తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Monday, January 7, 2008

వివేకానందుని భారతదేశ అభిమానము:

ఒక సారి వివేకానందుడు సభలో ప్రసంగించి క్రిందకు వస్తున్నప్పుడు జరిగిన సంఘటన.ఒక అమెరికా దేశీయుడు "స్వామీ మీరు ఎప్పుడూ మీ దేశాన్ని పొగుడుతుంటారు.మరి ఎందుకు మీరు అమెరికా దేశపు బట్టలు,బూట్లు ధరించారు?" అని ఎగతాళిగా అడిగాడు.అందుకు స్వామి సమాధానము " అవును ధరించాను.కానీ నా తలపాగా మాత్రము భారతదేశము కు సంభందిచినది.నేను నా దేశాన్ని ఎప్పుడూ తల పైనే ధరిస్తాను.మిగతావి మిగిలిన శరీరము నకు ధరిస్తాను. మీవి ధరించడము ఎందుకంటే రోము లో ఉన్నప్పుడు రోమన్ లాగా ఉండమన్నారు కదా.కానీ నా దేశాన్ని ఎప్పుడూ నా తలపైనే ధరిస్తాను" అని.

ఇంకొక సందర్బము లో వివేకానందున్ని అవమానించాలని అమెరికా వారు భగవద్గీతని క్రింద పెట్టి మిగతా మతగ్రంధాలను దాని పైన పెట్టి " చూడండి మీ పవిత్ర గ్రంథము మా గ్రంథాల క్రింద ఉంది" అన్నారు.అప్పుడు స్వామి వెంటనే భగవద్గీతను లాగేసాడు.వెంటనే మిగిలిన గ్రంథాలు క్రింద పడిపోయాయి.అప్పుడు స్వామి "చూశారా ,మిగిలిన మతాలు మా మతం పైన ఆధారపడిఉన్నవి.మాది గనుక కూలిపోతే మిగిలినవాటి గతి కూడా ఇంతే" అన్నాడు.స్వామికి అన్ని మతాలపైనా సమాన దృష్టి ఉన్నప్పటికీ వారు ఎగతాళి చేయడం వలన ఈ విధము గా సమాధానము ఇవ్వవలసి వచ్చినది.

ఉపనిషత్తుల పిలుపు:

చాలామంది వేదాంతము లేక ఉపనిషత్తుల విషయము వస్తేచాలు అమ్మో మనకు ఇవి పట్టవు ఎందుకులే అనుకుంటారు.కాని ఉపనిషత్తులనేవి విజ్ఞాన గనులన్నవి నిజము.ఉపనిషత్తులు మనకు భోదించేది " అభీః అభీః " అని.అంటే ధైర్యము గా ఉండాలని.ఎట్టి పరిస్థితులలోనూ ధైర్యమును కోల్పోకూడదని. వీటిని చదవి మననము చేయడము వలన మనిషి కి ప్రపంచము యొక్క అసలు స్వరూపము తెలిసి దేనికీ భయపడని మనస్తత్వము ఏర్పడుతుంది. ఏ కొత్త విషయానికీ భయపడనవసరము లేదని తెలుస్తుంది.మనిషి తన జీవితాన్ని ఎంత అర్థవంతంగా జీవించవచ్చో అర్థము అవుతుంది.

వేమన పద్యము

లెక్కలేనన్ని ఆశలు లీనమై ఉండగా

తిక్కపట్టి నరుడు తిరుగుగాక


కుక్క వంటి మనసు కూర్చుండనిచ్చునా
విశ్వదాభిరామ వినుర వేమ


మనిషి ఎన్నో కోరికలు కలిగి మనశ్శాంతి లేక తిరుగుతుంటాడు.స్వాధీనములో లేని మనసు కుక్కలాంటిది. అలాంటి కుక్క వంటి మనసు మనిషిని ఒక చోట స్థిమితంగా కూర్చుండనిస్తుందా?

Saturday, January 5, 2008

వేమన పద్యము

అంతరంగము నందు అపరాధములు చేసి
మంచి వాని వలె మనుజుడుండు
ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా
విశ్వదాభిరామ వినుర వేమ


చాలా మంది మనుషులు ఎవరికీ తెలియకుండా తప్పులు చేసి ఎవరికీ తెలియదులే అనుకుంటారు.కానీ అంతర్యామి ఐన దైవానికి తెలుసునన్న విషయాన్ని మరిచిపోతుంటారు.

సీతమ్మ మాయమ్మ ( త్యాగరాజ కీర్తన )

Get this widget Track details eSnips Social DNA


సీతమ్మ మాయమ్మ! శ్రీ రాముడు మా తండ్రి!


వాతాత్మజ, సౌమిత్రి, వైనతేయ, రిపు మర్దన, ధాత, భరతాదులు సోదరులు మాకు! ఓ మనసా! (సీతమ్మ)

పరమేశ, వసిష్ఠ, పరాశర, నారద, శౌనక, శుక, సుర పతి, గౌతమ, లంబోదర, గుహ, సనకాదులుధర నిజ భాగవతాగ్రేసరులెవరో, వారెల్లను, వర త్యాగరాజునికి పరమ బంధవులు. మనసా!! (సీతమ్మ)

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు