తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Sunday, August 24, 2008

కాంతివేగం వేదాలలోనే ఉంది (మహోన్నత భారతదేశం)

వేదభాష్యకారులలో ఒకరైన శాయనాచార్యులు (క్రీ.శ.1315 -1387) విజయనగర రాజులలో ఒకరైన బుక్కరాయల అస్థానంలో మంత్రిగా ఉండేవారు.వీరు తమ ఋగ్వేద భాష్యంలో కాంతి యొక్క వేగాన్ని ప్రస్తావించాడు.

వీరు తమ ఋగ్వేద భాష్యంలో ఒక శ్లోకంపై వ్యాఖ్య లో (1.50 సూక్తము,4 వ శ్లోకం)
"ఓ! సూర్యదేవా నీ కిరణాలు అరనిమేషంలో 2202 యోజనాలు ప్రసరిస్తాయి"అన్నాడు.

మనకు తెలుసు
ఒక యోజనం=9.00625మైళ్ళు
మహాభారతం,శాంతిపర్వం ప్రకారం
అరనిమేషం= 8/75 సెకన్లు (ఇక్కడ 7.9789... ను సమీప 8 కు మార్చడం జరిగింది).

ఈ లెక్క ప్రకారం కాంతివేగం 186413.22 మైళ్ళు/సెకన్.
ఇప్పటి లెక్కప్రకారం ఈ వేగం 186300 మైళ్ళు/సెకన్.
ఇది అత్యంత ఆశ్చర్యజనకమైన ఫలితం.ఎంత దగ్గరగా మనవాళ్ళు లెక్కించారో.

4 comments:

 1. వినడానికి చాలా బాగుంది. కొండొకచో కూసింత గర్వంగాకూడా, కానీ మన దగ్గర పెటెంట్ లెదుగా!
  కాబట్టి ఇలా ఈ డిస్కవరీ మనదే అని చెప్పుకుని తృప్తిపడదాం.

  ఇలా అయితే విమానం(పుష్పకవిమానం),TV (విదురుడి దృష్టి),రేడియో (అశరీరవాణి) మనం కనుక్కున్నవే కదా...

  ReplyDelete
 2. మహేష్ గారూ, పేటెంట్ ఉన్నాలేకపొయినా నిజం నిజమే కదా.అలాగే మనం ఉన్నదే చెప్పుకుంటున్నాం కానీ కల్పించిచెప్పుకోవడంలేదు కదా.అలానే మన పూర్వీకులకు లోకక్షేమం ముఖ్యంగా భావించారు వ్యక్తిగత కీర్తిప్రతిష్ఠల కొరకై అలోచించలేదు.

  ReplyDelete
 3. 2202 యోజనాలు అని చెప్పడానికి చందస్సు ఖచ్చితంగా సరిపోయివుంటుంది లేకుంటే ఆ సంఖ్య పెరగడమో తగ్గడమో జరిగి వుండేది అని నా అభిప్రాయం.

  సురేశ్ గారూ శయనాచార్యులు కాంతివేగాన్ని ఎలా కొలిచారో? భృకుటి ముడి వేసి, పద్మాసనంలో కూర్చుని ధ్యానంతో కనుక్కున్నారా? లేక ఏవైనా పరికరాలు వుపయోగించారా?

  మహేశ్ గారూ, మీరెలా అన్నా, పుష్పక విమానాన్ని చూపి మనవాళ్ళకు విమానం తెలుసనీ, దాన్నెలా నిర్మించాలో ఏదో మాయం అయిన వేదంలో వుందనీ, అలాగే కౌరవులు కుండలో పుట్టారు గనుక మహా భారత కాలంలోనే test tube baby విజ్ఞానం తెలుసనీ వాధించే జ్ఞానులు వున్నారు.

  --ప్రసాద్
  http://blog.charasala.com

  ReplyDelete
 4. మంచి విషయాలని, తెలియని సంగతులని వెలుగులోకి తెస్తున్న సురేష్ అభినందనీయుడు. ప్రతీదాన్నీ విమర్శనాత్మక దృష్టితో చూసే ప్రసాద్ గారిలాంటి వాళ్ళ వల్ల ప్రాచీన భారత దేశం యొక్క గొప్పతనం మరుగునపడిపోయింది. ఎవరో డార్విన్ అంట, అన్నీ పరిశిలించి కోతి నుండి మనిషి వచ్చాడు అని చెపితే అది నమ్మేసి, చిన్నప్పటి నుండీ దాన్నే వల్లే వేసి, అదే నిజమనుకుని బ్రతికేస్తున్నాము. డార్విన్ నిజంగానే పరిశోధన చేశాడా, లేదా, ఆయన రాసిన "The origin of Species" అనే గ్రంధాన్ని మీరు ఎప్పుడయిన చదివారా? లేదు కదా, సురేష్ చెప్పిన విషయం కూడా అంతే. ప్రపంచానికి మాట పలకడం నెర్పింది మనం, బట్ట కట్టడం నేర్పింది మనం, జంతువుల నుండి విడివడి సమాజంగా బ్రతకడం నేర్పింది మనం. ఇంకా ఏమయినా అనుమానాలుంటే, నేను రాసిన బ్లాగ్ చదవండి. http://saradaa.blogspot.com/2008/07/blog-post_15.html

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు