తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Monday, May 27, 2013

పదాలతో ఆడుకోవడం అంటే ఇలా ఆడుకోవాలి....అన్నమయ్య కీర్తన

తెలుగు బాష యొక్క సొగసు,సింగారాలను మనం ఎంతగా కోల్పోతున్నామో ఎందరికి తెలుసు. రామాయణంలోని హనుమంతుని సీతాన్వేషణ ను వర్ణిస్తూ ఉన్నటువంటి ఈ క్రింది అన్నమయ్య కీర్తన వింటూ చదవండి. అప్పుడు తెలుస్తుంది తెలుగు బాష యొక్క సొగసుతనం.


ఇదె శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకె, 
అదనెరిగి తెచ్చితిని అవధరించవయ్యా ||

రామ నిను బాసి నీరామ నే చూడగ నా
రామమున నిను బాడె రామరామ యనుచు
ఆ మెలుత సీతయని యపుడునే తెలిసి
నీ ముద్ర వుంగరము నే నిచ్చితిని ||

కమలాప్త కులుడ నీకమలాక్షి నీ పాద
కమలములు తలపోసి కమలారి దూరె
నెమకి యాలేమను నీదేవి యని తెలిసి
అమరంగ నీసేమమటు విన్నవించితిని ||

దశరథాత్మజ నీవు దశశిరుని చంపి, యా-
దశనున్న చెలి గావు దశదిశలు పొగడ
రసికుడ శ్రీ వేంకట రఘువీరుడా నీవు
శశిముఖి చేకొంటివి చక్కనాయ పనులు ||

2 comments:

  1. తెలుగు పలుకుబడులు నుడికారాలు తెరమరుగై కనుమరుగై పోకూడదు! ఆంగ్ల మానసపుత్రులయిన నవతరం క్షున్నముగా తెలుగు లోతులను చేదుకోవాలి!

    ReplyDelete
  2. అవునండి సూర్యప్రకాష్ గారూ, మీరు చెప్పింది అక్షరాలా నిజం. అలా అయితేనే బాష నిలువగలదు.

    ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు