నరునకు గల మానవతా లక్షణములలో "కృతఙ్నత" ప్రధానమైనది.కృతఙ్నత అనగా మనకు మంచి చేసిన వారిని మరిచిపోకుండా వారికి తిరిగి ప్రత్యుపకారం చేయుట.అలా చేయకపోవడాన్ని "కృతఘ్నత" అంటారు.రామాయణం లో రాముడు వాలిని చంపి సుగ్రీవునికి సహాయం చేశాడు.కాని సుగ్రీవుడు అది మరిచి తన పనులలో మునిగిపోయాడు.అప్పుడు లక్ష్మణుడు సుగ్రీవునితో
"బ్రహ్మఘ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా!
నిష్కృతిర్వహితాసద్భిః కృతఘ్నేనాస్తి నిష్కృతిః!!"
భావము: బ్రహ్మ హత్యకు,సురాపానమునకు,వ్రతభంగమునకు,దొంగతనానికి ప్రాయశ్చిత్తమున్నది.కాని కృతఘ్నతకు లేదు.
కృతఘ్నుల మాంసము కుక్కలు సైతం తినవు.కాబట్టి కృతఙ్నత చూపడం ముఖ్యం.