తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

శుక్రవారం 3 ఎప్రిల్ 2009

కర్ణాటక ప్రభుత్వం వారి కొత్త కన్నడ నిబంధన

ఈ నిబంధన ఏమిటంటే వాహనదారులు ఖచ్చితముగా తమ వాహనపు నమోదుసంఖ్యను (Regestration Number ) వాహనానికి ఏదో ఒకవైపున (అంటే ముందుగాని లేక వెనుక గాని) ఖచ్చితముగా కన్నడలో వ్రాయాలి.

ఉదాహరణకు KA 12 A 3456 అనే సంఖ్యను ఖచ్చితముగా కెఎ ౧౨౩౪౫౬ అని ఖచ్చితముగా ఒక వైపు వ్రాయాలి.

మొన్నామధ్య ద్విచక్రవాహనములో వెళ్తుంటే ఈ నిబంధనను ఇక్కడి రక్షకభటులు తెల్పారు. అలా వ్రాయనందుకు మొదటితప్పుగా 100 రూపాయలు జరిమానా కూడా విధించారనుకోండి అది వేరే సంగతి.




3 వ్యాఖ్యలు:

  1. తొండ ముదిరి ఊసరవెల్లి అవడమంటే ఇదే, భాషాభిమానాన్ని ఖజానా నింపుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చన్నమాట

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ఇక్కడ తెలుగులో సంఖ్యాఫలకం ఉంటే జరిమానాలు విధించాలనే నిబంధనలున్నాయి.

    ప్రత్యుత్తరంతొలగించు

నా బ్లాగును ఇష్టపడేవారు