తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Tuesday, December 20, 2011

భగవద్గీత పై నిషేధం - ఎవరికి నష్టం?

పాపం "ఖర్మ"జీవులు భగవద్గీతను నిషేధించాలని చూస్తున్నవాళ్ళు.

అమృతం త్రాగమని ఇచ్చాడు దేవుడు, కాది ఇది విషం అని నిరాకరిస్తే అది ఎవరికి నష్టం?

పద్దెనిమిది అంతస్తుల సౌధం ఇచ్చాడు భగవంతుడు.దీన్ని ఆశ్రయించుకొని జీవితాన్ని పండించుకొమ్మన్నాడు దేవుడు. వద్దు మాకు అవసరం లేదు అంటే ఎవరికి నష్టం?

అనేక వేలఏళ్ళుగా తుఫానులకు, భూకంపాలకు అనేకానేక భీభత్సాలకు ఎదురొడ్డి ఏమాత్రం తొణకని,చెదరని 18 అంతస్తుల సౌధమే మాకు వద్దు అంటే ఎవరికి నష్టం?

ఏమనుకుంటున్నారు ఈ మతచాందసులు?
భగంతుడు మానవుడి పై ఆధారపడి ఉన్నాడా లేక మానవుడు భగవంతుడిపై ఆధారపడి ఉన్నాడా?

భగవద్గీతను నిషేధించి మెల్లమెల్లగా సనాతన వైదిక ధర్మాన్ని నశింపజేయాలని అనుకుంటే అది వారి మూర్ఖత్వమే అవుతుంది కాని ఇతరం కాదు. భారతీయులు ఏ మతం వారు కానివ్వండి, భారతీయుల నరనరాలలోనూ సనాతన వైదికధర్మమే ప్రవహిస్తోంది.

భగవద్గీతను ఒకమతగ్రంధం గా భావించి నిషేధించాలని చూస్తున్న వీరి అజ్ఞానానికి నవ్వుకోవడం తప్ప సగటు భారతీయుడు ఏ మాత్రం బాధపడడు. బాధపడతాడు ఎందుకంటే అది వారి అజ్ఞానం గురించే.

8 comments:

 1. ఎవరి దృక్కోణంనుండి వారు ప్రపంచాన్ని వీక్షిస్తారు.

  తమ యింటి కప్పు చిల్లు లోంచి కనిపించేదే ఆకాశం అని వాదించే వాళ్ళకు యేం చెప్పీ లాభంలేదు.

  మనుషులు ఉన్నంతకాలం వాళ్ళ మధ్య విబేధాలూ ఉంటాయి.

  ReplyDelete
 2. చక్కగా చెప్పారండి.

  ReplyDelete
 3. I didn't know how it was translated. I cant comment on it. But real geeta is good. but real geeta says kill your brothers & relatives for justice. they might got affended..

  May be if they translate entire MahaBharata(Jaya) that might make sense.

  since i tink geeta says how you should be without a context...

  ReplyDelete
 4. భగవద్గీతను నిషేధించి మెల్లమెల్లగా సనాతన వైదిక ధర్మాన్ని నశింపజేయాలని అనుకుంటే అది వారి మూర్ఖత్వమే అవుతుంది కాని ఇతరం కాదు. భారతీయులు ఏ మతం వారు కానివ్వండి, భారతీయుల నరనరాలలోనూ సనాతన వైదికధర్మమే ప్రవహిస్తోంది.
  చాల బాగా చెప్పారు తమ్ముడూ, అహం బీజ ప్రజః పిత నేను ఈ సృష్టి రూపి వృక్షానికి బీజాన్ని అని పరమాత్ముడు చెప్పాడు, భరత దేశం లో భగవంతుడు వస్తాడు, ఇంకే దేశంలో రాడు కారణం భ అంటే వెలుగు రత అంటే మునిగి ఉండేవాడు భారత్ అంటే జ్ఞానమనే వెలుగులోనే సదా ఉండేవాడు. పవిత్రతే జ్ఞానం అది ఒక్క భారత దేశం లోనే పాటిస్తారు. వేరే దేశాలలో డానికి ప్రాధాన్యత లేదు. అనాది అవినాశి దేశం ధర్మం ఒక్క భారత దేశం మాత్రమె. సృష్టి ఆది నుంచి అంతం వరకు వినాశనం లేని జ్ఞానం ఒక్క భారత దేశం సొంతం. వినాశన మయ్యే వారు బలహీన ఆత్మలు పిరికి వారు గెలిచినా వారిని ద్వేషించడం లో కొత్తేమి లేదు. అందరిలాగే యుగ ప్రభావం వల్ల అతిగా మనమే చెడిపోయాము, కానీ అందరికన్నా ఎక్కువగా పరిష్కరించ బడేది మనమే. పతిత పావనా రమ్మని పిలిచేది మనమే. భగవంతుడు వచ్చిన దగ్గరనుంచి ఆయనను గురుతు పట్టి మొదటి నంబర్లో పురుషార్ధం (తపస్సు అనండి, యోగం అనండి భారతీయ రాజ యోగం సుప్రసిద్ధం) చేసి మన పాపాలు భస్మం చేసుకుని నంబర్ వన్ లో నిలిచేది మనమే. విదేశీయులు అంత చెడిపోరు అంత బాగూ పదారు. మధ్యస్తంగా ఉంటారు. అందుకే ఇప్పటికి వారి బుద్ధి బాగానే పనిచేస్తోంది మనబుద్దే విపరిఏతమ్గ చెడి పోయింది. కానీ ఒక్క విశేష గుణం మనని వారికన్నా ఎక్కువ నంబర్లో ఉంచుతోంది అదే పరమాత్ముడిని సాధారణ శరీరం లో వచ్చిన వాడిని మనం గురుతు పడతాము. సచ్చే దిల్ పర సహబ్ రాజి అన్నట్లు మనం ఆయనతో సత్యంగా ఉంటాము అప్పుడు మన పైన ఆయన రాజి ఐపోతారు. భగవంతుడే రాజి ఐనప్పుడు క్యా కారేగా కాజి. ఈ విధర్మీయులు విదేశీలు మనతో ఒడి పోతారు. చివరకు సత్యం గెలుస్తుంది. జయహో అవినాశి భారత్ ఖండ్ అవినాశి బాప్, అవినాశి జ్ఞాన్.


  --

  www.a1spiritual.info
  www.pbks.info

  ReplyDelete
 5. ఎవరికీ నష్టం లేదు. మన ఇండియాలో బైబిల్‌ని నిషేధిస్తే సరిపోతుంది.

  ReplyDelete
 6. భగవద్గీతనీ నిషేధించ కూడదు.బైబిల్నీ నిషేధించకూడదు.వాటిలోని మంచి చెడ్డలను,సారాన్ని పాఠకులకే చదివి నేర్చుకొనే స్వేచ్చ ఉండాలి.

  ReplyDelete
 7. శ్రీ కృష్ణ పరమాత్మ ప్రభోదించిన భగవద్గీత సుమారుగా క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాలు. మరి క్రీస్తు ప్రభోదించిన 'ప్రేమ, కరుణ, సేవ ' సూత్రాలు 2000 సంవత్సరాలు పూర్వం నాటివి . ఐతే మహాభారతం లో ప్రేమ , కరుణ , సేవ గూర్చి క్రీస్తు కన్న ముందే హైందవ ఇతిహాసాలలో భోదించారు అని బైబిల్ చేతిలో పట్టుకొని తిరిగే వాళ్ళు మరచిపోయి మాట్లాడితే , వాళ్ళు నిజంగా దేవుని బిడ్డలా అని సందేహం.

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు