సమాధానం ఏంటి? వాళ్లకు అంత సాంకేతికపరిజ్ఞానం లేకనా? లేక మరో కారణం ఉందా?
సాంకేతిక పరిజ్ఞానం లేక పోతే క్రీ.శ 2వ శతాబ్దం లో తంజావూరు సమీపంలో కావేరీ నదిపై కట్టిన,ఇంకా ఉన్న కలనై ఆనకట్ట, క్రీ.పూ 4వ శతాబ్దంలో గుజరాత్ లో నిర్మించిన సుదర్శన జలాశయం, క్రీస్తుపూర్వమే ఈజిప్టులో నిర్మించబడిన సద్-అల్-కఫ్రా ఆనకట్టలు మొదలగువాటిని నిర్మించగలరా? కాబట్టి ఆనాటికే వారికి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నదనడంలో ఏమాత్రం సందేహం లేదు.
మరెందుకని వాటిని భారీస్థాయిలో నిర్మించలేదు? అలా నిర్మించకపోవడానికి గల కారణాలను మనం ఒకసారి ఆలోచిస్తే ఆశ్చర్యం కల్గక మానదు. మరి కారణాలు ఏమిటి?
నేడు మనకు అనుభవం అవుతూనే ఉంది. భారీ ఆనకట్టలవలన మనకు లాభాల కన్నా నష్టాలే భారీస్థాయిలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది భూమి యొక్క సమతుల్యత దెబ్బతినడం. అందువలనే భూకంపాల ప్రమాదం. ఇది శాస్త్రీయంగా నిరూపించబడిన సత్యం. ఇక నీటివనరుల కొసం జరుగుతున్న యుద్ధాలు.
మనిషి తన కనీస అవసరాలైన తిండి, నీరు, బట్టలు వీటి కోసం ఇతరులపై ఎంత తక్కువ ఆధారపడితే అంత ప్రశాంతం గా ఉండగలడు. ఇదే విషయాన్ని మన పూర్వీకులు ఆలొచించిఉన్నారు. వీళ్ళు పర్యావరణ,ప్రకృతి పరంగానూ, సామాజిక పరంగానూ ఆలోచించే భారీఆనకట్టలు నిర్మించలేదు.
ఉదాహరణకు మన దేశంలో ఇవి ఆలోచించే మన పూర్వీకులు ప్రతి జనపదానికీ (పల్లె లేక పట్టణం ఏదైనా కావచ్చు) ఒక చెరువును లేక అవసరం రీత్యా 2,3 చెరువులను త్రవ్వించారు. ఇక బావుల సంగతి చెప్పనవసరమే లేదు. బావులు మంచినీటికి, చెరువులు పంటపొలాలకు ఉపయోగపడతాయని తెలుసు. ఇలా చేయడం వలన పడిన వర్షం నీరు వృధా కాకుండా చెరువులు,బావులు రూపంలో ఉపయోగపడుతుంది.
ఇలా చేయడంవలన అత్యంత ముఖ్యప్రయోజనం ఏమంటే నీటి కోసం కనీసం పక్క గ్రామం పై కూడా ఆధారపడనవసరం లేదు. నీటి విషయంలో స్వయంసమృద్ధి అలానే నీటిపై ఆధారపడిన పంటల విషయంలో స్వయంసమృద్ధి తద్వారా తిండికోసం కూడా ఎవరిపైనా ఆధారపడనవసరం లేకుండా ఉండడం సంభవిస్తుంది. వీటి వలన నష్టాలకంటే లాభాలే ఎక్కువ ఉంటాయి.
ఇన్ని ఆలొచించే మన పూర్వీకులు భారీఆనకట్టల వంటి నిర్మాణాలు ఎక్కువ చేయలేదు.
Now we are constructing projects for contractors.
ప్రత్యుత్తరంతొలగించుబాగా చెప్పారు. ఇదే అభిప్రాయం నాకూ ఉంది. ఆయా నదులు ప్రత్యేకమైన శక్తి కలవిగా చెప్తూంటారు. బలరాముడు, ఆదిశంకరులు భాస్కరాచార్యుల వంటి మహాత్ములు తప్ప నదులగమనం లో పూర్వీకులు పెద్దగా జోక్యం చేసుకోలేజదు.ఈ విషయంలో ఆధునిక పరిజ్ఞానం వుండి ఉత్సాహవంతులైన వారు కాస్త పరిశోధన చేస్తే బాగుంటుంది
ప్రత్యుత్తరంతొలగించుసత్యనారాయణ ప్రసాద్
మంచి విషయం చెప్పారు.. ధన్యవాదాలు.
ప్రత్యుత్తరంతొలగించు1969వ సంవత్సరంలో కొయినా భూకంపం వచ్చింది. అది భారీ డ్యామ్ పుణ్యమే. అది కట్టే మహాశాస్ర్రవేత్తలకు భూకంపం వచ్చే అవుకాశం ఉందన్న ఊహ కూడా కలగలేదో లేదా వాళ్ళ లెక్లల ప్రకారం రాకూడని భూకంపం కాస్తా వచ్చి ప్రకృతే తప్పు చేసిందో మరి!
ప్రత్యుత్తరంతొలగించుడ్యాంలు సీస్మిక్ జోన్స్లో కట్టరు అని తెలుసు కాని, డ్యాం వల్లనే భూకంపాలొస్తాయని అంత ఖచ్చితంగా మీరు ఎలా తేల్చేయగలిగారు?!! 1969 తరువాత భూకంపాలు రాలేదాండి? ఎందుకో?! ఒక డ్యాంకు ఒకేసారి భూకంపం రావాలని ప్రకృతి నియమమేమైనా వుందాండి, శ్యామలీయం గారూ?!!
ప్రత్యుత్తరంతొలగించుఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
ప్రత్యుత్తరంతొలగించుశంకర్ & శ్యామలీయం గారూ...
ప్రత్యుత్తరంతొలగించుఈ టాపిక్ గురించి సివిల్ ఇంజినీరింగ్ సర్కిల్స్ లో పెద్ద డిబేట్ నడుస్తోంది.. డ్యాముల వల్ల వచ్చాయనుకుంటున్న భూకంపాలు 100 కు పైగా ఉన్నాయి.. దానికి వ్యతిరేకంగా వాదించే వాళ్ళ పాయింట్స్ కూడా ఉన్నాయి (ప్లాన్ లో లోపాలు వగైరా).. ఈ క్రింది లింకులు చూస్తే మీకు మరింత సమాచారం తెలియవచ్చు.. ఈ విషయం పై నేను 2004 లో ఒక జర్నల్ లో చదివాను.. దాని కోసం వెతికాను కానీ దొరకలేదు :(
http://www.internationalrivers.org/node/3845
http://hindu.com/fline/fl1627/16270870.htm
http://www.seis.com.au/Basics/Dams.html
http://news.bbc.co.uk/2/hi/science/nature/1974736.stm