తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Friday, October 14, 2011

సింగరేణి కార్మికుల సమ్మె సమస్త మానవాళికి ఇస్తున్న హెచ్చరిక

సకలజనుల సమ్మెలో భాగంగా సింగరేణి బొగ్గు గనుల కార్మికుల సమ్మె వల్ల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీని వల్ల ధర్మల్ విద్యుత్ కేంద్రాల కు బొగ్గు సరఫరా నిలిచిపోయి విద్యుత్ ఉత్పత్తి కూడా చాలా తగ్గిపోయింది. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న కరెంటు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సరే నేను చెప్పదలచుకొన్న విషయం ఏంటంటే ఈ కార్మికుల సమ్మె వల్ల ప్రపంచమే గ్రహించాల్సిన హెచ్చరిక ఒకటి ఉంది.


ఎప్పుడో ఒకప్పుడు భూమి లో ఉన్న బొగ్గు నిల్వలు అన్నీ అయిపోతాయి. అప్పుడు ఏ కొద్దిగా బొగ్గు నిల్వలున్నా వాటి కోసం ప్రపంచ సంగ్రామాలే జరగవచ్చు. ఉన్న కొద్ది నిల్వలు కూడా అయిపోతే పూర్తిగా జల విద్యుత్, అణువిద్యుత్ మీదే ఆధారపడి మనం జీవించలేము. నిరంతర శక్తి ప్రధాత ఐన సూర్యుడు ఒక్కడే అప్పుడు మనకు దిక్కు. ప్రపంచ వ్యాప్తం గా సౌర విద్యుత్ ఉత్పత్తి పై ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. కాని ఇప్పుడు జరుగుతున్న ప్రయోగాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

3 comments:

 1. మనకున్న అదెపెద్ద విద్యుత్వనరు ధర్మల్ ప్రాజెక్టని ఈ మధ్య వరకూ నాకు తెలీదు. తెలిసాక ఆశ్చర్యమేసింది. How naive we are to be depending on coal? Things should certainly be changed.

  ReplyDelete
 2. @indian minerva garu
  well,let me give my 2cents here.
  A lot of European professors started research on alternative fuels as early as 1960s but the arab mafia attacked them, threatened them and stopped them from getting any substantial result in that direction. A professor from Prague told me this.
  Atleast we have nuclear power because research in that direction is bank rolled by big American companies..

  ReplyDelete
 3. కార్తీక్ నువ్వు చెప్పేది నిజమా? నమ్మలేకుండా ఉన్నాను. ప్రభుత్వం ఆ శాస్త్రజ్ఞులకు ఆ మాత్రం కూడా రక్షణ కల్పించలేకుండా పోయిందా?

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు