తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Wednesday, November 10, 2010

ఎవరు నిజమైన త్యాగులు?

సాధువులు, యోగులు, భక్తులు,సన్యాసులు మొదలైన వారు మేము భగవంతుడి కోసం అన్నీ త్యాగం చేసామంటారు. కాని క్రింది విషయాన్ని గమనించండి.

సకల ఐశ్వర్యవంతుడు,సకల సద్గుణవంతుడు అయిన భగవంతుడి కొరకు చిన్నచిన్న అల్పమైన డబ్బు,బంగారం,కామం లాంటి వాటిని వదులుకునే యోగులు,భక్తులు నిజమైన త్యాగులా?

లేక

అల్పమైన పై వాటి కోసం భగవంతుడినే వదులుకునే వ్యక్తులు నిజమైన త్యాగులా?

ఇప్పుడు చెప్పండి ఎవరు నిజమైన త్యాగులో?

3 comments:

 1. సురేష్ గారు,

  చాలా రోజుల తర్వాత మీరు, మీ టపా దర్శనం. బావుంది.

  $అల్పమైన పై వాటి కోసం భగవంతుడినే వదులుకునే వ్యక్తులు నిజమైన త్యాగులా?

  హ్మ్..చిన్న సందేహం!..అలాంటి వారు త్యాగం చేశాము అని చెప్పుకుంటున్నారనా మీ భావన? నే చూడలేదు అలా చెప్పుకొనేవాళ్ళని. కాకపోతే నిస్వార్థముగా మానవ/ఏ ప్రాణి సేవలో అయినా ఉండేవాళ్ళు భగవంతుని నమ్మక పొయినా/వదిలేసినా అది ధర్మ సమ్మతమే అని నా భావన.

  ReplyDelete
 2. రాజేష్ గారు! ఈ టపా లోని విషయము నగేంధ్రనాథ్ భాధురీ అనే సాధువు కేవలము వ్యంగ్యముగా చెప్పినది. ఇందులో నాభావనలు ఏవీ లేవండీ.
  ఇక మీరుచెప్పిన విషయం ధర్మసమ్మతమే అని నా భావన కూడా, అది కూడా అలాంటివారు నిస్వార్థముగా మానవ/ఏ ప్రాణి సేవలో అయినా ఉండేవాళ్ళు భగవంతుని నమ్మక పొయినా/వదిలేసినా కూడా భగవంతుని విషయములో తటస్థముగా ఉండేవరకే అని నా భావన.

  ReplyDelete
 3. $భగవంతుని విషయములో తటస్థముగా

  అవునండీ, మీతో ఏకీభవిస్తున్నాను. కానీ అలా "నిస్వార్థ"సేవ చేస్తూ, మూర్ఖముగా దైవదూషణ చేసేవారు అరుదు అని అనుకుంటున్నా.

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు