తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Wednesday, February 11, 2009

స్వామి వివేకానందుని జీవితంలో మనకు తెలియని వింత

స్వామి వివేకానందుని గురించి తెలియని భారతీయుడు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. యువతకు స్పూర్తి దాయకుడైన వివేకానందుడు అందరికీ ఆదర్శమే. అతను ఎన్నో అధ్యాత్మిక అనుభవాలు చివరికి అత్యున్నతమైన అద్వైత స్థితిని కూడా పొందాడు. ఇక్కడ చాలా మందికి ఒక సందేహం వస్తుంది. అదేమిటంటే ఇంత మహానుభావునికి సిద్ధులు అనగా అతీతశక్తులు ఉండవా అని. ఉన్నాయి. కాని అతను ఎప్పుడూ వాటిని బహిరంగముగా ప్రదర్శించలేదు.

ఇప్పుడు శ్రీ పరమహంస యోగానంద గారి గురించి చూద్దాం.
స్వామి పరమహంస యోగానంద క్రియాయోగమును భారత మరియు అమెరికా,ఇంగ్లండు లలో వ్యాప్తి చేసిన ఒక యోగి. ఇతను రచించిన ఆత్మకథ పేరు "ఒక యోగి ఆత్మకథ". ఈ పుస్తకం చాలా ప్రచారం పొందింది.ఈ పుస్తకమును అనేక అమెరికా విశ్వవిద్యాలయాలలో పాఠ్యాంశముగా పెట్టారు. ఈ పుస్తకములోనే మనకు తెలియని వివేకానందుని అతీత శక్తి గురించి ఉంది.సరే ఆ సంఘటన చూద్దాం.
####################################################################

పరమహంస యోగానంద గారు రెండవ సారి అమెరికా వెళ్ళినప్పుడు తన పాశ్చాత్య శిష్యుల కోసం ఎన్నో కానుకలు తీసుకెళ్ళారు. అక్కడ అందరికీ కానుకలు ఇస్తున్నారు. ఒక శిష్యునికి ఒక వెండి కప్పు బహుమానముగా ఇచ్చారు.
ఈ శిష్యుడు యోగానందుల కంటే వయసులో పెద్దవాడు. అప్పుడు ఆ శిష్యుడు నిశ్చేష్టుడై నోట మాట రాక ఒక మూల ఏడుస్తూ కూర్చుండిపోయాడు. యోగానంద గారు అది గమనించి అప్పటికి ఏమీ అనకుండా చివరలో ఏకాంతముగా ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు. అప్పుడు ఆ శిష్యుడు అవి ఆనందభాష్పాలు అని చెప్పాడు. యోగానంద గారు కారణం అడిగారు.
అప్పుడు ఆ శిష్యుడు తన చిన్ననాటి సంఘటన గురించి చెప్పాడు. అతని చిన్నతనంలో ఒకసారి అతను నీళ్ళల్లో మునిగిపోబోతూ రక్షించండని అరవసాగాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక కాషాయ దుస్తులు ధరించిన ఒక వ్యక్తి గాలిలో సూర్యకాంతివెలుగుతో ప్రత్యక్షమై "లే" అన్నాడు. ఈ శిష్యుడు ఎలాగో బయట పడ్డాడు. కొన్ని రోజులకు ఆ విషయం మరిచిపోయాడు.
తర్వాత చికాగోలో విశ్వమతమహాసభ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి లోపలికి పోవడం చూసి ఈ అబ్బాయి నిశ్చేష్టుడై తన తల్లితో "అమ్మా! చిన్నప్పుడు నాకు గాలిలో కనిపించిన వ్యక్తి అతనే" అంటూ వడివడిగా లోనికి ప్రవేశించారు. ఆ వ్యక్తే స్వామి వివేకానంద. వివేకానందులు ఈ అబ్బాయిని చూడ్డంతోనే నవ్వుతూ " నీళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండు" అన్నారు.ఈ అబ్బాయి ఆనందభాష్పాలు రాలుస్తూ శిష్యునిగా చేర్చుకోమన్నాడు. అందుకు వివేకానందులు "నీ గురువు నేను కాదు. అతను మరో పాతిక సంవత్సరాల తర్వాత వస్తాడు. దానికి గుర్తు అతడు నీకు ఒక "వెండి కప్పు"ను బహుమానముగా ఇస్తాడు" అన్నాడు.
వివేకానందులకు తనను శిష్యునిగా చేసుకోవడం ఇష్టములేక ఇలా అంటున్నాడని బాలుడు అనుకొన్నాడు. కాని ఇప్పుడు అతని భవిష్యవాణి ఇలా జరగడం చూసి ఆనంద భాష్పాలు రాల్చాడు.

ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే విశ్వమత మహాసభ జరిగినది 1893 సెప్టెంబరులో. యోగానంద గారు పుట్టినది 1893 జనవరి 5 న.
####################################################################

వివేకానందులు సిద్ధులను అనగా మహిమలను అసహ్యించుకొనేవారు. అందువలన అత్యంత అవసర పరిస్థితులలోనే తన శక్తులను ఉపయోగించారు. పైన పేర్కొన్న మానవాతీతశక్తి గురించి కూడా స్వామి వివేకానందులు ఎవరికీ స్వయముగా చెప్పలేదు.అందువలనే వివేకానందులు స్థాపించిన శ్రీ రామకృష్ణ మఠం వారి పుస్తకాలలో ఎక్కడా ఈ విశేషముగాని మరే ఇలాంటి విశేషాలు కాని పేర్కొనబడలేదు.6 comments:

 1. నాయనా ఈ ప్రపంచాన్ని నడిపించేది "" నాయన...ఈ నిజాన్ని గ్రహించ లేనంత వరకు ఎవడు ప్రశాంతంగా వుండలేడు.....నువ్వు ఆ స్టోరి ని నమ్మావంటే....నాకు ....ఎదో వస్తుంది....

  ReplyDelete
 2. నాయనా ఈ ప్రపంచాన్ని నడిపించేది "Money,Sex,Power" నాయన...ఈ నిజాన్ని గ్రహించ లేనంత వరకు ఎవడు ప్రశాంతంగా వుండలేడు.....నువ్వు ఆ స్టోరి ని నమ్మావంటే....నాకు ....ఎదో వస్తుంది....

  ReplyDelete
 3. jagadguruvulu vaaru.anamtamaina shaktini pomdinaa vaatini lokakalyaanamulakorakegaani chillara mahimalu choopataaniki upayogimcharu

  ReplyDelete
 4. సురేష్ గారూ, మంచి విషయాలను నలుగురితో పంచుకోవాలని మీరు చేస్తున్న ప్రయత్నం బాగుంది. ఇది అందరికీ నచ్చదు. అది ఎరుక లో ఉంచుకోండి. మిమ్మల్ని disturb చేయడానికి వచ్చే వ్యాఖ్యలను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళండి. :-)
  wish u best of luck

  ReplyDelete
 5. to anonymous:
  మీరన్నదే నిజమైతే (ఎట్ లీస్ట్ మీరు అనుకుంటున్నట్లైతే) మీరు ఈ బ్లాగ్ చదవరు. ఎందుకంటే ఇది చదవడం వల్ల మీకు డబ్బు రాదు, పవర్ రాదు,సెక్సువల్ ప్లెజర్ రాదు. అయినా మీరు చదువుతున్నారు ఎందుకు? అది మీ వ్యక్తిగత ఆసక్తి. అంతే కదా. అలాగే పూర్వజన్మ సుకృతమూ, పరమాత్మ గురించిన ఆసక్తి,భక్తి ఉంటే అది హృదయానికి తెలుస్తుంది. నమ్మకానికి సంబందించిన విషయం అది. అనుభవించి,నమ్మి తెలుసుకోవలసిందే తప్ప ఒకరు చెప్పేది కాదు.

  ReplyDelete
 6. మీ సేఖరణలు చాలా బాగున్నాయి. మీరు ఇంకా విలువైన విషయాలు సేకరించి మా లాంటి వాళ్లకు తెలియచేయాలని నేను ఆశ పడుతున్నాను. మరియు మీరు ప్రతేరొజూ ఆనాపానాసతి ధ్యానం చెయ్యండి. వివరములకు.naradad.blogspot.com ని క్లిక్ చేసి చూడండి.

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు