తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Friday, January 8, 2010

సచిన్ టెండూల్కర్ లా ఆలోచిస్తే ఇంతటి విధ్వంసాలు జరుగుతాయా?


సచిన్ ఆట గురించి మనకు తెలుసు. క్రింది సంఘటన చూస్తే మన ప్రవర్తనతో ఎదుటివారి మనసులను ఎలా గెలుచుకోవచ్చో తెలుస్తుంది.

ఆ మధ్య ముంబాయిలో ఒక కొత్త ఇల్లు కట్టుకొన్నాడు. అతను అలా కట్టుకోవడం వలన తమ ప్రాంతంలో ఇళ్ళ ధరలు పెరిగాయని ,సచిన్ అంతటివాడు తమ మధ్యకు వస్తున్నాడని అందరూ ఆనందించారు. కాని సచిన్ ఇల్లు కట్టుకొనేప్పుడు ఎదుటివారికి కలిగే అసౌకర్యం గురించి ఎంత ఆలోచించాడంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటి వారికీ స్వయంగా ఉత్తరాలు వ్రాశాడు. ఆ ఉత్తరం లోని విషయం ఇది.

" నేను మీ ప్రాంతములో ఇల్లు కట్టుకొంటున్నాను. అది పెద్ద ఇల్లు. ఇంటి నిర్మాణమప్పుడు ఎన్నో లారీలు పగలు,రాత్రీ తిరగవలసి వస్తుంది. ఇంకా ఇంటి నిర్మాణంలో బండలు పగలగొట్టవలసి వస్తుంది. చిన్నచిన్న డైనమెట్లు కూడా అందుకు ఉపయోగించవలసి వస్తుంది. ఎవరికీ దెబ్బలు తగులకుండా ఏర్పాటుచేసాము. కాని శబ్దం చాలా ఎక్కువగా ఉంటుంది. పగలురాత్రీ అని తేడా లేకుండా పని చేయాల్సి ఉండడం వలన మీకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. నన్ను మన్నించగలరు. ప్రాంతంలోకి నేను చేరిన తర్వాత నేను మీ కాలనీ అనే కుటుంబంలో ఒక సభ్యుడను అవుతాను కదా.

ఒక కుటుంబములో ఒక కొత్త సభ్యుడు రావడం అనేది ఒక తల్లికి బిడ్డ పుట్టడం లాంటిది. తల్లి నవమాసాలూ మోసేటప్పుడు చాలా కష్టాలు పడవలసి వస్తుంది. అప్పుడే బిడ్డ రాగలడు. అలానే మీ కాలనీ అనే కుటుంబములోనికి నేను కొత్తగా వస్తున్నాను కాబట్టి అందుకు మీరు కొంత కష్టం పడవలసిఉంటుంది అని తెలుపడానికి బాధపడుతున్నాను.. నన్ను మీ కుటుంబములోనికి చేర్చుకుంటారని ఆశిస్తున్నాను."

అసలు సచిన్ రావడమే తమకు ఎంతో గొప్పగా, ఆనందముగా భావించారు ఆ ప్రాంతవాసులు. ఐనా వారు ఏమీ అనలేదని సచిన్ ఊరుకోలేదు. వారి అసౌకర్యం ఊహించి ఎంత గొప్పగా వ్రాశాడో కదా.

ఇలా ఎదుటివారికి కలిగే బాధను మన విధ్వంసకారులూ (చీటికీమాటికీ ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్తులను తగులబెడుతున్నవారు) తెలుసుకొంటే బాగుంటుంది కదా

1 comment:

  1. వాళ్ళతో పాటుగా గాలి జనార్ధన్ రెడ్డి కూడా తెలుసుకుంటే బాగుంటుంది. ఓబుళాపురం గనులు మూతపడకముందు, మట్టిని తరలించే లారీలు మా ప్రాంతం మీదుగానే వెళతాయి. అవి తిరిగేటప్పుడు మా ప్రాంతంలోని ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. కంటిన్యూస్‌గా లారీలు వస్తుండటం వల్ల మాకు దగ్గరలోనే ఉన్న తాడిపత్రికి వెళ్ళాలంటే, గనుల్లోని మట్టితో వేషం వేసుకోవాల్సిందే. ఆ దారిలో ప్రయాణించాలంటే భయంగా ఉండేది. మాకు దగ్గరలోని యాడికిలో అయితే ఆ లారిల క్రింద పడి కోతులు వందల్లో చనిపోయి ఉంటాయి. గనులు మూతపడటానికి కొద్ది రోజుల ముందు, లారీల భీభత్సం అంతా ఇంతా కాదు.

    ఎంతైనా సచిన్ ఈజ్ గ్రేట్.

    ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు