తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Friday, June 1, 2012

వేమనకూ తెలుసు నేటి మానవుల అవసరాలేమిటో!

నేటి ప్రపంచంలో ఎంతో అవసరమైన సమాచార నైపుణ్యాలు(Communication skills),యాజమాన్యనైపుణ్యాలు(Management skills) నాటికాలం లోని వేమన పద్యాలలోనే చూడవచ్చు.
ఇందుకు ఉదాహరణగా కొన్ని పద్యాలు చూడండి.
మాట జెప్ప వినని మనుజుడు మూర్ఖుడు
మాట విన్న నరుడు మానుడగును
మాట వినగ జెప్ప మానుట కూడదు
విశ్వధాభిరామ వినుర వేమ
అర్థము:
ఎదుటివాడు చెప్పిన మాటలలోని మంచిచెడులను తెలుసుకోలేనివాడు మూర్ఖుడు.అందరిమాటలను ఆలకించేవాడు ఉత్తముడు.మాటలు విన్న త్రవత మంచిచెడులను ఆలోచించి సమాధానం చెప్పకపోవడం కూడా సమంజసం కాదు.

పదుగురాడు మాట పాడియై ధర జెల్లు
నొక్కడాడు మాట యెక్కదెందు
వూరకుండువాని కూరెల్ల నోపదు
విశ్వదాభిరామ వినుర వేమ
అర్థం:పదిమంది చెప్పే మాట అబద్దమైనా అదే న్యాయంగా చెల్లుతుంది.ఒక్కడే నిజం చెప్పినా నమ్మరు.వాగ్వివాదాల సమయంలో మౌనంగా ఉండేవాడే ఉత్తముడు.

తామసించి చేయదగదెట్టి కార్యంబు
వేగిరింపనదియు విషమగును
పచ్చికాయ దెచ్చి పడవేయ ఫలమౌనా
విశ్వదాభిరామ వినుర వేమ
అర్థం:ఏ పని ఐనా తొందరపడిచేయుట మంచిది కాదు.తొందరపడడం వలన పని చెడుతుంది.పచ్చికాయ తెచ్చి ముగ్గ పెట్టినంత మాత్రమున అది పండు(ఫలము)కాదు కదా.

శాంతమే జనులను జయమొందించును
శాంతముననె గురువు జాడ తెలియు
శాంతభావ మహిమ జర్చింపలేమయా
విశ్వదాభిరామ వినుర వేమ
అర్థం:శాంతస్వభావం ఉంటెనే ఏదైనా సాధించగలము.శాంతంతోనే గురువులు గొప్పవారయ్యారు.శాంతగుణం మహిమను వర్ణించలేము.

1 comment:

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు