తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Saturday, October 18, 2008

ద్వాదశ జ్యోతిర్లింగాలు,అష్టాదశ శక్తిపీఠాలు

ద్వాదశ జ్యోతిర్లింగాలు:

1.శ్రీ భీమశంకరేశ్వరుడు : భీమశంకర్

2.శ్రీ త్రయంబకేశ్వరుడు : త్రయంబకేశ్వరం,మహారాష్ట్ర

3.శ్రీ కేదారేశ్వరుడు : కేదార్‌నాథ్,హిమాలయాలు

4.శ్రీ విశ్వేశ్వరుడు : వారణాశి,ఉత్తరప్రదేశ్

5.శ్రీ రామలింగేశ్వరుడు : రామేశ్వరం,తమిళనాడు

6.శ్రీ మల్లిఖార్జునుడు : శ్రీశైలం,ఆంధ్రప్రదేశ్

7.శ్రీ మహాకాళేశ్వరుడు : ఉజ్జయిని,మధ్యప్రదేశ్

8.శ్రీ ఓంకారేశ్వరుడు : ఓంకారేశ్వర్,మధ్యప్రదేశ్

9.శ్రీ సోమనాధేశ్వరుడు : సోమనాథ్,గుజరాత్

10.శ్రీ నాగేశ్వరుడు : దారుకావనం,గుజరాత్

11.శ్రీ వైద్యనాథేశ్వరుడు : వైద్యనాథ్,బీహార్

12.శ్రీ ఘశ్మేశ్వరుడు :ఎల్లోరాగుహ,మహారాష్ట్ర

అష్టాదశ శక్తిపీఠాలు:

1.శ్రీ సరస్వతీ దేవి : జమ్మూకాశ్మీర్

2.శ్రీ విశాలాక్షీ దేవి : వారణాశి,ఉత్తరప్రదేశ్

3.శ్రీ కామాక్షీదేవి : కంచి,తమిళనాడు

4.శ్రీ గిరిజాదేవి : ఓడ్గాపురి,కటక్,ఒరిస్సా

5.శ్రీ భమరాంబా దేవి : శ్రీశైలం,ఆంధ్రప్రదేశ్

6.శ్రీ వైష్ణవీ దేవి : కాంగడా,హిమాచల్‌ప్రదేశ్

7.శ్రీ పురుహూతికా దేవి : పిఠాపురం,ఆంధ్రప్రదేశ్

8.శ్రీ శృంఖలా దేవి : ప్రద్యుమ్నం,బెంగాల్

9.శ్రీ మాధవేశ్వరీ దేవి : ప్రయాగ,ఉత్తరప్రదేశ్

10.శ్రీ మహాలక్ష్మీ దేవి : కొళ్హాపురం,మహారాష్ట్ర

11.శ్రీ ఏకవీరాదేవి : మహూర్యం,నాందేడ్,మహారాష్ట్ర

12.శ్రీ కామరూపిణీ దేవి : గౌహతి,అస్సాం

13.శ్రీ చాముండేశ్వరీ దేవి : మైసూరు,కర్ణాటక

14.శ్రీ మహాకాళీ దేవి: ఉజ్జయిని,మహారాష్ట్ర

15.శ్రీ మాంగల్య గౌరీదేవి : గయ,బీహార్

16.శ్రీ జోగులాంబా దేవి : ఆలంపురం,కర్నూలు

17.శ్రీ మాణిక్యాంబా దేవి : ద్రాక్షారామం,ఆంధ్రప్రదేశ్

18.శ్రీ శంకరీ దేవి : ట్రింకోమలి,శ్రీలంక.

3 comments:

 1. సురేష్‌గారు,

  టపాలో విషయం బాగుంది కాని, ఆ క్షేత్రాల వివరాలు కూడా వుంచితే బాగుండేది. అన్నట్టు అమరనాధుడు జ్యోతిర్లింగం కాదు. పూనా దగ్గెరలో వున్న భీమా శంకరుణ్ణి వదిలేసారు. వైద్యనాధుడు బీహారులో వున్నాడా లేక మహారాష్ట్రంలోని పర్లిలో వున్నాడా అని కూడా చర్చలున్నాయి. ఏది ఏమైనా సర్వం శివమే కదా...

  నా సుకృతంకొద్ది అనేక స్థలాలని దర్శించే అవకాశం కలిగింది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఎనిమిది, శక్తి పీఠాలలో ఏడు ఇప్పటికి చూడగలిగాను. త్రయంబకం అన్నది నిజానికి నాశిక్‌లో వున్నట్టే అలాగే దారుకావనం అంటే ద్వారక (గుజరాత్). కొన్ని ప్రదేశాల్లో అక్కడ ఒక జ్యోతిర్లింగమో శక్తిపీఠమో వుంది అంటే నమ్మలేము. జనాదరణ కూడా అంతంత మాత్రమే (నాగేశ్వరం,భీమాశంకరం, ఉజ్జైని మహాకాళి మొ||...) ఏమైనా దక్షిణాదిలో వున్న భక్తి, ప్రాముఖ్యత ఉత్తర దేశ ఆలయాలలో కనిపించదు.

  అన్నట్టు శ్రీశైలం, వారణాసి, ఉజ్జైని ఈ మూడు క్షేత్రాలలో అయ్యవారు జ్యోతిర్లింగం, అమ్మవారు శక్తిపీఠం
  గమనించారా..?

  అరిపిరాల

  ReplyDelete
 2. క్షమించండి.పొరపాటు గా అమర్‌నాథ్ ను కూడా జ్యోతిర్లింగాలలో కలిపివేసి భీమశంకరాన్ని మరిచిపోయాను.పొరపాటుకు క్షంతవ్యున్ని.

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు