తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Wednesday, April 25, 2012

అన్నమయ్య ఆవేదన అర్థం చేసుకోండి

కీర్తన:

కడుపెంత తా గుడుచు కుడుపెంత! దీనికై పడని పాట్లనెల్ల పడి పొరలనేలా||

పరుల మనసునకునాపదలు కలుగజేయ పరితాపకరమైన బ్రతుకేలా|
సొరిదినితరుల మేలుచూచి సైపగలేక తిరుగుచుండేటి కష్టదేహమిది యేలా||

యెదిరికెప్పుడు చేయు హితమెల్ల తనదనుచు చదివిచెప్పని యట్టి చదువులేలా|
పొదిగొన్న ఆశలో బుంగుడై సతతంబు సతమతంబై పడయు చవులు దనకేలా||

శ్రీవేంకటేశ్వరుని సేవానిరతిగాక జీవనభ్రాంతి బడు సిరులేలా|
దేవోత్తముని నాత్మ దెలియ నొల్లక పెక్కు త్రోవలేగిన దేహి దొరతనంబేలా||

అర్థవివరణ:

ఉన్నది బెత్తెడు కడుపు, అదెంత తింటుంది? పట్టెడన్నమే కదా. దీనికొరకేనా ఇన్నిపాట్లు మనము పడి పొర్లుతున్నది?
ఇతరుల మనసులు బాధ పెట్టే పనులు చేసే దుఃఖకరమైన బ్రతుకు ఎందుకు?
ఈర్ష్య,అసూయలకు లోనై మనము ఇతరులు బాగుపడుతూంటే చూసి ఓర్వలేని బ్రతుకు ఎందుకు?
ఎదుటివారికి చేసే మేలు కూడా మనకు మేలే అని చెప్పని విద్య ఎందులకు?
ఆశలలో మునిగిపోయి ఎల్లప్పుడూ సతమతం చేసే డబ్బు ఎందులకు?
భగవంతుని సేవ లేకుండా జీవితాన్ని భ్రాంతిలో పడవేయు ధనమెందుకు?
పరమాత్మను తెలియలేక అన్ని రకాల దారులలో కన్నుగానక తిరుగు జీవుని దొరతనం (నేనే గొప్ప అనుకోవడం) ఎందుకు?

3 comments:

 1. మంచి సేకరణ. అభివందనలు.

  ReplyDelete
 2. బాగా చెప్పారండి.

  ReplyDelete
 3. suresh gaaru..
  mee vyakhalu/utharaalu chaduvuthuntee..
  appudeppudo chinnapudu thinna chaddennam ruchi gurthochinatlu.... kammaga...
  manaku ishtamiana paatha cinemalonchi, ghantasala gaaru paadina pata vintunnatlu.. thiyyagaa...
  mana elementary schoollooo.. telugu mastaaru pattham madhalo, udaharanala kosam.. cheppe chitti kathanta.. madhurangaa...
  unnattndi.. vesavi kaalam selavullo vache.. ice bandilonchi ichee.. china color ice mukkantha, challagaa....

  untaayandi...

  nijangaa.. idi oka arudaina anubhooti..

  meeru ilaage kothagaa.. manam (samaajam) marichipothunna paathadanaanni gurthu chesthoo.. undalani..

  mee sreyobhilaasi...

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు