తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Thursday, July 24, 2008

ఓజోన్ - వేదాలు

ఋగ్వేదం 6వ అనువాకం,24 వ సూక్తం లోని 6,7 వ శ్లోకాలు

नहि ते कषत्रं न सहो न मन्युं वयश्चनामी पतयन्त आपुः
नेमा आपो अनिमिषं चरन्तीर्न ये वातस्य परमिनन्त्यभ्वम

अबुध्ने राजा वरुणो वनस्योर्ध्वं सतूपं ददते पूतदक्षः
नीचीना सथुरुपरि बुध्न एषामस्मे अन्तर्निहिताःकेतवः सयुः


అర్థం:
" వరుణ దేవా!నీవు పరాక్రమవంతుడవు.రెక్కలుగల పక్షులు నీని చేరలేవు.నిన్ను అవి సహించలేవు.ప్రవహించే నీరు కూడా నిన్ను చేరలేవు.వరుణుడు రాజులకు ప్రభువు.ఆధారంలేని అంతరిక్షంలో అతను ఉన్నాడు.అతడు తేజో రాణి చే ఆవరింపబడి ఉన్నాడు.కిరణములు అతని పై నుండి క్రిందకు ప్రసరిస్తున్నాయి.అందువలనే మన ప్రాణములు నిలిచిఉన్నవి. కిరణములకు మూలము అంతరిక్షమున ఉన్నది."
గమనించి చూస్తే వరుణదేవుడిని వాతావరణము గా,తేజోరాణి ని ఓజోన్ పొరగా తెలుసుకోవచ్చు.

5 comments:

 1. Suresh...ilage konasaagandi...chala chakkaga rasthunnaru..alage evaina links vunte telapandi...vedalu-arthalatho...

  ReplyDelete
 2. సురేష్,

  తేజోరాణి అంటే టేజస్సు లేక వెలుగు లేక సూర్యకిరణాలు అని అర్థం.
  "కిరణములు అతని పై నుండి క్రిందకు ప్రసరిస్తున్నాయి.అందువలనే మన ప్రాణములు నిలిచిఉన్నవి."
  దీని అర్థం: సూర్య కిరణములు కూడ ప్రణానికి ఆధారం. కిరణాల వల్ల ప్రాణులు నిలిచి వున్నాయి. (కిరనజన్యసమ్యోగ క్రియకు సూర్యకిరణాలు ఆధారం).

  "ఆ కిరణములకు మూలము అంతరిక్షమున ఉన్నది."
  అర్థం: సూర్యుడు అంతరిక్షంలో వున్నాడు.

  మీరు చెప్పినట్టు తేజో రాణి ఓజోన్ కాదు. మనకు ఓజోన్ వల్ల కిరణాలు రావట్లేదు. ఓజోన్ సూర్య కిరణాల్లోని అతినీలలోహిత కిరణాల్ని అడ్డుకుంటుంది.

  ReplyDelete
 3. వెంకటరమణ గారూ, ఇక్కడ వరుణదేవుడుని వాతావరణం తో పోల్చారు.వెలుగుని లేక కిరణాలను వరుణుడు ఎలా ధరించగలడు?అదీగాక కిరణాలు అతని పైనుండి క్రిందకు ప్రవహిస్తున్నాయి.తేజోరాణి ద్వారా ప్రవహిస్తున్నయి అనిఉంది.అంటే ఇక్కడ తేజోరాణి అనగా కిరణాలు అని కాదు అర్థము ఒక పొర అని అర్థం.

  ReplyDelete
 4. సురేష్,
  నాకు తెలిసి తేజస్సు(brightness) అంటే వెలుగు లేక కాంతి.
  తేజస్సుకు ఇంకా వేరే అర్థం ఏమైనా వుందా?

  ReplyDelete
 5. విజయక్రాంతి,

  మీకు వేదాలు అర్థమయ్యేలా, సరళంగా కావాలంటే...దాశరథి రంగాచార్య గారు గద్య రూపంలో అనువదించినారు.
  గద్య రూపంలో వుండడంవల్ల చాలా త్వరగా అర్థం అవుతుంది.

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు