తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Monday, December 31, 2007

క్రొత్త సంవత్సర శుభాకాంక్షలు

వచ్చింది మరో నూతన సంవత్సరము

మోసుకువస్తోంది కోటి ఆశలను

దృష్టిలో ఉంచుకో గతాన్ని

జీవించు వర్తమానము లోన

స్వప్నించు సుందర భవిష్యత్తును

వాతాపి గణపతింభజే

Get this widget Track details eSnips Social DNA

వాతాపి గణపతిం భజేహం

వారణాస్యం వరప్రదం శ్రీ

భూతాది సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం

వీతరాగిణం వినత యోగినం (శ్రీ) విశ్వ కారణం విఘ్న వారణం (వాతాపి)

చరణంపురా కుంభ సంభవ మునివర ప్రపూజితం త్రికోణ మధ్య గతం మురారి ప్రముఖాద్యుపాసితం మూలాధార క్షేత్ర స్థితం పరాది చత్వారి వాగాత్మకం ప్రణవ స్వరూప వక్రతుండం నిరంతరం నిటిల చంద్ర ఖండంనిజ వామకర విధ్రుతేక్షుతండం కరాంభుజ పాశ బీజాపూరం కలుష విధూరం భూతాధారం హరాది గురుగుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం (వాతాపి)

వైష్ణవ జనతో ( మహాత్మా గాంధీ గారికి ఇష్టమైన గీతము )

Get this widget Track details eSnips Social DNA

త్యాగరాజ

ఎంత నేర్చిన ఎంత జూచినఎంత వారలైన కాంత దాసులే

సంతతంబు శ్రీకాంత స్వాంతసిద్ధాంతమైన మార్గ చింత లేనివా(రెంత)
పర హింస పర భామాన్య ధనపర మానవాపవాద
పర జీవనాదులకనృతమేభాషించెదరయ్య త్యాగరాజ నుత (ఎంత)

Tuesday, October 30, 2007

తెలుగు భాషకు మన ప్రభుత్వము ఇస్తున్న ఆదరణ ఏమిటి?

ఈ మధ్య నేను గమనించిన విషయము ఒకటి చెపుతున్నాను. మన RTC బస్సుల పైన ముఖ్యము గా అంతర రాష్ట్ర బస్సు ల పైన తెలుగు పేరులు తీసివేసి అంతా ఆంగ్లము లోనికి మార్చివేసారు.ఇలాగైతే మన సంస్కృతి ఇతర రాష్ట్రాల వారికి ఎలా తెలుస్తంది. గరుడ బస్సుల పైన ఒక వైపు గరుడ అని తెలుగు లో రాయవచ్చు కదా? తెలుగు, ఆంగ్లము రెండూ రాయవచ్చు కదా?

మీకు గనుక రెండు gmail అకౌంట్స్ ఉండి ఒక మెయిల్ కు వచ్చిన మెయిల్లు మీ ఇంకో మెయిల్ అకౌంట్ కు కూడా రావాలంటే ఏమి చెయ్యాలి?

మీకు గనుక gmail అకౌంట్స్ ఉండి ఒక మెయిల్ కు వచ్చిన మెయిల్లు మీ ఇంకో మెయిల్ అకౌంట్ కు కూడా రావాలంటే లాగిన్ అయిన తర్వాత సెట్టంగ్స్ లోనికి వెళ్ళి అందులోని Forwarding and POP టాబ్ క్లిక్ చేయండి.అందులో Forwarding Forward a copy of incoming mail to ఆప్షన్ లో మీ రెండవ మెయిల్ అడ్డ్రస్ టైప్ చేయండి.తర్వాత రెండవ ఆప్షన్ ఐన POP Download లోనికి వచ్చి Enable POP only for mail that arrives from now on ఆప్షన్ క్లిక్ చేసి సేవ్ సెట్టింగ్స్ క్లిక్ చెయండి.

అభిప్రాయము తెల్పండి

నేటి ప్రపంచమునకు కావలసినది ఆధ్యాత్మికత తో జత కలసిన సాంకేతిక విజ్ఞానము.
దీని పై మీ అభిప్రాయాలు తెల్పండి.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు