తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Tuesday, December 7, 2010

భగవద్గీత సారం తెలిసినవారు(అర్థమైనవారు) విశ్వంలో ఎంతమంది ఉన్నారు?

భగవద్గీత సారం తెలిసిన వారిని ఊహించండి ఎంతమంది ఉంటారో! మనము ఊహించడానికి కూడా వీలు లేని ప్రశ్న ఇది. సరే చెబుతున్నాను.

పరమశివుడు ఈ విషయం గురించి ఇలా అన్నాడు.

" నారాయణుడికి తెలుసు,నాకు తెలుసు ,శుకుడికి తెలుసు,వ్యాసుడికి తెలిసి ఉండవచ్చు కొద్దిగా. అంతే!"

చూసారా విన్న అర్జునుడికే కాదు వ్రాసిన వ్యాసుడికి కూడా సారం పూర్తిగా తెలియదన్నమాట. కాని వ్యాసపుత్రుడైన శుకుడికి తెలుసు.శుకుడు పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని. శుకుడి గురించి వివరం నా టపా శుకమహర్షి - మన పురాణ ఋషులు లో ఉంది.


మరి నేటికాలంలో భగవద్గీతను గురించి తమకే అంతా తెలుసు అన్న అవాకులుచవాకులు మాట్లాడేవారి సంగతి కాస్త ఆలోచించండి.6 comments:

 1. మాట్లాడటం దేముంది ఎవరైనా చేయవచ్చుగనుక మాత్లాడుతుంటారు

  ReplyDelete
 2. for humans who want to know a little about what bhagvadgita is xplains,pl read "yadardha geetha",written by swami'ADAGADAANANDA".iT WAS PUBLISHED BY GANGA BHAVAN TRUST OF VAARANAASI.website-yatharthgeetha.com/eventhough it was preached by god,its content is purely'MAANAV DHARMA"..ONLY.

  ReplyDelete
 3. భగవద్గీత ఒకసారి చదివిన వెను వెంటనే, "ఆహా! నాకు భగవద్గీత సారాంశం అంతా తెల్సిపోయింది" అను కుంటే పొరపాటే... రెండోసారి చదువున్నప్పుడు, మొదటిసారి చదివినప్పుడున్న భావంలో మార్పు వస్తుంది. మూడోమారు చదువుతున్నప్పుడు మళ్ళీ ఇంకో కొత్త అర్ధం స్పురిస్తుంది. ఇలా చదువున్నకొద్దీ మనం అనుభూతుల్లో మార్పు, ఒక్కక్క సారి ఒక్కోలా ఏరోజు కారోజు కొత్త విషయం లా అనిపించే దివ్య గీతా సారం. ఇది ఎవరి వాళ్ళు అనుభవిస్తేనే గాని తెలీదు. సంపూర్ణంగా తెలుసుకోడం అది రాసిన వ్యాసుని వల్ల కూడా అవలేదని దాని భావం... ఈ కారణంగా ఇప్పటి భగవద్గీత పారాయణం చేసేవాళ్ళని, ఏదో వాళ్ళకి తెల్సిన విషయాల్ని మిగతా వాళ్ళకి చెప్పి, మంచి విషయాల్ని చెప్పేవాళ్ళని విమర్శించక్కర్లేదు.

  ReplyDelete
 4. $మరి నేటికాలంలో భగవద్గీతను గురించి తమకే అంతా తెలుసు అన్న అవాకులుచవాకులు మాట్లాడేవారి సంగతి కాస్త ఆలోచించండి.

  మంచిగా చెప్పారు. మిడిమిడి జ్ఞానం తో మాట్లాడేవాడికి ఎప్పటికైన ముప్పు తప్పదు అని తెలిసిందే కదా. పైన పెద్దలు చెప్పిందీ నిజమే.

  మంచి విషయాన్ని పంచుకున్నందుకు నెసర్లు.

  ReplyDelete
 5. @ voleti గారు!
  "ఈ కారణంగా ఇప్పటి భగవద్గీత పారాయణం చేసేవాళ్ళని, ఏదో వాళ్ళకి తెల్సిన విషయాల్ని మిగతా వాళ్ళకి చెప్పి, మంచి విషయాల్ని చెప్పేవాళ్ళని విమర్శించక్కర్లేదు."

  ఇక్కడ ఎవరిని విమర్శించలేదండి. అంతా తమకు తెలుసు అన్న అహంభావం తో ఉన్నవారిని,మాట్లాడేవారిని మాత్రమే అన్నాను.

  ReplyDelete
 6. శ్రీ భగవద్గీత గురించి వేదవ్యాసునికి కూడా తెలియదు అనుకోవడం మన పరిమిత జ్ఞానం మాత్రమే.

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు