తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Wednesday, August 21, 2013

సత్యాన్ని పైకి తీసుకురావడానికి అసత్య సహాయం అవసరమా - జగద్గురు ఆదిశంకర చిత్రం

నిన్న జగద్గురు ఆదిశంకర చిత్రం చూసాను. ఎక్కడా బోరు కొట్టలేదు. ఆదిశంకరుల గురించి తెలుసుకోవాలనుకొనేవారికి ఈ చిత్రం చూస్తే పైపూతగా కొద్దిగా తెలుసుకోవచ్చు. ఆయన ఎందుకై భూమిపైకొచ్చిందీ, ఏం సాధించిందీ తెలుసుకోవచ్చు.

కానీ ఆదిశంకరుల జీవితచరిత్ర తెలిసిఉన్నవారిని మాత్రం ఈ చిత్రం ఖచ్చితంగా బాధపెడుతుందన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు.

ఒక చారిత్రిక మహాత్ముని గురించి చెప్పాలనుకొన్నప్పుడు అసలు చరిత్ర కు భంగం వాటిల్లకుండా చూడాలి. అంతేకానీ నేనేదో మహత్కార్యం చేస్తున్నాననుకొని ఆ కార్యం నిమిత్తం మనకు ఇష్టమొచ్చింది, సత్యదూరమైనది చేయడం భావ్యం కాదు.

కాటికాపరితో సంభాషణ కానీ, మండనమిశ్రునితో వాదం కానీ ఇంకా అనేక విషయాలు సినిమా చూడడానికి వచ్చినవారికి బాగా అనిపిస్తాయేమో కానీ స్వామివారి చరిత్ర చదివున్నవారికి ఏమాత్రం మింగుడుపడవు.
ఇలా సత్యదూరమైన విషయాలతో సినిమా తీయడం వలన మొదటిసారి ఆదిశంకరుల గురించి తెలుసుకోవాలనుకున్న వారికి తెలిసేది ఏమిటి? వారికి తెలియకుండానే ఇదే ఆదిశంకరుల చరిత్ర అనుకుంటారు. తద్వారా అసలు చరిత్ర కాస్తా తెలుసుకోలేకపోతారు.

కానీ ఆదిశంకరుల గురించి నేటి తరానికి తెలియచెప్పాలన్న దర్శకుడి తాపత్రయం మెచ్చుకోవాలి.

సినిమా చూస్తున్నంతసేపూ మరియు సినిమా అయిపోయినతర్వాత నాకు ఒకటే అనిపిస్తూనే ఉంది " సత్యాన్ని తెలియజెప్పేందుకై అసత్య సహాయం అవసరమా?" అని.

6 comments:

 1. అసత్యానికి ఉన్న హంగూ ఆకర్షణా సత్యానికి ఉండవు కదా?

  అయినా ఆదిశంకరులు వచ్చి కేసు వేయరు కదా?
  లోగడ, అన్నమయ్యా, రామదాసూ వచ్చి కేసులు వేయలేదు కదా ఇలా తమని ఇష్టం వచ్చినట్లుగా ప్రజంట్ చేసారని?

  ఏం చేస్తారు మహా అయితే? ఎవరో కొందరు చాదస్తులు తిట్టుకుంటారు అంతే.

  నేను ఈ‌ శంకరాచార్య సినిమా చూడటం‌ జరగదు కాని, అందులో ఆయనకు ఫైట్లూ, ఒకళ్ళిద్దరు హీరోయిన్లూ, ఓ‌ ఐటం సాంగూ ఉన్నా ఆశ్చర్యపోను!


  ReplyDelete
 2. adi sankarulu gurinchi cheppalanukunnapudu... sankara vijayalu aadharam cheskoni film tesiuntay FOR YOUTH capusion ki sarrigga saripoeaydi

  ReplyDelete
 3. You are right Suresh,

  We have to oppose this ! JAGADGURU beongs to the rich culture and tradition of Bharat. We should aware this in the people. Moreover, Jagadguru Aadi Sankara Acharya is being treating more as symbol of religion than of spiritual. Sankara Vijayalu, Sankara Vaibhavam, Sankarula Jeevita Charitra one must know !!

  Regards,
  Subrahmanya Sarma

  ReplyDelete
 4. మేము కూడా చాల చాల కుతూహలం గా చూసాం. మా తల్లి తండ్రులు కూడా చుచారు. అయతే.. జగద్గురు అది శంకర చిన్మా తీయనలే సంకల్పం చలా బాగుంది. కాకా పొతే నాకు అంత సంతృప్తి కరం గా లేదు.. జగద్గురు చాల రచనలు చేసారు.సినిమాలో వెకిలి తనం కనబడుతోంది. మండల మిస్త్రుని తో సంభాశన దగ్గర అంత సుత్తి పెట్టక్కలలేదు. ఇంకా చిన్న చిన్న దోషాలు ఉన్నాయ్. ముక్యంగా బాష నాకు నచలేదు. మంచి పదాలు వాడాలి. సినిమాలో రోజని లక్ష్మి దేవి గా నాకు అస్సలు చూడబుద్ది కాలేదు.
  దీని వలన పిల్లలకి మంచి ఇంప్రెస్సిఒన్ పోయి ఎదో రామదాసు, అన్నమయ్య లా చూసారు . ఒక్కసారి మీరు మన చాగంటి కోటేశ్వర రావు గారు చెప్పిన శంకరాచార్యులు ప్రవచనం పూర్తికా వినండి. కళ్ళు మూసుకుంటే అది గురువు కనబడతారు.
  టైటిల్ కూడా అది శంకర అని పెట్టారు. పూర్తిగా పెడితే ఏమ్వతుంది.? జగద్గురు అది శంకరాచార్యులు .
  మీరు ఎవరైనా పాత జగద్గురు అది శంకరాచార్యులు చూసారా? Sanskrit version.
  జగద్గురు అది శంకరాచార్యులు సౌందర్య లహరి చెప్తారు. తల్లిని ఎలా చూడాలి అనేది లోకాని కి జగద్గురు చెప్పారు.

  ReplyDelete
 5. భారవి గారు శంకర విజయం చదివి సినిమా తీసి ఉంటే బాగుండేది

  శంకరులు పరమ కరుణా మూర్తులు , కాని ఆపాత్ర ఆసాంతం ఆవేశ పూరితంగా ఉంటుంది

  మండన మిశ్రుడు సాక్షాత్తు బ్రహ్మ గారి అంశ ఆయన్ను వెకిలిగా మరియు కర్మ వాదం గూర్చిన వివరణ బాగా అనిపించలేదు .

  తరువాత ఉభయభారతి దేవి శృంగేరి లో ప్రతిష్ట మవుతుంది . స్వామి ప్రధాన శిష్యులు ఎలా వచ్చారు అనేది చాలా ఆసక్తి గా ఉంటాయి అవి ఏమి లేవు

  ఇందులో గోవిందభగద్ పాదులుగా సుభాష్ ప్రత్రి గారు నటించి ఆయనకు ఇష్టం వచ్చిన రీతిలో తత్వాన్ని చెప్పడం బాధగా అనిపించింది .


  ఈ సినిమా కంటే 80ల్లో వచ్చిన G .V . అయ్యర్ గారు తీసిన సినిమా ప్రామాణికముగా కనబడుతుంది

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు