తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Tuesday, November 30, 2010

అద్వైతం లో ద్వైతం,విశిష్టాద్వైతాలు ఎలా కలిసిపోతాయో చూడండి - గణితం (లెక్కలు) ప్రకారం నిరూపణ

మనకు తెలుసు
ద్వైతం అంటే మనలోని జీవాత్మ,పరమాత్ముడు వేర్వేరు అని,
విశిష్టాద్వైతం అంటే జీవుడిలోనే పరమాత్మ ఆత్మగా వెలుగుతున్నాడని,
అద్వైతం అంటే జీవాత్మే మేఘాల(మాయ)చే కప్పబడిన సూర్యుడు(పరమాత్మ) అని అంటే జీవాత్మ కు పరమాత్మకు భేధం లేదని .

ఇంకా సరళంగా చెప్పాలంటే

ద్వైతం అనగా నేను వెలుగు లో ఉన్నాను అని,
విశిష్టాద్వైతం అనగా నాలో వెలుగు ఉందని,
అద్వైతం అంటే నేనే వెలుగు అని చెప్పవచ్చు.

ఇప్పుడు గణితం ప్రకారం చూద్దాం.


ద్వైతం ను A అని, విశిష్టాద్వైతమును B అని అనుకుందాము.

ఇప్పుడు ద్వైతం,విశిష్టాద్వైతములను అనగా A,B లను కలుపుదాము. అంటే నేను వెలుగులో ఉన్నాను,నాలో వెలుగు ఉంది అనే ఈ రెండు భావనలను కలిపామనుకోండి. అంటే (A+B). అపుడు నేను కు బయటా,లోపలా వెలుగు ఉంది అని అర్థం అవుతుంది. అంటే మొత్తం వెలుగే ఉంది, కేవలం నేను
అనే భావనే బయటి వెలుగును, లోపలి వెలుగును విడదీస్తోంది.

ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే కుండ లోని నీరు (విశిష్టాద్వైతం) , అదే కుండను ఒక నదిలో పూర్తిగా ముంచితే అపుడు కుండ నీటిలో ఉంటుంది (ద్వైతం) కదా. ఇపుదూ కుండలోనూ, కుండ బయటా కూడా నీరే ఉంది కదా. ఇపుడు బయటి నీరుకూ, కుండలోని నీటికీ అడ్డం కుండ కదా. ఈ కుండే నేను అనే భావన.

ఇప్పుడు కుండను పగలగొట్టేసామనుకోండి అప్పుడు బయటి నీరు,లోపలి నీరూ ఒక్కటే అయిపోయి కుండ అందులో కరిగిపోతుంది. ఇప్పుడు కుండకు అస్థిత్వం,లేక ఉనికి (Existance)ఎక్కడ ఉంది?కుండ కరిగిపోయి అంతా ఒకటే (నీరే) అయిపోయింది కదా! అదే కదా అద్వైతం.

అంటే ద్వైతం, విశిష్టాద్వైతాల కలయికే అద్వైతం అని గణితం ప్రకారం నిరూపించవచ్చు.

ఇక అద్వైతంలోని విభాగాలే ద్వైతం,విశిష్టాద్వైతం అని నిరూపిద్దాం.

గణితంలో సమితులు అనే భావన వినేఉంటారు.
ద్వైతం ను A అనే సమితి గానూ, విశిష్టాద్వైతం ను B అనే సమితిగానూ అనుకొందాము.
అప్పుడు A,B లను రెండూ కలిపితే A union B అంటే (A ∪ B).
ఇంతకుముందు నిరూపణ ప్రకారం A,B ల కలయికే అద్వైతం కదా. అంటే ఇక్కడ ఆ A(ద్వైతం),B(విశిష్టాద్వైతం) ల కలయిక (A ∪ B).

గణితంలోని సమితుల ప్రకారం A,B లు రెండు సమితులైతే A,B లు రెండూ (A ∪ B)కి ఉపసమితులు అవుతాయి.

అంటే A ⊂ (A ∪ B). ==>> A is subset of (A ∪ B) (A అనే సమితి (A ∪ B) కి ఉపసమితి.)

B ⊂ (A ∪ B) ==> B is subset of (A ∪ B) (B అనే సమితి (A ∪ B) కి ఉపసమితి.)

ఇలా నిరూపణ చేయవచ్చు.

అంటే నేను అనే భావనకు బయట ద్వైతం, లోపలి వైపు విశిష్టాద్వైతం ఉన్నాయని ఆ నేను అనే భావనను తొలగిస్తే అద్వైతం అనే భావన అని అర్థం చేసుకోవచ్చు. ఈ టపాలో "నేను" అనే భావనను "మాయ" అని, సూర్యుడిని కప్పిన "మేఘం", శరీరం అని ప్రయోగించాను. రమణమహర్షుల ప్రకారం "నేను" ను
ప్రయోగించలేదు.


4 comments:

 1. కుండ వున్నంతవరకు, నువ్వు చెప్పినది సరి కాదు. కుండలేనప్పుడు, వీటిగురించి అలోచించాల్సిన పని లేదు.

  ReplyDelete
 2. $సురేష్ గారు

  చక్కగా, చాలా సులువైన పద్దతిలో అదీ గణిత పద్దతిలో మూడు ఆరాధనా పద్దతుల్ని/ఉపాసనల్ని అద్భుతంగా వివరించారు ఈ అజ్ఞానికి. నెసర్లు.
  శాక్తేయం ఏ కోవలోకి చెందుంది లేక అది కేవలం అమ్మ/శక్తి ని పూజించే వారి ఉపాసనా మార్గమేనా?


  మరల ఒకసారి కృతజ్ఞతలు పంచుకున్నందుకు.

  ReplyDelete
 3. $WitReal గారు

  మీరు చిత్తగించింది, అర్దమయింది ఇలా ఉన్నట్లుంది.

  "చెడు(నేను అనే మాయ) వున్నంతవరకు, మంచి గురించి చెప్పడం సరి కాదు. చెడులేనప్పుడు, మంచిగురించి అలోచించాల్సిన పని లేదు."

  మీకు కూడా నెసర్లు.. ఇంత బాగా అర్దం చేసుకున్నందుకు!. Oh God, please save me.

  ReplyDelete
 4. @ రాజేష్ జి గారు!
  శాక్తేయం కూడా ఒక భక్తిమార్గమే. భక్తి ద్వైతంలోనూ, విశిష్టాద్వైతంలో రెండింటిలోనూ ఉంటుంది.

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు