తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Friday, May 25, 2012

ఏమిటయ్యా వేంకటేశు...

ఏమిటయ్యా వేంకటేశు...

అప్పుడెప్పుడో.. ఒక సోమరి ఏనుగు కాలికి దెబ్బతగిలితేనే... ఇంటి దగ్గరినుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి రక్షించావే..

ఆ తరువాత... ఒక వెర్రి పిల్లాడు... పొరపాటున ఒక పిచ్చి రాయిలో నువ్వున్నావని అంటే.. ఏకంగా ఒక అవతారాన్నే చూపించావే...

మరోసారి.. ఒక చాదస్తపు వృద్దురాలు... ఎంగిలి పండ్లిస్తే.. మొహమాటం కూడా లేకుండా తిన్నావే....

మొన్నటికి మొన్న... పాత స్నేహితుడు పలకరింపుకు వచ్చి అటుకులిస్తే... అష్ట ఐశ్వార్యలిచ్చి సత్కరించావే...

మరి నేనిప్పుడు.. అంతులేని కష్టాల్లో, అయోమయమైన రాగద్వేషాల్లో కొట్టుకుంటుంటే కరుణించవేమయ్యా....  ఇంత మొండివాడివేమయ్య .. 
--ఇది మా స్నేహితుడు కొండయ్య వ్రాసిన కవిత

3 comments:

 1. మన ఆర్తి బాధ అన్ని గమనిస్తూనే వుంటాడు కాని తరుణసమయము, కర్మవిమోచన అయితేనే మన కష్టాల మాయా అలా తొలిగిపొవాలి.నమ్మకము విశ్వాసాలను మాత్రము కొల్పొవద్దు.

  ReplyDelete
 2. రమేశ్ బాబుగారి మాట చాలా బాగుంది.

  ReplyDelete
 3. మీ స్నేహితుడి కవిత బాగుంది. కవితలు రాశారంటే అది ప్రజల ఆనందం/మెప్పు కోసం, అంత సీరియస్ కాదేమో.
  తీరిగ్గా తరువాతి జన్మల్లో ఎపుడైనా పట్టించుకుంటాడు లేండి. ఏనుగు ఎన్ని వేలేళ్ళో పోరాడిన తరువాత గాని ఈయనకు గుర్తు రాలేదు. సనాతనుడు కదా., కొద్దిగా మతిమరపు వుందేమో :)) :P

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు