తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Thursday, February 5, 2009

ఎన్ని రోజులు ఈ అనుకరణ ? సొంతమంటూ ఏదీ లేదా? ఉన్నా పాటించరా?

ప్రేమికుల రోజు త్వరలోనే వస్తోంది. అంటే ఫిబ్రవరి 14వ తేదీన. జరుపుకోకూడదని కొన్ని సంస్థలు, లేదు జరుపుకొనే తీరుకుంటామని యువత అంటున్నాయి. సరే అంతా బాగుంది. ప్రేమికుల రోజు అనేది పాశ్చాత్య దేశాల 
నుండి దిగుమతి చేసుకొన్నది అని అందరికీ తెలుసు. ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయనుకోండి.

సరే మనకు ఆ దినోత్సవం బాగుంది,జరుపుకొంటే తప్పేముంది అనుకొందాం. తప్పు ఏమీ లేదు.జరుపుకొందాం.
కాని ఒక్క విషయం. ప్రేమికుల రోజు ఎప్పుడు అంటే టక్కున ఫిబ్రవరి 14న అంటాము.
వెంటనే అన్నాచెల్లెల్ల దినోత్సవం (రాఖీ) ఈ సంవత్సరం ఎప్పుడు వస్తోంది అంటే ఎంత మంది కనీసం 5 నిమిషాల వ్యవధిలో చెప్పగలరు? చెప్పలేరు. ఇలా ఉంది మన సంస్కృతిపై మనకు గల ప్రేమ.
ప్రేమ పేరుతో యువతను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకొనే వ్యాపార వర్గాలు, పవిత్రమైన రాఖీ దినం పై ఎందుకు శ్రద్ద చూపడం లేదు? ఇది సాంస్కృతిక బానిసత్వం కాదా? యువత బలహీనత తో ఆడుకోవడం కాదా? 

యువతను రెచ్చగొట్టడం కాదా?
ఇక్కడ రాఖీ దినోత్సవాన్ని ఉదాహరణగా మాత్రమే తీసుకోవడం జరిగింది.
నేటి భారతదేశం ఇలా పలుకుతోంది:" పాశ్చాత్య భావాలను,వేషభాషలను, ఆహారవిహారాలను,పాశ్చాత్య ఆచారమర్యాదలను మనం పాటిస్తే వారిలాగే అభివృద్ధి చెందుతాము."
కాని ఒకటి తెలుసుకోవడంలేదు: " అనుకరణ వలన ఇతరుల భావాలు ఎన్నటికీ మనవి కాబోవు. సింహం తోలు కప్పుకొన్న గాడిద, సింహం అవుతుందా ? లేక ఆవు తోలు కప్పుకొన్న పులి ,ఆవు అవుతుందా(గోముఖవ్యాఘ్రం)?"
మరలా నేటి భారతదేశం ఇలా అంటోంది:"పాశ్చాత్య జాతులేమి చేస్తున్నాయో,అదంతా తప్పకుండా మంచిది,కాకపోతే అవి అంత బలవంతము ఎలా అయ్యాయి?"
ఇక్కడ తెలుసుకోవలసింది ఏమిటంటే మెరుపు మిరుమిట్లు గొలుపుతున్నప్పటికీ దాని ప్రకాశం క్షణకాలం మాత్రమే.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
ఐతే ఇతర దేశస్థులనుండి మనం ఏమీ నేర్చుకోనవసరం లేదా? అభివృద్ధికై మనం ప్రయత్నించనవసరం లేదా? మనం పరిపూర్ణులమా? మనలో లోపం ఏమీ లేదా? మనం నేర్వవలసిన విషయాలు చాలా ఉన్నాయి.బ్రతికినంత కాలం నేర్చుకొంటూనే ఉండాలి.
మనం ఒక మహాప్రమాదం గుర్తించడం లేదు. పాశ్చాత్య అనుకరణ వ్యామోహం మనలను ఆవహించి ఉంది.కీడేదో,మేలేదో వివేకవిచక్షణలతో మనం ఎంతమాత్రం నిర్ణయించుకోవడం లేదు.
ఉదాహరణకు చైనా దేశస్థులు ఎక్కడైనా ప్రపంచ సమ్మేళనం జరుగుతుంటే తన సాంస్కృతిక వేషధారణలోనే వస్తారు. కాని మనవారో బయటకు వెళ్తే "సూటు,బూటు"కావలసిందే. చైనీయులు అభివృద్ధి చెందడం లేదా? 
తమ సాంస్కృతిక వారసత్వం నిలుపుకొంటూనే నేడు అగ్రరాజ్యాలలో ఒకటిగా లేదా?
మన ఆచార సాంప్రదాయాలకు పాశ్చాత్యులు ప్రశంశా పత్రం(certificate) ఇస్తేనే మనం పాటిస్తామంటే ఎంత మాత్రం అంగీకారము కాదు.
విదేశీ ఆచారవ్యవహారాలను మనము ఎలా పోట్లాడి పాటిస్తామో అంతకంటే ఎక్కువగా మన ఆచార సాంప్రదాయాలు పాటించడానికి మొహమాటం ఎందుకు? మనకంటూ సంస్కృతి ఉంది.దాన్ని నిలబెట్టుకొందాము.

5 comments:

 1. well said sir, further The Indian Culture is appreciated by many foreigners and some of them followed. when the situation is like this it is foolishness to follow foreigner blindly.,

  ReplyDelete
 2. ఎవరు చెప్పారు రాఖీపై శ్రద్ధ పెట్టట్లేదని? కాస్త ఆంధ్రదేశం దాటి బయటికి రా బ్రదర్! నార్త్ ఇండియాలో డిజైనర్ రాఖీలూ,ముత్యాలూ వజ్రాల రాఖీలు కనబడతాయి. అయినా, రాఖీని మనం అనుకరించినా ఉత్తరాన్ని దక్షిణం అనుకరించినట్లే, అలాంటప్పుడు పాశ్చాత్యుల్ని అనుకరిస్తే తప్పా?

  అయినా ప్రతిరోజూ ప్రేమ రోజే, ప్రేమ కోసం ఒక రోజు కేటాయిస్తే తప్పొచ్చిందా? తండ్రులరోజు, తల్లుల రోజు, స్నేహితుల రోజు,తల్లిపాలరోజు,ఆడపిల్ల రోజు అని దినాలు జరుపుకోగా రాని తప్పు ప్రేమికుల రోజు అనంగానే వచ్చేసిందా?

  ఇప్పుడు మనకు సొంతం అంటూ మిగిలిందేమిటి దాడి చెయ్యడం తప్ప!

  ReplyDelete
 3. మహేష్ గారూ! ఈ టపాలో ఎక్కడ కూడా నేను ప్రేమికులరోజుకు వ్యతిరేకము గా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జరుపుకుందామనే అన్నాను.వ్రాయనిదానికి మీకు కోపం ఎలా వచ్చిందో?ఎందుకు వచ్చిందో? సరే! రాఖీ పండుగను నేను కేవలం ఉదాహరణగా మాత్రం తీస్కొన్న విషయం మీరు మరిచిపోయినట్టుంది. రాఖీని మనం అనుసరిస్తే ఉత్తరాన్ని అనుకరించినట్లు అన్నారు,అంటే ఉత్తర భారతం విదేశమని మీరు భావిస్తున్నట్ట్లు అనుకోవలసి ఉంటుంది.

  ReplyDelete
 4. సురేష్ గారూ,
  మహేష్ గారు చెప్పింది కరెక్ట్. ప్రేమికుల రోజు జరుపుకొన్నట్లు రక్షాబంధన్ ని గుంపులుగా చేసుకోకున్నా ఎవరికి వారు వాళ్ళ తోబుట్టువులతో కలసి ఆనందాన్ని పంచుకొంటూనే ఉన్నారు. అది మరుగున పడిపోలేదు.

  ప్రేమికుల రోజును ఎందుకు ఇంతలా వ్యతిరేకిస్తారో అర్థం కాదు!! (మీరు కాదు). కొంత మంది దాన్ని జరుపుకొనే పద్ధతి హద్దులు దాటడం వల్ల ఇంత వ్యతిరేకత వచ్చి ఉండచ్చు.

  ఇంక ఉత్తరం, దక్షిణం విషయానికొస్తే ఇప్పుడు అసలు దేశాల మధ్య అంతరాలే తగ్గి పోతున్నాయి సాంకేతిక అభివృద్ధి పుణ్యమా అని. రాబోయే రోజుల్లో అసలు ఈ హద్దులు, సరిహద్దులు కూడా కేవలం భౌగోళికంగా ఉంటాయే తప్ప మనుషుల మధ్య ఉండవేమో అనిపిస్తుంది.యు.ఎస్.ఏ., యు.ఏ.ఇ., ఇ.యు. ల లాగ యు.ఎన్.ఏ (యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఏసియా) వచ్చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదు.ఇక ఇటువంటి విషయాల్లో ఇంత ఆలోచించడం అనవసరం అని నా అభిప్రాయం.

  ReplyDelete
 5. మనం వాడేవి తిధులు వారు వాడేవి తేదీలు. అంతే కారణం
  హిందూ పండగలెందుకు తేదీ చెప్పలేము అంటే అది మన కాలెండరు తప్పు. అంటే రోమన్ కాలెండరు వాడుక వల్ల వచ్చిన సమస్య.
  హిందూ పండగలు గుర్తు పెట్టుకోవడం చాలా సులభం
  ఉదా: వినాయక చవితి - చవితి రోజున
  రాఖీ (రక్షా పౌర్ణిమ) - పౌర్ణమి నాడు
  శివరాత్రి - అమావాస్య నాడు
  విజయ దశమి - దశమి నాడు
  శ్రీరామ నవమి - నవమి నాడు

  ఇలా, ప్రతీ పండగ పేరులోనే ఆ తిధి ఉంటుంది. అయితే మనం తెలుగు కాలెండరు వాడకపోవటం వల్ల వెంటనే ఏ రోజో చెప్పటం కష్టం.
  ఇక వాలైంటన్సు డే, క్రిస్మస్ మొదలైనవి రోమను కాలెండరులోని తేదీల ఆధారంగా వస్తాయి కనుక సంవత్సరానికి ఒకసారి మారవు కనుక గుర్తుంచుకోవడం సులభం

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు