వాత నచికేతుడు సంతోషంతో తన ఇంటికి రాగా తన తండ్రి ఎంతో సంతోషంతో ఆహ్వానించాడు.

ఈ కథను కఠోపనిషత్తు నుండి గ్రహించడం జరిగింది.

Thursday, December 8, 2011

గ్యాస్ సిలిండర్ తీస్కొనేప్పుడు మనం ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయం


మీరెప్పుడైనా మానం నిత్యం వాడే గ్యాస్ సిలిండర్ కు expiry date ఉంటుందని విన్నారా.
ఇక్కడ చెప్పబోయేది గ్యాస్ యొక్క expiry date గురించి కాదు. సిలిండర్ యొక్క expiry date.
మనం గ్యాస్ సిలిండర్ ను గనుక గమనించినట్లైతే ఫోటోలో చూపించినట్లు వ్రాసిఉంటుంది.

ఇది ఆంగ్ల అక్షరము మరియు అంకెలను కలిగి ఉంటుంది.

దీని అర్థం ఏంటంటే:
ఆంగ్ల అక్షరాలైన A,B,C,Dలలో ఏదో ఒకటి ఉంటుంది.

A ఉంటే మార్చి నెల వరకు (మొదటి త్రైమాసికం)
B ఉంటే జూన్ నెల వరకు (రెండవ త్రైమాసికం)
C ఉంటే సెప్టెంబర్ వరకు (మూడవ త్రైమాసికం)
d ఉంటే డిసెంబర్ వరకు (నాలగవ త్రైమాసికం) లను సూచిస్తాయి.
ఇక సంఖ్య సంవత్సరం ను సూచిస్తుంది.

బొమ్మలో D-06 ఉంది అంటే ఈ గ్యాస్ సిలిండర్ కాలపరిమితి డిసెంబర్ 2006 తో ముగుస్తుంది అని అర్థం.

ఉదాహరణకు B-12 ఉంటే జూన్ 2012 తో ముగుస్తుంది అని అర్థం.

కాలపరిమితి(expiry date) ముగిసిన సిలిండర్లను గనుక మనం వాడినట్లైతే గ్యాస్ లీక్ కావడం, పేలడం లాంటి ప్రమాదాలకు చాలా ఆస్కారం ఉంది.

Wednesday, November 23, 2011

అమ్మానాన్నలారా! క్షమించండి ఈ పనికిమాలిన బిడ్డల్ని!


ఒక కళ్ళు సరిగా కనపడని,చెవులు సరిగా వినపడని వృద్ధుడైన తండ్రి ఇంటి గోడపై ఏదో వ్రాలడం చూసాడు.తన కొడుకును పిలిచి అది ఏంటని అడిగాడు.అది "కాకి" అని కొడుకు బదులిచ్చాడు.కాని సరిగా వినపడని తండ్రి మళ్ళీమళ్ళీ అడిగాడు.ఇలా మూడు సార్లు అడిగిన తర్వాత కొడుకు విసుగుతో "ఒక సారి చెప్తే వినపడదా? అది కాకి"అని విసుగుతో కోపంగా బదులిచ్చాడు.అప్పుడు ఆ వృద్ధుడు తన అరలో ఉన్న ఫలానా సంవత్సరపు డైరీని తన కొడుకును తీస్కొనమని చెప్పి అందులో ఫలానా తేదీలో ఏమున్నదో చదవమని అడిగాడు.ఆ డైరీ 30 సంవత్సరాల క్రిందటిది.

అందులో" ఈ రోజు నా సంవత్సరం వయసు ఉన్న కొడుకు గోడపై కాకిని చూపి అదేంటని అడిగాడు.నేను కాకి అని చెప్పినప్పటికీ అర్థం కాక 20 సార్లు అడిగాడు.అందుకు నాకు కోపం రాలేదు సరికదా వాడి అమాయకత్వం చూసి అంతకంతకూ వాడిపై అభిమానం పెరిగింది" అని ఉంది.ఇది చూసి ఆ కొడుకు సిగ్గుతో తల దించుకొన్నాడు.

పైన చెప్పినది కథే కావచ్చు.కాని నేడు దిగజారుతున్న మానవతా విలువలకు ఒక ఉదాహరణ.తను తినకున్నా బిడ్డలు తింటే చూసి ఆనందపడే తల్లి,కుటుంబం కోసం కష్టపడే తండ్రి ఏ విధమైన విసుగు,విరామం లేక బిడ్డలను పెంచి పోషిస్తుంటారు.పిల్లలు వృద్దిలోనికి వస్తే చాలు అనుకుని అందుకోసం ఎన్నో కష్టాలు పడతారు.కాని పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఆ సంతానం తల్లిదండ్రుల పట్ల చూపే కృతజ్ఞత ఏమిటి? ఇప్పుడు తామూ పెళ్ళి చేసుకొని పిల్లలను కని వారిని పోషిస్తుంటారు.అలా పోషించేటప్పుడు "తమను కూడా ఇలాగే కదా తమ తల్లిదండ్రులు పెంచి పోషించి వృద్దిలోనికి తెచ్చింది" అన్న ఆలోచన ఎందుకు రావడంలేదు? అందరూ ఇలానే ఉంటారనడం లేదు.కాని చాలామంది ఉన్నారు కదా? వృద్దాప్యంలో తల్లిదండ్రులు కోరుకొనేది ప్రశాంతమైన జీవితం.నేడు వారు భారమై వారిని ఏ వృద్దాశ్రమంలోనో వదిలి పెట్టి తమ బాధ్యత తీరిపోయిందని అనుకొంటున్నారు.ఇదే విధంగా తల్లిదండ్రులు కూడా అనుకొని బిడ్డలను అనాధశరణాలయాలలో వదిలిపెట్టి వస్తున్నారా? అలా వదిలిపెట్టి వచ్చుంటే నేడు ఆ బిడ్డల పరిస్థితి ఏమయ్యుండేది?ఆ దేవుడికే ఎరుక. తల్లిడండ్రులకు ఏ లోటూ లేకుండా ప్రశాంతంగా ఉంచడం మన బాధ్యత.కాదంటారా?

Tuesday, November 22, 2011

నీవు నిజంగా దేవుడిని నమ్మేవాడివైతే నీ మతం లోనే ఉండు

ఆర్థిక కారణాలతోనో లేక సామాజిక కారణాలతోనో మతం మారేవారిని మనం చూస్తూనే ఉన్నాము. అలాకాకుండా భగవంతుడి ఉనికి పట్ల మనస్పూర్తిగా నమ్మకం ఉన్నవాడు ఎన్నటికీ మతం మారవద్దని చెప్పే ఒక యదార్థ సంఘటన ఇప్పుడు చూద్దాం.

శృంగేరీ పీఠాధిపతి అయిన చంద్రశేఖరభారతీ స్వాముల వారి వద్ద జరిగిన విషయం ఇది. ఒకనాడు ఒక విదేశీ క్రైస్తవుడు స్వామివారిని కలవడానికి వచ్చినాడు. అక్కడ స్వామి వారికి అతనికిమధ్య జరిగిన సంభాషణ ఇలా జరిగింది.

విదేశీయుడు: "స్వామీ! మీరు అనుసరిస్తున్న సనాతనధర్మం పట్ల నేనెంతో ఆకర్షితుడైనాను.నేను కూడా మీ మతంలో చేరాలనుకుంటున్నాను.అనుగ్రహించండి"

స్వామి వారు: "మీకు భగవంతుడి ఉనికి పట్ల నిజంగా నమ్మకం ఉందా?"

విదేశీయుడు:ఉందండీ.

స్వామివారు:"సరే మీరు మీ ఇష్టప్రకారమే ,మీ తల్లిదండ్రులను మీరే ఎన్నుకుని జన్మించారా?"

విదేశీయుడు: "అలా ఎలా అవుతుందండీ. అది మన చేతుల్లో లేదు కదండీ. దేవుడు అక్కడ నన్ను జన్మించాలని ఆదేశించాడు. అందుకు అక్కడ పుట్టాను".

స్వామివారు: మరి మీఇష్టప్రకారమే మరణిస్తారా?

విదేశీయుడు: అదికూడా మనచేతుల్లో ఏముందండీ.అంతా ప్రభువు దయే కదండీ.

స్వామివారు: మరి మీ పుట్టుకకు, చావుకు కారణం భగవంతుడు అని మీరు నమ్ముతున్నప్పుడు అదే భగవంతుడు మిమ్మల్ని ఫలానా మతంలోనే ఎందుకు పుట్టించాడంటారు. అది అతడి నిర్ణయం అని మీరు ఎలా మర్చిపోతున్నారు. మీ బైబిల్ లో కూడా అద్భుతమైన విషయాలు ఉన్నాయి కదా. వాటిని ఆచరించవచ్చు కదా.

విదేశీయుడు: అవునండీ. మీరు చెప్పినది నిజమేనండీ. ప్రతిమతంలోనూ సత్యం ఉందండీ. అలానే మా మతంలో కూడా ఉందండీ. నన్ను క్షమించండి.

స్వామివారు: మీరు మీ మతంలోనే ఉంటూ ఒక నిజమైన క్రైస్తవుడు గా మంచి అభ్యున్నతి పొందండి. ఏ మతం ద్వారా ఐనా భగవంతుడిని సాక్షాత్కరించుకోవచ్చు.

చూసారు కదండీ. ఇదీ విషయం.

Thursday, November 17, 2011

తెలుసుకోవల్సిన విషయం


ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నా ఆయిల్ కంపెనీ నష్టాలంటూ ఎడాపెడా పెట్రోలు,డీజల్ ధరలు పెంచేస్తున్న మన ప్రభుత్వాన్ని ఏమనుకోవాలి? అంతే కాక ఆ ధరల పెంపు పై నియంత్రణను తొలగించుకొని ఆయిల్ కంపెనీలకే కట్టబెట్టిన ఘనత మన ప్రభుత్వానిది కదా.

Monday, November 7, 2011

మనలో చాలామందికి తెలియని కొన్ని ఆంగ్ల పదాల గమ్మత్తులు

BUS: Break Under Stopping.

CHESS: Chariot, Horse, Elephant, Soldiers.

COLD: Chronic Obstructive Lung Disease.

Joke: Joy of kids entertainment.

Aim: Ambition in mind.

Date: Day and time evolution.

Eat: energy and taste.

Tea: Taste and energy admitted.

Pen: power enriched in Nib.

Nylon: New York London (manufacturers Name).

Smile: Sweet memories in lip expression.

Bye: Be with you everytime.

చాలా విచిత్రం గా ఉన్నాయి కదండీ!

ఇవి ఎంతమాత్రం నిజమో తెలియదు కానీ నాకు వచ్చిన ఒక ఫార్వర్డు మెయిల్ లోనివి ఇవి.

Wednesday, October 26, 2011

మన పుర్వీకులు ఎందుకని భారీఆనకట్టలు నిర్మించలేకపోయారు (నిర్మించలేదు)? - ఒక వివరణ

సమాధానం ఏంటి? వాళ్లకు అంత సాంకేతికపరిజ్ఞానం లేకనా? లేక మరో కారణం ఉందా?

సాంకేతిక పరిజ్ఞానం లేక పోతే క్రీ.శ 2వ శతాబ్దం లో తంజావూరు సమీపంలో కావేరీ నదిపై కట్టిన,ఇంకా ఉన్న కలనై ఆనకట్ట, క్రీ.పూ 4వ శతాబ్దంలో గుజరాత్ లో నిర్మించిన సుదర్శన జలాశయం, క్రీస్తుపూర్వమే ఈజిప్టులో నిర్మించబడిన సద్-అల్-కఫ్రా ఆనకట్టలు మొదలగువాటిని నిర్మించగలరా? కాబట్టి ఆనాటికే వారికి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నదనడంలో ఏమాత్రం సందేహం లేదు.

మరెందుకని వాటిని భారీస్థాయిలో నిర్మించలేదు? అలా నిర్మించకపోవడానికి గల కారణాలను మనం ఒకసారి ఆలోచిస్తే ఆశ్చర్యం కల్గక మానదు. మరి కారణాలు ఏమిటి?

నేడు మనకు అనుభవం అవుతూనే ఉంది. భారీ ఆనకట్టలవలన మనకు లాభాల కన్నా నష్టాలే భారీస్థాయిలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది భూమి యొక్క సమతుల్యత దెబ్బతినడం. అందువలనే భూకంపాల ప్రమాదం. ఇది శాస్త్రీయంగా నిరూపించబడిన సత్యం. ఇక నీటివనరుల కొసం జరుగుతున్న యుద్ధాలు.

మనిషి తన కనీస అవసరాలైన తిండి, నీరు, బట్టలు వీటి కోసం ఇతరులపై ఎంత తక్కువ ఆధారపడితే అంత ప్రశాంతం గా ఉండగలడు. ఇదే విషయాన్ని మన పూర్వీకులు ఆలొచించిఉన్నారు. వీళ్ళు పర్యావరణ,ప్రకృతి పరంగానూ, సామాజిక పరంగానూ ఆలోచించే భారీఆనకట్టలు నిర్మించలేదు.

ఉదాహరణకు మన దేశంలో ఇవి ఆలోచించే మన పూర్వీకులు ప్రతి జనపదానికీ (పల్లె లేక పట్టణం ఏదైనా కావచ్చు) ఒక చెరువును లేక అవసరం రీత్యా 2,3 చెరువులను త్రవ్వించారు. ఇక బావుల సంగతి చెప్పనవసరమే లేదు. బావులు మంచినీటికి, చెరువులు పంటపొలాలకు ఉపయోగపడతాయని తెలుసు. ఇలా చేయడం వలన పడిన వర్షం నీరు వృధా కాకుండా చెరువులు,బావులు రూపంలో ఉపయోగపడుతుంది.

ఇలా చేయడంవలన అత్యంత ముఖ్యప్రయోజనం ఏమంటే నీటి కోసం కనీసం పక్క గ్రామం పై కూడా ఆధారపడనవసరం లేదు. నీటి విషయంలో స్వయంసమృద్ధి అలానే నీటిపై ఆధారపడిన పంటల విషయంలో స్వయంసమృద్ధి తద్వారా తిండికోసం కూడా ఎవరిపైనా ఆధారపడనవసరం లేకుండా ఉండడం సంభవిస్తుంది. వీటి వలన నష్టాలకంటే లాభాలే ఎక్కువ ఉంటాయి.

ఇన్ని ఆలొచించే మన పూర్వీకులు భారీఆనకట్టల వంటి నిర్మాణాలు ఎక్కువ చేయలేదు.

Friday, October 14, 2011

సింగరేణి కార్మికుల సమ్మె సమస్త మానవాళికి ఇస్తున్న హెచ్చరిక

సకలజనుల సమ్మెలో భాగంగా సింగరేణి బొగ్గు గనుల కార్మికుల సమ్మె వల్ల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీని వల్ల ధర్మల్ విద్యుత్ కేంద్రాల కు బొగ్గు సరఫరా నిలిచిపోయి విద్యుత్ ఉత్పత్తి కూడా చాలా తగ్గిపోయింది. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న కరెంటు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సరే నేను చెప్పదలచుకొన్న విషయం ఏంటంటే ఈ కార్మికుల సమ్మె వల్ల ప్రపంచమే గ్రహించాల్సిన హెచ్చరిక ఒకటి ఉంది.


ఎప్పుడో ఒకప్పుడు భూమి లో ఉన్న బొగ్గు నిల్వలు అన్నీ అయిపోతాయి. అప్పుడు ఏ కొద్దిగా బొగ్గు నిల్వలున్నా వాటి కోసం ప్రపంచ సంగ్రామాలే జరగవచ్చు. ఉన్న కొద్ది నిల్వలు కూడా అయిపోతే పూర్తిగా జల విద్యుత్, అణువిద్యుత్ మీదే ఆధారపడి మనం జీవించలేము. నిరంతర శక్తి ప్రధాత ఐన సూర్యుడు ఒక్కడే అప్పుడు మనకు దిక్కు. ప్రపంచ వ్యాప్తం గా సౌర విద్యుత్ ఉత్పత్తి పై ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. కాని ఇప్పుడు జరుగుతున్న ప్రయోగాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Saturday, September 10, 2011

రెండు తెలుసుకోవలసిన మంచిమాటలు

వేష భాషా సదాచారః రక్షణీయం ఇదం త్రయం
అంధానుకరణ మన్యేషాం అపకీర్తికర ముచ్యతే

భావం : వేషం,భాష, సంస్కృతి ఈ మూడింటిని రక్షించుకోవాలి. గుడ్డిగా అనుకరిస్తే అపకీర్తిపాలవుతాం.



కో ధర్మో? భూతదయా ................. ఏది ధర్మం ? జీవులయందు దయ
కిం సౌఖ్యం? అరోగితా ................... ఏది సుఖం ? ఆరోగ్యం
కః స్నేహః? జగతిజన్తో సధ్భావః .................. ఏది స్నేహం ? అన్ని జీవరాశుల యందు మంచి భావం
కిం పాండిత్యం? పరిచ్చేదః .......................... ఏది పాండిత్యం ? మంచి,చెడుల విచక్షణ

Friday, September 9, 2011

ప్రపంచం ఋణపడి ఉన్న భారతీయ శాస్త్రవేత్త - భాస్కరాచార్యుడు

సనాతన భారతదేశం కన్న గణితశాస్త్రవేత్తలలో భాస్కరాచార్యుడు చిరస్మరణీయుడు.ఇప్పటికీ ఇతను కనుగొన్న కొన్ని గణితసూత్రాలు పాశ్చాత్యశాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో పడవేస్తున్నాయి.చిక్కుముడి గణిత సమస్య లను సంధించడంలో భాస్కరులు అగ్రగణ్యులు.పాశ్చాత్య ప్రపంచం ఇంకా గణితంలో ఓనమాలు దిద్దుకుంటున్న సమయంలోనే బీజగణిత,గ్రహగణితం మొదలగునవి కనుగొన్నారు.

భాస్కరులు క్రీ.శ 1114 సంవత్సరంలో మహారాష్ట్ర లోని విజ్జదిత్( విజయపురం) అనే గ్రామంలో జన్మించాడు.చిన్నపటి నుండే గణితం లో అనేక పరిశొధనలు ప్రారంభించాడు.వీరు ప్రపంచప్రఖ్యాతి గాంచడానికి కారణమైన సంఘటన ఒకటుంది.

అదేమంటే భాస్కరులు జ్యోతిష్యంలో మంచి దిట్ట.ఇతను ముహూర్తాలు లెక్కపెట్టే పద్దతి ఏమిటంటే కుండలలో ఇసుక,నీళ్ళు వేసి వాటికి క్రింద చిన్న చిల్లులను పెట్టి ఆ కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి వాటిలోని నీటి చుక్కలు క్రిందకు పడే సమయం బట్టి ముహూర్తాలను,శుభాశుభాలను లెక్కించేవాడు.ఇలానే ఒకసారి తన కుమార్తె (పేరు లీలావతి) పెళ్ళి కొరకు ముహూర్తం నిర్ణయించాడు.తన కుమార్తె జాతకంలో వైధవ్యం ఉన్నదని తెలుసుకొని దానిని పోగొట్టడానికి తనే స్వయంగా ముహూర్తం నిర్ణయించాడు.కాని భగవత్ సంకల్పం మరో విధంగా ఉంది.ముహూర్తనిర్ణయానికి ముందు లీలావతి ఒకరోజు ఆడుకుంటూండగా తన ముక్కుపుడక లోని ముత్యం ఆ కుండలలోని పై కుండలో జారవిడుచుకొంది.ఆ ముత్యం చిల్లుకు అడ్డుపడి నీటిచుక్కల లెక్క,పడు సమయం మారింది. దీని వలన భాస్కరులు పెట్టిన ముహూర్తం తారుమారయ్యి లీలావతికి పెళ్ళైన సంవత్సరం లోనే భర్త చనిపోయాడు.ఈ దుఃఖం భరించలేక పోయిన భాస్కరులు తను మరియు లీలావతి ఆ దుఃఖం నుండి బయటపడడానికి లీలావతికి గణితం నేర్పించి తను కూడా గణితంపై తీవ్ర పరిశోధన చేసాడు.ఈ పరిశోధనల వలనే ఎన్నో కొత్త గణిత ప్రక్రియలు,సిద్దాంతాలు కనుగొని ప్రపంచప్రఖ్యాతుడయ్యాడు.తన కుమార్తెకు కూడా పేరుతెచ్చి పెట్టాడు.

సిద్దాంత శిరోమణి గ్రంధం ( భాస్కరులు ప్రపంచానికి అందించిన కానుక)

1150వ సంవత్సరం లో రచించిన "సిద్దాంత శిరోమణి" అను గ్రంధం భాస్కరులకు ఖ్యాతిని గణితప్రపంచానికి అమూల్యమైన కానుకను అందించినది.
ఇందులో భాగాలు నాలుగు.
అవి ౧.లీలావతి(అంకగణితం)
౨ .బీజగణితం
౩.గోళాధ్యాయ(గోళాలు,అర్దగోళాలు)
౪.గ్రహగణితo (గ్రహాలకు,నక్షత్రాలకు సంబంధించినది)
ఈ గ్రంధం సున్న (0) యొక్క ధర్మాలను, "పై" యొక్క విలువను,వర్గాలను,వర్గమూలాలను,ధనాత్మక-ఋణాత్మక అంకెలను,వడ్డీలెక్కలను,సమీకరణాలను గురించి తెలియజేస్తుంది.
మరియు పాశ్చాత్యులు గత శతాబ్దంలో కనుగొన్నామనుకొంటున్న కరణులు,వర్గ సమీకరణాలను,అనంతం (ఇన్‌ఫినిటీ)ని కనుగొని చర్చించి,వాటిని సాధించింది.సమీకరణాలను వాటి 3వ,4వ ఘాతం వరకు సాధించింది.త్రికోణమితిని కూడా చాలా చర్చించింది.

మన దౌర్భాగ్యం మరియు అలసత్వం కొద్దీ గురుత్వాకర్షణను న్యూటన్ కనుగొన్నాడని పాశ్చాత్యులు చెబితే అదే నిజమని అనుకొని మోసపోతున్నాము.. కాని ఈ గ్రంధంలో(న్యూటన్ కన్నా 500 సంవత్సరాల పూర్వమే) భాస్కరుల వాక్యాలను గమనించండి.
"వస్తువులు భూమి యొక్క ఆకర్షణ వలనే భూమిపై పడుతున్నాయి.కాబట్టి భూమి,గ్రహాలు,చంద్రుడు,నక్షత్రాలు చివరికి సూర్యుడు కూడా ఈ ఆకర్షణ వలనే వాటి కక్ష్యలలో పడిపోకుండా ఉన్నాయి.వాటికి కూడా ఆకర్షణలు ఉన్నాయి."

ఇంత స్పష్టంగా వీరు చెప్పినా ఇంకా మనం మన ప్రాచీన శాస్త్రవేత్తల గొప్పతనాన్ని తెలుసుకొనలేక పోతున్నాము.

తర్వాతి కాలంలో వీరు ఉజ్జయిని లోని ఖగోళగణితశాస్త్ర సంస్థకు అధ్యక్షుడయ్యారు.

వీరు మరణించిన సంవత్సరం 1183 లేక 1187.

Thursday, September 8, 2011

మతమౌఢ్యం ఎన్నాళ్ళు? మారరా ఇకనైనా?

సైన్సుపరంగా,నాగరికతపరంగా ఎంతో అభివృద్ది చెందుతున్నామని అనుకుంటున్నాము.కాని మనిషిపరంగా అంటే మానవత్వపరంగా,నైతికంగా,సంస్కారపరంగా అభివృద్దిచెందకపోవడమే దీనికి ప్రధానకారణం గా కనిపిస్తోంది.ఇంకా ప్రధాన కారణం వ్యక్తి ఆరాధన శృతి మించడం.ఆరాధించబడేవారి బోధనలను మరిచిపోవడం."నీవంటే నాకు చాలా ఇష్టము,ప్రాణము.కాని నువ్వు చెప్పేమాటలను నేను వినను,పాటించను" అంటున్నారు.అలాంటప్పుడు ఆ ఆరాధింపబడే వారికి తమను పూజించే వారంటే ఏమి ఇష్టము ఉంటుంది?.ఏ మతమైనా ఏం చెబుతుంది? ఇతరులను చంపమనా?కాదుకాదు ప్రేమించమని,ద్వేషింపవద్దని.దీనికి ఉదాహరణగా వివిధ మతగ్రంథాలు ఏమంటున్నాయో చూడండి.

భగవద్గీత:
"ఎవరెవరు ఏఏ రూపాన్ని ఆరాధిస్తారో వారికి ఆయా రూపాలందే శ్రద్ద,విశ్వాసం కలిగేలా చేసి వారిని ఆయా రూపాలతోనే అనుగ్రహిస్తున్నాను. ( విజ్ఞానయోగం 21-22)

ఖురాన్:
" ఎవరు ఖురాన్‌ను నమ్ముతారో,మరియు ఎవరు(యూదుల)లేఖనాలను అనుసరిస్తారో,మరియు క్రైస్తవులు...మరియు దేవునిపై నమ్మకం కలవారందరూ ధర్మంగా పని చేయువారందరూ అంతిమదినము నందు తమ దేవుని చేత బహుమానాలు పొందుతారు.వారు దుఃఖంచేగానీ,భయంచే గానీ బాధపడరు". ( 2:62)

బైబిల్:
మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి.(ముత్తయి 5:44)

ఏసు అనుచరులు సమారియాలోని గ్రామంలోనికి ప్రవేశించారు.కానీ ఆ గ్రామ ప్రజలు వారిని తిరస్కరించారు.అప్పుడు శిష్యులు ఏసు తో "ఎలీజా చేసినట్టు మీరు మమ్ము స్వర్గం నుండి అగ్నిని రప్పించి వారిని భస్మం చేయమంటారా?"అన్నారు.అప్పుడు ఏసు వారితో "మీరు ఎలాంటివారో మీకు అర్థం కావడంలేదు.మనుష్యకుమారుడు మనుష్యుల ప్రాణాలను కాపాడుటకు వచ్చాడు కానీ నాశనం చేయటానికి రాలేదు"అన్నాడు. ( లూకా 9:52-56)

ఈ విధంగా ప్రతి మతగ్రంథంలోనూ పరమతసహనాన్ని,తోటిమానవులను ప్రేమించమని ఉండగా ఎంతమంది వీటిని అనుసరిస్తున్నారు? ఈ గ్రంథాలలో మనం పూజించేవారి ఆదేశాలు,భోధనలు ఉండగా వాటిని పట్టించకొనకుండా పెడచెవిన పెట్టి వారిని పూజిస్తూ వారి పేరుపై కలహాలు సృష్టిస్తే వారు మెచ్చుకొంటారా? ఏమైనా అడిగితే తమ దేవుని కోసం చేస్తున్నామంటారు.కాని ఆ దేవుళ్ళు చెప్పినది మనం స్పష్టంగా పైన చూసాము.ఆ దేవుళ్ళు వీరి పనులను అంగీకరిస్తారా? ఒప్పుకుంటారా??
ఉదాహరణకు ఒక తోట యజమాని తన ఇద్దరు పనివారికి తోటపని చెప్పి చేయమన్నాడు.అందులో ఒకరు తనకు ఇచ్చిన పని చేస్తుండగా మరొకరు తమ యజమానిని "మీరు గొప్పవారు.మీ చేతులు ఎంతోసుందరాలు.మీ మనసు వెన్నలాంటిది."అని పొగుడుతున్నాడని అనుకొందాము. ఇద్దరిలో యజమాని ఎవరిని ఇష్టపడతాడు?తను చెప్పిన పని చేయకుండా తనను పొగిడేవాడినా? లేక తను చెప్పినపని సక్రమంగా చేసినవాడినా? ప్రస్తుతం కలహాలను చేసేవారి పరిస్థితి,సృష్టించేవారి పరిస్థితి పొగిడేవాని పని లాగానే ఉంది.
ద్వేషం కానీ,కలహం కానీ ఎదుటివారిలో మార్పు తీసుకురాదనే విషయం వీరు ఎందుకు తెలుసుకోవడంలేదు ? ఎప్పుడైతే తమ మతగ్రంథాలను కూలంకుషంగా చదివి అర్థం చేసుకుంటారో తమ ఇంగితజ్ఞానాన్ని,యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగిస్తారో అప్పుడే ఇలాంటి కలహాలు ఆగుతాయన్నది నా అభిప్రాయం.

నిజము కు, సత్యానికి గల తేడా ఏమిటి? ( ఆధ్యాత్మికత )

నిజము,సత్యము రెండిటినీ ఒకటిగానే పరిగణిస్తారు.కానీ ఆధ్యాత్మిక పరిబాషలో చిన్న తేడా ఉంది.
దీన్ని చిన్న ఉదాహరణతో వివరించే ప్రయత్నం చేస్తాను.


ఇప్పుడు మీ జేబులో ఒక పెన్ను ఉంది అనుకోండి. మీరు "నా జేబులో పెన్ను ఉంది" అంటారు. పెన్ను ఉండడం అనేది "ఇప్పుడు" నిజం. కొద్ది సేపైన తర్వాత పెన్ను తీసి ఎక్కడొ పెట్టేసారనుకోండి. ఇప్పుడు పెన్ను మీ జేబులో లేదు కదా. అంటే పెన్ను మీ జేబులో ఉండడం అనేది అది ఉన్నంత వరకే సరైనది. తర్వాత కాదు. అంటే నిజం అనేది మారుతూంటుంది.


ఇక సత్యం అనగా అది ఎన్నడూ మారనిది. సూర్యుడు తూర్పున పుడతాడు అనేది సత్యం. ఇది ఎన్నటికీ మారదు. మరి సృష్టి అంతం అయిపోయినతర్వాత అంటారేమో. ఒక ఉదాహరణ గా మాత్రమే తీసుకున్నాను. సత్యం అనగా మూడు కాలాలలోనూ మారనిది అంటే భూత,వర్తమాన,భవిష్యత్ కాలాలలోనూ ఏ విధమైన మార్పూ పొందనిది. అందుకే భగవంతుడొక్కడే సత్యం అంటారు. ఎందుకంటే మార్పులేనిది భగవంతుడు మాత్రమే కదా.


నిజానికి, సత్యానికి ఆధ్యాత్మికంగా మాత్రమే అర్థం చెప్పాను, కాని నిజజీవితంలో రెండింటినీ ఒకేలా భావించడం సంభవిస్తోంది.

Monday, August 29, 2011

జయహో స్వామి వివేకానంద! జయహో అన్నాహజారే!




దేశమంతా అవినీతినిర్మూలన కై ఉద్యమించిన అన్నాహజారే విజయం సాధించడంలో ఒక అడుగు ముందుకేయడంతో ఎంతో సంతోషపడుతోంది.

ఇటువంటి
పట్టుదల, అనన్య ఆత్మవిశ్వాసం కల్గిన అన్నాహజారే నేడు మనకు లభించడం వెనుక ఉన్న అదృశ్యశక్తి స్వామి వివేకానంద అన్న విషయం కొంతమందికి తెలుసు. చాలామందికి తెలియదు. నిరాశానిస్పృహలతో ఆత్మహత్య చేసుకోవాలన్న మనస్తత్వం నుండి బయటకు లాగినవి వివేకానందుని బోధనలే అని అన్నాహజారే గారే చెప్పినారు.

"
మోక్షం కోసం ప్రాకులాడను. వేల,లక్షల నరకాలకైనా పోతాను. నా శరీరం రాలిపోయేంత వరకు ఒక కుక్క ఆకలితో అలమటించినా దానికి ఆహారం ఇచ్చేందుకు ఎన్నిసార్లు నరకానికి పోవడానికైనా నేను సిద్దమే. జీవారాధనే అనగా జీవులనుసాటిమనుషులను సేవించడమే నిజమైన శివారాధన. నేను చనిపోయినా నా సందేశం 1500 సంవత్సరాలు జనం స్వీకరిస్తారు" అన్న వివేకానందుని వాక్యాలు ఎవరినైనా తట్టిలేపుతాయి.


ఇటువంటి వివేకానందుని కేవలం మతబోధకుడిగా చూస్తూ అతనిలోని మానవతావాదిని చూడలేని నేటి తరం ఎంత దురదృష్టవంతురాలో కదా!

జయహో
స్వామి వివేకానంద, జయహో అన్నాహజారే.

Sunday, July 31, 2011

మనిషి తలకు ఉన్న విలువ ఏమిటి? (ఒక చిన్న కథ)

ఒకసారి అశోకుడు,తన మంత్రి ఒక వీధిలో నడుస్తున్నారు.

దారిలో ఒక బౌద్ధసన్యాసి ఎదురు రాగా అశొకుడు తన కిరీటం తీసి పక్కన పెట్టి తన తలను ఆ సన్యాసి పాదాలపై ఉంచి నమస్కరించాడు. ఈ దృశ్యం చూసి మంత్రి ఒక చక్రవర్తి ఒక సామాన్య సన్యాసికి అంత గౌరవం ఇవ్వడం అనవసరం అని భావించాడు. ఈ విషయాన్ని అశోకుడు గమనించాడు.

తర్వాత ఆ మంత్రికి పాఠం నేర్పదలచి తన మంత్రి తో ఒక గొర్రెతల, ఒక ఎద్దు తల, ఒక మనిషితల తెమ్మని చెప్పాడు. మంత్రి అలాగే తెచ్చాడు. తర్వాత వాటిని బజారులో అమ్ముకొని రమ్మని మంత్రిని పంపాడు. మేక,ఎద్దు తలలను అమ్మగలిగాడు కానీ మనిషి తలను ఎంత ప్రయత్నించినా అమ్మలేకపోయాడు. అదే విషయం అశోకునికి చెప్పగా మనిషి తలను ఉచితంగా ఐనా ఎవరికైనా ఇచ్చి రమ్మన్నాడు. కాని ఏ ఒక్కరూ మనిషితలను తీసుకోవడానికి కాని, కనీసం చూడడానికి కూడా ఇష్టపడలేదు.

మంత్రి తిరిగి సభకు రాగా అశొకుడు అన్నాడు " ఆ రోజు నా తలను ఆ సన్యాసి పాదాలపై పెట్టగా నువు ఏంటి ఇలా చేశారు రాజు అనుకున్నావు. ఇప్పుడే చూసావు కాదా మనిషి తల యొక్క విలువ. బ్రతికి ఉన్నంత వరకే మనిషి తలకు విలువ.చనిపోయిన తర్వాత ఎద్దు,మేక లాంటి జంతువుల తలలకైనా విలువ ఉంటుంది కాని అసలు మనిషి తలను అసలు చూడడానికి కూడా ఎవరూ ఇష్టపడలేదు,ఇక విలువ సంగతి ఏం చెప్పాలి".

Sunday, July 3, 2011

సుప్రభాతము "కౌసల్యా సుప్రజా రామా" అని మొదలవడములో ఏదైనా అంతారార్థము ఉందా?

చాలా రోజుల తర్వాత బ్లాగు లోకము లోకి మళ్ళీ ప్రవేశిస్తున్నాను.


విశ్వామిత్రుడు రాముడిని నిద్రలేపుతూ

కౌసల్యా సుప్రజా రామా! పూర్వాసంధ్యా ప్రవర్తతే !
ఉత్తిష్ఠ నరశార్దూల! కర్తవ్యం దైవమాహ్నికం!

అంటాడు.

మన తెలుగు లోగిళ్లు "కౌసల్యా సుప్రజా రామా" అను సుప్రభాతము తో మేల్కొంటాయి. అసలు సుప్రభాతము ఈ శ్లోకము తోనే ఎందుకు మొదలైంది అని ఆలోచిస్తే ఇందులో మనకు ఒకటి అర్థమవుతుంది.

"కౌసల్యా సుప్రజా రామా!" అంటే ఇక్కడ రాముడు అనగా మేలుకోబోయే వ్యక్తి. అతడిని మేలుకొలపాలి. గాఢముగా నిద్రపోతున్న వ్యక్తిని ఉన్నట్టుండి మేల్కొలపడము ప్రమాదకరము. ఎటువంటి వ్యక్తి అయినా తన తల్లి పేరు విన్నంతనే తన దృష్టిని అటువైపు త్రిప్పుతాడు. అందువల్ల మొదట తల్లి పేరు పలికినారు. అంతేకాక ప్రత్యక్ష దైవమైన తల్లిని మొదట అతడికి గుర్తు చేస్తూ తర్వాత ఆ మేల్కోబోయే వ్యక్తి పేరు("రామా!") పిలుస్తున్నాము. సుప్రజా అంటే మంచిబిడ్డవు అని అర్థము.


తర్వాత మాత్రమే"పూర్వాసంధ్యా ప్రవర్తతే" అంటే తెల్లవారుతోంది నాయనా అంటున్నారు. అంటే ఇంకా సూర్యుడు ఉదయించలేదు, ఉదయించడానికి తయారుగా ఉన్నాడు. తెల్లవారుఝామునే లేవడం ఎంతో మంచిది అని మన అందరికీ తెలుసు.అందుకే ఆ సమయానికే ఇక్కడ మేల్కొల్పడం జరుగుతోంది.


"ఉత్తిష్ఠ నరశార్దూలా" అంటే ఓ మనుషులలో పులి లాంటి వాడా లెమ్ము అంటున్నారు. మనము చూస్తూనే ఉంటాము పిల్లలను లేపేటప్పుడు లేవరా "దున్నపోతా! బారెడు పొద్దెక్కినా ఇంకా పడుకొనే ఉన్నావు. పక్కింటి అబ్బాయి చూడు మంచి ర్యాంకు తెచ్చుకొన్నాడు, నువ్వూ ఉన్నావు పనికిరాని వెధవవు తినేకి,నిద్రపోయేకి ఎప్పుడూ తయారుగా ఉంటావు" అంటూ తిడుతూ లేపుతుంటారు.అందువలన లేచేటప్పుడే పిల్లలు ఒక విధమైన బాధతో లేస్తుంటారు. అలాకాకుండా తన శక్తిసామర్థ్యాలను గుర్తు చేస్తూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ మేల్కొల్పితే ఎంత ఆనందముగా,ఉత్సాహము తో మేల్కొంటారు. తర్వాత ఆ రోజు ఎంత ఉత్సాహముగా తమ పనులను చేసుకొంటారు. అందుకే ఈ విధంగా మేల్కొల్పాలని మనకు నేర్పుతున్నారు.


"కర్తవ్యం దైవమాహ్నికం" అంటే నీకు దైవం చే విధించబడిన అంటే నీవు చేయవలసిన పనులు (చదువుకోవడం కావచ్చు లేక ఉద్యోగం కావచ్చు లేక మరే వ్యాపారమో,సేద్యమో ఏదైనా కావచ్చు)చేయవలసి ఉంది అని గుర్తుచేస్తున్నారు.అందుకని తెల్లవారుఝామునే లెమ్ము నాయనా అంటూ ఒక పాజిటివ్ దృక్పథాన్ని కల్గిస్తూ మేల్కొల్పడం చేయాలి.

రాముడిని నిమిత్తముగా చేస్కొని సకల జీవరాశులను ఇలా మేల్కొలుపుతున్నారన్నమాట.

Friday, January 21, 2011

20-02-2011: బ్రహ్మచారి జీవితం నుండి సంసార జీవితంలోనికి అడుగు


లేవండి,మేల్కొనండి....
బ్లాగుతో మీఅందరికీ సుపరిచితుడైన సురేష్ బాబు పెళ్ళికొడుకు కాబోతున్నాడు.

నా పెళ్లి ఫిబ్రవరి 20 తేదీన గుత్తికి చెందిన రాజేశ్వరి అనుఅమ్మాయితో గుత్తిలో జరుగులాగున పెద్దలు నిశ్చయించారు.

గత డిసెంబర్ 26 తేదీన నిశ్చితార్థం జరిగింది.

బ్లాగర్లందరూ
ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను.

Tuesday, December 7, 2010

భగవద్గీత సారం తెలిసినవారు(అర్థమైనవారు) విశ్వంలో ఎంతమంది ఉన్నారు?

భగవద్గీత సారం తెలిసిన వారిని ఊహించండి ఎంతమంది ఉంటారో! మనము ఊహించడానికి కూడా వీలు లేని ప్రశ్న ఇది. సరే చెబుతున్నాను.

పరమశివుడు ఈ విషయం గురించి ఇలా అన్నాడు.

" నారాయణుడికి తెలుసు,నాకు తెలుసు ,శుకుడికి తెలుసు,వ్యాసుడికి తెలిసి ఉండవచ్చు కొద్దిగా. అంతే!"

చూసారా విన్న అర్జునుడికే కాదు వ్రాసిన వ్యాసుడికి కూడా సారం పూర్తిగా తెలియదన్నమాట. కాని వ్యాసపుత్రుడైన శుకుడికి తెలుసు.శుకుడు పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని. శుకుడి గురించి వివరం నా టపా శుకమహర్షి - మన పురాణ ఋషులు లో ఉంది.


మరి నేటికాలంలో భగవద్గీతను గురించి తమకే అంతా తెలుసు అన్న అవాకులుచవాకులు మాట్లాడేవారి సంగతి కాస్త ఆలోచించండి.



Wednesday, December 1, 2010

గురువుకు ఏమైనా కొమ్ములు మొలిచాయా? (ఆధ్యాత్మికంలో హాస్యము)

ఒక భక్తుడు ఉండేవాడండి. అతడికి ఒక గురువు ఉండేవాడు. ఈ భక్తుడికి తన గురువుగారంటే చాలా భక్తివిశ్వాసాలు.

ఒకసారి ఒకవ్యక్తి ఈ భక్తుడిని బాధపెట్టాలని "ఏం! గురువంటే అంత గొప్పవాడా? అతడికేమైనా రెండు కొమ్ములు ఉన్నాయా?" అన్నాడు.

భక్తుడు అతడితో "రెండు కాదు మూడు ఉన్నాయి. గ కు కొమ్ము వస్తే గు, ర కు కొమ్ము వస్తే రు, వ కు కొమ్ము వస్తే వు.ఇలా మూడు కొమ్ములు ఉన్నాయి. ఏం తెలీదా?" అన్నాడు.

Tuesday, November 30, 2010

అద్వైతం లో ద్వైతం,విశిష్టాద్వైతాలు ఎలా కలిసిపోతాయో చూడండి - గణితం (లెక్కలు) ప్రకారం నిరూపణ

మనకు తెలుసు
ద్వైతం అంటే మనలోని జీవాత్మ,పరమాత్ముడు వేర్వేరు అని,
విశిష్టాద్వైతం అంటే జీవుడిలోనే పరమాత్మ ఆత్మగా వెలుగుతున్నాడని,
అద్వైతం అంటే జీవాత్మే మేఘాల(మాయ)చే కప్పబడిన సూర్యుడు(పరమాత్మ) అని అంటే జీవాత్మ కు పరమాత్మకు భేధం లేదని .

ఇంకా సరళంగా చెప్పాలంటే

ద్వైతం అనగా నేను వెలుగు లో ఉన్నాను అని,
విశిష్టాద్వైతం అనగా నాలో వెలుగు ఉందని,
అద్వైతం అంటే నేనే వెలుగు అని చెప్పవచ్చు.

ఇప్పుడు గణితం ప్రకారం చూద్దాం.


ద్వైతం ను A అని, విశిష్టాద్వైతమును B అని అనుకుందాము.

ఇప్పుడు ద్వైతం,విశిష్టాద్వైతములను అనగా A,B లను కలుపుదాము. అంటే నేను వెలుగులో ఉన్నాను,నాలో వెలుగు ఉంది అనే ఈ రెండు భావనలను కలిపామనుకోండి. అంటే (A+B). అపుడు నేను కు బయటా,లోపలా వెలుగు ఉంది అని అర్థం అవుతుంది. అంటే మొత్తం వెలుగే ఉంది, కేవలం నేను
అనే భావనే బయటి వెలుగును, లోపలి వెలుగును విడదీస్తోంది.

ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే కుండ లోని నీరు (విశిష్టాద్వైతం) , అదే కుండను ఒక నదిలో పూర్తిగా ముంచితే అపుడు కుండ నీటిలో ఉంటుంది (ద్వైతం) కదా. ఇపుదూ కుండలోనూ, కుండ బయటా కూడా నీరే ఉంది కదా. ఇపుడు బయటి నీరుకూ, కుండలోని నీటికీ అడ్డం కుండ కదా. ఈ కుండే నేను అనే భావన.

ఇప్పుడు కుండను పగలగొట్టేసామనుకోండి అప్పుడు బయటి నీరు,లోపలి నీరూ ఒక్కటే అయిపోయి కుండ అందులో కరిగిపోతుంది. ఇప్పుడు కుండకు అస్థిత్వం,లేక ఉనికి (Existance)ఎక్కడ ఉంది?కుండ కరిగిపోయి అంతా ఒకటే (నీరే) అయిపోయింది కదా! అదే కదా అద్వైతం.

అంటే ద్వైతం, విశిష్టాద్వైతాల కలయికే అద్వైతం అని గణితం ప్రకారం నిరూపించవచ్చు.

ఇక అద్వైతంలోని విభాగాలే ద్వైతం,విశిష్టాద్వైతం అని నిరూపిద్దాం.

గణితంలో సమితులు అనే భావన వినేఉంటారు.
ద్వైతం ను A అనే సమితి గానూ, విశిష్టాద్వైతం ను B అనే సమితిగానూ అనుకొందాము.
అప్పుడు A,B లను రెండూ కలిపితే A union B అంటే (A ∪ B).
ఇంతకుముందు నిరూపణ ప్రకారం A,B ల కలయికే అద్వైతం కదా. అంటే ఇక్కడ ఆ A(ద్వైతం),B(విశిష్టాద్వైతం) ల కలయిక (A ∪ B).

గణితంలోని సమితుల ప్రకారం A,B లు రెండు సమితులైతే A,B లు రెండూ (A ∪ B)కి ఉపసమితులు అవుతాయి.

అంటే A ⊂ (A ∪ B). ==>> A is subset of (A ∪ B) (A అనే సమితి (A ∪ B) కి ఉపసమితి.)

B ⊂ (A ∪ B) ==> B is subset of (A ∪ B) (B అనే సమితి (A ∪ B) కి ఉపసమితి.)

ఇలా నిరూపణ చేయవచ్చు.

అంటే నేను అనే భావనకు బయట ద్వైతం, లోపలి వైపు విశిష్టాద్వైతం ఉన్నాయని ఆ నేను అనే భావనను తొలగిస్తే అద్వైతం అనే భావన అని అర్థం చేసుకోవచ్చు. ఈ టపాలో "నేను" అనే భావనను "మాయ" అని, సూర్యుడిని కప్పిన "మేఘం", శరీరం అని ప్రయోగించాను. రమణమహర్షుల ప్రకారం "నేను" ను
ప్రయోగించలేదు.


Friday, November 12, 2010

సమాధి స్థితి, శృంగారం, గాఢనిద్ర - ఈ మూడింటిలో ఉన్న సారూప్యత ఏమిటి?

మనందరికీ తెలుసు ప్రతి మనిషీ పై మూడింటిలో మొదటిదైన సమాధి స్థితిని కాకపోయినా శృంగారం, నిద్రలను ఖచ్చితంగా కోరుకొంటారు. శృంగారాన్ని కోరుకోని సన్యాసులు కూడా ఉంటారనుకోండి. నిద్రను మాత్రం అందరూ కోరుకొంటారనే విషయంలో సందేహం లేదు.


సమాధి స్థితి విషయాన్ని కాసేపు పక్కన పెడదాము.
ఇంతకూ నెను చెప్పదలచుకొన్న విషయం ఏంటంటే ఎందుకు ప్రతి మనిషీ ఇంకా చెప్పాలంటే దాదాపు ప్రతిజీవీ నిద్రను,శృంగారాన్ని ఖచ్చితంగా కోరుకొంటాయి?

శరీరం అలసిపోతే అది నిద్రను కోరుకొంటుంది. గాఢనిద్ర నిద్రపోయి లేచినవారు ( ఎవరూ లేపకుండా వారంతకువారే మామూలుగా లేచినవారు ) ఎంత ఉల్లాసంగా,ఉత్సాహంగా ఉంటారో మనము చూస్తూనే ఉన్నాం. ఏమి నిద్రపోయానురా,బలే నిద్రపట్టిందిరా అంటూంటారు వారు. అంటే గాఢనిద్రలో వారు ఏదొ ఆనందం పొందారు అన్నమాట. అదేంటి?


ఇక శృంగారం లో సంపూర్ణ తృప్తి ని పొందిన వారు కూడా శృంగారం అయిపోయిన తర్వాత ఎంతో ఆనందంగా,ఉల్లాసంగా ఉండటాన్ని చూస్తున్నాము కదా. అక్కడవారు కూడా ఏదో ఆనందం పొందారన్నమాట.అదేంటి?


ఇక యోగుల,ఋషుల సమాధిస్థితి విషయానికి వస్తే సమాధిస్థితి లో మరియు అందు నుండి బయటికి వచ్చిన తర్వాత కూడా వారు బ్రహ్మానందం లో విహరిస్తుంటారని మహాత్ముల జీవితాలలో ( ఉదా: రామకృష్ణులు, వివేకానంద, పరమహంసయోగానంద ) చూడవచ్చు. అంటె అందులో కూడా ఏదో ఆనందం ఉందన్న మాట. అదేంటి?

నిద్రకు, సమాధిస్థితికి గల తేడా ఏంటంటే నిద్రపోకముందూ,నిద్రపోయి లేచిన తర్వాత కూడా మనిషి కి ఉండే జ్ఞానంలో ఏ మార్పూ ఉండదు. అదే సమాధిస్థితి పొందిన మనిషి ఆ స్థితి నుండి బయటకు వచ్చిన తర్వాత పరమాత్మజ్ఞానం పొందుతాడని వేదాంతం చెబుతుంది.

పై మూడూ విషయాలకూ ఒకదానితో ఒకదానికి సంబంధం లేకపోయినా పై మూడింటిలో పొందే ఆనందానికి ఒకే మూలసూత్రం ఉందంటే మీరు నమ్మగలరా?


ఆ మూలసూత్రమే "తననుతాను మరిచిపోవడం" లేక వేదాంతపరిబాషలో "అద్వైతం". అంటే ఆ సమయంలో మరే భావనా చివరికి తను ఒకడిని ఉన్నాననే భావన కూడా లేకపోవడం. ఇంకా చెప్పాలంటే తనే ఆనందం,ఆనందమే తను అయిపోవడం.

ఇంతే విషయం. అయిపోయింది.

కాకపోతే కొద్దిగా కొనసాగింపు ఉంది.

గాఢనిద్రలోనూ, శృంగారం లోనూ ఈ అద్వైత భావన ఆ సమయంలో మాత్రమే ఉంటుంది. ఆ రెండూ లేని మామూలు సమయాలలో ఆ అద్వైతాన్ని ఊహించడం కూడా సాధ్యం కాదు. అంటే పై రెండు విషయాలలోనూ ఈ అద్వైతాన్ని అనుభవించడం తాత్కాలికం మాత్రమే అంతే కాకుండా అక్కడ మన ఎరుక లేకుండానే మనము ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాము అంతే.

నిద్రల్లో గాఢనిద్ర ఎంత ఉన్నతమైనదో సమాధిస్థితులలో సహజసమాధిస్థితి అంత కన్నా ఉన్నతమైనది అని వేదాంతం చెబుతోంది. ఈ సహజసమాధిస్థితి పొందిన మనిషి ఎల్లప్పుడూ అంటే నిద్రలోనూ,మెలకువలోనూ కూడా అంతే కాక ఏ పని చేస్తున్నా కూడా ఆ అద్వైతస్థితిని అనుభవిస్తూనే ఉంటాడని వేదాంతం చెబుతోంది.
అందుకే శృంగారంలోని ఆనందం కన్నా సమాధిస్థితిలోని ఆనందం కోటిరెట్లు ఉన్నతమైనదని, అధికమని అందుకే సమాధిస్థితి పొందిన వ్యక్తి అంతకు ఎంతో క్రింది స్థాయి అయిన శృంగారం పై శ్రద్ద,ఆసక్తి ఏ మాత్రం చూపడని శాస్త్రాలు చెబుతున్నాయి.

దీని గురించి ఇంకా చెప్పుకుంటూ పోతే ఆధ్యాత్మికతలోని లోతైన భావాలవైపు ఈ టపా పోతుంది. అవన్నీ చెప్పడానికి సందర్బం కాదు కాబట్టి ఈ టపాను ఇంతటితో ముగిస్తున్నాను.

Wednesday, November 10, 2010

ఎవరు నిజమైన త్యాగులు?

సాధువులు, యోగులు, భక్తులు,సన్యాసులు మొదలైన వారు మేము భగవంతుడి కోసం అన్నీ త్యాగం చేసామంటారు. కాని క్రింది విషయాన్ని గమనించండి.

సకల ఐశ్వర్యవంతుడు,సకల సద్గుణవంతుడు అయిన భగవంతుడి కొరకు చిన్నచిన్న అల్పమైన డబ్బు,బంగారం,కామం లాంటి వాటిని వదులుకునే యోగులు,భక్తులు నిజమైన త్యాగులా?

లేక

అల్పమైన పై వాటి కోసం భగవంతుడినే వదులుకునే వ్యక్తులు నిజమైన త్యాగులా?

ఇప్పుడు చెప్పండి ఎవరు నిజమైన త్యాగులో?

Friday, October 8, 2010

హస్టల్లో ఉంచి చదివించినందుకు ప్రతిఫలం వృద్ధాశ్రమమా? ఒక యదార్థ సంఘటన.

సంఘటన నిజంగా రోజు నేను చూసిన సంఘటన.

స్టీరింగ్ (సెవెన్ సీటర్) ఆటోలో నేను వెళ్తుంటే అదే ఆటోలో ఒక తల్లీ,కొడుకుల మధ్య జరిగిన సంభాషణ ఇది.


తల్లి: "ఏరా! చిన్నప్పటినుండి కష్టపడి మిమ్మల్ని చదివించి,జీవితంలో వృద్ధిలోనికి తీసుకువచ్చినందుకు వృద్ధాశ్రమంలోచేర్పించి మాకు బానే బుద్ధిచెప్పారు .ఒకే కొడుకువి మాకు మీదగ్గర ఉండాలని ,శేషజీవితం గడపాలని ఉంటుంది కదా"


కొడుకు: "ఏం నెలనెలా డబ్బు నేనేకదా పంపుతున్నది మీకు. అదీగాక మీరు నన్ను చూడాలని అనినప్పుడలా నేనువస్తూనే ఉన్నాకదా. మీతో గడుపుతున్నాకదా"


తల్లి: అలా డబ్బు పంపడం కాదు. మాకు మీదగ్గర ఉండాలని, మనవడిని ఆడించాలని ఉంటుంది కదా"


కొడుకు : చూడమ్మా. నువ్వు,నాన్న నాకు మిగతా బంధువుల కన్నా ఏమంత ఎక్కువకాదు. తేడా ఏంటంటే మీరుకష్టపడి మీ డబ్బుతో నన్ను చదివించారు.అంతే. అసలు నన్ను 2 తరగతిలోనే హాస్టల్లో వేసి చదివించారు. అప్పటినుండి నా ఎడ్యుకేషన్ అంతా హాస్టల్లల్లోనే జరిగింది. అప్పుడప్పుడు నెలకొకసారి వచ్చి పలకరించి వెళ్ళేవారు. ఇంటికొచ్చి చదువుకుంటానంటే నీ భవిష్యత్తు కోసమే కదా మేము ఇద్దరమూ కష్టపడుతూ చదివిస్తున్నాము అన్నారు. ఏం నాకు మాత్రం మీవద్ద ఉండాలని అప్పుడు ఎంతబాధపడ్డానో మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు వినిపించుకోలేదు. ఐన విషయం ఎన్నిసార్లు చెప్పాలి. మీలాగే నేను కూడా డబ్బు పంపుతున్నా కదా. మీరన్నా అప్పుడు నెలకుఒకటిరెండుసార్లే వచ్చే వారు చూడడానికి.నేను మీరు పిలిచినప్పుడల్లా వస్తున్నా కదా. ఇక టాపిక్ ఎప్పుడూమాట్లాడకు.


ఇక్కడ నేను ఆటో దిగేసాను. తర్వాత ఏం వాదం జరిగిందో నాకు తెలీదు.ఆమె చేతిరుమాలు అడ్డుపెట్టుకొని ఏడుస్తున్నట్లుఅనిపించింది.

కాని సంఘటన నాలో నేటి మానవసంబంధాలను గూర్చి ఏవేవో అస్పష్ట ఆలోచనలను రేకెత్తిస్తోంది .

Thursday, October 7, 2010

నేర్చుకోవడం అంటే ఇదీ............ నేటి మనుషులు అనుకుంటున్నట్లు కాదు

చాలా పెద్ద విరామం తర్వాత మళ్ళీ బ్లాగులోక దర్శనం. ఒక చిన్న కథ.

కౌరవపాండవులు ద్రోణాచార్యుల గురుకులం లో విద్యాభ్యాసం చేస్తున్న రోజులవి. ఒకసారి ద్రోణులు ఏదో పనిమీద కొన్ని రోజులు బయటకు నేర్చుకోవడం వచ్చింది. వెళ్తూవెళ్తూ తన శిష్యులకు కొద్దిగా ఇంటిపని(home work) ఇచ్చి వెళ్ళాడు. అతను వచ్చిన తర్వాత శిష్యులు తాము చదివినదంతా ద్రోణులకు అప్పజెపుతారు.

కాని ధర్మరాజు మాత్రం "ఒక వాక్యాన్ని మాత్రం చదివాను.అందులొని విషయాన్నే నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను" అని చెప్తాడు. ఇన్నిరోజులుగా ఒక్కవాక్యం మాత్రమే చదివి నేర్చుకొన్నావా? అంటూ కోపంతో ధర్మరాజును దండిస్తాడు.


ఐనా ధర్మరాజు ఏ మాత్రం చలించకుండాఉండడం చూసి ద్రోణులు ఆలోచనలో పడి ధర్మరాజును పిలిచి "నాయనా! నువ్వు చదివిన ఆ వాక్యం ఏమిటి?" అన్నాడు. అప్పుడు ధర్మరాజు పుస్తకం చూపాడు."ఎన్నడూ కోపం తెచ్చుకోవద్దు" అన్నదే ఆ వాక్యం. ద్రోణులు ఆనందభాష్పాలు రాలుస్తూ "నాయనా! నాకు నువ్వు ఈరోజు "నేర్చుకోవడం"అంటే ఏమిటో నేర్పావు" అన్నారు.


పైన చెప్పిన విధం నిజముగా నేర్చుకోవడం కాని చిలకలలా నేర్చుకొని తిరిగి వల్లించడం,వప్పచెప్పడం కాదు.

ఇప్పుడు చెప్పండి నేర్చుకోవడం అంటే ఏదో.

Thursday, July 29, 2010

ఏ విషయమైనా సమగ్రంగా నేర్చుకోవడానికి వేదాలు చెప్పిన పద్దతి చూడండి. ఎంత బాగుందో!

సాధారణంగా వేదమంత్రం ఉద్దేశ్యాన్ని గ్రహించడానికి ఆరు పద్దతులు ఉన్నాయి. ఆ ఆరు పద్దతులనే మనం నిత్యజీవితంలో కూడా ఒక విషయాన్ని నేర్చుకోవడానికి, అధ్యయనం చేయడానికి ఉపయోగించుకోవచ్చు.

ఆ పద్దతులు ఏంటంటే ఉపక్రమం, ఉపసంహారం, అభ్యాసం, అపూర్వత, ఫలం, అర్థవాదం, ఉపపత్తి.


ఉపక్రమమంటే ప్రారంభం. ఉపసంహారమంటే చివర. మొదటి పద్ధతి ఈ రెంటినీ గమనించటం - దీనినే ఉపక్రమ - ఉపసంహార పద్ధతి అంటారు. ఈ రెండూ ఒకే విషయం గురించి చెప్తే మొత్తం విషయమదేనని గ్రహించవచ్చు.


అభ్యాసమంటే ఒక విషయాన్ని పదేపదే చెప్పటం లేక వల్లెవేయటం లేక మననం చేయటం.


ఏ వ్యాసంలోనైనా ఒకే విషయం గురించి పదే పదే చెప్తూంటే విషయం యొక్క సారాంశమదేననీ, మనస్సుకి బాగా హత్తుకోవటానికే తిరిగి తిరిగి దాని ప్రస్తావనే జరుగుతోందని గ్రహించవచ్చు.
అపూర్వత అంటే అంతకు పూర్వం చెప్పబడనిది అని అర్థం. అంటే విషయసారాంశమదే నన్న మాట.


''ఉపపత్తి'' అంటే విషయం గురించి చెప్పి ఆ విషయం యొక్క మూలమూ, ఉద్దేశమూ, ఔచిత్యమూ గురించి తెలుసుకోవడం. వీటి వల్ల ఆ విషయం స్పష్టమవుతుంది.


అర్థవాదం అంటే విషయాన్ని అనేక కోణాలలో విషయాన్ని చర్చించడం. వివిద రకాలుగా అర్థవంతమైన వాదాలు చేసుకోవడం.


'ఫలం'' అంటే ప్రతిఫలం. ''ఈ విధంగా చేస్తే ఈ ఫలితం లభిస్తుంది'' అనటం లాంటిదన్నమాట. అంటే మనం నేర్చుకోవలసినదాని వైపు లేక పొందవలసినదాని వైపు మనలను నడిపించటం. దీనిని ''ఫలం'' అంటారు.



Wednesday, July 28, 2010

వేదాల ముందు,వెనుకలను నిర్ణయించడానికి నేటి పరిశోధకుల ప్రామాణికత్వం ఏంటి?

నేటికాలపు పరిశోధకుల దృష్టిలో ఋగ్వేదం పురాతనమైనది. తర్వాత యజుర్వేదం,సామవేదం, అధర్వణవేదం వచ్చాయి. అందరూ దీనినే నమ్ముతున్నారు.

ఈ పరిశోధకులు దేనిని ప్రామాణికంగా తీస్కొని ఇలా వర్గీకరించారో తెలియడం లేదు.

ఇలా ఎందుకంటున్నానంటే అసలు ఋగ్వేదంలోనే యజుర్వేదానికీ, సామవేదానికీ సంబంధించిన సమాచారం ఉంది.
అందుకే వేదాల ముందు,వెనుకల సందేహం వచ్చింది.

మనలో పురుషసూక్తము చాలామందికి తెలుసు. ఋగ్వేదం 10వ మండలంలోని పురుషసూక్తములోని 10 వ శ్లోకం చూడండి.

తస్మాద్యజ్ఞాత్-సర్వహుతః | ఋచః సామాని జజ్ఞిరే |
చందాగ్ంసి జజ్ఞిరే తస్మాత్ | యజుస్తస్మాద జాయత ||


అర్థం:

ఈ సర్వహుత యజ్ఞం నుండి ఋగ్వేద మంత్రాలు పుట్టాయి,సామవేద మంత్రాలు పుట్టాయి.ఛందస్సు పుట్టింది,యజుర్వేదం పుట్టింది.


మరి ఋగ్వేదం తర్వాత పూర్తైన తర్వాత యజుర్వేదం,సామవేదాలు వచ్చాయనాలా? లేక ఋగ్వేదం రచిస్తుండగానే యజుర్,సామవేదాలు సమాంతరంగా(parallel) గా రచించారనాలా? లేక అన్నీ ఒకేసారి ఉన్నాయనాలా లేక పుట్టాయనాలా? కాని ఎవరూ ఇలా అనలేదు. అందరూ అనేదేమంటే మొదట చెప్పినట్లుగా ఋగ్వేదం మొదట తర్వాత యజుర్వేదం, సామవేదం మొదలగునవి.


కాని పై శ్లోకం వలన
ఋగ్వేదం మొదట తర్వాత యజుర్వేదం, సామవేదం అనే భావన ఎలా నిలబడగలదు?


ఇంకా ఇలాంటి ప్రస్తావనలు కల శ్లోకాలు ఏమైనా ఉన్నాయేమో నేనింకా చూడలేదు కాని పై శ్లోకం నాకు కనిపించింది.

Tuesday, July 27, 2010

ఈ తెలుగు పాటకు ఇంగ్లిష్ పాట ఎదో కనుక్కోండి చూద్దాం

క్రింది పాట ఒక తెలుగు సినిమాలోనిదే, కాకపోతే మొత్తం పాట అంతా ఇంగ్లీష్ లో ఉంటుంది. ఆ పాట ఏదో కనుక్కోండి.

నా మొహం అద్దంలో చూస్కొని

ఆశ్చర్యపోయా కనిపించింది చూసి

నేను కేవలం ప్రయాణించే సిపాయిని

నేనవగలను కాగలిగిందంతా

ఇప్పుడు అసలు పాట ఏంటో కనుగొని ఆ శృతిలోనే ఈ పాట కూడా పాడుకొని నవ్వుకోండి.

Monday, July 26, 2010

ప్రాచీన భారత ఋషులు ఆఫర్లు పెట్టి సరుకులు అమ్మినారా?

టపా పేరు చూసి ఇదేదో బిజినెస్ కు సంబంధించినది అనుకోకండి.
ఇది నేను ఇంతకు ముందు రాసిన టపా "మన ప్రాచీన శాస్త్రజ్ఞుల(ఋషుల) కంటూ ఒక విధానం ఉంది. విదేశీయుల కళ్ళజోళ్ళతో దాన్నెందుకు చూడాలి?" కి కొనసాగింపు.

రామాయణం లో ఒక శ్లోకం ఉంది. విభీషణుడు రావణుడితో చెప్పే శ్లోకం

సులభాఃపురుషా రాజన్‌ సతతంప్రియవాదినః

అప్రియస్యతుపథ్యస్య వక్తా శ్రోతాచదుర్లభః

అర్థం:
రాజా! నిత్యం ప్రియమైన మాటలు చెప్పేవారు సులభంగా లభిస్తారు. కాని మన మనసుకు నచ్చకపోయినా మన మేలు కోసం చెప్పేవారూ, చెప్పినా వినేవారూ దొరకడం కష్టం.


కాని అందరికీ మంచిది అవుతుంది అన్న విషయం చెప్పితీరాలి. చెప్పినా వినేవారు దొరకడం కష్టం. ఇక్కడే మన ప్రాచీనఋషులు ఆలోచించారు. నేటి వ్యాపారస్థులు తమ సరుకులు అమ్ముడుపోవడం కోసం "ఒకటి కొంటే ఇంకోటి ఉచితం" లాంటి పథకమే ఆ ఆలోచన.

చెప్పాల్సిన విషయం లేదా సందేశం సరుకులాంటిది. ఆ విషయాన్ని లేక సందేశాన్ని కల్గి ఉన్న కథ ఆఫర్ లాంటిది. అంటే అసలు సరుకు చెప్పాల్సిన విషయం, కథ ఆఫర్ అన్నమాట. సరుకు అమ్ముడు పోవడం కోసం వ్యాపారి ఆఫర్ ఇస్తాడు. జనంలో చాలా మంది మళ్ళీ ఇలాంటి ఆఫర్ ఉండదేమోనని సరుకు కొంటారు. ఇది అందరికీ తెల్సిన విషయమే. కొందరైతే ఆఫర్ ఉంటేనే సరుకులు కొంటారు. ఎలాగైనా సరుకు అమ్ముడుపోవడం అనేది వ్యాపారికి ఎలా ముఖ్యమో, మంచి విషయం ప్రజలకు అందాలనేది ఋషి ఉద్దేశ్యము.

మనము సరుకు కొన్న తర్వాత అసలు సరుకు చూపించకుండా ఆఫర్లో వచ్చిన సరుకునే ఎక్కువగా పక్కింటివారికి లేక మరెవరికో ఎలా చూపిస్తామో కథలోని సందేశాన్ని కాకుండా కథనే ఎక్కువగా
పట్టించుకొంటాం. అది వేరే సంగతి.

సరే కథ చదివినంత మాత్రాన సందేశం అందుతుందా అంటే సందేహమే. ఇక్కడే మరో ఆలోచన వచ్చింది ఋషులకు.

మనిషి విన్నదాని కంటే చూస్తే ఎక్కువ గా ఆకర్షితుడవుతాడు.

కాబట్టి నాటకాలలో సందేశాలను జొప్పించి నాటకాలు వ్రాశి వాటిని ప్రదర్శిస్తే చూస్తున్నంతసేపు తనను తాను మరిచిపోతాడు. పాత్రలను మరిచిపోయి వాటిని నిజంగా భావించి అందులో లీనమవుతాడు.

బయటకు వచ్చినా ఆ ప్రభావం పోదు. నేటి సినిమాలు, సీరియళ్ళ లో ఈ విషయాన్ని బాగా గమనిస్తూనే ఉన్నాం కదా.

Sunday, July 25, 2010

ఈ ఇంగ్లీష్ పాటకు తెలుగు పాట కనుక్కోండి

గాడ్ హ్యాస్ గివెను స్ట్రీట్ వన్ను
నవ్ వై టౌను ,వై ఓన్ హౌసు
ఓ సిస్టరు

Saturday, July 24, 2010

ఈ పాటకు అసలు తెలుగు పాట ఏదో కనుగొనండి చూద్దాం

క్రింది పాట తెలుగు పాట. నేను పేరడీగా తెలుగు లోని పాటను ఆంగ్లం లోనికి అనువదించాను. అసలు పాట ఏదో కనుగొని ఆ పాట లాగే దీన్ని కూడా పాడుకోండి.



స్టైలు క్వీను యు ఆర్, స్టైలు మ్యాను ఐ యాం ( style queen you are, style man i am)

ఏజు మ్యాచు, కపులు మ్యాచు (age match, couple match)

డిసెండ్ ఫ్రం టెర్రస్ (desend from terrus)

Friday, July 23, 2010

చేసే ఏ పని కైనా ప్రేమే ముఖ్యకారణంగా ఉండాలి - శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతులవారు

మీరు చేసేపని ఏదైనాసరే! దానికి ప్రేమ ఒక్కటే ముఖ్యకారణంగా ఉండాలి. కార్యం అంటూ ఎప్పుడుఆరంభం అవుతుందో - ఆ కార్యానికి కర్త, కర్తకు వేరైన ఇతరులు ఉండనే ఉంటారు. కార్యం ఏదైనాసరే! దాని ఉద్దేశము, ప్రయోజనము, కారణము ప్రేమతప్ప ఇంకోటి కారాదు. ఇచ్చట నేను గాంధీగారు అవలంబించిన అహింసావ్రతాన్ని గురించి చెప్పటంలేదు. ఒక్కొక్కప్పుడు మనం హింసా పూర్వకములైన కార్యాలు కూడ చేయవలసివస్తుంది. కొన్ని కొన్ని సందర్భాలలో నేరములకు తగిన శిక్షను కూడ విధించవలసి వస్తుంది. యుద్ధాలు చేయవలసిన అవసరం కూడ కలుగుతుంది. కాని ఏ కార్యం చేసినా సరే! కర్తయొక్క ముఖ్యోద్దేశము ప్రేమయే అయిఉండాలి. ఇచ్ఛాద్వేషాలకు క్రోధమాత్సర్యాలకు అందులో తావుండరాదు. మనం చేసే ప్రతి ఒక్క పనిలోనూ ఈ ప్రేమ అనేది అల్లుకోనిపోయి ఉంటే ప్రపంచంలో ఎట్టి గడ్డు సమస్యలనైనాసరే, మనం అవలీలగా సాధించగలం.

-శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతులవారు

Thursday, July 22, 2010

పండ్లు తినడానికి పండ్ల తోటలోనికి వెళ్లి పండ్లు తినకుండా ఆకులెన్ని, చెట్లెన్ని,కొమ్మలెన్ని అని లెక్కపెట్టడం ఎందుకు?

చాలా ఆకలి మీద పండ్ల తోటలోనికి వెళ్తాము. అక్కడికి వెళ్ళాక తీరా పండ్లు తినకుండా ఆకులెన్ని, చెట్లెన్ని,కొమ్మలెన్ని అని లెక్కపెడుతుంటే ఎవరికి నష్టం? కావాలంటే ఆకలి తీరాక ఆ పని చేసుకోవచ్చు.

కాని మన దురదృష్టం ఏంటంటే నేడు మనం చేస్తున్న పని లెక్కెట్టుకోవడమే, తిని ఆకలి తీర్చుకోవడం కాదు.సాధారణంగా వేదాలు కాని, మరేవైనా గ్రంధాలు కాని చదవాలని ఎందుకు అనుకొంటాము.

మనకు కావలసినది మనం చదివే పుస్తకాలలో నుండి మన జీవనమార్గాని కొక దీపం... నిజానికి ఆ పుస్తకం ఏనాటిది? ఎవరు వ్రాసారు? మొదలైన చర్చలు అసలువిషయాన్ని మన దృష్టినుండి ప్రక్కకు తొలగిస్తున్నాయి. ఇట్లాంటి ప్రశ్నలవల్ల మన దృష్టిలో ఆ పుస్తకాల విలువ తగ్గిపోవడమేకాక వాటిపై నిరాదరణ ఏర్పడి వానిపై మనము ఉంచవలసిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కూడా ఉంచలేకపోతాము. అది పిల్లలు తినడం కోసం పెంచబడుతున్న పండ్ల తోటలను బాటనీ లాబొరేటరీలుగా మార్చినట్లు అవుతుంది. అలా ప్రయోగశాలలుగా మార్చామనుకోండి, వివిధ రసాయనాలు అవీ కలపవలసివస్తుంది. అప్పుడు అసలు దేనికోసం ఆ పండ్ల తోటను పెంచుతున్నామో ఆ అసలు పని ఇక వీలు కాదు. మనం ప్రస్తుతం శాస్త్రాలను,గ్రంధాలను చదివేపద్దతి కూడా ఇలానే ఉంది.

లేదు, ఆ పుస్తకం ఏనాటిది? ఎవరు వ్రాసారు? మొదలైనవి కనుగొనాలి అనేవారు ఉన్నారంటే అది వేరే సంగతి.వారు అందుకు చదువుతారు.అది వారు చదువుతున్న కారణం.

మన కారణం అది కానప్పుడు మన కారణం అందులోని విషయాలు ఏంటి? మనకు పనికొచ్చేవా,కాదా? ఆచరణలో పెట్టగలమా లేక పెట్టవచ్చా?అవి మనకు ఎలా ఉపయోగపడతాయి? అయినప్పుడు కూడా పైన చెప్పినవారి పనే చేస్తుంటే ఎవరికి నష్టం?

మనం ఒక పదానికి అర్థం కావాలని నిఘంటువు(Dictionary) చూస్తాం. కాని ఆ పదానికి అర్థం వెదికే క్రమంలో అనేక ఇతరపదాలు కనపడి వాటి అర్థం కూడా చూస్తూ ఒక్కొక్కసారి మనం అసలు ఏ పదానికి అర్థం చూడాలనుకొంటామో ఆ పదాన్ని మరచిపోతుంటాం. తర్వాత ఆ పదం గుర్తుకు రాక అదేంటో అని ఆలోచిస్తూ నరకయాతన పడుతుంటాం. ఇది అందరికి అనుభవమే అనుకొంటున్నాను. మిగతా పదాల అర్థాలు తెలిసాయి కదా అని అంటారేమో మంచిదే, కాని మన అసలు పని కాలేదు కదా.

ఒక అడవిలో రాత్రి పూట అడవి జంతువులు,పురుగులు,పాములు మొదలగునవి మన వద్దకు రాకుండా మనం కాపాడబడడం కోసం మనం కట్టెలు పేర్చి మంట పెట్టామనుకొందాం. ఇక్కడ
"రక్షణ" అనేది ప్రధాన కారణం,లక్ష్యం. ఆ మంట వెలుగులో మన వద్ద ఏమైనా దుంపలు అవీ ఉంటే వాటిని ఉడికించడం,తినడం అంతేకాక చలిగా ఉంటే మనకు వెచ్చదనం రావడం అనే ప్రయోజనాలు
అనుషంగికం.అంటే మన అసలు కారణం చెడకుండానే ఇతర ప్రయోజనాలు కలగడం.

అలానే మనం దేనికోసం పుస్తకాలు చదువుతున్నామో దాని కోసం చదివేటప్పుడు ఇతర విషయాలు మనకు తెలిస్తే తెలియనీ! మేలే, కాని అసలు విషయం మాత్రం మనం మరిచిపోకూడదు.

ఎవరెందుకు చదువుతున్నారో అందుకే మొదట చదవాలి. కావాలంటే చదివిన కారణం తీరాక ఆ పుస్తకాన్ని వ్రాసిన రచయిత ఎవరు? అతను ఏ కాలం వాడు లాంటివాటిపై దృష్టి పెట్టి కనుగొనడానికి ప్రయత్నించవచ్చు.

Wednesday, July 21, 2010

యోగ్యుడైతే నీ విద్యను చెప్పు,ఎవరూ దొరకకపోతే నీలోనే ఉంచుకో - ఇదే వేదాల అభిప్రాయం

ఇది నా ౨౦౦(200)వ టపా.

మన వేద విద్య లేక విజ్ఞానం అన్నది గురుశిష్య పరంపరగా ప్రసరిస్తూ ఉంది. వ్రాతమూలకంగా వేదాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా వేదాలు స్వరప్రధానం అయినందువలన విని వల్లెవేస్తూ నేర్చుకోవడం అవసరం అయింది. అందుకే వేదాలను ఇలా విని నేర్చుకోవడం వలెనే "శ్రుతి" అని కూడా పిలుస్తున్నాం. మనము వేదాలలోని విజ్ఞానాన్ని చూస్తూనే ఉన్నాం.

అసలు ఈ విజ్ఞానం లేక విద్య ఎవరికి అందాలి అన్న విషయంలో వేదాలు ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాయి. క్రింది శ్లోకాలు చూడండి.

సామవేదం లోని ఉపబ్రాహ్మణమైన "సంహితోపనిషద్ బ్రాహ్మణం" లోని శ్లోకాలు ఇవి.

"విద్య వై బ్రాహ్మణం ఆజగామ తవహం అస్మి త్వం మాం పాలయస్వ-అనర్హతె మానినెమాదా
గోపాయ మా శ్రేయసీతె అహమస్మి విద్యా సార్ధం మ్రియెత్ నా విద్యాం ఊషరెవపెత్"(3-9,10)

అర్థం:
ఒకసారి "విద్య" ఒక తపస్వి దగ్గరకు వచ్చి ఇలా ప్రార్థించింది." నేను నీ దానిని. నన్ను చక్కగా అభ్యసించి పాలించు. అయోగ్యుడు,దురభిమాని అయిన శిష్యుడికి నన్ను ఇవ్వకు.నన్ను
నీలోనే ధరించి కాపాడు. నీకు ఎన్నటికైనా మంచి(శ్రేయస్సు)నే చేస్తాను. ఎప్పటికీ ఊషరక్షేత్రం(ఉప్పుచవిటి నేల) లాంటి అయోగ్యుడి చేతిలో మాత్రం ఉంచకు."

ఈ శ్లోకపు భాష్యం:

"యోగ్యుడైన శిష్యుడు దొరక్కపోతే తన విద్యను తనలోనే ఉంచుకోవాలే కాని ఎన్నటికీ అలాంటి వారికి తను నేర్చుకొన్న విద్యను చెప్పరాదు. దానివల్ల వాడు లోకకళ్యాణం సాధించకపోగా
లోకవినాశనానికే కారణం అవుతాడు."

విజ్ఞానం లేక విద్య అనేది ఎవరికి,ఎలాంటివారికి అందాలి అనే విషయాన్ని వేదాలు ఇంత విస్పష్టంగా ప్రకటించాయి.

గార్గి - స్త్రీ జాతిలో ఒక ఆణిముత్యం

గార్గి వేదకాలం నాటి మహాయోగిని.ఈమె బ్రహ్మజ్ఞానం పొందిన సాధ్వి.ఈమె సకల వేదాలు,శాస్త్రాలు అవగతం చేసుకొన్న జ్ఞానిగా పేరు పొందినది.ఆ కాలంలోని మహా జ్ఞానులలో ఈమె ఒకరు.

ఈమె వచక్నుడు అనే మహాముని యొక్క కుమార్తె.చిన్నప్పటి నుండే గార్గి యొక్క విద్యాభిలాష ప్రస్ఫుటంగా కనిపించేది.ఈమె బ్రహ్మచారిని.పరబ్రహ్మం యొక్క ఉనికిని అన్వేషిస్తూ ఈమె అనేక సూక్తాలను రచించింది.జనక మహారాజు యొక్క సభలోని నవరత్నాలలో ఈమె కూడా ఒకరు.ఈమె యొక్క పేరు జనకమహారాజు నిర్వహించిన బ్రహ్మజ్ఞానుల సభ ద్వారా వ్యాప్తి చెందినది.ఆ సభలో ఆ కాలంలో అందరికన్నా గొప్పవాడైన "యాజ్ఞవల్క్య ముని"ని ఆత్మ,పరమకారణమైన పరమాత్మ ల గురించి గార్గి వేసిన ప్రశ్నలు అతడిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి.

ఉపనిషత్తులలో గార్గి యొక్క ప్రస్తావన వస్తుంది. ముఖ్యంగా బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్నవల్క్యముని తో సంభాషణలలో ఈమె జ్ఞానపు వెలుగులు మనలను,అందరిని నిశ్చేష్టులను చేస్తాయి. ఉపనిషత్తులలో ఆమెను ఒక గొప్ప సహజ వేదాంతజ్ఞాని గా పేర్కొన్నారు.

మహాతల్లి గార్గి వేదకాలం నాటిదైనందున
ఇంతకన్నా ఎక్కువ వివరాలు దొరకడం లేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు.

Tuesday, July 20, 2010

పగలు,రాత్రి ఏర్పడే విధానాన్ని వేదకాలంలోనే స్పష్టంగా చెప్పిన మన పూర్వీకులు

నేను గతంలో భూమి గుండ్రం (వేదాలు) అని ఒక టపా వ్రాశాను. అందులో మన ప్రాచీనులు భూమి గుండ్రంగా ఉన్న విషయాన్ని ఎంత స్పష్టంగా చెప్పారో వ్రాసాను. ఈ టపాలో ఇంకా ఎంత చాలా స్పష్టం గా వివరించారో చూడండి. ఋగ్వేదం ఎంత పురాతనమైనదో మనకు తెలుసు.

ఋగ్వేదం లోని శాకల శాఖకు చెందిన బ్రాహ్మణం ఐతరేయబ్రాహ్మణం లో క్రింది శ్లోకాన్ని చూడండి.

" వా ఏష న కదాచనాస్తమేతి నోదేతి, తం యచస్తమేతీతి మన్యంతేహ్న ఏవ తదంత్వమిత్వాథాత్మానం విపర్యస్యతే- రాత్రీమేవావస్తాత్ కురుతేహః పరస్తాత్ ... య ఏవం వేద" 14.6

అర్థం:

సూర్యుడు ఉదయించడం,అస్తమించడం అంటూ అనేది ఎప్పటికీ ఉండదు. సాయంకాలం అతడు విపర్యాసాన్ని పొంది మనకు కనబడడు. మళ్ళీ తెల్లారేసరికి కనబడతాడు.ఈ గోళంలో
కొంతభాగానికి కొంతసేపు మిగతాభాగానికి కొంతసేపు చీకటి,వెలుగులను ప్రసాదిస్తూ రాత్రి,పగలు అనే వ్యవహారాన్ని కలిగిస్తాడు.

ఇందులో విపర్యసం అనే పదం నాకు అర్థం కాలేదు.

అసలు రాత్రి,పగలు అనేవాటిని ఎంత స్పష్టంగా ఆ కాలంలోనే వివరించారో చూడండి.
అంతేకాక గోళం అంటూ భూమి గుండ్రంగా ఉందనే విషయాన్ని కూడా చెప్పకనే చెప్తున్నారు.

వేదాల్లోని ఈ విషయాన్ని చూసి 19వ శతాబ్దపు వేద పరిశోధకుడు మోనియర్ విలియంస్ (Monier Williams) భారతీయుల సునిశిత మేధాశక్తిని ప్రశంసించిన విధానం చూడండి.

"Indians had made some shrewd astronomical guesses more than 2000 years before the birth of Copernicus" (The Vedas p.39)

ఇంకో తెలుసుకోవల్సిన విషయం ఏంటంటే ఈ ఋగ్వేదపు ఐతరేయ బ్రాహ్మణంలోనే మొదటిసారిగా "ఆంధ్ర దేశం" అని ఉపయోగించబడింది.
ఇందుకు సంబంధించిన శ్లోకం

"తుంగా కృష్ణా తథా గోదా సహ్యాద్రి శిఖరావధి|
ఆ ఆంధ్రదేశ పర్యంతం బహ్వృచశ్చాశ్వలాయనీ" (33.6)

స్త్రీ మాత్రమే కాదు, మగవాడు కూడా సంతానం పొందితేనే పరిపూర్ణమైన మగవాడు అవుతాడు

అదేదో చిత్రంలో కథానాయకుడు ఒక స్త్రీ పరిపూర్ణత గల స్త్రీ ఎప్పుడు అవుతుంది అని మార్కులు వేస్తూ సంతానవతి ఐన తర్వాతనే ఆమె పరిపూర్ణత పొందుతుందని చెప్తాడు.

మరి మగవాడు పరిపూర్ణ మగవాడు ఎప్పుడు అవుతాడు? ఈ విషయం చాలా మందికి తెలియదు.

ఈ విషయం గురించి వేదాలలో ఏమున్నదో గమనించండి.

శుక్ల యజుర్వేదం లోని "శథపథ బ్రాహ్మణం" లోని క్రింది శ్లోకాన్ని చూడండి.


అర్ధో హ వాయేష ఆత్మనో యజ్ఞాయా, తస్మాద్యావజ్జాయాం
న విందయతేనైవ తావత్ ప్రజాయతే అసర్వోహి తావద్భవతి
అథ యదైవ జాయాత్ విందతే అథ ప్రజాయతే, తర్హిసి
సర్వో భవతి! సర్వ ఏతాం గతిం గచ్ఛానీతి (5.2.1.10)


అర్థం :

భార్య భర్తలో సగభాగం. ఆమెను పొందేవరకు అతను సంతానాన్ని కనలేడు. అసంపూర్ణుడే అవుతాడు. భార్యను, ఆమె ద్వారా సంతానాన్ని పొందిన భర్త పరిపూర్ణత సాధిస్తాడు.


కాబట్టి పై వేదప్రమాణం ప్రకారం పురుషుడు కూడా సంతానం పొందితేనే పరిపూర్ణ పురుషుడు కాగలడని తెలుస్తోంది.


మనం ఇంకోటి గమనిస్తే కనుక ఒకటి అర్థం అవుతుంది. పై శ్లోకంలో భార్య ద్వారా సంతానం పొందేవాడే పరిపూర్ణత పొందుతాడని చెప్పబడింది. అంటే కట్టుకొన్న భార్య ద్వారానే పొందాలి, ఇతరత్రా కాదు అన్న విషయం స్పష్టమవుతోంది.

Monday, July 19, 2010

జనానికి మంచి బదులు చెడు జరుగుతుందనే విమాన నిర్మాణం వ్రాయడం లేదు - భోజరాజు

భోజరాజు గురించి అతను ఒక గొప్ప మహారాజుగా మనందరికీ తెలుసు. ఇతని ఆస్థానంలోనే మహాకవి కాళిదాసు ఉండేవాడని చరిత్ర చెప్తోంది.


కానీ ఇతను "సమరాంగణసూత్రం" అనే గ్రంధం వ్రాశాడని చాలామందికి తెలీదు.


ఈ గ్రంధంలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వ్రాయబడ్డాయి. "యంత్రాలు ఎలా తయారు చేయాలి?","ఆకాశంలో ప్రయాణించడం ఎలా సాధ్యం?" అనే విషయాలు ప్రస్తావించబడ్డాయి.



అమరకోశం లో 'వ్యోమయానం విమానోస్త్రీ' అని ఉంది. అంటే "ఆకాశంలో ప్రయాణించే వాహనానికి విమానమని పేరు" అని అర్థం.


భోజరాజు తన 'సమరాంగణసూత్రం'లో విమాన నిర్మాణవిధానం గూర్చి వ్రాస్తూ భోజరాజు "విమాన నిర్మాణం గురించి స్థూలంగా తత్త్వము(theory) మాత్రమే వ్రాస్తున్నాను. దానిని నిర్మించే విధానం తెలిసే వదిలేస్తున్నాను,వ్రాయడం లేదు.చేయడం ఎలాగో చెప్పడం వల్ల సామాన్య జనానికి సుఖం బదులు కష్టమే ఏర్పడుతుంది అని ఇది వ్రాయడంలేదు' అని వ్రాశారు.



చిత్తశుద్ధి లేని వారి చేతిలో ఇలాంటివి పడితే పసిపిల్లల చేతిలో విషం ఉన్నట్లే కదా!


భోజరాజు గారు ఏమి ఆలోచించాడో ఏమో మనకైతే తెలియదు.


1980 లలో ఈ గ్రంధాన్ని చూసిన శాస్త్రవేత్తలు అందులో బెలూన్ల వంటి సాధనాల నిర్మాణం, అందులో ఎలా ప్రయాణించడం అనే విషయాలు వర్ణించారని అన్నారు.


ఇతర దేశాలలో నూతనశాస్త్రాలు అభివృద్ధి చెందుతూ ఉంటే మనదేశంలో ఉన్నశాస్త్రాలు కూడా నామరూపాలు లేకుండ నశిస్తున్నాయి. ఉన్న శాస్త్రాల ను ఉపయోగించుకొనే పద్దతి మనకు తెలియడంలేదు.


ప్రాచీన శాస్త్రాలను అర్థం చేసికొనడానికి పరిశోధనలు చెయ్యాలి. మనకు అర్థము కాకపోయినా మన తర్వాతి తరం కొరకైనా వానిని రక్షించాలి. ఇప్పుడు అర్థము కాకపోయినా మరియొక కాలంలోనైనా అవి ఉపయోగపడతాయి.


మిగిలిన దేశాలు మొదట అజ్ఞానదశలో ఉండి క్రమేణ జ్ఞానదశకు వచ్చాయి. మన దేశము ఆరంభ కాలములో ఉచ్చస్థితిలోఉండి క్రమేణ క్షీణస్థితికి వచ్చి మళ్లీ ఇప్పుడు ఉన్నత స్థితికి వెళ్తోంది.



ఇప్పటికే ఎన్నో శాస్త్రాలు మనకు దొరకడం లేదు. ఉన్న శాస్త్రములను మూర్ఖంగా పనికిమాలినవని పారవేస్తే మనకే నష్టం. వానిని అర్థం చేసికొనడానికి ప్రయత్నించాలి. నిరూపణ కానిదే దేనినీ ఖండించుటకు మనకు అధికారంలేదు. అర్థము చేసికొనుటకే మనకు అధికారం ఉంది.


సముద్రంలో ప్రయాణాన్ని వేదాలలో నిషేధించలేదు

ఋగ్వేదం 4 అధ్యాయం,9 అనువాకం,48 సూక్తం



उवासोषा उछाच्च नु देवी जीरा रथानाम

ये अस्या आचरणेषु दध्रिरे समुद्रे न शरवस्यवः



అర్థము:


ధనము కోరువారు సముద్రమున నావలు నడుపుతారు.ఆట్లే ఉదయాకాశమును ఉషోదేవినడుపుచున్నది.ఇంతకు పూర్వము కూడా నడిపినది.ఇప్పుడూ నడుపుచున్నది.



సముద్రమున నావలు నడపడం ధనం కొరకు అని అన్నప్పుడు,సముద్రయానం వ్యాపారం కొరకే అని కదా అర్థము.దీనినిబట్టి వేదకాలములోనే మన పూర్వీకులు సముద్ర ప్రయాణం (ఇతర దేశాలతో కూడా అయ్యుండవచ్చు) ద్వారావ్యాపారము చేస్తున్నట్టు అర్థం అగుచున్నది.



అంతేకాక సముద్రయానము నిషేదము అన్నది వేదకాలం తర్వాత ఎవరో మన గ్రంధాలలో చొప్పించారు అన్నది అర్థంఅవుతోంది.

Sunday, July 18, 2010

ఎపిక్ (Epic) - మన భారతదేశపు బ్రౌజర్



ఈ మధ్యనే నేను ఎపిక్ బ్రౌజర్ ను వాడుతున్నాను. చాలా బాగుంది.

దీన్ని mozilla fire fox ను ఆధారంగా తీస్కొని రూపొందించారు.
మామూలు firefox లోని అన్ని features ఇందులో ఉన్నాయి.

ముఖ్యం గా బ్రౌజర్ లో నే Anti virus సౌకర్యం ఉంది. దాన్ని download చేసుకొని activate చేసుకొంటే తర్వాత మనం ఏ download చెసుకొన్నా బ్రౌజరే స్కాన్ చేస్తుంది. ఈ anti virus ను మన కంప్యూటర్ ను కూడా స్కాన్ చేసి శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. బాగానే పనిచేస్తోంది.

దీని ప్రత్యేకతలు :
1.direct గా ఆంగ్లం తో పాటుగా ఏ భారతీయ భాష లో నైనా టైప్ చేసుకొనే సౌకర్యం ఉంది.
2.ఎడమ వైపు ఒక బార్ ఉంటుంది. అందులో చాలా అదనపు సౌకర్యాలు ఉంచారు.
3.బ్రౌజర్లోనే మనం word pad open చేసుకొని ఆంగ్లం తో పాటుగా ఏ భారతీయ భాష లో నైనా వ్రాసుకోవచ్చు.
4.ఇంకా twitter, orkut, gmail, facebook,yahoo, book marks, ఇంకా చాలా సైట్ల short cut లు ఎడమ వైపు బార్ లో ఉంచారు.
5.ఇంకా my computer ని కూడా బ్రౌజర్ లో నే (open) చేసుకోవచ్చు.
.6. fire fox లాగానే ఇందులో కూడా addons పెట్టుకోవచ్చు.
7. గేములు, backup కూడా ఎడమవైపు బార్ లో ఉన్నాయి.
8. ఇంకా ఎడమవైపు బార్ కు మనమే చాలా అదనం గా చేర్చుకోవచ్చు.
9.history కూడా ఈ బార్ లోనే ఉంటుంది.
10. ఇంకా అలారం కూడా పెట్టుకోవచ్చు. మనం నెట్ ఉపయోగిస్తూ సమయం మరిచిపోకుండా ఉండేందుకు అలారం ఉపయోగించుకోవచ్చు.
11. అలానే చేయవలసిన పనులు గుర్తు చేయడానికి To Do కూడా ఇందులో ఉంది.
12. ఏదైనా సైట్ లో మనకు నచ్చిన విషయం ఉంటే దాన్ని కాపీ చేసుకోవడానికి snippets అనే సౌకర్యం ఇచ్చారు.

ఇంకా చాలా ఉన్నాయి. ఇందుకోసం http://www.epicbrowser.com/ చూడండి.


ఈ బ్రౌజర్ ను క్రింది లంకె నుండి దింపుకోవచ్చు.
ఎపిక్(Epic)
(http://http.cdnlayer.com/href/epic-setup.exe)

Saturday, July 17, 2010

ప్రతి మనిషి ఏ విషయానికి భయపడతాడు?

ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించండి.

99% మనుషులు ( బహుశా 100% అను కూడా అనుకోవచ్చేమో) ఏ విషయానికి భయపడతారు?

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు