తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Friday, August 14, 2009

మనకు ఆదర్శము పరమేశ్వరుడి కుటుంబమే!


ఎప్పుడైనా శివపార్వతుల కుటుంబము ను గమనించారా?
మొదట వీరి కుటుంబ సభ్యులను చూద్దాం. శివపార్వతులు కాకవీరికొడుకులైన గణపతి, కుమారస్వామి కుటుంబ సభ్యులు. సరే, ఇక్కడ కుటుంబము మనకు ఎలా ఆదర్శమో చూద్దాము.

పరమేశ్వరుడు కేవలం మొలకు చర్మమును మాత్రం ధరించి, శరీరమంతటా విభూతిని ధరించి ఉంటాడు. ఇంత మాత్రమే మహాదేవుని వస్త్రాలు, అలంకారాలు. ఇక అమ్మ పార్వతీదేవిసర్వాలంకార భూషితయై ఉంటుంది.
సందర్బములో ఒకకుటుంబములోని భర్త తెలుసుకోవలసినవిషయం ఒకటి ఉంది. అదేమిటంటే తన కోసం చిన్నప్పటినుండీతనను ఎంతగానోప్రేమించిన తల్లిదండ్రులను, కుటుంబసభ్యులనుతన పుట్టింటినివదిలి వచ్చిన భార్యను ఎలా చూసుకోవాలనేది. భర్త ఎంత కష్టపడిఐనా తన అర్ధాంగిని ఆనందపరచాలి. అంటే భార్యకు నగలు కొనిపెట్టో,ఆస్తులు కూడబెట్టో లేక మంచి బట్టలు ఇచ్చోఆనందపరచమని అర్థం కాదు. పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు.అంటే తనలో సగభాగం అమ్మవారికి ఇచ్చాడు. ఆమాటకొస్తే శివుడి నివాసం రాజభవనంకాదు. అది ఒక కొండ మాత్రమే. ఉన్నంతలోనే తనూ,తన భార్య సుఖముగానే ఉన్నారు.


అమ్మవారు ఎంత సర్వాలంకారభూషితయై ఉన్నప్పటికీ అది పరమేశ్వరుని కొరకు మాత్రమే. కావాలంటే తనుకూడానార చీరలను మాత్రమే ధరించి ఉండగలదు. శివుడు లేని పార్వతి ఉండలేదు. అయ్యవారి సంతోషమేఅమ్మవారిసంతోషము. విషయం మనం దక్షయజ్ఞములో చూడవచ్చు. తన భర్తకు అవమానం జరిగిందని తనప్రాణాలనే త్యాగంచేసిన మహాసాధ్వి పార్వతీదేవి. ఇది ఒక భార్య తెలుసుకోవలసిన విషయం.


ఇక వీరి కుమారులు వినాయకుడు, కుమారస్వామి బిడ్డలు ఎలా ఉండాలనడానికి మంచి ఉదాహరణ. బిడ్డలకు అమ్మానాన్నలే ప్రపంచమని వారిచుట్టూ ప్రదక్షిణ చేయడమే సర్వతీర్థాలు,సర్వ పుణ్యక్షేత్రాలు,అందరు దేవతలూవీటన్నిటినీ దర్శించిన ఫలం కలుగుతుందని వినాయకుడు నిరూపించాడు. దీనిని తన తమ్ముడైనకార్తికేయునికిఉదాహరణగా ఒక అన్నగా గణేశుడు చూపించాడు. కార్తికేయుడు కూడా నిజం తెలుసుకొని తన అన్నయొక్కగణాధిపత్యాన్ని (గణాలకు అధిపతి పదవిని) సంతోషముగా అంగీకరించాడు. విధమైన పోట్లాటా పెట్టుకోలేదు.


ఇక శివపార్వతుల,గణేశకార్తికేయుల ఆభరణాలు,వాహనాల గురించి చూద్దాం.
శివుడి ఆభరణాలు పాములు, వాహనం నంది. అమ్మవారి వాహనము సింహము.
గణేశుని వాహనము ఎలుక, కుమారస్వామి వాహనము నెమలి.

మనకు తెలుసు సింహము అత్యంత భయంకర జంతువు,మృగరాజు. నెమలి,పాములు పరస్పర శత్రువులు. అలాగేపాములు,ఎలుకలు శత్రువులు.సింహము తన ఆహారముగా జంతువునైనా తినగలదు. అది ఎద్దు ఐనా, నెమలిఐనాసరే.
కాని కుటుంబములో ఇవేమీ ఒకదానికొకటి హాని తలపెట్టకుండా ఆనందముగా మసలుకొంటున్నాయి.

ఇక్కడి జంతువులను మనిషి మనస్తత్వాలుగా చెప్పుకోవచ్చు. ఇద్దరి మనస్తత్వాలూ ఒకేలా ఉండవు. అలాగేఒకకుటుంబములో కూడా విభిన్న మనస్తత్వాలు ఉంటాయి. కాని ఎవరూ ఎవరినీ బాధపెట్టుకోకుండా, పరస్పరహానికలిగించుకోకుండా అందరూ సంతోషముగా ఉండాలి.

ఓం నమః శివాయ
ఓం జగన్మాతాయ నమః
ఓం గం గణపతయే నమః
ఓం స్కందాయ నమః

గమనిక : ఇవి నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ఇక్కడ నేను శివపార్వతుల కుటుంబాన్ని ఒకదైవకుటుంబముగాకాక ఒక సాధారణ కుటుంబముగా మాత్రమే తీసుకొన్నాను.
,


3 comments:

  1. చాలా బాగుంది. మంచిని చక్కగా గ్రహించి వర్ణించారు. మరి గంగ గురించేమి చెప్తారు?? :)

    ReplyDelete
  2. నాకు చిన్నప్పడినుండీ శివుడంటే ఇష్టం.... కానీ...ఈ మధ్య అన్ని మతాల్ని కాస్త విమర్శణ దృష్టితో పరిశీలిస్తున్నాను. ఒక వైపు గంగ. మరో వైపు గణేషుడు ఆయనకు ఆయన వల్ల పుట్టిన కొడుకు కాదు. ఎక్కడో నదిలో ఏడుగురు అప్సరసల కడుపులో ఒక్క కుమారస్వామి జనించడం.మోహిని (విష్ణువు)తో శివుడు రమించడం...(extra marital affair + homo sexuality) తద్వారా అయ్యప్ప స్వామి జననం. ఇలాంటి తలా తోక లేని కధలు మన పురాణాల్లో చాలా ఉన్నాయి. దేవుడు మంచివాడే కానీ మధ్య దళారులే అత్యుత్సాహం, అర్ద తెలివితేటలు ప్రదర్శించి కల్పితకధలు రాసి ఆమె/ఆయన్ని/ .....ఇరకాటంలో పడేసారు.


    నా విమర్శకు మీరు నొచ్చుకోవద్దు.ఇది మీపై విమర్శ కాదు. తరాలుగా వస్తున్న దరిద్రాన్ని మనం ఆలోచించకుండా ఆచరిస్తున్నాం.

    ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు