

దేశమంతా అవినీతినిర్మూలన కై ఉద్యమించిన అన్నాహజారే విజయం సాధించడంలో ఒక అడుగు ముందుకేయడంతో ఎంతో సంతోషపడుతోంది.
ఇటువంటి పట్టుదల, అనన్య ఆత్మవిశ్వాసం కల్గిన అన్నాహజారే నేడు మనకు లభించడం వెనుక ఉన్న అదృశ్యశక్తి స్వామి వివేకానంద అన్న విషయం కొంతమందికి తెలుసు. చాలామందికి తెలియదు. నిరాశానిస్పృహలతో ఆత్మహత్య చేసుకోవాలన్న మనస్తత్వం నుండి బయటకు లాగినవి వివేకానందుని బోధనలే అని అన్నాహజారే గారే చెప్పినారు.
"మోక్షం కోసం ప్రాకులాడను. వేల,లక్షల నరకాలకైనా పోతాను. నా శరీరం రాలిపోయేంత వరకు ఒక కుక్క ఆకలితో అలమటించినా దానికి ఆహారం ఇచ్చేందుకు ఎన్నిసార్లు నరకానికి పోవడానికైనా నేను సిద్దమే. జీవారాధనే అనగా జీవులనుసాటిమనుషులను సేవించడమే నిజమైన శివారాధన. నేను చనిపోయినా నా సందేశం 1500 సంవత్సరాలు జనం స్వీకరిస్తారు" అన్న వివేకానందుని వాక్యాలు ఎవరినైనా తట్టిలేపుతాయి.
ఇటువంటి వివేకానందుని కేవలం మతబోధకుడిగా చూస్తూ అతనిలోని మానవతావాదిని చూడలేని నేటి తరం ఎంత దురదృష్టవంతురాలో కదా!
జయహో స్వామి వివేకానంద, జయహో అన్నాహజారే.