తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Monday, September 9, 2019

వేదాల ప్రాచీనత విషయంలో భారతీయులు మోసపోయారా ?

7 comments:

 1. Yes!WE need to throw that idea from our mind that vedas come one after the other.

  ReplyDelete
 2. హేతువాదులైన శ్డాస్త్రజ్ఞులు కొందరు ఋగ్వేదంలో కొన్ని చోట్ల వర్ణించబడిన గ్రహతారకల స్థితిగతులను పరిశీలించి సుమారు 7000 BCE నుంచి 6000 BCE మధ్యన ఆయా సూక్తాలు చెప్పబడినట్లు నిర్ధారించారు.కానీ ఇలా నిర్ధారించెయ్యడంలో ఒక చిక్కు ఉంది.ఆ గ్రహతారకల అమరిక కొన్ని వేల సంవత్సరాల కొకసారి పునరావృతమవుతూ ఉంటుంది కాబట్టి ఆయా సూక్తాలు ఆ పునరావృతమయ్యే సంవత్సరాలలో ఎప్పుడైనా చెప్పబడి ఉండవచ్చు కదా!

  University of Edinburghలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న సంస్కృత భాషలో అపారమైన పాండిత్యం గల Prof. Keith వేదాల వయస్సును నిర్ధారించడానికి ఎంతో పరిశ్రమ చేసి "The determination of the age of the Samhitas will mostly remain a mere guess work!" అని తేల్చి చెప్పారు.మిగిలినవాళ్ళు చేసిన నిర్ధారణలనీ తన పరిశ్రమనీ కలిపి చూసుకుని విసుగెత్తి ఆయన ఆ మాట అన్నాడో లేక ఈయన ఇంత మాట అనేశాక కూడా వేదసాహిత్యాన్ని ఏదో ఒక కాలానికి కుదించుదామనే చిరాశతో చేశారో తెలియదు గానీ మిగిలినవాళ్ళు చేసిన నిర్ధారణలు ఇలా ఉన్నాయి:Maxmuller వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 1200BCE నుంచి 1500BCE మధ్యన అని నిర్ధారించాడు.Keith మరియు McDonald వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 1200BCE నుంచి 2000BCE మధ్యన అని నిర్ధారించారు.Whitney మరియు ఇతర్లు వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 2000BCE వెనక అని నిర్ధారించారు.Winternitz వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 2000BCE నుంచి 2500BCE మధ్యన అని నిర్ధారించాడు.Jacobi వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 3000BCE నుంచి 4000BCE మధ్యన అని నిర్ధారించాడు.Satyavrata Samashrami వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 5000BCE వెనక అని నిర్ధారించాడు.Balagangadhara Tilak వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 6000BCE నుంచి 10000BCE మధ్యన అని నిర్ధారించాడు.Sampoornananda వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 18000BCE నుంచి 30000BCE మధ్యన అని నిర్ధారించాడు.Pt.Krishna Sastri Godbol వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 18000BCE వెనక అని నిర్ధారించాడు.Avinash Chandra Das Mukhopadhyaya వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 25000BCE నుంచి 50000BCE మధ్యన అని నిర్ధారించాడు.Lele Shastri వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 40000BCE నుంచి 54000BCE మధ్యన అని నిర్ధారించాడు.Rajpur Patangar Sastri వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 21000BCE అని నిర్ధారించాడు.Pavaki వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 2,40,000BCE వెనక అని నిర్ధారించాడు.Pt.Dinanath Sastri వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 3,00,000BCE వెనక అని నిర్ధారించాడు.Dr.Jvala Prasad వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 5,00,000BCE వెనక అని నిర్ధారించాడు.Nobel Laureate Materlink వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 70,00,000BCE వెనక అని నిర్ధారించాడు.Maahrshi Dayananda వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 200,00,00,000BCE వెనక అని నిర్ధారించాడు.భారతదేశం బయట ఉండి వేదం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నవారికీ భారతదేశం లోపల ఉండి వేదం గురించి తెలియని వారికీ తొలిసారి వేదాలను పరిచయం చేసిన మ్యాక్స్ ముల్లరు స్వయంగా వేదం యొక్క వయస్సు నిర్ధారించడం అసాధ్యం అని చెప్పి ఉన్నాడు కాబట్టి వేదం యొక్క ప్రాచీనతను నిర్ధారించడం అసంభవం!

  ReplyDelete
 3. సింధు నాగరికతా నిర్మాతలుగా ఇప్పుడు తెలిసిన జనసమూహం వైదిక సంస్కృతికి చెందినవారేనా అనేది ఇప్పటికీ నిర్ధారణ కాలేదు.మౌలికమైన విషయాలు కలుస్తున్నాయి గానీ కొన్ని అంశాలలో విభిన్నతలు కనిపిస్తున్నాయి.హరప్ప వంటివి సర్వసంపద్విలసితమైన నగరాలు అయితే వైదిక సంస్కృతికి చెందిన ప్రజలు గ్రామ్యజీవనులు.ముందు ముందు జరిగే కొత్త పరిశోధనల అనంతరం ఈ చిక్కుముడి విడిపోవచ్చు.

  ReplyDelete
 4. ఋగ్వేద సాహిత్యంలో యమున ప్రస్తావన లేదు.హిమశ్రేణి ప్రస్తావన ఉంది కానీ వింధ్య ప్రస్తావన లేదు.ఇప్పుడు మనం నదులలో శ్రేష్ఠమైనది అని చెప్పుకునే గంగకి సరస్వతి అదృశ్యం కాక మునుపు ఇంతటి ప్రాముఖ్యత లేదు కాబట్టి ఒకే ఒక్కసారి ప్రస్తావించబడింది - అదీ ఋగ్వేద కాలం ఆఖరి దశలో!అబ్రహామిక్ మత సాహిత్యంలో The Graet Flood అని వ్యవహరిస్తున్న పెద్ద వరద సరస్వతిని ముంచేసింది - ఆ సమయంలో ఇక్కడినుంచి వెళ్ళినవారే యూదులు.ఈ దురదృష్టకరమైన సంఘటనకి మనస్సు చెదిరి కకావికలై తమకు క్షేమకరమైన నివాసస్థలం కోసం చేసిన ప్రయాణమే "వలసకాండ"లో రూపం మారి కనిపిస్తుంది!

  ఈ సరస్వతిని తిరిగి గుర్తుపట్టడం వల్లనే "ఆర్య-ద్రవిడ సంఘర్షణ" జరిగిందనే వికృత సిద్ధాంతం అబద్ధమని తేలిపోయింది!ఇంకొక విశేషం యేమిటంటే, ఆ ప్రాచీన ఋగ్వేద సాహిత్యంలోనే సముద్రాల ప్రస్తావన ఉంది - ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారని చెప్తున్నారో అక్కడ సముద్రాలు లేవు కాబట్టి ఆ సిద్ధాంతాన్ని భుజాల మీద మోసుకు తిరిగిన వారందరూ అవి ఇప్పటి సముద్రాలకి ప్రత్యామ్నాయం కాదనీ అతి పెద్ద జలరాశిని ఋగ్వేద ఆర్యులు సముద్రం అని వర్ణించారనీ చెప్పాల్సి వచ్చింది.కానీ ఋగ్వేద సాహిత్యంలోనే సముద్ర జలాలు ఉప్పగా ఉంటాయన్నది వారికి తెలుసుననీ వాటిమీద నౌకలతో ఇతర భూభాగాలతో సంబంధం పెటుకోవడం గురించిన ప్రస్తావనలు కూడా ఉన్నాయనీ గమనిస్తే ఈ దేశంలోనే పుట్టి ఈ దేశపు గొప్పతనాన్ని దాచెయ్యడంలో ఆ చరిత్రకారులు ఎంత కృతనిశ్చయులై ఉన్నారో తెలుస్తుంది - అటువంటివాళ్ళు రాసిన చరిత్రని మన పిల్లల చేత చదివిస్తున్నందుకు సిగ్గు పడాలి!

  ReplyDelete
  Replies


  1. మనం నదులలో శ్రేష్ఠమైనది అని చెప్పుకునే గంగకి సరస్వతి అదృశ్యం కాక మునుపు ఇంతటి ప్రాముఖ్యత లేదు కాబట్టి ఒకే ఒక్కసారి ప్రస్తావించబడింది - అదీ ఋగ్వేద కాలం ఆఖరి దశలో -

   సరియైన స్టేట్మెంటేనా అబ్బీ ?


   జిలేబి

   Delete
  2. That was most of the researchers well acknowledged truth!

   Delete

  3. Is the statement about Ganga ? Appearing one time only or Saraswati one time only ?

   Delete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు