తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Monday, June 16, 2014

ఇకనైనా మారండయ్యా చులకన అయినది చాలు!


తరాలు మారినా మనకు మాత్రం సిగ్గు రావడం లేదు. ఎందుకండీ సాధువులారా! మీ సాధుత్వం? హాయిగా సంసారంలోకి రండి. రాగద్వేషాలు ఉన్నచోట సాధువుకీ సంసారికీ తేడా ఏముంది? సంసారి సంసారం కోసం కొట్టుకొంటున్నాడు, కొందరు సాధువులు పంతం కోసం కొట్టుకొంటున్నారు.

లేకుంటే ఏంటి ఇది..మొన్న భద్రాచలం లో సీతారాముల నిత్యకళ్యాణంలో ప్రవర చెప్పేటప్పుడు "రామనారాయణ" అన్నారట...అలా అనకూడదని కొందరు సాధువులు గగ్గోలు పెట్టారట..
శ్రీరాముడి నామాలలో "రామనారాయణ" కూడా ఒకటి...అంటే నారాయణ స్వరూపమైన రాముడు అని అర్థం..ఇది కూడా తెలియని సాధువులా వీరు?

ప్రసిద్ది చెందిన క్రింది స్తోత్రం చూడండి:

అచ్యుతం కేశవం రామనారాయణం!!
కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్!!
శ్రీధరం మాధవం గోపికావల్లభం!!
జానకీనాయకం రామచంద్రం భజే!!

అచ్యుతం కేశవం సత్యభామాధవం!!
మాధవం శ్రీధరం రాధికారాధితమ్!!
ఇందిరామందిరం చేతసా సుందరం!!
దేవకీనందనం నందజం సందధే!!


శివ కేశవుల భేధమే అంతరించిపోతున్న ఈ కాలంలో ఇంకా ఇలాంటి సంకుచిత భావాలతో ఇలాంటి వారు సనాతనధర్మానికి ఎంత ద్రోహం చేస్తున్నారో వీరికి తెలుస్తోందా?

ఇతర మతస్థులు మన ధర్మం గురించి తెలియక విమర్శిస్తే ఏమన్నా అనుకోవచ్చు, కాని మనవారే మనలనే కించపరుచుకుంటూ ఉంటే మనకు ఎంత నష్టం జరుగుతుందో ఆలోచించరా? "

ఏకం సత్ విప్రా బహుదా వదంతి" (ఉన్నది ఒక్కటే, కాని అది పలురకాల పేర్లతో పిలువబడుతోంది) అన్న విషయం జీర్ణించుకుపోని సాధువులు ఎందుకు. సంసారులకు ఇలాంటి విషయాలు తెలియకపోవచ్చు.కాని భగవంతుడి కోసం అని చెప్పుకుని సంసారాన్ని వదిలివేసి సాధువుల వేషం కట్టిన ఇలాంటి సాధువులు ఘోరమైన దుర్గతి పాలవుతారు.

గమనిక: ఈ పోస్ట్ కుహనా (Half minded) మరియు ఢాంభికులైన సాధువులను ఉద్దేశించి వ్రాసినది.

3 comments:

 1. Promote your Website or Blog for free and increase traffic to your site at http://forum.telugushortfilmz.com/

  ReplyDelete
 2. ఇలాంటి సాధువులు వలన హిందూ ధర్మానికి వచ్చేది నష్టమే తప్ప లాభం లేదు.... ఇప్పటకే చాలామంది కుహానా సాధువులు అర్ధంకాని వ్రతాలు,మంత్రాలు వలన ఇతర మతాలలో అలుసు అయిపోయి సామాన్య మానవులకు హిందూ ధర్మన్ని దూరం చేసారు.... దక్షిణ భారతదేశంలో జరుగుతున్న మతమార్పిడిలతో హిందూధర్మం క్షీణ దశలో ఉంది.... ఎంతమంది సాధువులు, పూజారులు తము బట్టీ కొట్టిన మంత్రాలు, గ్రంధాలు సామాన్య జనానికి అర్ధమయ్యే విధంగా చెప్పగలరు?....

  ReplyDelete
 3. మీ పోస్త్ చాలా బాగుంది.ఏ సాధువు కూడా రాగద్వేషాలు లేకుండా ఉండలేరు.అసలు సన్యాసత్వం అనేది లేదు.ఈ రోజుల్లో అస్సలు కుదరదు.మనం టివిలలో ప్రతిరోజూ ఈ సాధువుల గురించి చూస్తూనే ఉన్నాం.
  http://ahmedchowdary.blogspot.com/

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు