తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Wednesday, June 13, 2012

ఇలా చేయడం శ్రీరామానుజాచార్యులకే చెల్లింది.


అష్టాక్షరీ మంత్రాన్ని బహిర్గతం చేసి మానవాళికి మహోపకారం చేసిన రామానుజాచార్యుల జీవిత సంఘటన ఇది.

శ్రీరామానుజాచార్యుల కాలంలో జనులు రోజూ ఒక వింతను చూసేవారు.

అదేంటంటే రామానుజులు శారీరకంగా అంత బలవంతులు కాకపోవడంతో రోజూ స్నానానికి వెళ్ళేటప్పుడు ఒక బ్రాహ్మణుని భుజంపై చేతులు వేసుకుని వెళ్ళేవారు. స్నానం చేసి తిరిగి వచ్చేటప్పుడు ఒక శూద్రుని భుజంపై చేతులు వేసి వచ్చేవారు. జనం దీనిని వింతగా చూసేవారు.

ఒక రోజు కొందరు ధైర్యం చేసి స్వామి ప్రవర్తనకు గల కారణం అడిగారు.
అప్పుడు ఆయన ఇలా అన్నారు.

"స్నానం వలన నా శరీరం మాత్రమే శుభ్రం అవుతోంది. మనసులోని మాలిన్యం పోవడం లేదు. ఇతరుల కన్నా నేను గొప్పవాన్ని అనే భావన అహంకారం అనిపించుకుంటుంది. మనిషి పురోగతికి ఆధిక్య భావన అన్నింటికీ మించిన ఆటంకం.స్నానం చేసి దేహ మాలిన్యాన్ని పోగొట్టుకొన్న తర్వాత నేను శూద్రున్ని తాకి నా అహంకారాన్నీ,మనోమాలిన్యాన్ని తొలగించుకుంటున్నాను. నేను ఎవరికన్నా గొప్పవాణ్ణీ కాను. నాకన్నా ఎవరూ తక్కువ వారూ కాదు. నాకాన్నా శూద్రుడు కూడా శ్రేష్ఠుడే అనే భావన వలన నాకు ఆనందం లభిస్తుంది."1 comment:

  1. chaala manchi vishayamulu charchku vasthunnai,idi manchi parinamamau.aithe inka chaala pramukyamaina vishayalu chaala unnai.vaatini kooda chusthe chaala baguntundi.evarini evaru kinchaparuchukokunda manchi hrudayamutho maatladu kunte baguntundi.

    ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు