తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Monday, July 19, 2010

జనానికి మంచి బదులు చెడు జరుగుతుందనే విమాన నిర్మాణం వ్రాయడం లేదు - భోజరాజు

భోజరాజు గురించి అతను ఒక గొప్ప మహారాజుగా మనందరికీ తెలుసు. ఇతని ఆస్థానంలోనే మహాకవి కాళిదాసు ఉండేవాడని చరిత్ర చెప్తోంది.


కానీ ఇతను "సమరాంగణసూత్రం" అనే గ్రంధం వ్రాశాడని చాలామందికి తెలీదు.


ఈ గ్రంధంలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వ్రాయబడ్డాయి. "యంత్రాలు ఎలా తయారు చేయాలి?","ఆకాశంలో ప్రయాణించడం ఎలా సాధ్యం?" అనే విషయాలు ప్రస్తావించబడ్డాయి.అమరకోశం లో 'వ్యోమయానం విమానోస్త్రీ' అని ఉంది. అంటే "ఆకాశంలో ప్రయాణించే వాహనానికి విమానమని పేరు" అని అర్థం.


భోజరాజు తన 'సమరాంగణసూత్రం'లో విమాన నిర్మాణవిధానం గూర్చి వ్రాస్తూ భోజరాజు "విమాన నిర్మాణం గురించి స్థూలంగా తత్త్వము(theory) మాత్రమే వ్రాస్తున్నాను. దానిని నిర్మించే విధానం తెలిసే వదిలేస్తున్నాను,వ్రాయడం లేదు.చేయడం ఎలాగో చెప్పడం వల్ల సామాన్య జనానికి సుఖం బదులు కష్టమే ఏర్పడుతుంది అని ఇది వ్రాయడంలేదు' అని వ్రాశారు.చిత్తశుద్ధి లేని వారి చేతిలో ఇలాంటివి పడితే పసిపిల్లల చేతిలో విషం ఉన్నట్లే కదా!


భోజరాజు గారు ఏమి ఆలోచించాడో ఏమో మనకైతే తెలియదు.


1980 లలో ఈ గ్రంధాన్ని చూసిన శాస్త్రవేత్తలు అందులో బెలూన్ల వంటి సాధనాల నిర్మాణం, అందులో ఎలా ప్రయాణించడం అనే విషయాలు వర్ణించారని అన్నారు.


ఇతర దేశాలలో నూతనశాస్త్రాలు అభివృద్ధి చెందుతూ ఉంటే మనదేశంలో ఉన్నశాస్త్రాలు కూడా నామరూపాలు లేకుండ నశిస్తున్నాయి. ఉన్న శాస్త్రాల ను ఉపయోగించుకొనే పద్దతి మనకు తెలియడంలేదు.


ప్రాచీన శాస్త్రాలను అర్థం చేసికొనడానికి పరిశోధనలు చెయ్యాలి. మనకు అర్థము కాకపోయినా మన తర్వాతి తరం కొరకైనా వానిని రక్షించాలి. ఇప్పుడు అర్థము కాకపోయినా మరియొక కాలంలోనైనా అవి ఉపయోగపడతాయి.


మిగిలిన దేశాలు మొదట అజ్ఞానదశలో ఉండి క్రమేణ జ్ఞానదశకు వచ్చాయి. మన దేశము ఆరంభ కాలములో ఉచ్చస్థితిలోఉండి క్రమేణ క్షీణస్థితికి వచ్చి మళ్లీ ఇప్పుడు ఉన్నత స్థితికి వెళ్తోంది.ఇప్పటికే ఎన్నో శాస్త్రాలు మనకు దొరకడం లేదు. ఉన్న శాస్త్రములను మూర్ఖంగా పనికిమాలినవని పారవేస్తే మనకే నష్టం. వానిని అర్థం చేసికొనడానికి ప్రయత్నించాలి. నిరూపణ కానిదే దేనినీ ఖండించుటకు మనకు అధికారంలేదు. అర్థము చేసికొనుటకే మనకు అధికారం ఉంది.


35 comments:

 1. మీరు చివరి మూడు ముక్కలు సూటిగా సుట్టిలేకుండా చెప్పారు... అభినందనలు

  ReplyDelete
 2. //ఉన్న శాస్త్రములను మూర్ఖంగా పనికిమాలినవని పారవేస్తే మనకే నష్టం. వానిని అర్థం చేసికొనడానికి ప్రయత్నించాలి.//

  అర్థం లేకున్నా కాకున్నా ఏదో వుంది, వుంది అంటూ యుగాలతరబడి గడిపేయడమూ మూర్ఖత్వమే.


  //నిరూపణ కానిదే దేనినీ ఖండించుటకు మనకు అధికారంలేదు. అర్థము చేసికొనుటకే మనకు అధికారం ఉంది//
  నిరూపించ బడకముందే ప్రచారం చేసికొవడం, మంచిదంటారా? :))

  అనవసరంగా అందరి టైమూ వేస్ట్ చేయకుండా ఏదైనా అందులోని ఒక్క విషయం ఆచరణ సాధ్యము అని సహేతుకంగా నిరూపించండి.

  ReplyDelete
 3. @snkr
  యోగా,మేడి టేషన్, ఆయుర్వేద లాంటివి మీకు ఉదాహరణల క్రింద సరిపోవచ్చు అనుకుంటాను.

  ReplyDelete
 4. @snkr గారు
  ##అర్థం లేకున్నా కాకున్నా ఏదో వుంది, వుంది అంటూ యుగాలతరబడి గడిపేయడమూ మూర్ఖత్వమే. ##
  "అర్థం కాకున్నా" అనవచ్చు. కాని "లేకున్నా" అని ఎలా అనగలరు? ప్రాచిన భారతీయులు వ్రాసినవి అనగానే మూడనమ్మకాలని,చాందసం అని పక్కనపెట్టేవారే కాని ఎంతమంది చదివారు?చదువుతున్నారు? చెప్పండి. సరే మీరన్నట్లు యుగాలతరబడి గడపడం మూర్ఖత్వమే కాని ఆ మూర్ఖత్వం వాటిని అర్థం చేసుకోకపోవడం వలెనే,వాటి పై పరిశోధనలు చేయకపోవడం వలెనే వచ్చింది. ఉదాహరణకు భోజరాజు గారి "సమరాంగణసూత్రం" తీసుకొంటే అందులో ఆకాసంలో ఎగరగల్గే బెలూన్ల వంటి నిర్మాణాలు వ్రాసారని నేటి శాస్త్రవేత్తలే చెప్తున్నారు. ఇలా మిగతా గ్రంధాలకు ఎందుకు చేయకూడదు?

  ReplyDelete
 5. @snkr గారు
  ##నిరూపించ బడకముందే ప్రచారం చేసికొవడం, మంచిదంటారా?##

  స్విట్జర్లాండ్ లో "బిగ్ బాంగ్" ప్రయోగం జరగక ముందే వారెందుకు మేం చేస్తున్నాం అని ప్రచారం చేశారు? చేసిన తర్వాత నిరూపణ అయిన తర్వాత ప్రచారం చేయవచ్చు కదా. ప్రచారం చేయడం వలన మనం ఫలానా పని చేస్తున్నాం అని జనాలకు తెలుస్తుంది కనుక.

  అసలు ఇతర దేశాలకు, మనకు ఉన్న తేడానే ప్రచారం చేసుకోకపోవడం. అసలు ఇలాంటి గ్రంధాలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు చెప్పండి. ఇక్కడ అందులో ఇలా ఉంది కాబట్టి నమ్మండి అని అనడం లేదు. అలా ఉన్నది పనికొచ్చేది అనిపిస్తే పరిశోధన చేయాలి, అర్థం చేసుకోవాలి అంటున్నాను. ఏమి లేకుంటే అప్పుడు పక్కన పెట్టేయవచ్చు. అసలు ఇలాంటి పుస్తకాలు ఉన్నాయని చెప్పడమే, అందులో ఇలా వ్రాయబడి ఉన్నాడని చెప్పడమే ప్రచారం చేయడం అని మీరనుకొంటే చేయగలిగినది ఏం లేదు.

  ##అనవసరంగా అందరి టైమూ వేస్ట్ చేయకుండా##

  ప్రశ్నించండి తప్పు లేదు. టైం వేస్ట్ అని మీరనుకొంటే నేను చేయగలిగినది ఏం లేదు.

  ReplyDelete
 6. @ సురేష్ గారు,

  >> 1980 లలో ఈ గ్రంధాన్ని చూసిన శాస్త్రవేత్తలు అందులో బెలూన్ల వంటి సాధనాల నిర్మాణం, అందులో ఎలా ప్రయాణించడం అనే విషయాలు వర్ణించారని అన్నారు.>>


  దీనికి ఆధారాలు ఏమన్నా వుంటే ఇవ్వగలరా దయ చేసి !

  ReplyDelete
 7. సురేష్ గారు! ప్రచారం విషయం లో మీతో ఏకీభవిస్తున్నానండి.

  ReplyDelete
 8. @ సురేష్ గారు,
  ఇంకొక అనుమానం,
  మన పూర్వజులలో ఒక ఆర్యభట్టు, ఒక ధన్వంతరి, ఒక చార్వాణకుడు, ఒక భరద్వాజ మహర్షి.. వివిధ రంగాలలో నిష్ణాతులు కదా!
  మరి వారి తరువాత ఆ స్థాయిలో కాకపోయినా వారి ఆలోచనలు ముందు తరాలకు అందించే వారు గాని, అందించి వుంటే ఆ స్థాయిలో విజ్ఞులు గాని మరెవరు లేకపోవడానికి కారణం ఏమిటి అంటారు ?
  ఇందులో విదేశీ కుట్ర ఏమన్నా వుందా? లేక మన భారతీయ మనస్తత్వ కోణం లో ఏమన్నా వివరణ వుందా?
  మన విధ్యా వ్యవస్థ ఒక కారణం కావచ్చా? కొంత మందికి మాత్రమే విధ్య అన్న నిబంధనలు ఒక కారణం కావచ్చా ?
  ఇప్పటికే విమానయానం పై మనకంటూ ఒక స్థాయి వచ్చింది. ఇంకా వాటిని మించిన టెక్నాలజీ భొజరాజు రచనలలో దొరకొచ్చు అంటారా?
  >> చిత్తశుద్ధి లేని వారి చేతిలో ఇలాంటివి పడితే పసిపిల్లల చేతిలో విషం ఉన్నట్లే కదా! >>
  ప్రయత్న లోపం అనిపిస్తుంది.. కొంత మంది గొప్ప తనం రాబోయే తరాలకి కనీస జ్ఞానం అవ్వాలి, కానీ అలా కాలేదు. ఇది ఖచ్చితంగా మన పూర్వజుల తప్పు....

  ReplyDelete
 9. బాబు సురేష్! నువ్వు engineering చదివినట్ళు నీ profile లో ఉంది. కానీ నీ చదువుకు నువు రాసే పోస్టులకు సంబంధమే లెదు. నా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అన్నట్లుంది నీ వ్యవహారం. వాల్లు నేతులే తాగారో లేక ఫినాయిలే తాగారో ఎవరికి తెలుసు. అధారాలు లేని సొంతడబ్బా కొట్టుకొనే ఇలాంటి సాహిత్యాన్ని నువు ఎలా నమ్ముతున్నావో.

  ReplyDelete
 10. మీ దగ్గర చాలా ఆశ్చర్యాన్ని గొలిపే సమాచారం ఇంది సుమా! ఇంత విజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు గుర్తించకుండా మూర్ఖంగా ల్యాబుల్లో పడి ఏడుస్తున్నారెందుకబ్బా? వీటిని కలెక్ట్ చేసి పరిశోధనలు చెయ్యకుండా ప్రభుత్వం IITలు IIS లు పెట్టాలనుకోవడమేమిటి వారి పైత్యం కాకపోతే.

  మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ దగ్గర ఇంత విజ్ఞానం ఉందని తెలిస్తే ఏ ఆమెరికావోడో, అల్ ఖైదా వాడో ఎత్తుకెళ్ళిపోగలడు.

  ReplyDelete
 11. krishna గారు! ఈ భోజరాజు గారి "సమరాంగణసూత్రం" పుస్తకం కంచి కామకోటి పీఠం వారి వద్ద ఉన్నట్లు సమాచారం. 1980 లలో పరిశోధన విషయాలకు కూడా చంద్రశేఖర సరస్వతుల కాలం లో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు కూడా వాళ్ళ వద్దే ఉన్నట్లుంది.

  ReplyDelete
 12. @ సురేష్ గారు,
  మీరు ఇలా ఆధారాలు (ఇవ్వ)లేని ' నిజాలు ' రాయడం ఏమి బాగా లేదు. కనీసం టపాలో అన్నా ఇది ఒక అభిప్రాయం అని మాత్రమే అన్నా చెప్పుండాల్సింది.
  అసలే మన సోదరులు మూఢంగా సంగతులు నమ్మెయ్యడం లో అందరి కన్నా ముందు వుంటారు,
  దయ చేసి మీరు అటువంటి వారికి మేత కల్పించవద్దు..

  ReplyDelete
 13. >>>ఈ భోజరాజు గారి "సమరాంగణసూత్రం" పుస్తకం కంచి కామకోటి పీఠం వారి వద్ద ఉన్నట్లు సమాచారం

  ఉంటే లాభం ఏముంది? దాన్నేలాగూ బయటికి తీయరు. ఈలోగా పుకార్లు విమానం నుండి వ్యోమనౌక దాకా వెళ్తాయి.

  ReplyDelete
 14. శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరసరస్వతులవారు వారు పీఠాధిపతులుగా ఉన్నప్పుడు ఈ సాహితీసమరాంగణసూత్రం పుస్తకం గురించి, శాస్త్రవేత్తల పరిశోధన గురించి ఒక పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు. అప్పటి నుండే ఇటువంటి పుస్తకాల లోని విషయాలపై మన శాస్త్రజ్ఞులు కొందరు పరిశోధనలు చేస్తున్నారు.ఈ పుస్తకాన్ని శాస్త్రజ్ఞులకు ఇచ్చినట్లు చంద్రశేఖరులే చెప్పారు.

  ReplyDelete
 15. //తర్వాత నిరూపణ అయిన తర్వాత ప్రచారం చేయవచ్చు కదా. ప్రచారం చేయడం వలన మనం ఫలానా పని చేస్తున్నాం అని జనాలకు తెలుస్తుంది కనుక.//
  అంటే మీరు ఇక నిరూపించబోతున్నారా? ఒట్టి వూకదంపుడేమో అనుకున్నా. మీరు ఒక్కటి -విమానం ఒద్దులే , అదే రాగిని బంగారం చేసేది చాలు, ఇంకేమీ వద్దు :) నిరూపించండి, మీకు పెట్టుబడి లేకుండా 80% ఇచ్చుకుంటా, పెట్టుబడి నాది 20% నాకు.
  ఏదో కలలు కని వుంటారు, కాని మీలాంటి యువకులు ఆ కలలను సాకారం చేయాలి, వుపన్యాసాలతో కాదు. న్యూటన్ కూడా రసవాదాన్ని నమ్మి ఫెయిల్ అయ్యాడు. 50% నిజమైతే ఇంకో 50% బాకా వూదుకోవచ్చు, ఏమీ లేకుండా 100% బాకా ఏళ్ళ కొద్దీ వూదుతామంటే బాగోదేమో .. ఒకసారి దయచేసి ఆలోచించండి.

  ప్రవరుడు హిమాలయలకు వెళ్ళాడు గదా అదే ఇమానం అనుకో అంటే ఆహా అంటాను కాని ఆ ఇమానం టికట్టు కొనను. :P

  ReplyDelete
 16. సురేష్ గారు,
  ఈ పుస్తకం కోసం గూగ్లింగ్ చేశాను .. మీకు తెలుసా ఇది గూగుల్ autosuggession lo ఉంది... అంటే చాలా మంది దీని కోసం గాలించారు అన్నమాట ..
  అందులో మొట్ట మొదటి లింక్ http://www.new.dli.ernet.in/rawdataupload/upload/insa/INSA_1/20005abd_118.pdf
  ఈ PDF ఉన్న ఏడు పేజిలు ఇండియన్ జర్నల్ అఫ్ హిస్టరీ అఫ్ సైన్స్ నుంచి తీసుకోబద్దవి.. ఇంకా hardward university references కూడా ఉన్నాయి..

  స్తూలంగా పంచభూతాలని బీజాలుగా ఉపయోగించి ఎలా యంత్ర౦ని తయారు చేయవచో ఉంది...

  మరి వీటిని ఉపయోగించడం ఎలానో ట్రై చేసారా?? లేదు.. మరి అలాంటప్పుడు ఇది తప్పు అనే వాళ్ళకి అధరాలు ఏవి?

  గుడ్డివాడికి చీకట్లో దీపం చూపించాలని అనుకోవడం వేస్ట్.. అసలే గుడ్డివాడు... ఇంకా వాల్లు తమ గుడ్డితనాన్ని స్వార్ధానికి వాడుకొని మన టైం వేస్ట్ చేస్తారు...

  మీరు ఈ గుడ్డివల్లని వదిలేసి మరుగునపడిన విషయాలని చెప్తూ వెళ్ళండి..

  ReplyDelete
 17. @Rajesh garu
  Alochinpachesettu chepparu.. thanks

  ReplyDelete
 18. @Rajesh,
  Ippdu inka mimmalani vaallu guddivadivi antarandi :) endukante guddiki lomantha gudd kadaa :))
  @Suresh,
  Welldone suresh gaaru... ika nunchi alanti guddi vallakosamu.. alage maakosam.. naalugu google links rujuvuga padeyyandi..

  ReplyDelete
 19. అయ్యా ఇది pseudoscience and ufology అని వినికిడి. అదే మనకున్న గొప్ప లెగసీ...ఎంజాయ్!

  ReplyDelete
 20. @మల్లీ గారు,
  కృతజ్ఞతలు..ఏదో చిన్నవాడిని ..మన జ్ఞానాన్ని అందరికి షేర్ చేయాలి కదండీ .. లేక పోతే అజ్ఞాన౦ అనే గుడ్డి కత్తి కి వాచాలత ఎక్కువ అవుద్ది :)..
  అదే సదుద్దేశంతో సురేష్ గారు మంచి విషయాలు వ్రాసున్నారు.... వాటిని గుడ్డిగా నమ్మమని ఎవేరు చెప్పడంలేదు .. అల్లాగే గుడ్డిగా విమర్శించమని కూడా..
  కాని ధృతరాష్ట్ర పుత్రుల సంతతి ఎక్కువ మరి...

  ReplyDelete
 21. @రాజేష్ గారు!
  ##ఈ PDF ఉన్న ఏడు పేజిలు ఇండియన్ జర్నల్ అఫ్ హిస్టరీ అఫ్ సైన్స్ నుంచి తీసుకోబడ్డవి.. ఇంకా hardward university references కూడా ఉన్నాయి..##
  అన్నారు. మీకు నా కృతజ్ఞతలు. అనుమానాలు ఉన్నవారు ఇవి రెఫెర్ చేసుకోవచ్చు.
  గూగుల్ రుజువులు చూపించినా fake అనే అంటారు.అయినా ఫర్లేదు. నేను చేయాలనుకొన్న పని (అంటే మన పూర్వికులుచే చేయబడ్డపనిని అందరికి తెలపడం, వేదాలలో ఉన్న విజ్ఞానం) ఎన్ని అవాంతరాలు వచ్చినా జరుగుతుంది. అందరికి ధన్యవాదాలండి.

  ReplyDelete
 22. ఈ సూడో సైన్సు అనే మాట వినగానే వూడూ సైన్సనే మాటొకటి గుర్తొచ్చింది.. హిమానీ నదాలు కరిగిపోతున్నై, కారిపోతున్నై, ఆరిపోతున్నై, ఆవిరైపోతున్నై అనీ ఒక అంతర్జాతీయ సంస్థ ఓ.. ఘోల ఘోల చేస్తే మన శాస్త్రవేత్తలు ’అబ్బే అంత కంగారడాల్సిందేమీ లేదు మీరు చెప్పినంత తొందరగా పోవు’ అని చెప్పారు. అప్పుడా ఘనత వహించిన అంతర్జాతీయ సంస్థ మనవాళ్ళను మీది ’వూడూ సైన్సు’ అని అన్నారు. కొన్నాళ్ళకి, ఆ అంతర్జాతీయ సంస్థవాళ్ళు చెప్పింది తప్పని తేలింది. ఎక్కడో గాలికబుర్లు పోగేసుకొచ్చి నివేదికలు తయారు చేసారని తేలింది. పైగా అవతలోణ్ణి వూడూ సైన్సని ఎగతాళి చేసారు. వాళ్ళ బండారాలు బైటపడ్డాక, తమ మొండిమొలల్ని దాచుకోడానికి గుడ్డపేలిక కూడా దొరక్క నానా తంటాలు పడ్డారు. ఎలా క్షమాపణలు చెప్పుకోవాలో కూడా తెలీలా వాళ్ళకి.

  ఇంతకీ నేను చెప్పొచ్చేదేంమంటే, పచౌరీ తక్కువోడేం కాదు, తెలివైనోడే. (తెలివైనోడైనా తప్పులు చేస్తాడు. ఈ సందర్భంలో అతగాడు చేసినది ఉత్త తప్పు కాదు, ఘోరమైన తప్పనుకోండి.) కానీ ఒళ్ళు పొగరు, తగని బలుపూ అతగాడి చేత అలా మాట్టాడించాయి. నాకే అంతా తెలుసు ఈడికేం తెలుసు అనే తల బరువు అలా మాట్టాడించింది. అది అంత మంచిది కాదు.

  ReplyDelete
 23. బాగున్నది, ఇది తప్పో ఒప్పో అప్రస్తుతం, ఒకటి మాత్రం నిజం, మనం మతం మత్తులో సైన్సుని పక్కన పడేశాం,
  కత్తి గారు, సురేష్ గారు ఎదో చెప్పారు; బాగున్నది, మీకు నచ్చితే చెప్పండి, లేదంటే లేదు, అలాని అవతలి వారిని అవహేళన చేయటమో, అసలు ఆ గ్రంధం చదవకుండా అది అంతా తప్పు అని అలా గుడ్డిగా ఎలా చెప్పేస్తారు? తను ఏమీ భోజుడు విమానంలో తిరిగాడు అని అనటం లెదే..
  ఇదే విషయాన్ని డెవెన్సి చెప్టే ఆహా ఒహో కేక అంటారు, మనల్ని మనం చులకనగా చూసుకోవటం వలనే మన శాస్త్రవేత్తలు ఎవరో మనకి తెలియటం లేదు. వరాహా మిహిరుడు అని ఒకాయన ఉన్నాడు , 43 బి.సి లోనే ఏటువంటి పరికరాలు లేకుండా భూమి పోల్స్ వంగి ఉన్నాయి అని చెప్పాడు, కానీ ఫలాన జ్ఞాన అజ్ఞాన వేదిక అతన్ని ఒక విలన్ని చెసేసింది.
  ఎప్పుడో సెర్జి లాంగ్ పుస్తకం చదువుటుంటే అతను రాసారు ఇతని గొప్పదనం, తరువాత ఆర్య భట్టుని గొప్పతనం, కానీ మనం వరాహ మిహిరుడు అంటే చాలు విష వృక్షం అని మొదలెడతారు.
  అవతలి వారు చెప్పినది, నిజమో కాదో తెలుసుకొని విమర్శ చెస్తే తప్పొప్పులు తెలుస్తాయి, అల కాకుండా మతాన్ని నమ్మేవారు ఏది చెప్పినా తప్పు అని గిరి గీసుకు కుర్చోవాలి అనుకుంటే, అలాంటి వాటికి దురంగా ఉండటమే చాలా మంచిదని నా భావన.

  ReplyDelete
 24. @తార గారు
  బాగా చెప్పారు... గుడ్డిగా కాదు లేదు అనడ౦ కొందరి లెగసీ ...
  @చదువరి ,
  చక్కగా చెప్పారు.. కానీ ఈ పచౌరీ ఎవరండీ???

  ReplyDelete
 25. కృష్ణ గారి వ్యాఖ్య:

  @ suresh ji, i hope this comment may need to be posted. i think if you/ or some other gentlemen would like to answer this. thanks for deleting some comments. if you dont want to post this comment please let me know! think about comment moderation.
  అసలు నా ప్రశ్న ఏమిటి ?
  >> 1980 లలో ఈ గ్రంధాన్ని చూసిన శాస్త్రవేత్తలు అందులో బెలూన్ల వంటి సాధనాల నిర్మాణం, అందులో ఎలా ప్రయాణించడం అనే విషయాలు వర్ణించారని అన్నారు.>>
  దీనికి ఆధారాలు ఏమన్నా వుంటే ఇవ్వగలరా దయ చేసి !
  నేను సమరాంగణ సూత్రధార అన్న రచన వుందో లేదొ అడగలేదు. విమాన యానం గురించి అందులో ఏముంది అసలు ?
  మీరు ఇచ్చిన లింక్ లో పంచభూతాలు-యంత్ర నిర్మాణం వుంది తప్ప నా ప్రశ్న కి సమాధానం లేదు.
  >> అమరకోశం లో 'వ్యోమయానం విమానోస్త్రీ' అని ఉంది. అంటే "ఆకాశంలో ప్రయాణించే వాహనానికి విమానమని పేరు" అని అర్థం.>>
  ఇలా పదాలు వున్నాయి కనుక ఆయా విషయాలు కూడా వున్నాయని నమ్మేస్తారా ? స్వర్గం నరకం.. మోక్షం అన్న పదాలు వున్నాయి కానీ వాటికి ఆధారాలు వున్నాయా ?
  >> ఈ పుస్తకం కోసం గూగ్లింగ్ చేశాను .. మీకు తెలుసా ఇది గూగుల్ autosuggession లొ ఉంది... అంటే చాలా మంది దీని కోసం గాలించారు అన్నమాట ..>>
  ఇలా జనాలు గాలించిననత మాత్రాన ఆ పుస్తకం.. అందులో విమాన యానం నిజమయిపోతాయని నమ్మెయ్యమంటారా? అలా అంటే రసవిద్య గురించి వెతికే వారు ఎంత మంది లేరు.. అది వుంది అని , ప్రతి లోహాన్ని బంగారంగా మార్చెయ్యొచ్చని కూడా మీరు రూడిగా చెబుతారు కామోలు..
  >>మరి వీటిని ఉపయోగించడం ఎలానో ట్రై చేసారా?? లేదు.. మరి అలాంటప్పుడు ఇది తప్పు అనే వాళ్ళకి అధరాలు ఏవి? >>
  అసలు ఆ పేపర్ లో యంత్ర నిర్మాణం లో చతుర్ భూతాలు వుంటాయని ప్రతిపాదించారు. అది నిజమే కదా ఆ విషయంలో ఎవరు విభేదించారు ?
  >>గుడ్డివాడికి చీకట్లో దీపం చూపించాలని అనుకోవడం వేస్ట్.. అసలే గుడ్డివాడు... ఇంకా వాల్లు తమ గుడ్డితనాన్ని స్వార్ధానికి వాడుకొని మన టైం వేస్ట్ చేస్తారు...>>
  గుడ్డివాడికి దారి చూపడం ఇలా కాదండి. చేయి పట్టుకుని నడిపియ్యాలి. పురాతన జ్ఞాన సంపద తెలియని ప్రతి భారతీయుడు గుడ్డివాడే ఈ విషయం లో ! చర్చిస్తేనె విషయంలో నిజానిజాలు తెలిసేవి.. గుడ్డిగా నమ్మితే కాదు!

  ReplyDelete
 26. ఇక్కడే పొరబడుతున్నారు . నువ్వు వందచెప్పు . మెకాలే మానసికపుతృలకు సత్యమైనా నమ్మతం వీలుకాదు . అవి పరాధీన బానిసభావజాలాలతో నిండిన మెదళ్ళు. నువ్విప్పుడు ఇలాంటివిషయాలు చర్చకుపెట్టకుండా ఉండటమే వాళ్లకు కావలసింది . నీలక్ష్యానికి అడ్డూగాఉండే చెత్తవాగుడు తీసిపారవేసి ముండుకు సాగు అంతేగాని చర్చలను ఆపుతామనటం కరెక్ట్ కాదని నా ఉద్దేశ్యం .

  ReplyDelete
 27. @Krishna

  Oka vishayam tappo oppo teliyalante kaneesam daani gurinchina avagahana undaali.

  nuvvedo pedda chadivi, vimanam nuvve kanipettinattu matladutunnv gaa.

  right sodarulakante munde endaro bharateeya satravethalu kanipttaranataniki sakshyalu unnay.

  oka roju andhrajyothi paper lo vesadu...chadivithe manchidi.

  neeku nammakam lekapothe...nenu nammanu ani anu anthe tappithe....adi guddi vadana...adi tappu ani egataali cheyyaku.....neeku satha unte atuvanti daanimeeda prayogam or research chesi tappu ani cheppu............

  ReplyDelete
 28. మన తల్లిదండ్రులు డిఎన్ఏ రిపోర్ట్ ఇస్తేనే నమ్మాలి .
  లేకపోతే గుడ్డిగా నమ్మేస్తే ఎలా ??
  కొందరి రాతలని చూసాక తెలిసింది ఆధారాలు లేకుండా నమ్మకండి .
  మనకి వివేకం పనిచేయక్కర లేదు ...

  ReplyDelete
 29. @ Suresh garu, Plz share knowledge like this. !!

  @KRishna : I want to tell you one thing regarding the knowledge transfer. Veda Bhoomi (bharat) nune mottam gnanam ee prapanchaniki cherindi. Idi nenu kadu enno english articles/novels lo after research in somany universities chepparu. Modata turkey ki cheri , akkadi nundi europe ki (greek) cheri, akkadi nundi vistarinchabadindi !!

  Regards,
  Subbu

  ReplyDelete
 30. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
  పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే
  ఓం శాంతిః శాంతిః శాంతిఃదేవుడు పరిపూర్ణుడు.
  ఇది(ఈ ప్రపంచం) పరిపూర్ణమైనది. పరిపూర్ణమైన భగవంతుడి నుండే పరిపూర్ణమైన ప్రపంచం పుట్టింది. పరిపూర్ణం నుండి పరిపూర్ణాన్ని తీసివేసిన తర్వాత కూడా పరిపూర్ణతే మిగిలి ఉంది.
  ఈశావాశ్య ఉపనిషత్తు లోని మొదటి మంత్రం. ఇది "0" (పూర్ణం) అనే భావనని ప్రపంచానికి తెలెయజెప్పిన మొట్టమొదటి ప్రయత్నం. సనాతన భారతీయత విజ్ఞానాన్ని సమగ్రమైనది నేటి చదువుల్లా గణితం, చరిత్ర, విజ్ణానశాస్త్రం, వైద్యం అలా విడివిడిగా బొధించదు. ప్రాచీన భారతీయ విజ్ణానం గణితం, ఖగోళ శాస్త్రం, జ్యొతిషం, వైద్యం మరియు ఆధ్యత్మికం పెనవేసుకుపోయిన ఒక విశిష్ఠమైన విజ్ణాన సంపద. పాస్చ్యాత్యులు బట్టలు కట్టుకొవటం చేతకాని రోజుల్లోనే మన విజ్ణానం ఉత్క్రుష్ట స్తాయికి చేరుకొందనడానికి ఉదాహరణ గత 5000 సంవత్సరాలనుండి ప్రాచీన గ్రహగణితం ఆధారంగా లెక్ఖించబడుతున్న గంటల పంచాగంలోని గ్రహణ సమయాలు, గ్రహ గతుల లెక్కలే సాక్ష్యం. ఆంగ్లేయులు మనదేశాన్ని ఆక్రమించుకొని మన సంపదని మాత్రమే దోచుకోలెదు అంగ్ల విద్య ప్రవేశపెట్టడం ద్వారా మన సంస్క్రుతిని నాశనం చేయటమే కాక మనమే మన సంస్క్రుతిని దూషించే స్తితికి తేసుకువచ్చారు. జై భారత్. సురెష్ గారు మీ ప్రయత్నం బాగుంది కొనసాగించండి. సంస్క్రుత భాష రానివారు ప్రాచీన గ్రంధాలను విమర్శించటం గ్రుడ్డివాడు సోర్యోదయాన్ని వర్ణించినట్టు వుంటుంది. ప్రాచీన భారతీయుల గొప్పదనాన్ని చాటే క్రింది బి.బి.సి విడియో చూడండిhttp://www.youtube.com/watch?v=L-sBNzuVBgs

  ReplyDelete
 31. Kattu lu , reger lu vaatekea panekostae . Vastavalu telusukune stae vaateki undadu . Dayachesi Marenni veluvyna post lu present cheyya galru .

  ReplyDelete
 32. 1) https://www.facebook.com/photo.php?fbid=2208187597523&set=a.2160209478100.121471.1032423490&type=3&theater

  2) https://www.facebook.com/photo.php?fbid=2208190477595&set=a.2160209478100.121471.1032423490&type=3&theater

  3) https://www.facebook.com/photo.php?fbid=2582475754493&set=a.2160209478100.121471.1032423490&type=3&theater

  4) https://www.facebook.com/photo.php?fbid=2588315300478&set=a.2160209478100.121471.1032423490&type=3&theater

  5) https://www.facebook.com/photo.php?fbid=10200170730364293&set=a.2160209478100.121471.1032423490&type=3&theater

  6) https://www.facebook.com/photo.php?fbid=2605965821730&set=a.2160209478100.121471.1032423490&type=3&theater

  7) https://www.facebook.com/photo.php?fbid=2605965821730&set=a.2160209478100.121471.1032423490&type=3&theater

  8) https://www.facebook.com/photo.php?fbid=2974662798924&set=a.2160209478100.121471.1032423490&type=3&theater

  10) https://www.facebook.com/photo.php?fbid=3172682229286&set=a.2160209478100.121471.1032423490&type=3&theater

  11) https://www.facebook.com/photo.php?fbid=3390479354078&set=a.2160209478100.121471.1032423490&type=3&theater

  12) https://www.facebook.com/photo.php?fbid=3396285419226&set=a.2160209478100.121471.1032423490&type=3&theater

  13) https://www.facebook.com/photo.php?fbid=3482764021137&set=a.2160209478100.121471.1032423490&type=3&theater

  14) https://www.facebook.com/photo.php?fbid=3718665158518&set=a.2160209478100.121471.1032423490&type=3&theater

  15) https://www.facebook.com/photo.php?fbid=3901017197205&set=a.2160209478100.121471.1032423490&type=3&theater

  16) https://www.facebook.com/photo.php?fbid=3895810467040&set=a.2160209478100.121471.1032423490&type=3&theater

  17) https://www.facebook.com/photo.php?fbid=4034965545830&set=a.2160209478100.121471.1032423490&type=3&theater

  18) https://www.facebook.com/photo.php?fbid=4092349220386&set=a.2160209478100.121471.1032423490&type=3&theater

  19) https://www.facebook.com/photo.php?fbid=4276665068167&set=a.2160209478100.121471.1032423490&type=3&theater

  20) https://www.facebook.com/photo.php?fbid=4276666428201&set=a.2160209478100.121471.1032423490&type=3&theater

  21) https://www.facebook.com/photo.php?fbid=4552856292775&set=a.2160209478100.121471.1032423490&type=3&theater

  22) https://www.facebook.com/photo.php?fbid=4552867933066&set=a.2160209478100.121471.1032423490&type=3&theater

  ఇలా ఈ దేశంలో .ఏంతో విజ్ఞానం ఉండేది. విదేశీ దురాక్రమణలకి చాలా నాశనమైపోయింది.
  https://www.facebook.com/photo.php?fbid=3817396586742&set=a.3749135760264.156376.1032423490&type=3&theater

  ఉన్న కొద్ది పాటి విజ్ఞానంలో పిసరంత విజ్ఞానాన్నైనా సరిగా వాడుకుందామనే సద్భుద్ధి ఉంటే, ఆయా శాస్త్రాలను పరీక్షించి, ఆ భాషని ఆకాలంలోని వివరాలను అర్ధం చేసుకో గలిగితే ఆధునిక అవసరాలకు అనుగుణంగా నూతన హంగులను జతపరిచి మరిన్ని కొత్త పరికరాలను తయారు చేయడం కష్టమేమీ కాదు.... .ఇప్పటికే ఈ పనిలో ఎన్నో సాధించాము కూడా....

  ReplyDelete
 33. Hi After reading the article & comments I googled for that book. Please check the below link. you can find Bhoja Maharaja's Book "Samarangana Sutradhara". Most of the books are in Sanskrit. One book in Hindi. Its a free site. You can download tons of books in PDF format.
  Maharshi Dayananda also mentioned Bhoja Maharaja's Vimanika sasthra Book

  https://archive.org/search.php?query=Samarangana%20Sutradhara

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు