Saturday, November 9, 2013
Thursday, November 7, 2013
చాలా మందికి తెలిసిన ఈ కథ ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా?

ఒక నిరుద్యోగి ఒక సంస్థలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్ళాడు. ఆ ఇంటర్వ్యూకు రానూ,పోనూ చార్జీలు ఆ సంస్థే ఇస్తుంది. కాని ఇంటర్వ్యూ సరిగా చేయలేక పోవడం వలన ఆ నిరుద్యోగి ఆ ఉద్యోగం పొందలేకపోయాడు. బయటకు వచ్చేసాడు.ఇంటర్వ్యూలు ముగిసిన తర్వాత ఇంటర్వ్యూ బోర్డు చైర్మన్ బయటకు వచ్చాడు.
ఈ నిరుద్యోగి ఇంకా అక్కడే తిరుగుతుండడం చూసి అతను " ఏం బాబూ!నువ్వు ఎంపిక కాలేదు కదా? ఇంకా ఇక్కడే ఎందుకు తిరుగుతున్నావ్?" అన్నాడు.
దానికి ఆ నిరుద్యోగి "సార్! మీరు రానూ,పోనూ చార్జీలు ఇచ్చారు కదా. మీరు ఇచ్చినదాని కన్నా మా ఊరికి చార్జీలు తక్కువే. అందుకే మిగిలిన డబ్బును మీకు తిరిగి ఇద్దామని ఇక్కడే ఉన్నాను." అన్నాడు.
ఆశ్చర్యచకితుడైన ఆ ఇంటర్వ్యూ బోర్డు చైర్మన్ " బాబూ! నువ్వు ఉద్యోగం లో చేరవచ్చు. సబ్జెక్ట్‌లో (ఉద్యోగం లో) నీకు నేను సహాయం చేయగలను. నీవు నేర్చుకోగలవు. కానీ నిజాయితీ అనేది ఒకరు నేర్పిస్తే వచ్చేది కాదు. అది నీకు ఉంది. చాలా సంతోషం. మా సంస్థలో చేరు" అన్నారు.
ముందే చెప్పినట్లు ఈ కథ చాలామంది చదివి ఉండవచ్చు.
కానీ ఇది జరిగింది ఎక్కడో తెలియనివారి కోసం ఈ టపా.
ఆ నిజాయితీ గల నిరుద్యోగి పేరు తెలియనందుకు క్షమాపణలు.
ఆ సంస్థ : భారతీయ వైజ్ఞానిక సంస్థ (IISc),బెంగళూరు.
ఆ ఇంటర్వ్యూ బోర్డు చైర్మన్ : సర్ సి.వి.రామన్ గారు.
రామన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
Subscribe to:
Posts (Atom)
Featured Post
వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం
ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...