తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Friday, February 27, 2009

ఏ కులమని నన్నడిగితె ఏమని చెప్పను దున్నపోతులకు, లోకులకు, దుష్టులకు

ఏ కులమని నన్నెవరు అడిగితె ఏమని చెప్పను లోకులకు,
పలుకాకులకు, దుష్టులకు, దుర్మార్గులకు, దున్నపోతులకు,
అంతున పుట్టిందే కులమె
ముట్టంటున పెరిగెందే కులమె
అంటున శివుడు, ముట్టున మురుడు, ఎంతన ఈశ్వరుడు,
ముగ్గురు మూర్తుల దెలెపందె ఏకులమె
ఇంటిలోపల ఇల్లు కట్టుకొని
కంటి లోపల కదురు పెట్టుకొని
నారాయణ అని నరం తీసికొని
పంచాద్రి అని తడికి వేసుకొని
గోవింద అని గుడిప దీసికొని
గబ గబ, దబ దబ, ఏకెనిదె ఏకులం
దూదేకుని కులమె నాకులం
ఏ కులమని నన్నెవరు అడిగితె ఏమని చెప్పను లోకులకు,
పలుకాకులకు, దుష్టులకు, దుర్మార్గులకు, దున్నపోతులకు,
పంచాద్రి అని పంచె తీసికొని
ఎరబ్రహ్మ అని శాలువ కప్పుకొని
పూజల నడిపెందికులమె నాకులం
వంటరి గాడు ఏ కులమె శ్రీజంతనె
కలసిందె కులమె నాకులం
ఏ కులమని నన్నెవరు అడిగితె ఏ మని చెప్పను లోకులకు,
పలుకాకులకు, దుష్టులకు, దుర్మార్గులకు, దున్నపోతులకు.


ఈ కవిత బ్రహ్మం గారి శిష్యుడు ఐన సిద్దయ్య గారిచే రచింపబడినది.

5 comments:

 1. ప్రస్తుతకాలంలో పలుకాకులకు, దుష్టులకు, దుర్మార్గులకు, దున్నపోతులకు కులమే తురుపుముక్క

  ReplyDelete
 2. kaakulaku palugaakulaku amtumtaaru eepaatanu mapraamatamlo

  ReplyDelete
 3. బాగుందండి.
  వర్డ్ వెరిఫికేషనును దయతో తీసివెయ్యగలరు.

  ReplyDelete
 4. బావుందండి.
  ట్యూన్‌ కట్టి పాడితే బావుంటుంది, ప్రత్నించి,పాడి బ్లాగులో పెట్టండి ఈసారి

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు