తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Monday, December 7, 2015

నీలము - ఆ రంగుకు (తెలుగు భాషలో) ఈ పేరెలా వచ్చింది ? (నా అభిప్రాయము)కొన్ని ఉన్నట్టుండి అనూహ్యంగా,అకస్మాత్తుగా మనసుకు తడుతూఉంటాయి. అలా నిన్న పడుకున్నప్పుడు ఉన్నట్టుండి మెరుపులా నాకు కలిగిన భావన ఇది.

నాకు తట్టిన ఊహ ప్రకారము  :

మనకు తెలుసు సముద్రము ఆకాశము రంగులో అంటే నీలపు రంగులో ఉంటుందని (రామన్ ఎఫెక్ట్ దీనినే వివరించింది).
నీటిని తెలుగులో నీళ్ళు, నీరు గ్రాంధిక భాషలో "నీరము" అని కూడా అంటారు.
భాష అభివృద్ధి దశలో మన తెలుగువారు ఎప్పుడైనా నీలము రంగును చుసినప్పుడు అది ఏ రంగులో ఉంది అనే ప్రశ్న వచ్చినప్పుడు (ఇంకా నీలము అనే పదము లేదు కాబట్టి) వారు సముద్రపు రంగును దృష్టిలో పెట్టుకొని "నీళ్ళ రంగులో" లేక "నీరము రంగులో" ఉంది అనేవారు అని నా భావన.
ఈ భావమే తర్వాతి కాలములో నీరము అనేది నీలము అని మారిందని నా ఊహ. నీరు అనేది "నీలి" అని మారి ఉండవచ్చు..

ఇది కేవలం నా భావన మాత్రమే.ఇదే నిజమని నేను చెప్పలేను.

ఇదండీ నాకు నిన్న అకస్మాతుగా మెరుపులా వచ్చిన ఊహ.

4 comments:

 1. మల్లి మల్లి చదవాలనిపించేల ఎన్నో మంచి విషయాలు మా అందరి కోసం రాస్తున్న నీకు అన్ని విధాల మంచి జరగాలని ఆశిస్తూ............

  ReplyDelete
 2. నీరము లేదా నీరు అనగా రంగు లేనిదని అర్ధము..రామన్ దీనిగురించి ఎటువంటి ఆవిష్కరణలూ చేయలేదు..meeru raman effect గురించి వొకసారి చదవండి ..దీనిని kwalitaetive and quantitative analysis of liquids lo use chaesthaaru..ఇక నీలము అనే సంస్క్రుత పదానికి వేద నిరుక్త నిఘంటువు చెప్పిన అర్ధము చూడండి--సర్వ వ్యాపకమైనది/మచ్చ పడనిది/అనంతము..ఆని,అంతేగానీ నీరము నుంచి నీలము అనే పదము వచ్చినట్లు భావోక్తంగా చెప్పజాలము..మీ ఆశక్తిని గమనిచిన మీదట ఈ విషయాన్ని మీతో పంచుకోవడమైనది..అంతేగానీ మిమ్ములను తక్కువచేయుతకుగాదని గమనించ ప్రార్ధన..

  ReplyDelete
  Replies
  1. @astrojoyd గారు,
   కృతజ్ఞతలు అండీ. రామన్ ఎఫెక్ట్ గురించి నేను ప్రస్తావించినది నీళ్ళ గురించి కాదండీ. సముద్రం రంగు నీలం రంగులో ఎందుకు ఉంటుంది అనే విషయముగా. ఇక ఆ రంగుకు ఆ పేరు వచ్చిన విషయము విశ్లేషించినందుకు ధన్యవాదాలు.

   Delete
 3. ok thank you..can you please give under what name Raman had mentioned in his inventions or in his hypothasis papers?out of enthusiasam iam asking this sir..ACC.to difraction and reflection principle,we are able to see the colour of the any object bcz of that object absorbs all the other wavwlwngths[colours]and reflecting one particular colour..Was Raman mentioned the same ,if so under what name,it was written in his papers?Hope you wil throw some light on it sir..

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు