తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Friday, September 9, 2011

ప్రపంచం ఋణపడి ఉన్న భారతీయ శాస్త్రవేత్త - భాస్కరాచార్యుడు

సనాతన భారతదేశం కన్న గణితశాస్త్రవేత్తలలో భాస్కరాచార్యుడు చిరస్మరణీయుడు.ఇప్పటికీ ఇతను కనుగొన్న కొన్ని గణితసూత్రాలు పాశ్చాత్యశాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో పడవేస్తున్నాయి.చిక్కుముడి గణిత సమస్య లను సంధించడంలో భాస్కరులు అగ్రగణ్యులు.పాశ్చాత్య ప్రపంచం ఇంకా గణితంలో ఓనమాలు దిద్దుకుంటున్న సమయంలోనే బీజగణిత,గ్రహగణితం మొదలగునవి కనుగొన్నారు.

భాస్కరులు క్రీ.శ 1114 సంవత్సరంలో మహారాష్ట్ర లోని విజ్జదిత్( విజయపురం) అనే గ్రామంలో జన్మించాడు.చిన్నపటి నుండే గణితం లో అనేక పరిశొధనలు ప్రారంభించాడు.వీరు ప్రపంచప్రఖ్యాతి గాంచడానికి కారణమైన సంఘటన ఒకటుంది.

అదేమంటే భాస్కరులు జ్యోతిష్యంలో మంచి దిట్ట.ఇతను ముహూర్తాలు లెక్కపెట్టే పద్దతి ఏమిటంటే కుండలలో ఇసుక,నీళ్ళు వేసి వాటికి క్రింద చిన్న చిల్లులను పెట్టి ఆ కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి వాటిలోని నీటి చుక్కలు క్రిందకు పడే సమయం బట్టి ముహూర్తాలను,శుభాశుభాలను లెక్కించేవాడు.ఇలానే ఒకసారి తన కుమార్తె (పేరు లీలావతి) పెళ్ళి కొరకు ముహూర్తం నిర్ణయించాడు.తన కుమార్తె జాతకంలో వైధవ్యం ఉన్నదని తెలుసుకొని దానిని పోగొట్టడానికి తనే స్వయంగా ముహూర్తం నిర్ణయించాడు.కాని భగవత్ సంకల్పం మరో విధంగా ఉంది.ముహూర్తనిర్ణయానికి ముందు లీలావతి ఒకరోజు ఆడుకుంటూండగా తన ముక్కుపుడక లోని ముత్యం ఆ కుండలలోని పై కుండలో జారవిడుచుకొంది.ఆ ముత్యం చిల్లుకు అడ్డుపడి నీటిచుక్కల లెక్క,పడు సమయం మారింది. దీని వలన భాస్కరులు పెట్టిన ముహూర్తం తారుమారయ్యి లీలావతికి పెళ్ళైన సంవత్సరం లోనే భర్త చనిపోయాడు.ఈ దుఃఖం భరించలేక పోయిన భాస్కరులు తను మరియు లీలావతి ఆ దుఃఖం నుండి బయటపడడానికి లీలావతికి గణితం నేర్పించి తను కూడా గణితంపై తీవ్ర పరిశోధన చేసాడు.ఈ పరిశోధనల వలనే ఎన్నో కొత్త గణిత ప్రక్రియలు,సిద్దాంతాలు కనుగొని ప్రపంచప్రఖ్యాతుడయ్యాడు.తన కుమార్తెకు కూడా పేరుతెచ్చి పెట్టాడు.

సిద్దాంత శిరోమణి గ్రంధం ( భాస్కరులు ప్రపంచానికి అందించిన కానుక)

1150వ సంవత్సరం లో రచించిన "సిద్దాంత శిరోమణి" అను గ్రంధం భాస్కరులకు ఖ్యాతిని గణితప్రపంచానికి అమూల్యమైన కానుకను అందించినది.
ఇందులో భాగాలు నాలుగు.
అవి ౧.లీలావతి(అంకగణితం)
౨ .బీజగణితం
౩.గోళాధ్యాయ(గోళాలు,అర్దగోళాలు)
౪.గ్రహగణితo (గ్రహాలకు,నక్షత్రాలకు సంబంధించినది)
ఈ గ్రంధం సున్న (0) యొక్క ధర్మాలను, "పై" యొక్క విలువను,వర్గాలను,వర్గమూలాలను,ధనాత్మక-ఋణాత్మక అంకెలను,వడ్డీలెక్కలను,సమీకరణాలను గురించి తెలియజేస్తుంది.
మరియు పాశ్చాత్యులు గత శతాబ్దంలో కనుగొన్నామనుకొంటున్న కరణులు,వర్గ సమీకరణాలను,అనంతం (ఇన్‌ఫినిటీ)ని కనుగొని చర్చించి,వాటిని సాధించింది.సమీకరణాలను వాటి 3వ,4వ ఘాతం వరకు సాధించింది.త్రికోణమితిని కూడా చాలా చర్చించింది.

మన దౌర్భాగ్యం మరియు అలసత్వం కొద్దీ గురుత్వాకర్షణను న్యూటన్ కనుగొన్నాడని పాశ్చాత్యులు చెబితే అదే నిజమని అనుకొని మోసపోతున్నాము.. కాని ఈ గ్రంధంలో(న్యూటన్ కన్నా 500 సంవత్సరాల పూర్వమే) భాస్కరుల వాక్యాలను గమనించండి.
"వస్తువులు భూమి యొక్క ఆకర్షణ వలనే భూమిపై పడుతున్నాయి.కాబట్టి భూమి,గ్రహాలు,చంద్రుడు,నక్షత్రాలు చివరికి సూర్యుడు కూడా ఈ ఆకర్షణ వలనే వాటి కక్ష్యలలో పడిపోకుండా ఉన్నాయి.వాటికి కూడా ఆకర్షణలు ఉన్నాయి."

ఇంత స్పష్టంగా వీరు చెప్పినా ఇంకా మనం మన ప్రాచీన శాస్త్రవేత్తల గొప్పతనాన్ని తెలుసుకొనలేక పోతున్నాము.

తర్వాతి కాలంలో వీరు ఉజ్జయిని లోని ఖగోళగణితశాస్త్ర సంస్థకు అధ్యక్షుడయ్యారు.

వీరు మరణించిన సంవత్సరం 1183 లేక 1187.

3 comments:

 1. చాలా విలువైన విషయాలు చెప్పారు. ఇవి అందరికీ తెలియాల్సి ఉంది.

  ReplyDelete
 2. ఒక్క ముక్కలో చెప్పలి అంటే
  మనం ఇప్పుడు మాటని కాదు కాగితాన్ని నమ్ముతున్నాము.

  మీ గురుంచి కాదు మన దేశాన్ని వదిలి వెళ్ళిన వారి గురుంచి, తప్పులు చేస్తున్న వారి గురుంచి

  ReplyDelete
 3. " కాని ఈ గ్రంధంలో(న్యూటన్ కన్నా 500 సంవత్సరాల పూర్వమే) భాస్కరుల వాక్యాలను గమనించండి.
  "వస్తువులు భూమి యొక్క ఆకర్షణ వలనే భూమిపై పడుతున్నాయి.కాబట్టి భూమి,గ్రహాలు,చంద్రుడు,నక్షత్రాలు చివరికి సూర్యుడు కూడా ఈ ఆకర్షణ వలనే వాటి కక్ష్యలలో పడిపోకుండా ఉన్నాయి.వాటికి కూడా ఆకర్షణలు ఉన్నాయి." .........బాగా చెప్పారండి.

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు