తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Tuesday, August 19, 2008

కొన్ని ఆంగ్ల పదాలు వాటి మూలాలు

సహారా(ఎడారి):

ఇది "సాగర"అను సంస్కృత పదము నుండి వచ్చినది.పూర్వము భూమి అంతా ఒకే ఖండము గా ఉండి ఇప్పటి రూపము సంతరించుకొనేటప్పుడు ఎన్నో మార్పులు జరిగినాయి.భూగర్భ శాస్త్రజ్ఞుల ప్రకారము సహారా ఎడారి ఒక ఎండిపొయిన సముద్రము."సాగర" అను సంస్కృత పద రూపాంతరమే నేటి "సహారా" అను పదము అని భాషా శాస్త్రజ్ఞుల అభిప్రాయము.

కాలిఫోర్నియా:

మన రామాయణము లోని సగర కుమారుల వృత్తాంతము అందరికీ తెలిసేవుంటుంది.వారు కపిలమహర్షి నివశించే అరణ్యము లోనికి వెళ్ళి ఆ మునికి తపస్సు భంగము గావిస్తారు.అప్పుదు కపిలుడు వారిని బూడిద చేస్తాడు.ఈ "కపిలారణ్య"మే నేటి కాలిఫోర్నియా అని భాషా శాస్త్రజ్ఞుల అభిప్రాయము.ఇందుకు నిదర్శనము గా నేటికీ అక్కడ కనిపించే ప్రఖ్యాత " ఫౌంటైన్ యాషెస్".అనగా బూడిద ఫౌంటైన్స్.

4 comments:

 1. బాబోయ్, మీకు భాషాశాస్త్రం చాలా తెలుసే!

  > "సాగర" అను సంస్కృత పద రూపాంతరమే నేటి "సహారా" అను పదము అని భాషా శాస్త్రజ్ఞుల అభిప్రాయము.

  > ఈ "కపిలారణ్య"మే నేటి కాలిఫోర్నియా అని భాషా శాస్త్రజ్ఞుల అభిప్రాయము.

  ఏ భాషాశాస్త్రవేత్త అవ్విద్ధంబుగా సెలవిచ్చినో దెల్పిన మేమునూ అయ్యుద్గ్రంథములను పఠించి పండితులమవుదము.

  P.N.Oak అని మాత్రం అనకండే. అయినా ఆ రెండు మాటలతో ఆపేసారే! అసలు ఈ పాశ్చాత్య భాషలన్నీ మన సంస్కృతంనుండి పుడితేను. మన గిరీశం ఎప్పుడో అన్నాడు... నే మరల చెప్పక్కర్లేదు కదా!

  -- శ్రీనివాస్

  ReplyDelete
 2. ‘షేక్ సాహెబ్ పీర్’ కాస్తా ‘షేక్స్పియర్" అయ్యాడన్నట్లుంది వరస.ఇంత "అతిగా" అన్నింటినీ నమ్మాలా? కనీసం మనబుద్ధి కొంచెమైనా వాడఖ్ఖరలేదా!

  ReplyDelete
 3. జగమే మాయ బ్రతుకే మాయ.. వేదాలలో షారమింతేనయా.. ఖళ్.. ఖళ్.. ఈ వింషేనయా.. జఘమే.. ఖళ్.. ఖళ్..

  ReplyDelete
 4. పైన మీరు వివరించిన విషయాలకు source ఏది?

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు