తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Friday, October 8, 2010

హస్టల్లో ఉంచి చదివించినందుకు ప్రతిఫలం వృద్ధాశ్రమమా? ఒక యదార్థ సంఘటన.

సంఘటన నిజంగా రోజు నేను చూసిన సంఘటన.

స్టీరింగ్ (సెవెన్ సీటర్) ఆటోలో నేను వెళ్తుంటే అదే ఆటోలో ఒక తల్లీ,కొడుకుల మధ్య జరిగిన సంభాషణ ఇది.


తల్లి: "ఏరా! చిన్నప్పటినుండి కష్టపడి మిమ్మల్ని చదివించి,జీవితంలో వృద్ధిలోనికి తీసుకువచ్చినందుకు వృద్ధాశ్రమంలోచేర్పించి మాకు బానే బుద్ధిచెప్పారు .ఒకే కొడుకువి మాకు మీదగ్గర ఉండాలని ,శేషజీవితం గడపాలని ఉంటుంది కదా"


కొడుకు: "ఏం నెలనెలా డబ్బు నేనేకదా పంపుతున్నది మీకు. అదీగాక మీరు నన్ను చూడాలని అనినప్పుడలా నేనువస్తూనే ఉన్నాకదా. మీతో గడుపుతున్నాకదా"


తల్లి: అలా డబ్బు పంపడం కాదు. మాకు మీదగ్గర ఉండాలని, మనవడిని ఆడించాలని ఉంటుంది కదా"


కొడుకు : చూడమ్మా. నువ్వు,నాన్న నాకు మిగతా బంధువుల కన్నా ఏమంత ఎక్కువకాదు. తేడా ఏంటంటే మీరుకష్టపడి మీ డబ్బుతో నన్ను చదివించారు.అంతే. అసలు నన్ను 2 తరగతిలోనే హాస్టల్లో వేసి చదివించారు. అప్పటినుండి నా ఎడ్యుకేషన్ అంతా హాస్టల్లల్లోనే జరిగింది. అప్పుడప్పుడు నెలకొకసారి వచ్చి పలకరించి వెళ్ళేవారు. ఇంటికొచ్చి చదువుకుంటానంటే నీ భవిష్యత్తు కోసమే కదా మేము ఇద్దరమూ కష్టపడుతూ చదివిస్తున్నాము అన్నారు. ఏం నాకు మాత్రం మీవద్ద ఉండాలని అప్పుడు ఎంతబాధపడ్డానో మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు వినిపించుకోలేదు. ఐన విషయం ఎన్నిసార్లు చెప్పాలి. మీలాగే నేను కూడా డబ్బు పంపుతున్నా కదా. మీరన్నా అప్పుడు నెలకుఒకటిరెండుసార్లే వచ్చే వారు చూడడానికి.నేను మీరు పిలిచినప్పుడల్లా వస్తున్నా కదా. ఇక టాపిక్ ఎప్పుడూమాట్లాడకు.


ఇక్కడ నేను ఆటో దిగేసాను. తర్వాత ఏం వాదం జరిగిందో నాకు తెలీదు.ఆమె చేతిరుమాలు అడ్డుపెట్టుకొని ఏడుస్తున్నట్లుఅనిపించింది.

కాని సంఘటన నాలో నేటి మానవసంబంధాలను గూర్చి ఏవేవో అస్పష్ట ఆలోచనలను రేకెత్తిస్తోంది .

4 comments:

 1. విదేశాల నుండి ఖర్చు తగ్గుతుందని పిల్లలని చిన్నప్పుడే ఇండియా కి పంపించి హాస్టల్లో పెట్టి చదివించిన వాళ్ళ గతి ఏమవుతుందో!

  ReplyDelete
 2. @Rao S Lakkaraju గారన్నట్లు, ఇక్కడ (అమెరికాలో), అది మామూలైపోయింది. ఈ విషయం మీద రేడియోలో చర్చలు కూడా జరిగాయి - "పిల్లల్ని మీకోసం కంటున్నారా లేక మీ తల్లితండ్రులకోసం కంటున్నారా" అని. ఇక ఆటోలో మీరు చూసిన/విన్న సంఘటన గురించి అయితే - నో కామెంట్. నేనైతే, నా పిల్లల్ని బోర్డింగ్ స్కూల్లో ఉంచను, ఇండియా మా తల్లితండ్రుల దగ్గరికి పంపను అని ఎప్పుడో నిర్ణయించుకున్నాం.

  ReplyDelete
 3. ధర్మ సందేహం లేవనెత్తారు.
  అందరూ తల్లిదండ్రులదే తప్పని అంటున్నట్టు వుంది. వర్తమానం(ఆ కొడుకు) భూతకాలాన్ని(అమ్మని)తృణీకరిస్తే, భవిషత్తు వర్తమానాన్ని కాలదంటుంది. మరి ఆ సృహ వర్తమానానికి వుండాలి.

  ReplyDelete
 4. I heard from somebody long time back....children send parents to old age home because they sent them to creche in their childhood. This is definitely a valid point. The efforts of many people are motivated by their yearning for earning. Infact, many of us donot want simple lives...we run for comforts, extra comforts, 'higher and higher studies' and then towards luxuries, forgetting the ground realities. Children will grow up healthy and confident when both the father and the mother take proper care of them. With the pretext of earning, usually the father is away from the children. And it is very difficult for a mother to give away her 'self' and raise the children. Both , the mother and the father, should be able to work and earn, tone thier creative skills and also take care of the children. The working hours should be cut down phenominally.

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు