తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Saturday, February 7, 2009

మా ఊరు కదిరి పట్టణము విశేషాలు

ఇన్నిరోజులుగానేను టపాలువ్రాస్తున్నామా కదిరిపట్టణముగురించివ్రాయకపోవడం నాకే ఆశ్చర్యముగా ఉంది. వికీపీడియా లో కదిరి గురించి వ్రాశాను.
మా ఊరి గురించి కొన్ని విశేషాలు.
కదిరి పట్టణము అనంతపురం జిల్లాలో ఉంది.
ఆంధ్ర రాష్ట్రములో తాలూకాలు ఉన్నప్పుడు కదిరి తాలూకా రాష్ట్రములోనే అతి పెద్ద తాలూకా.
రాష్ట్రములోని నవ నారసింహ క్షేత్రాలలో కదిరి ఒక నారసింహక్షేత్రము.ఇక్కడి నరసింహుని శ్రీలక్ష్మీనరసింహస్వామిఅంటారు. మరే ప్రాంతములో లేని విధముగా ఇక్కడ స్వామి వారి మూలవిరాట్టు ముందు భక్త ప్రహ్లాదుని విగ్రహంచేతులు జోడించుకొని స్వామిని శాంతపరుస్తునట్టు ఉంటుంది. నరసింహుని విగ్రహం హిరణ్యకశిపుని చీలుస్తున్నట్టుఉంటుంది. మూలవిరాట్టు స్వయంభూవిగ్రహము.
ఇక్కడి నరసింహస్వామి బెంగళూరు, కోలారు ప్రాంతాలలో చాలా మందికి ఇంటి దైవము. కదిరి లక్ష్మీనరసింహ స్వామిబ్రహ్మోత్సవాలు ఏటా వైభవముగా జరుగుతాయి. ముఖ్యముగా బ్రహ్మరథోత్సవం(తేరు) నాడు సుమారు 5 లక్షలమంది కి పైన పాల్గొంటారు. కర్ణాటక,తమిళనాడుల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.
స్వామి వారికి కులమత భేధాలు లేవు. దీనికి ఋజువుగా స్వామి వారి తేరు(రథము) కదలవలనంటే కదిరికి రెండుకిలోమీటర్ల దూరంలోని కుటాగుల్ల గ్రామం నుండి బోయవాల్లు వస్తేనే వీలవుతుంది. వారు రాకుంటే ఎన్ని లక్షలమందిలాగినా,తోసినా కదలదు. మరియు సంక్రాంతి మరుసటి రోజు కనుమ నాడు స్వామి వారి రథము హరిజనల ఇళ్ళల్లోకివెళ్తుంది.
గుడి వెనకాల ఒక కోనేరు ఉంది.దానిని భృగుతీర్థము అంటారు. ఇంకా అగస్థ్యతీర్థము,కుంతితీర్థము, వ్యాసతీర్థముమొదలగు 12 తీర్థాలు ఉన్నాయి.
ఇక గుడి నుండి 3 కిలోమీటర్ల దూరంలో కదిరికొండ ఉంది. కొండను లఘువమ్మకొండ మరియు అలివేలుమగమ్మకొండ అని అంటారు. దీని క్రింది భాగాన సీతాదేవి సమేత రాముడి గుడి ఉంది. కొండల నరసింహ స్వామి గుడి కూడాఉంది. కొండపై గుహను సప్తర్షుల గుహ అంటారు. ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రిందట సప్తర్షుల విగ్రహాలు ఉండేవి. ఇప్పుడు మూడు విగ్రహాలు మాత్రం ఉన్నాయి.
ఇక కదిరి చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాల గురించి చెప్పుకోవాలంటే కదిరికి 10 కిలోమీటర్ల దూరంలో మహాకవిమరియు యోగివేమన పరమపదించిన ప్రదేశము కటారుపల్లి ఉంది. అక్కడ వేమన గారి సమాధి ఉంది. పర్యాటకశాఖవారు ప్రదేశాన్ని బాగా అభివృద్ధి చేశారు.
కదిరి కి 26 కిలోమీటర్ల దూరంలో ప్రపంచంలోనే విస్తీర్ణములో అతి పెద్దదైన మర్రిచెట్టు (తిమ్మమ్మ మర్రిమాను) ఉంది.దీనివిస్తీర్ణము 5 ఎకారాల పైనే ఉంటుంది.
కదిరి పట్టణము జిల్లా కేంద్రమైన అనంతపురానికి 90 కిలోమీటర్ల దూరంలో అనంతపురం నుండి చెన్నైకు వెళ్ళే జాతీయరహదారిలో ఉంది. బెంగళూరుకు 175 కిలోమీటర్ల దూరంలో, ముఖ్యమంత్రి గారి పులివెందులకు 45 కిలోమీటర్లదూరంలోణు, పుట్టపర్తికి 42 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. అన్ని చోట్ల నుండి బస్సు మార్గము ఉంది. బ్రాడ్గేజ్ రైలుమార్గం వేస్తున్నారు.

8 comments:

 1. చాలా విశేషాలు ఉన్నాయే! బాగుంది.

  ReplyDelete
 2. ఆర్యా
  కదిరి లోని ఆలయాన్ని ౨౦ ఏండ్ల క్రితం చూసాను. ఆలయంలో ఇంకా ఏన్నో విశెషాలున్నయి. ఏక సిలా ద్వజస్తంబం, ఆలయంలోపల అలనాటి రంగుల చిత్రాలు,ఇంకా ఎన్నో చారిత్రిక అంసాలు ఉన్నట్టు గుర్థు. అది మీ సొంత ఊరు గాన అటువంటి విశేషాలు మీరే వివరంగా రాయ గలరు. అటువంటి సమగ్ర వ్యాసాన్ని అందిస్తారని ఆసిస్తునాను. ..... నెనర్లు.

  ReplyDelete
 3. surESha aa narasimhuni anugraha mumte oakasaari narasimhuni darshimchaali meevooruvachchi.jaya bhaktaprahlaada varada

  ReplyDelete
 4. "బేట్రాయి సామి దేవుడా, మమ్మేలినోడ" అన్న ఓ పాట ఎప్పటి నుంచో వింటున్నాను. (మాది అనంతపురం).

  బేట రాయడు - వేట రాయడు - వేటకు రాజు - సింహం అని ఈ మధ్య నాకు తెలిసింది. కన్నడంలో వేట - బేట అయ్యింది. కదిరి, కర్ణాటక సరిహద్దు కాబట్టి ఈ భాషా ప్రయోగం జరిగిందేమో.

  ReplyDelete
 5. mana KADIRI gurinchi lokaaniki theliya chesinanduku meeku Dhanyavaadamulu....
  mee HARI PRATHAP REDDY.

  ReplyDelete
 6. మంచి సమాచారమిచ్చారు..థాంక్సండీ..

  ReplyDelete
 7. మంచి సమాచారమిచ్చారు..థాంక్సండీ..

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు