తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Monday, November 9, 2009

ఈ సంఘటనకు మీరైతే ఎలా స్పందిస్తారు? మేము లోకల్.

ఇది బెంగళూరులో నాకు నిజంగా జరిగిన సంఘటన.

పోయిన దీపావళి పండుగ రోజు బెంగళూరులో మేమున్న మారతహళ్ళిలో మేము మా రూం ముందు నిలుచునిఉన్నాము. అప్పుడు రాత్రి 7వ,8వ తరగతి పిల్లలు టపాకాయలు కాలుస్తున్నారు. కాల్చడములో ఎవరికీ అభ్యంతరము లేదు కానీ రోడ్డులో పోయేవాళ్ళపైకి చేత్తో టపాసులు కాల్చి విసురుతున్నారు. నేను,నా స్నేహితులు వద్దని వారించాము.

తర్వాత మేము వెనుకకు తిరగగానే ఒక పిల్లవాడు లక్ష్మీటపాసును మా మిత్రుడిపై విసిరాడు. దాంతో మా వాడికి కోపం వచ్చి వానిపై చెయ్యెత్తబోయాడు. కాని ఎందుకులే అని ఊరుకున్నాడు. కాని ఆ అబ్బాయిలు మా వద్దకు వచ్చి కన్నడంలో " మీరు ఇక్కడకు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు.కానీ మేము ఇక్కడ Local. మా మీద చెయ్యెత్తేంత ధైర్యమా మీకు ? చెయ్యెత్తి ఇక్కడ ఉంటామనే అనుకుంటున్నారా?" అని అన్నాడు. మాకు చేష్టలుడిగిపోయాయి(shock). అన్నది పెద్దవారు కాదు. 13,14 ఏళ్ళు వయసు గల పిల్లలు. తప్పు వాళ్ళదే. ఐనా Local feeling వారికి ఎలా వచ్చినో ఇప్పటికీ అర్థం కావడం లేదు.

ఇక్కడ వ్యవస్థ తప్పా? లేక సినిమాల ప్రభావమా? లేక ప్రాంతీయ దురభిమానమా? ఏమో అస్సలు అస్సలు అర్థం కావడంలేదు.
10 comments:

 1. idiot cinema lantidi edo kannada lo choosivuntaru... aina samajam antha ilage vundi ...roju roju ku kunchinchukoni pothondi ...

  ReplyDelete
 2. చిన్నప్పటి నుంచే ఇది ఇలా ఇంజెక్ట్ చెయ్యబడుతుంది అనుకుంటా!. కాని ఇలాంటి సంఘటన లు బెంగళూరు లో సర్వ సాధారణం. భాషేతరులని వాళ్ళు. గౌరవించరు. వీలుంటే కన్నడ చదవడం మీకు వస్తే గనక మెజెస్టిక్ ప్రాంతం లో ఉన్న గోడల మీద రాతలు చదవండి. ఎలాంటి వాడికయినా రక్తం సల సల మరగక మానదు. అంత ఉద్రేక పూరితంగా, కన్నడేతరులని అణగదొక్కే విధంగా ఉంటాయి రాతలు..బాధపడటం తప్ప ఎమీ చెయ్యలేం. ఇండియన్ సిలికాన్ వ్యాలి గా, దేశం లో సాఫ్ట్ వేర్ రంగాన్ని శాసిస్తున్న కన్నడిగుల అధిపత్యాన్ని మనం అంగీకరించాల్సిందే! తప్పదు.

  ReplyDelete
 3. విజయ్ క్రాంతి గారన్నట్టు సినిమా ప్రభావం తప్పకుండ ఒక కారణం అండి.
  మన దేశం లో మీడియా ప్రభావం మునుపెన్నడూ లేనట్టు గా ఈ మద్య కాలం లో పెరిగి పోయింది.భాషాభిమానం ప్రాంతియభినామం ఉండడం లో తప్పు లేదు.గతి తప్పిన భావాలు ఇలా బయటపడినప్పుడు మానన్ని చంపడానికి ఏ టెర్రరిస్టు ఎందుకు మన పక్కింటి మిత్రుడే మన భారతీయుడే చాలు...ముంబై లో వోట్ల కోసం అదేదో పార్టీ చేసినట్టు..వెస్ట్ అస్సాం లో ..చెప్పుకుంటూ పోతే ..ఎన్నో ..హిట్లర్ నెలకొల్పిన గాస్ చామ్బెర్లకు మళ్లీ రోజులు దగ్గర పడ్డాయి..
  www.ceratechies.wordpress.com

  ReplyDelete
 4. ఎక్కడో కన్నడ రాష్ట్రంలోనే కాదు, మన రాష్ట్రంలో నయినా, ఎక్కడయినా ఉన్నదే!

  ReplyDelete
 5. దీన్నే వొళ్ళు పొగరంటారు. విజ్ఞులు దీన్నే బలుపు అని కూడా అంటుంటారు. అంటే వాడు చేసింది తప్పు అని వాడికికూడా తెలుసు అయినా "ఎవ్వడు ఏమీ చేయలేడు" అనే పొగరు. ఇది ఈ సంవత్సరం నేను కూడా అనుభవించాను. కాకపోతే కారుకూతలు కూసినవాడి చెంప పగలగొట్టిమరీ వదిలాను.

  సందర్భమో కాదో తెలీదు కానీ ఓ మాట చెబుతాను మనమెవ్వరమూ భారతీయులుగా identify అవ్వడానికంటే ఇంకోలా (ప్రాంతాల/కులాల/మతాల పేరుతో) identify అవ్వడానికే ఇష్టపడుతుంటాం.

  ReplyDelete
 6. చాలా కామన్ విషయం. భారతదేశంలోని ప్రతి మూలా జరిగే సాధారణ విషయం. We are not Indians and we are NEVER Indians. We are our castes,our languages,our regions. అంతే!

  ReplyDelete
 7. ఇలాంటి తీవ్రమయిన భావాల్ని పెంచి పోషిస్తున్నది మీడియా మాత్రమే కాదు. సినిమాలు, సినిమా హీరో లు రాజకీయనాయకులు కూడా తమ తమ వంతు పాత్రలు నిర్వహిస్తున్నారు. ఇది ఇక్కడ ప్రస్తుతమో, అప్రస్తుతమో నాకు తెలియదు కాని, విడుదల అయ్యే ప్రతి సినిమాల్లోను,హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ రాష్త్రభక్తి ని ప్రేరేపించే గీతాలుంటాయి. ప్రత్యేక జెండాలు పసుపు ఎరుపు దుస్తులతో కనిపించని హీరోలు సినిమాలు ఇక్కడ నిషిద్ధం అనుకుంటా..!!! తప్పు అది కాదు, కాని కన్వే ఆవ్వాల్సిన భావం సరి అయిన రీతి లో కరెక్ట్ గా ప్రజలకి రీచ్ అవడం లేదు. అందువల్లే ఈ తిప్పలంతా.


  ....నిజమే ఇదిప్పుడు కామన్ విషయం గానే తీసుకోవాల్సి వస్తోంది. మన తర్వాతి తరానికి, భారత దేశం లోనే ఇతర ప్రాంతాలకి వెళ్ళాలంటే విసా, పాస్ పోర్ట్ లు పొందాల్సిన దుస్థితి మరెంతో దూరం లో లేదు.

  ReplyDelete
 8. Welcome to Best Blog 2009 Contest


  The Andhralekha best blog 2009 contest is the first ever blog contest for telugu speaking bloggers. This contest is to recognize the effort & energy shown by bloggers. The contest is open for all bloggers and the blog should be in either english or telugu.  Submit your best blog written in 2009 along with URL and enter to win Best blog 2009 contest. All the blogs submitted will be carefully reviewed by our senior journalists and editors. Voting for selected finalists is expected begin January 15, 2010. Top 3 winners would receive shields and surprise gifts.  Please submit your entries by sending an email to blogchamp@andhralekha.com with your name, location, blog details and URL.

  Good Luck! Spread the word and enjoy the contest.


  plz contact andhralekha@gmail.com

  http://andhralekha.com/blog_contest/AL_blog_contest.php

  ReplyDelete
 9. Its hurting. Its shame to every citizen of India.

  I strongly believe, this feelings can be erased from children s or adults, when good patriotic movies are played/released.

  Movies like Kaalapani, Bharateeyudu, Lagaan, Rang de basanti etc are good and patriotism ls involved.
  Similar movies must be played with regional super star heroes like Chiranjeevi, Rajanikant, Raj Kumar, Mohan Lal etc., so as to hit children local or regional feelings even for adults too,

  I strongly believe that in this manner one can set the things properly.

  Regards
  Raghuram

  ReplyDelete
 10. మీ స్తానంలో నేనుటే. బెంగళూరు మాత్రమే నీదా మరి భారతదేషం కాదా అని వారితో స్నేహాంగా మాట్లడి నిది నాది భారతదేషం అని సమాదానం చెపుతాను.

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు