తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Wednesday, June 30, 2010

మన ప్రాచీన శాస్త్రజ్ఞుల(ఋషుల) కంటూ ఒక విధానం ఉంది. విదేశీయుల కళ్ళజోళ్ళతో దాన్నెందుకు చూడాలి?

రోముకు వెళ్ళినప్పుడు రోమన్ లాగా ఉండమని ఒక సామెత. అంటే వారి మనస్తత్వానికి తగ్గట్లు నడుచుకోవాలన్నమాట. అంటే ప్రతి దేశానికి కొన్ని విధివిధానాలు, సంస్కృతీసాంప్రదాయాలు
ఉంటాయి, అవి ఇంకో దేశంలో చెల్లుబాటు కావచ్చు,కాకపోవచ్చు. అలానే ప్రజల మనస్తత్వాలు కూడా. భారతదేశంలో ని ప్రజల వేషధారణ ఇంగ్లాండ్ వారికి ఎబ్బెట్టు గా కనిపించవచ్చు.
అలానే వారి స్వేఛ్ఛా మనస్తత్వాన్ని మనం విచ్చలవిడితనం గా భావించవచ్చు. ఇక్కడ ఇద్దరిదీ తప్పే కనిపిస్తుంది. ఎందుకంటే మనం మన విధానాల కళ్ళజోళ్ళ లో నుండి, వారు వారి
విధానాల కళ్ళజోళ్ళలో నుండి చూస్తున్నారు. అలా చూడకూడదు కదా. ఎవరి ప్రమాణాలు(Standards) వారివి.

ఇదే విషయం మన ప్రాచీన శాస్త్రజ్ఞుల(ఋషుల) విషయంలో కూడా వర్తిస్తుంది. వారి విధానం వేరు. ఇక్కడ మన ప్రాచీన శాస్త్రజ్ఞులను ఋషులని సంభోధిస్తున్నాను. భారతీయులు
ఎప్పుడూ దేవుడు,ఆత్మ,వేదాంత రంగాలలోనే విషయాలు కనుగొన్నారు కానీ సైన్సు పరంగా ఏమీ లేదనే అభిప్రాయం విదేశీయులలోనే కాదు, దురదృష్టవశాత్తూ మన భారతీయులలో కూడా
చాలా ఎక్కువగా ఉంది.

మన ఋషులు ఏవైనా సైన్సుకు సంబంధించిన విశేషాలు కనుగొంటే ఎందుకు చెప్పలేదు? అని చాలామంది అంటుంటారు. ఒకటే కారణం వారు చెప్పిన విధానం వేరు.

మన ఋషుల విధానం ఏమంటే సమాజంలో సామాన్యులే ఎక్కువగా ఉంటారు. మేధావుల శాతాన్ని మామూలు జనం సంఖ్యతో పోలిస్తే నిర్లక్ష్యం చేయవచ్చు(Negligible). సైన్సు యొక్క ఫలాలు సామాన్యులకు చేరినప్పుడే దానికి విలువ అని ప్రస్తుతం మనం అనుకుంటున్నదే వారి విధానం కూడా. సాధారణంగా మన పూర్వీకుల పద్దతి ఆధ్యాత్మిక సంబంధమైనది. ఆ పద్దతికి తగ్గట్లే మన ఋషులు కూడా తమ పద్దతిని రూపకల్పన(Design) చేసుకొన్నారు. తము కనుగొన్న విషయాలను కథల రూపంలోనూ, కట్టుబాట్ల రూపం లోనూ, నిషేధాల రూపం లోనూ జనానికి అందించారు. ఉదాహరణకు ఏదైనా ఆసనం పై (కుర్చీ లేదా గోడ ఏదైనా కావచ్చు) కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపరాదు అంటారు. అలా ఊపడం అలవాటైతే గనుక పక్షవాతం వస్తుందని నేటి సైంటిస్టులు కనుగొన్నారు. కానీ మనవారు అలా ఊపితే ఎదురుగా ఉన్న వారికి కాళ్ళు చూపినట్లవుతుందని ,వారికి అగౌరవమని నిషేధించారు.ఇది ఒక ఉదాహరణ
మాత్రమే. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. కొన్ని మూఢనమ్మకాలు కూడా ఇందులో కలిసిపోయుండవచ్చు. అంత మాత్రాన అన్నీ మూఢనమ్మాకాలేనని ఎలా నిర్ణయించగలం?

మనఋషుల విధానం లో ప్రజలలోనికి విషయం ఎలాగైనా చేరాలి, వారు ఆచరించాలి అంతే.
అసలు తాము ఒక విషయం కనుగొన్నమనే దానికి వారు ఏమాత్రం ప్రాముఖ్యతను ఇవ్వలేదు. ఉదాహరణకు సాయణాచార్యులు ఋగ్వేద భాష్యం చెప్తూ కాంతివేగాన్ని కూడా
పరోక్షం(indirect)గా చెప్పారు. తానేదో కొత్తవిషయాన్ని పరిచయం చేస్తున్నట్లు చెప్పలేదు.
మనకు తెలిసిన ఆర్యభటుడు , భాస్కరాచార్యుడు, చరకుడు,కణం అనే భావనను కనుగొన్న కణాదుడు మొదలగు వారు కూడా తమ ఆవిష్కరణలను ఏనాడూ ప్రచారం చేసుకోలేదు.
పేటెంటు కూడా తీసుకోలేదు. పేరును ఆశించలేదు. తమ కృషి ఫలితాలు కేవలం ప్రజలకు చేరడమే వారికి కావలసింది. అంతెందుకు మన కాలం నాటి జగదీశ్ చంద్రబోస్ కూడా ఎన్నో
కనుగొన్నా ఏనాడూ పేరు ఆశించకుండా కేవలం తన పరిశోధన ఫలితాలు జనానికి అందాలని ఆశించాడు. పేటెంట్లు కూడా తీసుకోలేదు.

ఇప్పుడంటే మనం మన పూర్వీకులు ఇది కనుగొన్నారు, అది కనుగొన్నారు అని చెప్పుకొంటున్నాం కానీ వారు ఏనాడూ పేరుప్రతిష్టలకై ఆశించలేదు.

ఇక విదేశీయుల పద్దతి ఏమిటంటే తాము ఏదైనా కనుగొంటే మొదట తమ పేరున పేటెంట్ పొంది తర్వాత జనాలకు ఆ అవిష్కరణను పరిచయం చేస్తారు. ఇక్కడ నేను విదేశీయులను తక్కువ చేసి మాట్లాడడం లేదు. వారి విధానం ఇది అని చెప్తున్నాను. వారి విధానం వారికి సరైనదని అనిపించవచ్చు కాబట్టి అదే వారు అనుసరిస్తున్నారు.

ఇప్పుడు ఆలోచించండి విదేశీయుల విధానాలను ప్రాతిపదికగా తీస్కొని మన విధానాలను పోల్చడం ఎంత బుద్ధి తక్కువ పనో!

వనరులు:
కాంతివేగం వేదాలలోనే ఉంది (మహోన్నత భారతదేశం)
ఆర్యభటీయం(ప్రాచీన భారత విజ్ఞానగ్రంథాలు)
భాస్కరాచార్యుడు (ప్రాచీన భారత శాస్త్రవేత్తలు)
ఋషులు అంటే సమాజహితం వదిలి స్వార్థం చూసుకొనేవారా?

12 comments:

 1. మంచి విషయాలు చెప్పారు. మన ఉపనిషత్తులలో కూడా పిప్పలాద మహర్షి వంటి వారు ఏదీ తాము కనుగొన్నమని గానీ, ఆవిష్కరించామని గానీ చెప్పుకోలేదు. మా గురువులయినా మహానుభావుల మార్గదర్శకంలో మేమిది తెలుసుకున్నాం అనే చెప్పారు. అదీ వారి ఔన్నత్యం! చక్కని టపా వ్రాసారు. నెనర్లు!

  ReplyDelete
 2. మూఢనమ్మకంగా చెప్పడం మనం అది పాటించడం వేరు, తెలిసి అర్థం చేసుకుని పాటించడం వేరు. మనిషి బుద్ధి జీవి, జంతువు కాదు కాబట్టి , సహేతుకంగా చెప్పాలి. పేటెంట్లు, పేర్లు తరవాతి సంగతి.
  ఎలా చెప్పినా సహేతుకంగా చెప్పినంత వరకూ అంగీకారయోగ్యమే. మూర్ఖంగా ' అన్నీ వేదాల్లో వున్నాయిష ' అనే వాళ్ళు వేదాలను కించపరుస్తున్నారనే నేనుభావిస్తాను. మా వేదాల్లో కూడా ' సైన్సు ' వుంది అని పదే పదే జబ్బలు చరుచుకోవడం సైన్సు అందులో వుంది కాబట్టే వేదాలు కూడా గొప్పవి అనే అర్థం వస్తుంది.

  కౌరవులు 'ఇంక్యూబేటర్ ' లో పుట్టారు. పుష్పక విమానం అంటే విమానాల తయారీనే , జరాసంధుడిని అతికించిన జర రాక్షసి మొదటి సర్జన్ ... ఇలాంటి మిడిమిడి/ మూర్ఖ జ్ఞానం వల్ల ఆ ప్రాచీన జ్ఞానానికి మేలుకన్నా కీడే చేస్తుంది. మరి అన్నీ తెలిసిన ఈ వేదభూమి ఎందుకీరోజు మూడవ ప్రపంచ దేశంగానే వుంది?

  అన్ని వేల ఏళ్ళ క్రితం మనిషి అలా ఆలోచించాడు అనే ఒక్క ఆలోచన చాలు, వేదాలు గొప్పవి అని చెప్పడానికి.

  ReplyDelete
 3. ఈ మధ్య 'A tour of the calculus' by David Berlinski
  చదువు చున్నాను. దానిలో హిందూ ఋషుల( పన్నెండొవ శతాబ్దపు భాస్కర) సంఖ్యా శాస్త్రము లో మేధా శక్తీ గురించి చెబుతుంటే ఉప్పొంగి పోయాను.
  గౌరవించ తగ్గ మంచి పోస్ట్.

  ReplyDelete
 4. I would like to add a point here, purely my personal opinion.
  It may be misleading to divide the modern Western and Indian worlds and attribute everything of Veda to today's India.

  Probably during the vedic period(may be around 5000BC), there are no distinctions of east and west, like we see today. The world at that time probably would have been one culture.
  When the veda is declined, others civilizations would have sprouted everywhere. Only in India, vedic civilization continued.
  So, it probably doesn't make sense to put geekoroman(or modern science) and vedic cultures against each other and compare. This is the same mistake that modern western scholars does.

  ReplyDelete
 5. 1=మనిషి బుద్ధి జీవి,జంతువు కాదు కాబట్టి , సహేతుకంగా చెప్పాలి....2-అన్నీ తెలిసిన ఈ వేదభూమి ఎందుకీరోజు మూడవ ప్రపంచ.....@snkr.....
  అన్ని జీవులు బుద్ధ్హిని కలిగిఉన్నాయి.ఉదాహరణకు:మీ సైన్స్ పరికరాలకంటే ముందుగా గాడిదలు వాన రాకను ఇట్టే గ్రహిస్త్తాయి ,అదేవిధంగా పాములు/చీమలు/కుందేళ్ళు భ్హోకంప తాకిడిని సేస్మోగ్రఫులకంటే. ముందుగానే పసికడతాయి.ఇటువంటి నిశితమైన బుద్ధ్హి..బుద్ధి జీవులమని చెప్పుకునే మనకు లేదు[నరుని నాలుకకు నరం లేదని ఓ నానుడి]మనిషికి అహం పెరగరాదని దేవుడు వాటికి ఏ బుద్ధినిచ్చి మనలను వెంగలాయిలను చేసాడు.హేతువును మూలం నుంచి/బుద్ధ్హిని ఉపయోగించి తెలుసుకోవాలి ..ఉదాహరణకు,తల్లి హేతువుకు అర్ధం తెలియని తన బిడ్డకు, భర్తను ఈయనేరా నీ నాన్నఅని పలుమార్లు చెప్పడం వల్ల,ఆబిడ్డ అతడిని నాన్న అని పిలుస్తూ గౌరవిస్తాడే. తప్ప ..తన తల్లిని చూసి దీనికి హేతువు ఏమిటని ఎదురు ప్రస్నిన్చడు..ఆ బిడ్డ స్థానంలో మీరుంటే,ము౦దు మన ముగ్గురి జన్యుపటాలు/రక్త గ్రూపు టెస్ట్లు హేతువుగా చూపమని ప్రస్నిస్తారనుకుంటా ?[yes iam right]౨.అన్ని తెలిసిన ఈ దేశం తర్డ్ వరల్డ్ కన్త్ర్తి గా ఉండడానికి కారణం మనం వేదరాశిని పోగొట్టుకోవడమే ,its equal to a scientist who lost his experimental papers.మనం పోగొట్టుకున్న వస్తువుతో తెల్లోడు లాభాన్నిపొంది మీలాంటి వారి కళ్ళు మూసుకుపోయేలా చేసాడు ..దానికి మీరు వాడికి జై -కొడుతున్నారు /బుద్ధ్హికలిగినవాడికి ఎవ్వరూ హేతువును ప్రత్యేకంగా వివరించాలిసినపనిలేదు ..అలా వాడు తిరిగి హేతువు అంటూ సోది పెడుతున్నడన్టే..అతడ్డాస్సలు బుద్ధిజీవేకాదని అర్ధం --జయదేవ్

  ReplyDelete
 6. When the veda is declined,/సూర్య not decliend,they were stolen....but any how ur comment is stoic on this topic.Thanks/jayadev

  ReplyDelete
 7. మీ ప్రయత్నం దానివెనుక మీ ఉద్దేశ్యం చాల బాగున్నాయి !
  మరి కొద్ది విపులం గ శాస్త్రీయమైన సోదాహరణం బాగుంటుందేమో !ప్రయత్నించగలరు !
  "మన సంస్కృతి మన సంపద కాబట్టి మనమే కాపాడు కోవాలి "
  ....మీ సావిరహే

  ReplyDelete
 8. @ Pandit Jayadev :గాడిద మనిషికన్నా బుద్ధిజీవి అనిపించడం .. హీ హీ హీ (అంటే హాస్యాస్పదం అని.) , కాసింత ఆశ్చర్యం కలిగించింది కూడా. మనుషులకు వేదాలు తెలుసు, మరి గాడిదలకు తెలియవనుకుంటా :)

  అనాదిగా వేదాలు స్మృత్యాలు , అలాంటి మనసులో వున్న వాటిని ఎలా దొంగిలించుకుపోగలరో తమరే చెప్పాలి.

  గాడిదలు, జంతువులకు వున్న కొన్ని లక్షణాలను ( స్కిల్స్) చూసి, తమలాంటి పెద్దలు వాటిని మనిషికన్నా గొప్ప బుద్ధిజీవులని ఆరాధించడం ఏమంత బాగో లేదు. ఓ సారి పునఃపరిశీలన చేసుకొమ్మని నా వినతి. ;)

  మీ ఇతర ఉదాహరణలు, తండ్రి ఎవరు వగైరాలు .. కేవలం మీ ఆవేశం గా పరిగణించి వదిలివేస్తున్నా.

  ReplyDelete
 9. meeku chaalaa pradhamikaamsaalu telisinattugaa anipinchadam ledu snkr jee.అనాదిగా వేదాలు స్మృత్యాలు , అలాంటి మనసులో వున్న వాటిని ఎలా దొంగిలించుకుపోగలరో తమరే చెప్పాలి/from kaasmir,the westrens forcefully taken 1000s of vedicpandits.The pandits who refused to migrate to their countries were maasscared on the spot.so in this way the smruthis were stolen from us. హీ హీ హీ.../గాడిదలు, జంతువులకు వున్న కొన్ని లక్షణాలను ( స్కిల్స్) చూసి, తమలాంటి పెద్దలు వాటిని మనిషికన్నా గొప్ప బుద్ధిజీవులని ఆరాధించడం ఏమంత బాగో లేదు/manishiki leni buddhi daeniki unnaa oppukovadam naa nature..meekaa samskaaram ledannaaru...thats ur persanal matter.u have a very poor knoeledge in our epics nd scriptures snkr.In geethaa,lord krishnaa said"if u find a spl.skill in any part of creation,o arjunaa realise that spl.skill is nothing but me".so iam a follower of krishnaa./మీ ఇతర ఉదాహరణలు, తండ్రి ఎవరు వగైరాలు .. కేవలం మీ ఆవేశం గా పరిగణించి--vadliveyaadamaa?leka paaripovadamaa?-----jayadev.

  ReplyDelete
 10. //westrens forcefully taken 1000s of vedicpandits.//
  When, where, by whom? You may give your version.

  // manishiki leni buddhi daeniki unnaa oppukovadam naa nature //
  Ok, you may worship. But, I advise you not to go behind those brainy creatures. They just don't forgive anyone who stand behind. :P :))
  EdO cheppaanu A taravaata mee ishTam.

  ReplyDelete
 11. the story of civilisation-by,willdurant[92-volumes]/vasudeva verses gaadida kadha meeku telusunanukuntaanu-jayadev

  ReplyDelete
 12. Ok, thanks. I'll look for the info/book.

  Yes, I know that story and What I shared was lesson learnt from my own experience a couple of times. :))

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు