
సూర్య లేక చంద్ర గ్రహణ సమయాలలో ఏమీ తినకూడదని శాస్త్రాలంటాయి. తినవచ్చని జనవిజ్ఞానవేదిక, హేతువాదం అంటాయి. ఐతే ఏది పాటించాలి అనే విషయంపై ఎన్నో వాదోపవాదాలు, చర్చలు జరిగాయి. నాకూ శాస్త్రాలపై, సైన్సు పై గౌరవం ఉంది. ఐతే నేను శాస్త్రం చెప్పినదానికే ఓటు వేసి సూర్యగ్రహణ సమయంలో ఏమీ తినలేదు. ఒక్కటే కారణం "కృతజ్ఞత".
మన అందరికీ తెలుసు సూర్యుడి వలనే వానలూ, పంటలూ పండుతున్నాయని,మనం జీవనం సాగిస్తున్నామని. ఒక ఉదాహరణగా మనకు ఎంతో సహాయం చేసిన వ్యక్తి ప్రతిష్ఠకు అతని ప్రమేయం వలనో అతని తప్పు వలనో మచ్చ పడితే ఎంతో బాధపడతామే అలాంటిది అతని ప్రమేయం లేకుండానే ఏదైనా కళంకం కలిగిందంటే మనకు ఇంకెంత బాధ కలుగుతుందో ఊహించగలము.
నిత్యమూ మనకు సహాయపడే మనకు బాంధవులైన సూర్యచంద్రులకు గ్రహణం వలన తాత్కాలికముగా వారి సమయంలోనే వారి ప్రతిష్ఠ కు భంగం కలుగుతోంది. అంటే కనుమరుగు చేయబడుతున్నారు. లోక బాంధవులైన సూర్యుడు,చంద్రులకు సైన్సు చెప్పే ప్రకారం కావచ్చు లేక శాస్త్రాలు చెప్పే ప్రకారం కావచ్చు గ్రహణాలు ఏర్పడడం ద్వారా వారు మూసివేయబడుతున్నారు. వారి వలన ఆహారం తింటూ వారికి మచ్చ పడుతున్న సమయంలో ఆహారం తినడం కృతఘ్నత అని అనుకొంటున్నాను. అందుకే నేను తినలేదు.
ఈ వాదం పిచ్చివాడి ప్రేలాపన అనుకొన్నా ఫర్వాలేదు కాని నా ఉద్దేశ్యం మాత్రం కృతజ్ఞత ప్రకటించడమే.