Monday, December 10, 2012
అహింస,అహింస అంటున్నారు. నిజం గా అహింస అంటే ఏంటో మనకు తెలుసా?
Wednesday, November 21, 2012
Tuesday, October 23, 2012
Monday, October 22, 2012
సృష్టి నడవడంలో భగవంతుడు ఒక క్రమబద్ధమైన విధానం ఏర్పరచాడా? (నా (అందరి) అనుభవం)
ఒక అయస్కాంతం ఉన్నదనుకోండి. అది తనకు దూరంగా ఉన్నవాటిని అతితక్కువ బలంతో ఆకర్షిస్తూ, ఆ వస్తువులు దగ్గరకు వచ్చేకొద్దీ అత్యంత బలంగా ఆకర్షిస్తుందని. ఇది ఆ అయస్కాంత పదార్థ ధర్మం.
మరి మన నిజ జీవితంలో కూడా మన అందరికీ ఒక అనుభవం ఎదురవుతూనే ఉంటుంది. అదేమంటే మనం ఫలానాచోటికి(గుడికో లేక మన ఇంటికో,కాలేజుకో,సినిమాకో) వెళ్ళాళనుకోండి. ఆ చోటు దూరం ఉన్నంత వరకు మనం మామూలుగానే వెళుతుంటాము. కానీ చేరవలసిన ప్రదేశానికి దగ్గర అవుతున్నకొద్దీ మన నడకలో వేగం పెరుగుతుంది కదా. దగ్గరయ్యే కొద్దీ ఎంత త్వరగా చేరుకుంటామా అన్నంత వేగంగా నడుస్తాము.ఒక వేళ ఏదైనా వాహనంలో కనుక వెళ్తుంటే దగ్గరయ్యే కొద్దీ మానసికంగా ఆత్రుత చెందుతాము.
ఇక్కడ కంటికి కనిపించే లోహాల విషయంలోనూ, కనిపించని ఒక భౌతికమైన ఆకృతి అంటూ ఏమీలేని మనసుకూ కల ఒకే ధర్మాన్ని కనుక ఆలోచిస్తే ఆశ్చర్యం కల్గుతుంది.
అందుకే నాకు ఈ అనుమానం వచ్చింది. ఇలా ఆలోచించుకుంటూ వెళ్తే అన్నిటికీ మూలమైన ధర్మం,వస్తువు ఏదో ఉందనీ, దాని నుండే అన్నీ ఉత్పన్నమైనాయనీ మనకు లీలగా అనిపిస్తుంది. బహుశా ఆ మూలాన్నే మనం భగంతుడిగా కొలుస్తున్నామనుకుంటున్నాను.
Friday, September 28, 2012
పరమేశ్వరుడి కుటుంబము - జీవవైవిధ్యము
మొదట వీరి కుటుంబ సభ్యులను చూద్దాం. శివపార్వతులుకాకవీరికొడుకులైన గణపతి, కుమారస్వామి ఈ కుటుంబ సభ్యులు.సరే, ఇక్కడ ఆ కుటుంబము మనకు ఎలా ఆదర్శమో చూద్దాము.
పరమేశ్వరుడు కేవలం మొలకు చర్మమును మాత్రం ధరించి,శరీరమంతటా విభూతిని ధరించి ఉంటాడు. ఇంత మాత్రమేఆమహాదేవుని వస్త్రాలు, అలంకారాలు. ఇక అమ్మపార్వతీదేవిసర్వాలంకార భూషితయై ఉంటుంది.ఈ సందర్బములో ఒకకుటుంబములోని భర్తతెలుసుకోవలసినవిషయం ఒకటి ఉంది. అదేమిటంటే తన కోసం చిన్నప్పటినుండీతననుఎంతగానోప్రేమించిన తల్లిదండ్రులను, కుటుంబసభ్యులనుతన పుట్టింటినివదిలి వచ్చిన భార్యను ఎలాచూసుకోవాలనేది. భర్త ఎంత కష్టపడిఐనా తన అర్ధాంగిని ఆనందపరచాలి. అంటే భార్యకు నగలుకొనిపెట్టో,ఆస్తులు కూడబెట్టో లేక మంచి బట్టలు ఇచ్చోఆనందపరచమని అర్థం కాదు. పరమేశ్వరుడుఅర్ధనారీశ్వరుడు.అంటే తనలో సగభాగం అమ్మవారికి ఇచ్చాడు. ఆమాటకొస్తే శివుడి నివాసంరాజభవనంకాదు. అది ఒక కొండ మాత్రమే. ఉన్నంతలోనే తనూ,తన భార్య సుఖముగానే ఉన్నారు.
అమ్మవారు ఎంత సర్వాలంకారభూషితయై ఉన్నప్పటికీ అది పరమేశ్వరుని కొరకు మాత్రమే. కావాలంటేతనుకూడానార చీరలను మాత్రమే ధరించి ఉండగలదు. శివుడు లేని పార్వతి ఉండలేదు. అయ్యవారిసంతోషమేఅమ్మవారిసంతోషము.ఈ విషయం మనం దక్షయజ్ఞములో చూడవచ్చు. తన భర్తకుఅవమానం జరిగిందని తనప్రాణాలనే త్యాగంచేసిన మహాసాధ్వి పార్వతీదేవి. ఇది ఒక భార్యతెలుసుకోవలసిన విషయం.
ఇక వీరి కుమారులు వినాయకుడు, కుమారస్వామి బిడ్డలు ఎలా ఉండాలనడానికి మంచి ఉదాహరణ.బిడ్డలకు అమ్మానాన్నలే ప్రపంచమని వారిచుట్టూ ప్రదక్షిణ చేయడమే సర్వతీర్థాలు,సర్వపుణ్యక్షేత్రాలు,అందరు దేవతలూవీటన్నిటినీ దర్శించిన ఫలం కలుగుతుందని వినాయకుడునిరూపించాడు. దీనిని తన తమ్ముడైనకార్తికేయునికిఉదాహరణగా ఒక అన్నగా గణేశుడు చూపించాడు.కార్తికేయుడు కూడా నిజం తెలుసుకొని తన అన్నయొక్కగణాధిపత్యాన్ని (గణాలకు అధిపతి పదవిని)సంతోషముగా అంగీకరించాడు. ఏ విధమైన పోట్లాటా పెట్టుకోలేదు.
ఇక శివపార్వతుల,గణేశకార్తికేయుల ఆభరణాలు,వాహనాల గురించి చూద్దాం.శివుడి ఆభరణాలు పాములు, వాహనం నంది. అమ్మవారి వాహనము సింహము.గణేశుని వాహనము ఎలుక, కుమారస్వామి వాహనము నెమలి.
మనకు తెలుసు సింహము అత్యంత భయంకర జంతువు,మృగరాజు. నెమలి,పాములు పరస్పరశత్రువులు. అలాగేపాములు,ఎలుకలు శత్రువులు.సింహము తన ఆహారముగా ఏ జంతువునైనాతినగలదు. అది ఎద్దు ఐనా, నెమలిఐనాసరే.కాని ఈ కుటుంబములో ఇవేమీ ఒకదానికొకటి హాని తలపెట్టకుండా ఆనందముగామసలుకొంటున్నాయి.
ఇక్కడి జంతువులను మనిషి మనస్తత్వాలుగా చెప్పుకోవచ్చు. ఏ ఇద్దరి మనస్తత్వాలూ ఒకేలా ఉండవు.అలాగేఒకకుటుంబములో కూడా విభిన్న మనస్తత్వాలు ఉంటాయి. కాని ఎవరూ ఎవరినీబాధపెట్టుకోకుండా, పరస్పరహానికలిగించుకోకుండా అందరూ సంతోషముగా ఉండాలి.
ఓం నమః శివాయఓం జగన్మాతాయ నమఃఓం గం గణపతయే నమఃఓం స్కందాయ నమః
గమనిక : ఇవి నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ఇక్కడ నేను శివపార్వతుల కుటుంబాన్నిఒకదైవకుటుంబముగాకాక ఒక సాధారణ కుటుంబముగా మాత్రమే తీసుకొన్నాను. ,
Thursday, September 27, 2012
Monday, September 24, 2012
"No cell phone Day"(సెల్ఫోన్రహిత దినము)అని ఒక రోజును జరుపుకుంటే బాగుంటుంది కదా!

అదేమంటే mothers day,fathers day,lovers day లాగా No cell phone Day కూడా ప్రభుత్వం నిర్భందంగా విధిస్తే బాగుంటుంది కదా అని.
మరి అత్యవసర సమాచారం ఎలాగా అంటారేమో , ఆ రోజు call rates, sms rates నిమిషానికి 30 రూపాయలో లేక మరో Tariff వసూలు చేస్తే బాగుంటుంది కదా అనిపించింది.
Wednesday, June 13, 2012
ఇలా చేయడం శ్రీరామానుజాచార్యులకే చెల్లింది.

అష్టాక్షరీ మంత్రాన్ని బహిర్గతం చేసి మానవాళికి మహోపకారం చేసిన రామానుజాచార్యుల జీవిత సంఘటన ఇది.
శ్రీరామానుజాచార్యుల కాలంలో జనులు రోజూ ఒక వింతను చూసేవారు.
అదేంటంటే రామానుజులు శారీరకంగా అంత బలవంతులు కాకపోవడంతో రోజూ స్నానానికి వెళ్ళేటప్పుడు ఒక బ్రాహ్మణుని భుజంపై చేతులు వేసుకుని వెళ్ళేవారు. స్నానం చేసి తిరిగి వచ్చేటప్పుడు ఒక శూద్రుని భుజంపై చేతులు వేసి వచ్చేవారు. జనం దీనిని వింతగా చూసేవారు.
ఒక రోజు కొందరు ధైర్యం చేసి స్వామి ప్రవర్తనకు గల కారణం అడిగారు.
అప్పుడు ఆయన ఇలా అన్నారు.
"స్నానం వలన నా శరీరం మాత్రమే శుభ్రం అవుతోంది. మనసులోని మాలిన్యం పోవడం లేదు. ఇతరుల కన్నా నేను గొప్పవాన్ని అనే భావన అహంకారం అనిపించుకుంటుంది. మనిషి పురోగతికి ఆధిక్య భావన అన్నింటికీ మించిన ఆటంకం.స్నానం చేసి దేహ మాలిన్యాన్ని పోగొట్టుకొన్న తర్వాత నేను శూద్రున్ని తాకి నా అహంకారాన్నీ,మనోమాలిన్యాన్ని తొలగించుకుంటున్నాను. నేను ఎవరికన్నా గొప్పవాణ్ణీ కాను. నాకన్నా ఎవరూ తక్కువ వారూ కాదు. నాకాన్నా శూద్రుడు కూడా శ్రేష్ఠుడే అనే భావన వలన నాకు ఆనందం లభిస్తుంది."
Friday, June 1, 2012
వేమనకూ తెలుసు నేటి మానవుల అవసరాలేమిటో!
Thursday, May 31, 2012
ఆంజనేయుడొక్కడే ఇలా అర్థం చేసుకోగలడేమో (ఆంజనేయుని అత్యద్భుత జ్ఞానం)
''అతల్పం నిద్రాళుః రజనిషు కువాక దుర్గత తమః
మహాకాతర్యాఢ్యః మనసి విధుత ప్రోజ్జ్వ లయశాః
వధా న్మాంసా దానం బహు విమతలాభో జనకజే.''
అంటే "రాముడు శయ్యలేకుండా రాత్రిపూటనిద్రిస్తాడు. చెడ్డమాటలు పలుకుతాడు, ప్రియమైన హితవాక్యం చెప్పడు, దరిద్రం అనుభవిస్తున్నాడు, అన్నిటి కంటే పిరికివాడు, ఏది చూచినా భయపడువాడు, మాంసం తింటాడు అట్లాంటివాడు, ''కథంశ్లా ఘ్యోరామః'' అటువంటి రాముని నీవు ఎలా పొగడుతున్నావు? అతడు నగరాలు విడిచి అడవుల పాలైనాడు. ఖరదూషణాదులను చంపి పెద్దనష్టం పొందాడు. చివరకు భార్యే కనిపించని నష్టం కలిగింది. అందువల్ల రాముడు శ్లాఘ్యుడుకాడు (అంటే పొగడబడేందుకు అర్హుడు కాదు) - అని రావణుడు చెప్పగా
సీతాదేవి ఇలా బదులు చెప్పింది.
'ఖల తం అసకృత్ మా స్పృశగిరా''
ఓదుర్మార్గుడా! నీ వాక్కుతో ఆ మహానుభావుని ముట్టుకోకు-అంటే అతని నామమైన పలుకుటకు నీకు యోగ్యత లేదని మృదువుగా చెప్పింది.
ఈ సంభాషణను హనుమంతుడు చెట్టు పైనుండి వింటున్నాడు.
అయితే ఆంజనేయస్వామి నవవ్యాకరణవేత్త. ఐంద్రియాదివ్యాకరణాలు తొమ్మిది, ఆయనకు తెలుసు అంతేకాక మహాభక్తుడు, అందువల్ల అమ్మచెప్పిన మాటలోని మరొక విశేషభావాన్ని యిలా గ్రహించాడు.
ఖల అంటే దుర్మార్గుడని అర్థం కనక ఆ పుణ్యపురుషుడైన రాముని గురించి మాట్లాడే అధికారందుర్మార్గుడైన రావణునికి లేదని సీతాదేవి తాత్పర్యం.
''తం''-అంటే ''అతనిని'' అనే అర్థం కాకుండా ''అతల్పం నిద్రాళుః'' అనే శ్లోకంలోని తకారాలన్నింటినీ ఒక్కసారి (అసకృత్)కూడా పలుకకుండా-శ్లోకంలోని తక్కిన మాటల భావాన్ని మాత్రమే గ్రహించాలని ఆ జగన్మాత మాటలోని విశేషముగా హనుమంతుడు గ్రహించాడు. శ్లోకాన్ని ఆ ప్రకారం తిరిగి చదువుకొంటే అమ్మవారు సూచించిన ప్రధానార్థం గోచరిస్తుంది
''మొదటిది-అల్పనిద్రాళుః'' అని వస్తుంది. ''అల్పాహారో, అల్పనిద్రః'' అని రామునిగురించి వాల్మీకి చెప్పిన దానికి యిది సరిపోతుంది, మహాపురుషులు ఎప్పుడు ఏం భుజిస్తారో, ఎక్కడ ఎప్పుడు నిద్రిస్తారో ఎవరికీ తెలియదు, రాములవారు అట్టివారు.
రెండవదానిలో ''తకారాలు'' తీసేస్తే ''కువాక్ దుర్గమః''అని వస్తుంది. అంటే కువాక్కులకు దుర్గముడని అర్థం, వాటికి వారివద్దకు వెళ్ళడానికి కూడా అర్హతలేదు
. తర్వాతమాట- ''మహాకార్యాఢ్యః'' అని వస్తుంది. దేవకార్యనిర్వహణం. దుష్టనిగ్రహం, శిష్టరక్షణం, చెయ్యడం వారి కార్యము అని అర్థం. ''పైమాట ''విధుప్రోజ్జ్వలయశాః'' అని వస్తుంది. అంటే చంద్రకాంతివంటి కీర్తిగలవాడని అర్థం. ''బహువిమలాభః''అనేది అనంతరపదం, ఆయనకాంతి కూడా మిక్కిలి స్వచ్ఛమైనదని అర్థం.
అందుకే అంటారు
"మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం
వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి"
Wednesday, May 30, 2012
ఫలితం కోసం వేచిచూసేవాడిని ఫలితం తెలిసికూడా చెప్పకుండా టెన్షన్ పెట్టడం ఒక పైశాచికానందమే!
చూసే ప్రేక్షకులకే చాలా Tension ఉంటుంది. అలాంటిది నిజంగా పోటీలో పాల్గొన్నవారికి ఇంకెంత ఉంటుందో కదా పాపం. వారు ఏడుస్తారు. విసుగుతో (Frustration) తో పక్కవారిని ఈర్ష్యా,అసూయలతో చూస్తుంటారు, బాధపడుతుంటారు. ఇవన్నీ చూస్తూ వ్యాఖ్యాతలు మరియు న్యాయనిర్ణేతలు ఎంతో సంతోషంతో ఇంకా రెచ్చగొడుతుంటారు. పోటీదారుల బాధలలో వీరు ఆనందాన్ని వెదుక్కుంటూంటారు. ఇవన్నీ మనం చూస్తూ Tension పడుతూ ,అయ్యో పాపం అనుకొంటూ తిట్టుకొంటూ ఉంటాము.
వ్యాఖ్యాతల సంగతి సరి, మరి న్యాయనిర్ణేతలు అనబడే సదరు వ్యక్తులు కొద్దోగొప్పో పేరు సంపాదించుకొన్నవారే కదా! వారి బుద్ధి ఏమైంది? వయసుతో పాటు వివేకం సంగతి దేవుడెరుగు, వారికి శాడిజం బాగా పెరిగిపోతున్నట్లు అనిపిస్తోంది.
హనుమంతుడు లంకలో సీతమ్మను చూసి వచ్చిన తర్వాత అతని కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వేచిచూస్తున్న వానరవీరులను ఏం Tension పెట్టలేదే. వానరుల దృష్టిలో పడగానే "దృష్ట్వాతు సీతా" (చూసాను సీతను) అన్నాడు కదా. "సీతను చూసాను" అని కూడా అనలేదు, అలా అంటే మొదట సీత పేరు చెబితే సీతమ్మకు ఏమయ్యిందో, చూసాడో లేదో అనే సందేహాలు వస్తాయని మొదటే "చూసాను" అనే పాజిటివ్ మాట అన్నాడు.
మనము హనుమంతునితో మనలను పోల్చుకోనవసరం లేదు, కనీసం అతని ఆచరణ ను తెల్సుకొని మనలను మనం దిద్దుకొంటే చాలు కదా.
కొసమెరుపు:
అసలు TV చూడకుంటే సరిపోతుంది అనుకోవచ్చు. కాని ఇలాంటి కార్యక్రమాలు చూడడం వలన ఇలా మనం మన జీవితంలో ఉండకూడదు అని నేర్చుకోవచ్చేమో. ఇలాంటి భావంతో చూస్తే ఏ తలనొప్పీ ఉండదనుకొంటాను.
Friday, May 25, 2012
ఏమిటయ్యా వేంకటేశు...
--ఇది మా స్నేహితుడు కొండయ్య వ్రాసిన కవిత
Tuesday, May 22, 2012
Wednesday, May 9, 2012
ఈ మధ్య నేను చూసిన మంచి సినిమా "Two brothers"

తల్లి పులి, దాని ఇద్దరు బిడ్డలైన రెండు పిల్లలు మానవ స్వార్థం వలన విడిపోవడం తర్వాత ఎన్నో కష్టాలు పడడం చివరికి మూడూ కలవడం ఎంతో బాగా చూపించారు. ముఖ్యంగా పులులు మధ్య భావోద్వేగాలను దర్శకుడు చాలా బాగా చూపించాడు. కొన్ని దృశ్యాలలో మనము కూడా ఆ భావోద్వేగంలో లీనమైపోతాము. అంతబాగా తీశారు.
సెంటిమెంట్ కు పెద్దపీట వేస్తూ తీశిన ఈ ఆంగ్ల చిత్రం చాలా కదిలించింది.
మన తెలుగు మూసచిత్రాలకు భిన్నంగా మంచి సినిమా చూడాలనే కోరిక ఈ సినిమా ద్వారా తీరింది.
ఈ చిత్రం ఫ్రెంచ్ నుండి ఆంగ్లానికి అనువదించినట్లు ఉంది.
Wednesday, April 25, 2012
అన్నమయ్య ఆవేదన అర్థం చేసుకోండి
Thursday, April 19, 2012
Wednesday, April 11, 2012
ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి.

లాభాల కోసం ఇతరులను త్రొక్కివేసే వారిని ప్రోత్సహిస్తారో లేక తమ మానాన తాము ఎవరినీ మోసం చేయకుండా కేవలం బ్రతకడం కోసమే వ్యాపారం చేసుకునేవారిని ప్రోత్సహిస్తారో ఆలోచించుకోండి.
చిత్రంలో దాగున్నదెవరో కనుక్కోండి?

ఈ చిత్రం లో దాగున్నదెవరో కనుక్కోగలరా?
Monday, March 19, 2012
తప్పించుకొనేందుకు పారిపోయివస్తే మళ్ళీ ఇలాగైందేమిటి? - రమణమహర్షులవారు

Friday, March 16, 2012
Wednesday, March 7, 2012
ఈ శిల్పము యొక్క అర్థం ఏంటో వివరించగలరా?

Wednesday, February 29, 2012
Tuesday, February 21, 2012
Wednesday, February 15, 2012
Monday, February 13, 2012
హనుమాన్ చాలీసా
బరణౌ రఘువర విమల యశ,జోదాయక ఫలచార
బుద్దిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార
బలబుధ్ధి విద్యాదేహు మోహి హరహు కలేశ్ వికార
1.జయహనుమాన జ్ఞాన గుణసాగర జయకపీశ తిహులోక ఉజాగర
2.రామదూత అతులిత బలధామ అంజనిపుత్ర పవన సుతనామ
3.మహావీర విక్రమ బజరంగీ కుమతినివార సుమతికే సంగీ
4.కంచన వరణ విరాజసువేశ కానన కుండల కుంచిత కేశా
5.హాథ వజ్ర ఔద్వజా విరాజై కాంథే మూంజ జనేవూ సాజై
6.శంకర సువన కేసరీ నందన తేజ ప్రతాప మహాజగ వందన
7.విద్యావాన గుణి అతిచాతుర రామకాజ కరివేకో ఆతుర
8.ప్రభుచరిత్ర సునివేకో రసియా రామలఖన సీతా మన బసియా
9.సూక్ష్మ రూప ధరి సియహిదిఖావ వికటరూప ధరి లంక జరావ
10.భీమరూప ధరి అసుర సమ్హారే రామ చంద్రకే కాజ సవారే
11.లాయ సజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హరషి వురలాయే
12.రఘుపతి కీన్హీ బహుత బడాయి తుమ మమ ప్రియ భరత సమభాయి
13.సహస వదన తుమ్హరో యశగావై అసకహి శ్రీపతి కంఠలగావై
14.సనకాదిక బ్రహ్మాది మునీశా నారద శారద సహిత అహీశా
15.యమ కుభేర దిగపాల జహాతే కవికోవిద కహి సకై కహాతే
16.తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా రామ మిలాయ రాజపద దీన్హా
17.తుమ్హరో మంత్ర విభీషణ మానా లంకేశ్వర భయే సబ జగజానా
18.యుగ సహస్ర యోజన పరభానూ లీల్యో తాహి మధుర ఫల జానూ
19.ప్రభుముద్రికా మేలిముఖ మాహీ జలధి లాంఘిగయే అచరజ నాహీ
20.దుర్గమ కాజ జగతకే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే
21.రామ దు ఆరే తమ రఖవారే హోతన ఆజ్ఞా బిను పైసారే
22.సబ సుఖ లహై తుమ్హారీ సరనా తుమ రక్షక కాహూ కో డరనా
23.ఆపన తేజ సమ్హారో ఆపై తీనోం లోక హాంకతే కాంపై
24.భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబనామ సునావై
25.నాశై రోగ హరై సబ పీరా జపత నిరంతర హనుమత వీరా
26.సంకట సే హనుమాన చుడావై మన క్రమ బచన ద్యాన జోలావై
27.సబ పర రామ తపస్వీ రాజా తినకే కాజ సకల తుమ సాజా
28.ఔర మనోరథ జోకోయిలావై అమిత జీవన ఫల పావై
29.చారో యుగ ప్రతాప తుమ్హారా హై ప్రసిద్ద జగత ఉజియారా
30.సాధు సంతకే తుమ రఖవారే అసుర నికందన రామ దులారే
31.అష్ట సిద్ది నవనిధి కే దాతా అస వర దీన జానకీ మాతా
32.రామ రసాయన తుమ్హరే పాసా సదా రహో రఘుపతికే దాసా
33.తుమ్హరే భజన రామకో పావై జన్మ జన్మకే దుఖ బిసరావై
34.అంతకాల రఘుపతి పురజాయీ జహా జన్మ హరిభక్త కహాయీ
35.ఔర దేవతా చిత్తన ధరయీ హనుమత సేయి సర్వ సుఖ కరయీ
36.సంకట హరై మిటై సబవీరా జో సుమిరై హనుమత బలవీరా
37.జైజైజై హనుమాన గోసాయీ కృపాకరో గురుదేవకీనాయీ
38.జో శతబార పాఠకర జోయీ చూటహి బంది మహా సుఖ హోయీ
39.జో యహ పడై హనుమాన చాలీసా హోయసిద్ది సాఖీ గౌరీసా
40.తులసీదాస సదా హరిచేరా కీజైనాథ హృదయ మహడేరా
పవనతనయ సంకటహరన మంగళ మూరతి రూప
రామలఖన సీతాసహిత హృదయ బసహు సురభూప
రామాయ రామభద్రాయ రామ చంద్రాయ వేధసే
రఘు నాధాయ నాధాయ సీతాయః పతయే నమః!
Featured Post
వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం
ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...