ఈ శీర్షికను మన విభిన్న ప్రాంతాల మధ్య తెలుగు భాషా పదాలను తెలుసుకోవడానికి మొదలుపెడుతున్నాను. అలాగే ముందు మా ప్రాంతపు పదాలు వ్రాస్తాను. మా ఊరు అనంతపురం జిల్లా, కదిరి పట్టణము.
తొందరగా = బిరిన్న(బిర్న)
గరాటు = లొడిగి
పళ్ళెము = తట్ట ( మిగతా ప్రాంతాలలో తట్ట అనగా గంప అని అర్థము )
ఎల్లుండి = మర్నాడు లేక మన్నాడు
పురోహితుడు చేసే పెళ్ళిపనులు = సాంగ్యాలు
పొద్దస్తమానం = పల్లాపగలు
కొబ్బరిబోండాము = ఎల్లీరు కాయ
ఐదుగురు = ఐదుమంది ( మా ప్రాంతాలలో ఐదుగురు, ఆరుగురు అనే బదులు ఐదుమంది, ఆరుమంది ఇలా ఉపయోగిస్తాము)
పదిహేను = పదహైదు
పద్దెనిమిది = పజ్జెనిమిది
ఇవి కొన్ని పదాలు. మిగతావి తర్వాత.
ఎల్నీర్ ఇది తమిళపదమనుకుంటా !తమిళంలో కొబ్బరి నీళ్ళు. మీరు మదనపల్లికి దగ్గరకాబట్టి అక్కడ కొంచెం తమిళపదాలు వాడుకలో ఉన్నాయి.
ప్రత్యుత్తరంతొలగించుకన్నడంలో కూడా ఎళ్నీరే అంటారు, కొబ్బరి నీళ్లకి.
ప్రత్యుత్తరంతొలగించుమీరు చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం చాలా గొప్పది. మీకు నా అభినందనలు.
ప్రత్యుత్తరంతొలగించుకదిరి బెంగళూరుకు దగ్గర కాబట్టి కన్నడ ప్రభావము ఎక్కువ. ’బిర్న’,’ఎళ్నీరు’ అనేవి కన్నడ పదలే. మీరు అరువు తీసుకున్నారు. భాష ఎప్పుడూ మార్పుకు గురవ్వుతూనే ఉంటుంది.
మీరు చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం చాలా గొప్పది. మీకు నా అభినందనలు.
ప్రత్యుత్తరంతొలగించుకదిరి బెంగళూరుకు దగ్గర కాబట్టి కన్నడ ప్రభావము ఎక్కువ. ’బిర్న’,’ఎళ్నీరు’ అనేవి కన్నడ పదలే. మీరు అరువు తీసుకున్నారు. భాష ఎప్పుడూ మార్పుకు గురవ్వుతూనే ఉంటుంది.
ఎళ నీరు - కన్నడ పదం
ప్రత్యుత్తరంతొలగించుఅట్లే "బేట్రాయి సామి దేవుడా, నన్నేలినోడ..."
ఇందులో బేట్రాయి - బేట రాయడు అంటే వేటకు రాజు - నరసింహ స్వామి. తెలుగులో వ కన్నడలో బ, తెలుగు "ప", కన్నడ "హ" (పంది - హంది, పల్లు - హల్లు ఇలా)ఇలా మార్పులు.
మంచి ప్రయత్నం..