తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Thursday, January 12, 2012

స్వామి వివేకానందుని గురించి చాలామందికి తెలియని అద్భుతము

స్వామి వివేకానందుని పుట్టినరోజు నేడు. జాతీయ యువజనదినోత్సవం నేడు.ఈ టపా గతంలో ప్రచురింపబడ్డదే. వివేకానందుల పుట్టినరోజు సందర్బంగా ఈ టపా తిరిగి వ్రాస్తున్నాను.

స్వామి వివేకానందుని గురించి తెలియని భారతీయుడు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. యువతకు స్పూర్తి దాయకుడైన వివేకానందుడు అందరికీ ఆదర్శమే. అతను ఎన్నో అధ్యాత్మిక అనుభవాలు చివరికి అత్యున్నతమైన అద్వైత స్థితిని కూడా పొందాడు. ఇక్కడ చాలా మందికి ఒక సందేహం వస్తుంది. అదేమిటంటే ఇంత మహానుభావునికి సిద్ధులు అనగా అతీతశక్తులు ఉండవా అని. ఉన్నాయి. కాని అతను ఎప్పుడూ వాటిని బహిరంగముగా ప్రదర్శించలేదు.

ఇప్పుడు శ్రీ పరమహంస యోగానంద గారి గురించి చూద్దాం.
స్వామి పరమహంస యోగానంద క్రియాయోగమును భారత మరియు అమెరికా,ఇంగ్లండు లలో వ్యాప్తి చేసిన ఒక యోగి. ఇతను రచించిన ఆత్మకథ పేరు "ఒక యోగి ఆత్మకథ". ఈ పుస్తకం చాలా ప్రచారం పొందింది.ఈ పుస్తకమును అనేక అమెరికా విశ్వవిద్యాలయాలలో పాఠ్యాంశముగా పెట్టారు. ఈ పుస్తకములోనే మనకు తెలియని వివేకానందుని అతీత శక్తి గురించి ఉంది.సరే ఆ సంఘటన చూద్దాం.
####################################################################

పరమహంస యోగానంద గారు రెండవ సారి అమెరికా వెళ్ళినప్పుడు తన పాశ్చాత్య శిష్యుల కోసం ఎన్నో కానుకలు తీసుకెళ్ళారు. అక్కడ అందరికీ కానుకలు ఇస్తున్నారు. ఒక శిష్యునికి ఒక వెండి కప్పు బహుమానముగా ఇచ్చారు.
ఈ శిష్యుడు యోగానందుల కంటే వయసులో పెద్దవాడు. అప్పుడు ఆ శిష్యుడు నిశ్చేష్టుడై నోట మాట రాక ఒక మూల ఏడుస్తూ కూర్చుండిపోయాడు. యోగానంద గారు అది గమనించి అప్పటికి ఏమీ అనకుండా చివరలో ఏకాంతముగా ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు. అప్పుడు ఆ శిష్యుడు అవి ఆనందభాష్పాలు అని చెప్పాడు. యోగానంద గారు కారణం అడిగారు.
అప్పుడు ఆ శిష్యుడు తన చిన్ననాటి సంఘటన గురించి చెప్పాడు. అతని చిన్నతనంలో ఒకసారి అతను నీళ్ళల్లో మునిగిపోబోతూ రక్షించండని అరవసాగాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక కాషాయ దుస్తులు ధరించిన ఒక వ్యక్తి గాలిలో సూర్యకాంతివెలుగుతో ప్రత్యక్షమై "లే" అన్నాడు. ఈ శిష్యుడు ఎలాగో బయట పడ్డాడు. కొన్ని రోజులకు ఆ విషయం మరిచిపోయాడు.
తర్వాత చికాగోలో విశ్వమతమహాసభ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి లోపలికి పోవడం చూసి ఈ అబ్బాయి నిశ్చేష్టుడై తన తల్లితో "అమ్మా! చిన్నప్పుడు నాకు గాలిలో కనిపించిన వ్యక్తి అతనే" అంటూ వడివడిగా లోనికి ప్రవేశించారు. ఆ వ్యక్తే స్వామి వివేకానంద. వివేకానందులు ఈ అబ్బాయిని చూడ్డంతోనే నవ్వుతూ " నీళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండు" అన్నారు.ఈ అబ్బాయి ఆనందభాష్పాలు రాలుస్తూ శిష్యునిగా చేర్చుకోమన్నాడు. అందుకు వివేకానందులు "నీ గురువు నేను కాదు. అతను మరో పాతిక సంవత్సరాల తర్వాత వస్తాడు. దానికి గుర్తు అతడు నీకు ఒక "వెండి కప్పు"ను బహుమానముగా ఇస్తాడు" అన్నాడు.
వివేకానందులకు తనను శిష్యునిగా చేసుకోవడం ఇష్టములేక ఇలా అంటున్నాడని బాలుడు అనుకొన్నాడు. కాని ఇప్పుడు అతని భవిష్యవాణి ఇలా జరగడం చూసి ఆనంద భాష్పాలు రాల్చాడు.

ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే విశ్వమత మహాసభ జరిగినది 1893 సెప్టెంబరులో. యోగానంద గారు పుట్టినది 1893 జనవరి 5 న.
####################################################################

వివేకానందులు సిద్ధులను అనగా మహిమలను అసహ్యించుకొనేవారు. అందువలన అత్యంత అవసర పరిస్థితులలోనే తన శక్తులను ఉపయోగించారు. పైన పేర్కొన్న మానవాతీతశక్తి గురించి కూడా స్వామి వివేకానందులు ఎవరికీ స్వయముగా చెప్పలేదు.అందువలనే వివేకానందులు స్థాపించిన శ్రీ రామకృష్ణ మఠం వారి పుస్తకాలలో ఎక్కడా ఈ విశేషముగాని మరే ఇలాంటి విశేషాలు కాని పేర్కొనబడలేదు.

లేవండి,మేల్కొనండి గమ్యము చేరువరకు విశ్రమించకండి (వివేకానందుని పిలుపు)


22 comments:

 1. చక్కని విషయం పంచుకున్నందుకు అభినందనలు..

  ReplyDelete
 2. bagundi suresh.. inkoka thelisina vishayam emante na puttina roju, yoganamda puttina roju okate..

  ReplyDelete
 3. మాతో పంచుకొన్నందుకు ధన్యవాదాలు.

  ReplyDelete
 4. ఒకయోగిఆత్మ కధలో ఈ విషయం చదివినట్లు గుర్తు వస్తోంది
  మరొకసారి గుర్తుచేసినందుకు ధన్యవాదములు

  ReplyDelete
 5. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు వివేకానందునునికి తెలుసా.. అతను ఆ శక్తి ఎలా సంపాందించాడో ఎక్కడ చదవ వచ్చు.. వీటికి సాక్ష్యాలున్నాయా ?

  ReplyDelete
 6. ee vivekude....ilaa nidara pommanee.....keerthistooo koorchommaneee kooda cheppaledu...pani cheyyamani cheppadu!!!!

  ayana cheppina maatalu entha goppavo...cheppatam kaadu....aacharanalo......choopinchagalagaali!!!!

  guts chetchokommani ayana first gaaa cheppindi!! ee rakamgaaa puranaala gurinchi sollu vesukone valla daggara guts enduku untai???

  repu china vaaadu vaste..daasoham!!antaaru!!

  meeee lanti vaallu kaadu ee desaniki kaavalsindi!!! VIVEKANANDUDU lanti vaaru!!! meeratha....eee drainage lonee.....choosukondi!!!

  ReplyDelete
 7. Yougod

  Time for you to go back to your ghetto dude. You aint qualified enough to talk over here :$

  ReplyDelete
 8. ఇక్కడ యువర్ గాడ్ అండ్ లక్కు పేట వారు దర్శనం భోగి మంట కి ప్రారంభమా ?!!  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 9. yougod

  Time for you to go back to your ghetto dude. You aint qualified enough to talk over here :$

  Reply::HAHHAHAHAHAHHAHHHAAHHAHHAAAAHAHAHHHAAHAHAHHAHA

  atleast...naakoo, suresh koo ,vivekananda..emi cheppado konchamianaaaa ....telusu......neeku assalu emi teliyadu kadaraaa....bevakooof!!!!

  enduku matlaadataav????aaaaa??? clikkuala kosamaaa??? aaaa??? fame kosamaaa??? endukosam raa....emee teliyaka pogaa...noru paaresukontaaav??? daridrudaaaa!!!! purpose emainaaa undaa!!! against me???? that u cud do only with reason!! to reason, u need knowledge!!! but neeku adi ledu!!! assaalu ledu!!!
  0.000001% of what either suresh or I hVE!!!

  YOU ARE NOT INVITED HERE....EVEN BY SURESH HIMSELF!!!! IDIOT!!!

  ReplyDelete
 10. నీ మొహానికి knowledge ఒకటి.

  Thats the funniest part of it. The only purpose I have here is kicking the ghetto dwellers like you :P

  ReplyDelete
 11. As I said earlier, you talking about Vivekananda is about a pig talking about cleanliness. It doesn't suit ya :P

  ReplyDelete
 12. YOU ARE NOT INVITED HERE
  ____________________________

  LOL, as if you are invited. By the way I thought you said you would kick me out of the blogs - I haven't seen any progress so far with the exception of your frustration :P

  ReplyDelete
 13. @ జిలేబి
  >>>ఇక్కడ యువర్ గాడ్ అండ్ లక్కు పేట వారు దర్శనం భోగి మంట కి ప్రారంభమా ?!!<<<
  నేను వచ్చాను చలి కాచుకోవడానికి
  మీరు కూడా రండి


  @యువర్ గాడ్
  గూగుల్ ఇమే డౌన్లోడ్ చేసుకుని తెలుగు లో వ్రాయండి
  లేకపోతె ఇంగ్లీష్ లో వ్రాయండి
  చస్తున్నాం మీ "గాడ్" భాష అర్ధం చేసుకోలేక
  >>>keerthistooo koorchommaneee kooda cheppaledu <<<
  ఒక మహానుభావుడి గురించి,
  తెలిసిన విషయాలు పంచుకుందాం
  తెలియని విషయాలు తెలుసుకుందాం
  "మీకు ఏమన్నా తెలిస్తే"( కికికి ) చెప్పండి మేం అందరం తెలుసుకుంటాం

  బ్లాగులు అనేవి భావ వ్యక్తీకరణ కి కేంద్రాలు
  మీరు ఉద్వేగానికి లోనుకాకుండా ప్రశాంతం గా ఉండండి

  >>>ee rakamgaaa puranaala gurinchi sollu vesukone valla daggara guts enduku untai???<<<
  మీకు చాలా గట్స్ ఉన్నాయి అనుకుంటా

  >>>repu china vaaadu vaste..daasoham!!antaaru!!<<<
  మీరు చైనా వాళ్ళా ? (కికికి)

  ReplyDelete
 14. Very nice Suresh.
  I was reading your all posts. Excellent.
  Great work. I like each and every post :-)

  ReplyDelete
 15. dhanyavadamulu, marinni chakkani vishayamulanu telusukonutaku prayatnistunnamu.

  ReplyDelete
 16. chalaa bagundi, marinni vishayamulanu telusukonutaku prayatnistunnamu

  ReplyDelete
 17. i owe you so much for having shown me the unknown side of the spiritual legend. Proceed to post like these, then once surely India will be reformed with a shiny spirituality.

  ReplyDelete
 18. its very nice to know brother..thanks,,,keep it up

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు